breaking news
danamma
-
ఆర్ఈసీఎస్ ఉద్యోగుల్లో కలవరం..!
సాక్షి, అనకాపల్లి: : టీడీపీని ఇంటికి సాగనంపడానికి స్పష్టమైన ప్రజాతీర్పు వెలువడనుందనే సంకేతాల నేపథ్యంలో.. పచ్చ నేతల అరాచకాలకు అడ్డూఅదుపూ లేకుండా పోతోంది. అనకాపల్లి గ్రామీణ విద్యుత్ సహకార సంఘం (ఆర్ఈసీఎస్) ఉద్యోగులను సంఘ మాజీ పర్సన్ ఇన్చార్జి సతీమణి, టీడీపీ జడ్పీటీసీ ధనమ్మ బెదిరింపులకు గురిచేశారు. వచ్చేది తమ ప్రభుత్వమేనంటూ..టీడీపీకి ఓటేయకుంటే ఉద్యోగాలు పీకేస్తామని హెచ్చరించారు. గురువారం ఎన్నికల ప్రచారం చేపట్టిన ధనమ్మ ఆర్ఈసీఎస్ సిబ్బంది అంతా అధికార టీడీపీకి ఓటు వేయాలని ఒత్తిడి చేశారు. ‘మీరంతా ఈ ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి మద్దతు ఇస్తున్నట్టు తెలిసింది. రానున్నది టీడీపీ ప్రభుత్వమే. మా పార్టీకే ఓటు వేయాలి’ అంటూ బెదిరించే ధోరణిలో మాట్లాడినట్టు సమాచారం. ఈ పరిణామంతో ఉద్యోగులు కలవరం చెందుతున్నారు. ధనమ్మ బెదిరింపులపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఉద్యోగులు..‘మమ్మల్ని వదిలేయండి. మాకు నచ్చినవారికి ఓటేస్తాం’ అని స్పష్టం చేశారు. జెడ్పీటీసీ తీరు బాగోలేదని సంఘ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడు పరదేశినాయుడు పేర్కొన్నారు. ఇలా బెదిరించడం సమంజసం కాదని, ప్రజాస్వామ్యంలో నచ్చిన వారికి ఓటు వేసుకోవచ్చన్నారు. సంస్థ ఉద్యోగులకు రాజకీయాలతో సంబంధం లేదన్నారు. వినియోగదారులకు సేవలందించడమే తమ ధ్యేయమన్నారు. ఇదే విషయాన్ని జెడ్పీటీసీ ధనమ్మ వద్ద ప్రస్తావించగా సంఘ వినియోగదారునిగా తాను విద్యుత్ కనెక్షన్ కోసం అధికారులతో మాట్లాడటానికి మాత్రమే వెళ్లానని పేర్కొన్నారు. జడ్పీటీసీ తీరుపై చర్యలు తీసుకోవాలని ఉద్యోగులు కోరుతున్నారు. -
విషం తాగి తల్లి, కొడుకు ఆత్మహత్య
కుటుంబ కలహాలతో మనస్తాపం చెందిన ఓ మహిళ తన కుమారుడికి విషం తాగించి, తానూ తాగి తనువు చాలించింది. ఈ విషాదం కృష్ణా జిల్లా బంటుమిల్లి మండలం నాగన్నచెరువు గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పితాని దానమ్మ(23), ఆమె కుమారుడు సాయి(4) సోమవారం సాయంత్రం సమీపంలోని చెరువు వద్ద విగత జీవులై పడి ఉండగా స్థానికులు గుర్తించారు. వారి సమీపంలో పురుగు మందు డబ్బా పడి ఉంది. కుటుంబ తగాదాల నేపథ్యంలో వారు చనిపోయారని భావిస్తున్నారు. -
వ్యక్తి అనుమానాస్పద మృతి
తల్లాడ: తన భర్త మృతిపై అనుమానాలు ఉన్నాయని, విచారణ జరపించాలని కోరుతూ ఖమ్మం జిల్లా తల్లాడ పోలీసులకు ఓ మహిళ ఫిర్యాదు చేశారు. మండలంలోని కుర్నవల్లి గ్రామానికి చెందిన ఎక్కిరాల నాగేశ్వరరావు (40) ఈ నెల 2న తన ఇంటి ఆవరణలో మృతి చెందాడు. రెండు రోజుల తర్వాత నాగేశ్వరరావు మృతదేహాన్ని సమాధి చేశారు. అయితే, తన భర్త మృతిపై అనుమానాలున్నాయంటూ మృతుడి భార్య దానమ్మ శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. భర్త స్నేహితులపై అనుమానం ఉన్నట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో ఎస్ఐ భాను ప్రకాశ్ మృతదేహాన్ని వెలికి తీయించి పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.