court holiday
-
సెలవుల్లో పని చేయడానికి లాయర్లు ఇష్టపడడం లేదు
న్యూఢిల్లీ: సెలవు రోజుల్లో పని చేయడానికి న్యాయవాదులు ఇష్టపడడం లేదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్.గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం వెల్లడించింది. మరోవైపు పెండింగ్ కేసులు పరిష్కరించడం లేదంటూ న్యాయ వ్యవస్థపై విమర్శలు వస్తున్నాయని పేర్కొంది. తమ పిటిషన్‌పై విచారణను వేసవి సెలవుల తర్వాత ప్రారంభించాలని కోరిన ఓ న్యాయవాది పట్ల ధర్మాసనం బుధవారం అసంతృప్తి వ్యక్తంచేసింది. సుప్రీంకోర్టులో మొదటి ఐదుగురు న్యాయమూర్తులు వేసవి సెలవుల్లోనూ విధులు నిర్వర్తిస్తారని తెలియజేసింది. అయినప్పటికీ బ్యాక్లాగ్ కేసుల విషయంలో తమపై నిందలు తప్పడం లేదని ఆవేదన వ్యక్తంచేసింది. వాస్తవానికి వేసవి సెలవుల్లో పని చేయడం లాయర్లకు ఎంతమాత్రం ఇష్టం లేదని ఆక్షేపించింది. సుప్రీంకోర్టుకు ఈ నెల 26 నుంచి జూలై 13 వరకు వేసవి సెలవులు ప్రకటించారు. ఈ మేరకు న్యాయస్థానం నోటిఫికేషన్ జారీ చేసింది. సెలవుల సమయంలోనూ ధర్మాసనాలు పాక్షికంగా పని చేయాలని సూచించింది. రెండు నుంచి ఐదు వెకేషన్ బెంచ్‌లు పని చేయాలని నిర్దేశించింది. సీజేఐ సహా ఐదుగురు న్యాయమూర్తులు విధులకు హాజరవుతారు. గతంలో వేసవి సెలవుల్లో కేవలం రెండు వెకేషన్ బెంచ్‌లు పనిచేసేవి. సీనియర్ న్యాయమూర్తులు విధులు నిర్వర్తించాలన్న నిబంధన ఉండేది కాదు. కానీ, ఈ నిబంధనల్లో సుప్రీంకోర్టు తాజాగా మార్పులు చేసింది. ఈ నెల 26 నుంచి ఐదు ధర్మాసనాలకు జస్టిస్ బి.ఆర్.గవాయ్, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ విక్రంనాథ్, జస్టిస్ జె.కె.మహేశ్వరి, జస్టిస్ బి.బి.నాగరత్న నేతృత్వం వహిస్తారు. అలాగే సుప్రీంకోర్టు రిజిస్ట్రీ అన్ని పనిదినాల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా తెరిచి ఉంటుంది. -
సెలవు ఇవ్వండి.. సీజేఐకి లేఖ
లక్నో: అయోధ్యలోని రామమందిర ప్రతిష్ఠాపన వేడుకను వీక్షించేందుకు జనవరి 22న కోర్టులకు సెలవు ఇవ్వాలని కోరుతూ భారత ప్రధాన న్యాయమూర్తికి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా లేఖ రాసింది. ప్రజల మనోభావాలకు అనుగుణంగా ఈ చారిత్రక సందర్భాన్ని గుర్తించడానికి తగిన చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నట్లు బార్ కౌన్సిల్ ఛైర్మన్ మనన్ కుమార్ మిశ్రా లేఖలో పేర్కొన్నారు. ఈ అభ్యర్థనను అత్యంత సానుభూతితో పరిగణించాలని సీజేఐని కోరారు. "అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవ వేడుకలు, దేశవ్యాప్తంగా జరిగే ఇతర సంబంధిత కార్యక్రమాలలో పాల్గొనడానికి కోర్టు సిబ్బందికి సెలవు రోజు అవసరం అవుతోంది." అని బార్ కౌన్సిల్ ఛైర్మన్, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది మనన్ కుమార్ మిశ్రా అన్నారు. తక్షణ విచారణ అవసరమయ్యే అంశాన్ని ప్రత్యేక ఏర్పాట్ల ద్వారా సర్దుబాటు చేయవచ్చు లేదా తదుపరి రోజుకు రీషెడ్యూల్ చేయవచ్చని ఆయన లేఖలో పేర్కొన్నారు. అయోధ్యలో ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయి. దేశవ్యాప్తంగా రాజకీయ నాయకులు, సాధువులు, ప్రముఖులతో సహా 7,000 మందికి పైగా ప్రజలు ఈ వేడుకలకు హాజరవనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. వివిధ దేశాల నుండి దాదాపు 100 మంది ప్రతినిధులు పాల్గొంటారు. ఇదీ చదవండి: Ayodhya Ram Mandir: అయోధ్యలో కలశ పూజ -
బాంబే హైకోర్టుకు వర్షం సెలవులు!
భారీ వర్షాల కారణంగా స్కూళ్లకు సెలవులు ఇవ్వడం చూశాం కానీ హైకోర్టుకు కూడా సెలవు ప్రకటించడం ఎప్పుడైనా విన్నారా? బాంబే హైకోర్టుకు ఇలా సెలవు ప్రకటించారు. ముంబై మహానగరంలో భారీ వర్షాల కారణంగా జనజీవనం స్తంభించింది. దీంతో బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అక్కడి హైకోర్టుకు సెలవు ప్రకటించారు. ఇప్పటికే విద్యాసంస్థలు మూతపడ్డాయి. యూనివర్సిటీ ఆఫ్ ముంబై తన పరీక్షలను రద్దుచేసింది. రాజకీయ కార్యక్రమాలన్నీ కూడా రద్దయిపోయాయి. అత్యవసరమైన పని ఉంటే తప్ప అసలు ప్రజలను ఇళ్ల నుంచి బయటకు కదలొద్దని ప్రజలకు అధికారులు స్పష్టంగా చెప్పారు. పిల్లలను స్కూళ్లకు పంపొద్దన్నారు. చాలా వరకు ప్రైవేటు స్కూళ్లు కూడా సెలవులు ప్రకటించేశాయి. కాంగ్రెస్, ఎన్సీపీ లాంటి పార్టీలు విలేకరుల సమావేశాలను కూడా రద్దుచేసుకున్నాయి. సముద్రంలో భారీ ఎత్తున అలలు చెలరేగే అవకాశం ఉంది కాబట్టి.. అసలు ప్రజలను ముంబై బీచ్ సమీపానికి రావొద్దని అధికారులు హెచ్చరించారు. సుమారు 4.6 మీటర్ల ఎత్తున అలలు రావొచ్చని చెప్పారు.