breaking news
date of birth certificate
-
దత్తతలో నకిలీ సర్టిఫికెట్ల దందా
సాక్షి, వరంగల్ : దత్తత ప్రక్రియలో కొందరు బాలల సంరక్షణ విభాగాధికారులు దందాకు తేర లేపారన్న ఆరోపణలున్నాయి. తక్కువ వయసున్న పిల్లల కోసం..కొందరు దంపతులు తమ వయసును తక్కువగా చూపించేందుకు కొన్ని స్కూళ్ల నుంచి స్టడీ, కండక్ట్, డేట్ ఆఫ్ బర్త్ సర్టీఫికెట్లు తీసుకున్నారు. కొందరైతే చదువుకోకున్నా, స్టడీ సరిఫికెట్లు తీసుకున్న ఘటనలు కూడా వెలుగుచూశాయి. తెర వెనుక ఉండి కొందరు అధికారులు ఈ తతంగాన్ని నడిపించనట్టు తెలుస్తోంది. వాస్తవానికి నిరక్షరాస్యులకు వయసు ధ్రువీకరణ పత్రం ప్రభుత్వామోదిత వైద్యుడి వద్ద ఓసిఫికేషన్ పరీక్ష నివేదిక ఆధారంగా తీసుకోవచ్చు.లేదంటే పాన్‌కార్డులోని పుట్టిన తేదీ ఉంటే సరిపోతుంది. అయితే ఎక్కువ వయసున్న దంపతులకు తక్కువ వయసు పిల్లలను దత్తత ఇచ్చే అవకాశం లేదని అధికారులే ‘మామూలు’గా మాట్లాడతారు. కొందరు ప్రైవేట్ పాఠశాలల యజమానులతో కుమ్మక్కై సర్టీఫికెట్లను తీసుకొచ్చి వాటినే ఒరిజినల్‌గా చూపిస్తూ సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీ (కారా) వెబ్సైట్లో అప్లోడ్ చేస్తున్నారు.వాస్తవానికి దంపతులిద్దరి వయసు కలిపి 85 ఏళ్లుంటే రెండేళ్లలోపు పిల్లలు, 90 ఏళ్లుంటే రెండేళ్ల నుంచి నాలుగేళ్లలోపు, 100 ఏళ్లుంటే నాలుగు నుంచి ఎనిమిదేళ్లలోపు పిల్లలు, 110 ఏళ్లుంటే ఎనిమిది నుంచి 18 ఏళ్లలోపు పిల్లలను దత్తత ఇస్తారు. ఈ నేపథ్యంలో నకిలీ సర్టీఫికెట్ల తీసుకొని దందాకు తెరలేపారు. ఇలా చేసి పిల్లల జీవితాల్ని ఇరకాటంలోకి నెడుతున్నారు. ఎందుకంటే పిల్లలు పదో తరగతి చదువుకునే సమయంలో తల్లిదండ్రులు వృద్ధాప్య దశలోకి రావడం.. పిల్లల భవిష్యత్‌పై ప్రభావం చూపుతోంది. వరంగల్ కేంద్రంగా... వరంగల్ జిల్లా కేంద్రంగా 2022లో దత్తత కోసం దరఖాస్తు చేసుకున్న దంపతులిచ్చిన పత్రాల్లో ఈ నకిలీల బాగోతం బయటకు వచ్చింది. గత నెలలో రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ విభాగ ఉన్నతాధికారి దత్తతకు సంబంధించి హోంస్టడీ రిపోర్టులను సమీక్షించాలని చెప్పడం, దరఖాస్తు చేసుకున్నవారు రెన్యూవల్‌కు వచి్చన సందర్భంలో నకిలీ సర్టిఫికెట్ల అంశం అధికారుల దృష్టికి వచ్చింది. అయినా చర్యలు లేకపోవడం అనుమానాలకు తావిస్తోంది. వెబ్సైట్లో అప్లోడ్ చేసిన సర్టీఫికెట్ల దర్యాప్తునకు ఆదేశిస్తే వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశముంది. నర్సంపేట నుంచే నకిలీ సర్టీఫికెట్లు ⇒ వరంగల్ జిల్లాలోని నర్సంపేట కేంద్రంగా శ్రీఅరుణోదయ విద్యాలయం, అరుణోదయ విద్యాలయం, ఏకశిల హైస్కూల్ పేర్లతో రెండు దశాబ్దాల క్రితం ఒకటి, రెండు, మూడో తరగతి చదువుకున్నారంటూ కొందరు పిల్లలు లేని దంపతులకు నకిలీ డేట్ ఆఫ్ బర్త్ సర్టీఫికెట్లు ఇచ్చారన్న ఆరోపణలున్నాయి. పిల్లలు లేని భార్యాభర్తలిద్దరూ చదువుకోకపోయినా, ఒకటే పాఠశాలలో చదివినట్టుగా సరిఫ్టికెట్ ఇవ్వడం, ఇద్దరూ వేర్వేరు ప్రాంతాలకు చెందినవారైనా, రెండు దశాబ్దాల క్రితం ఒకటే పాఠశాలలో చదివినట్టుగా ఇవ్వడం వివాదాస్పదమవుతోంది. అసలు వారు చదువుకున్న సమయంలో ఆ పాఠశాలలు లేకపోవడం గమనార్హం. ⇒ పర్వతగిరి మండలం చింతనెక్కొండలోని వివేకానంద పబ్లిక్ స్కూల్లో ఒకరు చదవుకున్నా చదివినట్టుగా పాఠశాల పేరుతో నకిలీ స్కూల్ రికార్డు షీట్ తీసుకున్నారని ఆ పాఠశాల నిర్వాహకుడు బి.సాంబయ్య లిఖితపూర్వక ఫిర్యాదు ఇచ్చారు. ⇒ దత్తతకు వచ్చిన చాలామంది దంపతులు నర్సంపేటలోని పాఠశాలల నుంచే ఈ సర్టీఫికెట్లు తేవడంతో దీని వెనుక బడా నకిలీ సర్టిఫికెట్ల రాకెట్ ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇతర జిల్లాలకు చెందిన వారు సైతం ఇక్కడే చదువుకున్నట్టుగా సర్టీఫికెట్లు తీసుకెళ్లారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. -
హైదరాబాద్ లో నకిలీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్లు కలకలం
-
ఇతను నిజంగానే ఫిబ్రవరి 30న పుట్టాడంట!
ఛండీగఢ్ : అధికారుల నిర్లక్ష్యం ఓ పంజాబీ యువకుడిని కష్టాలపాలు చేస్తోంది. విద్యాపరంగానే కాదు.. వృత్తిపరంగానూ ఎదగకుండా ఆటంకాలు కలగజేస్తోంది. పొరపాటున అతని జన్మదిన తేదీని తప్పువేయటమే అందుకు కారణం. లూథియానాకు చెందిన హర్‌ప్రీత్ సింగ్ ఫిబ్రవరి 20, 1995లో జన్మించాడు. 2012లో అతను చదువులకు ఫుల్ స్టాప్ పెట్టాడు. తర్వాత పంజాబ్ ఓపెన్ స్కూల్ ద్వారా ఎలాగోలా పదో తరగది పూర్తి చేసిన ఆ యువకుడు.. ఇప్పుడు 12వ తరగతి పరీక్షల కోసం సిద్ధం అయ్యాడు. ఈ క్రమంలో అతను బర్త్ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు కోసం గతేడాది దరఖాస్తు చేసుకున్నాడు. అధికారులు మాత్రం జనన ధృవీకరణ పత్రంలో ఫిబ్రవరి 30 అని తేదీని చేర్చారు. పైగా అది మ్యానువల్‌గా రాయటం కొసమెరుపు. అది గమనించకుండా సివిల్ సర్జన్, మరో ఇద్దరు ఉన్నతాధికారులు దానిపై సంతకం చేశారు. ఇక దాని సవరణ కోసం ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరిగి తిరిగి వేసారిపోయిన హర్‌ప్రీత్ చివరకు.. చదువుకు పుల్‌స్టాప్ పెట్టి కెనడా వెళ్లి పనులు చేసుకుంటూ బతుకుదామని నిర్ణయించుకున్నాడు. పాస్‌పోర్టు కోసం కూడా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ అవసరం కావటంతో అతని కష్టాలు మళ్లీ మొదటికి వచ్చాయి. ఏడాది నుంచి ఎందరిని కలిసి విజ్ఞప్తులు చేస్తున్నా.. ఎవరూ అతన్ని పట్టించుకోవటం లేదంట. దీంతో మీడియా దృష్టికి తన సమస్యను చెప్పుకొని హర్‌ప్రీత్ వాపోయాడు. -
పాస్‌పోర్ట్‌కు డేట్ ఆఫ్ బర్త్ అవసరం లేదు..
న్యూఢిల్లీ: మీరు పాస్‌పోర్టు దరఖాస్తు చేయాలి. మీ దగ్గర జనన దృవీకరణ పత్రం(డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్) ఉంటే త్వరగా వచ్చేస్తుంది. కానీ అదే మీదగ్గర లేకపోతే, అది రావటానికి ఓ 90రోజులు సమయం పడుతుంది. అంతేకాదు. దానికోసం మీసేవ కార్యాలయం, ఎమ్మార్వో కార్యలయం చూట్టూ తిరగాల్సి ఉంటుంది. కానీ ఇప్పడు మీకు ఆ బాధలన్నీ ఉండవు. ఎందకుంటే భారత ప్రభుత్వం కొత్త నియమాలను అమలు లోకి తెచ్చింది. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ లేకపోయినా పాస్‌పార్ట్ దరఖాస్తు చేసుకోవచ్చు. ఆధార్ కార్డు, పాన్‌కార్డులోని మీ పుట్టిన రోజు విషయాలనే పరిగణలోకి తీసుకోవాలని భారతప్రభుత్వం సూచించింది. పాసుపోర్టు చట్టం 1980 ప్రకారం, 1989 జనవరి 26 తరువాత పుట్టిన వారు పాసుపోర్టు పొందాలంటే ఖచ్ఛితంగా జనన దృవీకరణ పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు అది అవసరం లేదు. స్కూల్ ట్రాన్సఫర్ సర్టిఫికేట్, పదో తరగతి మార్కుల మెమో, పాన్‌కార్డు, ఆధార్‌కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడీకార్డు, ఎల్ఐసీ పాలసీ బాండ్లలో ఓ ఒక్కటైనా చూపించాల్సి ఉంటుంది. ఈ మేరకు ఉత్తర్వులు జరీ చేస్తూ కేంద్రం చర్యలు తీసుకుంది.