breaking news
data limit
-
ఆండ్రాయిడ్ యూజర్లకు అలర్ట్!
స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు గూగుల్ షాక్ ఇచ్చింది. తన ఆండ్రాయిడ్ బ్యాకప్ విధానంలో మార్పులు తీసుకువచ్చింది. ఇప్పటివరకు ప్రతి గూగుల్ ఖాతాకు లభించే 15 జీబీ ఉచిత క్లౌడ్ స్టోరేజ్ పరిమితిపై ఆధారపడుతున్న కోట్లాది మంది యూజర్లపై ఈ నిర్ణయం ప్రత్యక్ష ప్రభావం చూపనుంది. జులై 7 నుంచి అమల్లోకి వచ్చిన ఈ కొత్త నిబంధనల ప్రకారం.. ఇకపై ఆండ్రాయిడ్ పరికరాల బ్యాకప్ డేటా మొత్తాన్ని ఉచిత 15 జీబీ కోటాలోనే లెక్కించనున్నారు. గతంలో చాలా రకాల బ్యాకప్ అంశాలకు మినహాయింపునిస్తూ అనుసరించిన సున్నితమైన విధానానికి గూగుల్ స్వస్తి పలికింది.ఉచిత స్టోరేజ్ కోసం పెరగనున్న పోటీ!కొత్త నిబంధనల ప్రకారం.. యూజర్లు ఫోన్లను మార్చేటప్పుడు లేదా కొత్త పరికరాలను సెటప్ చేసేటప్పుడు డేటాను పునరుద్ధరించడానికి (రీస్టోర్) తోడ్పడే ఆండ్రాయిడ్ బ్యాకప్‌లు ఇకపై ఉచిత స్టోరేజ్ పరిమితి పరిధిలోకి వస్తాయి. అంటే, ఇప్పటివరకు జీమెయిల్ ఇమెయిల్స్, గూగుల్ డ్రైవ్ ఫైల్స్, గూగుల్ ఫోటోస్ మాత్రమే ఈ 15 జీబీ స్పేస్‌ను పంచుకోగా ఇకపై ఆండ్రాయిడ్ బ్యాకప్ డేటా కూడా దీనికి తోడవుతుంది.ఇంతకుముందు కేవలం ఫోటోలు, వీడియోలు, ఎంఎంఎస్ అటాచ్మెంట్ల వంటి మీడియా ఫైళ్లు మాత్రమే ఈ 15జీబీ పరిమితిలోకి వచ్చేవి. యాప్ సెట్టింగులు, కాల్ లాగ్ల వంటి మీడియా యేతర డేటాకు మినహాయింపు ఉండేది. కానీ తాజా అప్డేట్తో ఆ సౌకర్యం ఉండదు.ఇకపై స్టోరేజ్ పరిమితిలోకి వచ్చే అంశాలు..ఎస్ఎంఎస్, ఎంఎంఎస్‌ల పూర్తి టెక్స్ట్ కంటెంట్.వినియోగదారుల పూర్తి కాల్ లాగ్‌లు.ఫోన్ వాల్పేపర్లు, వై-ఫై పాస్వర్డ్లు, యూజర్ సెట్టింగ్స్.ఇన్స్టాల్ చేసిన యాప్‌లు, వాటికి సంబంధించిన అనుబంధ డేటా.సగటు వినియోగదారుడిపై ప్రభావం ఎంత?‘ఆండ్రాయిడ్ బ్యాకప్ మీ ఫోన్లోని డేటాను గూగుల్ ఖాతాకు సేవ్ చేయడానికి అనుమతిస్తుంది. తద్వారా దానిని సులభంగా రీస్టోర్ చేసుకోవచ్చు లేదా కొత్త డివైజ్‌లో సెటప్ చేయవచ్చు. మేము మా పాలసీని అప్డేట్ చేశాం. దాంతో మొత్తం ఆండ్రాయిడ్ బ్యాకప్ డేటా ఇప్పుడు గూగుల్ అకౌంట్ స్టోరేజ్ కింద లెక్కిస్తారు. దీనివల్ల సగటున ఒక పరికరానికి అదనంగా 40 ఎంబీ మాత్రమే ఖర్చవుతుందని మేము భావిస్తున్నాం’ అని గూగుల్ ప్రతినిధి అన్నారు. ఇది స్వల్పమని గూగుల్ పేర్కొంటున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితి వేరేలా ఉండే అవకాశం ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.ఇప్పటికే తమ 15 జీబీ ఉచిత పరిమితికి చేరువైన వినియోగదారులకు ఈ మార్పు కూడా ఇబ్బందికరంగా మారవచ్చు. ఫలితంగా వినియోగదారులు ఇప్పటికే ఉన్న ఫైళ్లను తొలగించడమో, బ్యాకప్‌లను తగ్గించుకోవడమో లేదా గూగుల్ వన్ పెయిడ్ ప్లాన్లకు సబ్‌స్క్రైబ్ అవ్వడమో చేయక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది.వినియోగదారులకు సూచనలుమీ ఫోన్ సెట్టింగ్స్ లేదా గూగుల్ వన్ యాప్ ద్వారా ప్రస్తుతం ఎంత స్టోరేజ్ వాడారో పరిశీలించండి.అవసరం లేని యాప్స్, పాత సందేశాలు, కాల్ లాగ్స్ బ్యాకప్‌ను నిలిపివేయండి.స్టోరేజ్ పరిమితి ముగిసే దశలో ఉంటే పాత మెయిళ్లు, డ్రైవ్ ఫైళ్లను క్లియర్ చేయండి.స్టోరేజ్ అవసరం ఎక్కువగా ఉంటే అదనపు క్లౌడ్ స్పేస్ కోసం నెలకు కొంత రుసుము చెల్లించి 100 జీబీ లేదా అంతకంటే ఎక్కువ సామర్థ్యం గల ప్లాన్‌కు అప్‌గ్రేడ్ అవ్వడాన్ని పరిశీలించవచ్చు.ఇదీ చదవండి: బంగారం ధరల్లో స్వల్ప మార్పు -
డేటా పరిమితి, వేగాన్ని కస్టమర్లకు చెప్పాల్సిందే
టెల్కోలకు ట్రాయ్ ఆదేశం న్యూఢిల్లీ: మొబైల్ బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ ప్లాన్లకు సంబంధించి డేటా వినియోగ పరిమితిని కస్టమర్లకు తప్పకుండా తెలియజేయాలని టెలికం కంపెనీలను నియంత్రణ సంస్థ ట్రాయ్ ఆదేశించింది. అదేవిధంగా ‘పరిమితి దాటిన తర్వాత(ఫెయిర్ యూసేజ్ విధానం) కనెక్షన్ స్పీడ్ ఎంతకు తగ్గుతుందన్న విషయాన్ని కూడా వెల్లడించాలని స్పష్టం చేసింది. ఫెయిర్ యూసేజ్ ప్రకారం... ఉదాహరణకు ఒక కస్టమర్ అపరిమిత బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ను తీసుకున్నాడనుకుందాం. నెట్ స్పీడ్ 2 ఎంబీపీఎస్ కంటే అధికంగా డౌన్లోడ్ పరిమితి 2 జీబీగా టెల్కో నిర్ణయిస్తే... సంబంధిత బిల్లింగ్ వ్యవధిలో కస్టమర్ వినియోగం ఈ పరిమితిని గనుక మించిపోతే, ఆటోమేటిక్‌గా మిగతా కాలానికి స్పీడ్‌ను టెల్కోలు తగ్గించేసే అవకాశం ఉంది. ఫిక్స్డ్(వైర్‌లైన్) బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్లకు కూడా ఫెయిర్ యూసేజ్ పాలసీని వర్తింపజేశాక కనీస స్పీడ్ 512 కేబీపీఎస్ కంటే తగ్గకూడదని ట్రాయ్ తేల్చిచెప్పింది. టెల్కోలు డేటా లిమిట్ ఎంతవరకూ చేరిందనే(50%, 90%, 100%) సమాచారాన్ని కస్టమర్ల రిజిస్టర్డ్ మొబైల్ లేదా ఈ-మెయిల్‌కు పంపాల్సి ఉంటుంది.


