breaking news
cow injured
-
ఆవుపైనా అమానుషత్వం
సిమ్లా: కేరళలో పైనాపిల్‌లో పేలుడుపదార్థాలు పెట్టి దాంతో ఏనుగును హతమార్చిన అమానవీయ ఘటనను మరువకముందే హిమాచల్ ప్రదేశ్‌లోని బిలాస్పూర్లో ఆవు నోట్లో టపాసులు పెట్టి, అలాంటి దారుణానికే ఒడిగట్టారు దుండగులు. ఝన్‌దూతలోని ఓ సూడి ఆవు నోట్లో టపాసులు పెట్టి పేల్చడంతో ఆవుకి తీవ్రగాయాలయ్యాయి. నోరంతా రక్తసిక్తమైన ఆవు ఏమీ తినలేక అవస్థపడుతోంది. ఆవు యజమాని గురు దయాళ్æ ఈ వీడియోను సోషల్ మీడియాలో పెట్టడంతో ఇది వైరల్‌గా మారింది. ఆవుపై దాడికి ఒడిగట్టిన వారిని కఠినంగా శిక్షించాలని ఆవు యజమాని కోరారు. ఈ ఘటనకు తన పొరుగున నివసించే నందాలాల్ కారణమని ఆరోపించారు. పది రోజుల క్రితం ఈ ఘటన జరిగింది. యానిమల్ క్రూయాలిటీ యాక్టు కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కేరళలోని పాలక్కాడ్‌లో టపాసులు పెట్టిన పైనాపిల్ తినడంతో ఏనుగు మరణించిన ఘటన తర్వాత యానిమల్ క్రూయాలిటీ యాక్ట్‌ను చేశారు. పేలుడు ధాటికి ఏనుగు తీవ్రంగా గాయపడటంతో కొన్ని రోజులపాటు ఏమీ తినలేక, నొప్పి నుంచి ఉపశమనం కోసం నీటిలోనే ఉండి చనిపోయింది. ఈ ఘటనలో సంబంధం ఉన్న కొందరిని పోలీసులు అరెస్టు చేశారు. -
ఆవుపై నుంచి దూసుకెళ్లిన లారీ
కాలికి తీవ్రగాయం జహీరాబాద్ టౌన్: పట్టణంలోని రహదారిపై సేదతీరుతున్న ఆవు కాలిపై నుంచి లారీ దూసుకెళ్లడంతో తీవ్రంగా గాయపడింది. గమనించిన కొందరు పశువైద్యాధికారులకు ఫిర్యాదు చేయడంతో వారు వచ్చి చికిత్స చేశారు. పట్టణంలోని మోర్ ముందు జాతీయ రహదారిపై కొన్ని ఆవులు సోమవారం సేదతీరుతున్నాయి. హైదరాబాద్ నుంచి ముంబాయి వైపు వెళ్లుతున్న ఓ లారీ చక్రాలు ఆవు కాలిపై నుంచి వెళ్లడంతో గాయపడింది. దీంతో ఆవు కాలినుంచి తీవ్ర రక్తస్రావం కావడంతో గమనించిన కొందరు పశువైద్యాధికారులకు సమాచారమిచ్చారు. పశువైద్యాధికారులతో పాటు బీజేపీ నాయకులు పూల సంతోష్ తదితరులు సంఘటన స్థలానికి చేరుకుని గాయపడిన ఆవుకు చికిత్స నిర్వహించారు.