cost guard
-
గుజరాత్లో భారీ డ్రగ్స్ ముఠా గుట్టు రట్టు.. విలువ వెయ్యి కోట్లకు పైగా
గాంధీనగర్: గుజరాత్లో భారీ డ్రగ్స్ ముఠాను యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) పోలీసులు గుట్టు రట్టుచేశారు. కచ్‌లో సుమారు రూ.1180 కోట్ల విలువైన 118 కిలోల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఇప్పటి వరకు ముగ్గురు విదేశీయులను అరెస్టు చేశారు.రాష్ట్రంలో ఇటీవల భారీ ఎత్తున డ్రగ్స్ రవాణా జరుగుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ క్రమంలో బ్రెజిల్, పలు లాటిన్ అమెరికా దేశాలు, మెక్సికో, అమెరికా, కరాచీ (పాకిస్థాన్) మీదుగా ప్రయాణించి గుజరాత్ తీరానికి ఓ ఓడ చేరుకుంది. ముంద్రా తీరానికి సుమారు 9.5 కిలోమీటర్ల దూరంలో ఉండగా, ఆ ఓడ నుంచి అనుమానాస్పదంగా ప్యాకెట్లు సముద్రంలోకి విసురుతున్నట్లు కోస్ట్ గార్డులు గుర్తించారు. వెంటనే గుజరాత్ ఏటీఎస్ పోలీసులకు సమాచారం అందించగా.. ఏటీఎస్–కోస్ట్ గార్డ్ సంయుక్త ఆపరేషన్ నిర్వహించారు.ఆపరేషన్ సమయంలో ఓడలో ఇద్దరు నైజీరియన్ జాతీయులు ఉండగా, వారిలో ఒకరు సముద్రంలోకి దూకి తప్పించుకున్నారు. మరో ఇద్దరిని క్లావిన్ చుక్వుమా (టాంజానియా పౌరుడు), బ్యారుహంగా జేమ్స్ (ఉగాండా పౌరుడు)గా గుర్తించారు. కంటైనర్ల ద్వారా తెచ్చిన కొకైన్‌ను భారత్‌లో ఎవరికి అందించాలనుకున్నారు. ఏ ప్రాంతానికి తరలించాలనుకున్నారు అనే విషయాలను పోలీసులు విచారిస్తున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, ఆ డ్రగ్స్‌ను ఢిల్లీలోని ద్వారకలో నివసిస్తున్న ఇద్దరికి అందజేయాల్సి ఉందని నిందితులు వెల్లడించినట్లు తెలుస్తోంది.గత ఏడాది ఏప్రిల్ 13న పోర్బందర్లో రూ.1800 కోట్ల విలువైన 300 కిలోల మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. ఏప్రిల్ 12 రాత్రి జరిగిన సంయుక్త ఆపరేషన్‌లో గుజరాత్ ఏటీఎస్, కోస్ట్ గార్డ్ బృందం, పోర్బందర్కు 190 కిలోమీటర్ల దూరంలో సముద్రంలో ఈ మాదకద్రవ్యాల రవాణాను అడ్డుకుంది.గుజరాత్ ఏటీఎస్ సమాచారం మేరకు, కోస్ట్ గార్డ్ అంతర్జాతీయ సముద్ర సరిహద్దు రేఖ (IMBL) వద్దకు గాలింపు నౌకను పంపింది. కోస్ట్ గార్డ్ బృందం ఒక పడవను గుర్తించి, అందులోని వారి వ్యక్తిగత వివరాల గురించి ఆరా తీసింది. దీంతో భయపడిన స్మగ్లర్లు మత్తుమందు ప్యాకెట్లను సముద్రంలోకి విసిరేసి, అంతర్జాతీయ సరిహద్దు దాటి పారిపోయారు. -
హెలికాఫ్టర్ ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం
గాంధీ నగర్ : గుజరాత్ (Gujarat)లో విషాదం చోటు చేసుకుంది. పోర్బందర్ ఎయిర్పోర్ట్ (Porbandar Airport)లో ఘోర హెలికాప్టర్ (helicopter crash porbandar) ప్రమాదం జరిగింది. కోస్ట్ గార్డ్‌కు చెందిన ఏఎల్‌హెచ్ ధృవ్ హెలికాప్టర్ టేకాఫ్ సమయంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ఆ హెలికాప్టర్ భూమిని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడినట్లు సమాచారం. అయితే మరణాలకు సంబంధించి ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు.ప్రమాదం వెంటనే హెలికాప్టర్ భూమిని ఢీకొట్టిన తర్వాత మంటలు చెలరేగి, దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. ఘటనా స్థలంలో విమానాశ్రయ సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను వెంటనే సివిల్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.Helicopter of Indian Coast Guard ALH Dhruv 'crashed' in Porbandar, Gujarat during a routine training sortie.3 crew members DEAD. pic.twitter.com/vt4L025Ifl— RAMULU.B (@vedicramrekha) January 5, 2025 -
ప్రయాణం.. విషాదాంతం
బోస్టన్: ఒకరు ‘టైటానిక్’ నిపుణుడు.. మరొకరు సాహసి..ఇంకొకరు సీఈవో..ఇంకా ప్రముఖ వ్యాపారవేత్త, ఆయన కొడుకు..! వీరంతా ‘టైటాన్’అనే మినీ సబ్‌మెరైన్‌లో టైటానిక్ శకలాలను చూసేందుకు వెళ్తూ అట్లాంటిక్ సముద్రంలో గల్లంతయ్యారు. ఈ అయిదుగురూ మృతి చెందినట్లు భావిస్తున్నామని అమెరికా కోస్ట్ గార్డ్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. న్యూఫౌండ్‌ల్యాండ్ రాష్ట్రం సెంట్ జాన్స్‌కు సుమారు700 కిలోమీటర్ల దూరంలో ఆదివారం ఉదయం ‘టైటాన్’సముద్రాంతర యాత్రకు బయలుదేరింది. టైటానిక్ వైపుగా నీటి అడుగుకు ప్రయాణం ప్రారంభించిన 1.45 గంటలకే ప్రధాన నౌక పోలార్ ప్రిన్స్‌తో సంబంధాలు తెగిపోయాయి. అందులోని ఆక్సిజన్ నిల్వలు గురువారం ఉదయం 6 గంటల వరకు మాత్రమే సరిపోతాయి. దీంతో, అమెరికా, కెనడా విమానాలు, నౌకలు, రోబోల సాయంతో టైటాన్ జాడ కోసం అన్వేషణ మొదలుపెట్టాయి. చివరికి, టైటాన్ శకలాలను తమ రోబో టైటాన్ శకలాలను గుర్తించినట్లు అమెరికా కోస్ట్‌గార్డ్ ప్రకటించిన విషయం తెలిసిందే. అందులో ఉన్న ఓషన్ గేట్ సంస్థ చీఫ్ పైలట్, సీఈవో స్టాక్టన్ రష్, సాహసి హామిష్ హార్డింగ్,, పాక్ జాతీయుడైన వాణిజ్యవేత్త షహ్జాదా దావూద్, ఆయన కొడుకు సులేమాన్, టైటానిక్ నిపుణుడు నర్గియెలెట్ మృతి చెందారని తెలిపింది. అయితే, అది ఎందుకు? ఎలా? ఎప్పుడు? ప్రమాదం బారిన పడి ఉంటుందనే విషయం తెలుసుకునేందుకు అన్వేషణ కొనసాగిస్తామన్నారు. -
మునిగిపోతున్న నౌక నుంచి సిబ్బందిని కాపాడిన కోస్ట్ గార్డ్
-
మత్స్యకారులను కాపాడిన ‘కోస్ట్ గార్డ్’
విశాఖపట్నం: సముద్రంలో చిక్కుకున్న ఏడుగురు మత్స్యకారులను నేవీ కోస్ట్‌గార్డ్ బుధవారం రక్షించింది. కమాం డెంట్ ఎస్.జాకీర్‌హుస్సెన్ తెలిపిన వివరాల ప్రకారం.. కింగ్‌ఫిషర్-3 బోటులో ఏడుగురు మత్స్యకారులు 12 రోజుల క్రితం సముద్రంలో చేపల వేటకు వెళ్లారు. జనవరి మూడోతేదీ నుంచి వారికి తీరంతో కమ్యూనికేషన్ తెగిపోయింది. విషయం తెలుసుకున్న మత్స్యశాఖ విశాఖ జిల్లా జాయింట్ డెరైక్టర్ పి.కోటేశ్వరరావు మంగళవారం కోస్ట్‌గార్డ్‌కు సమాచారం అందించారు. కోస్ట్‌గార్డ్ షిప్ ఐసీజీఎస్ రాజ్‌ధవాజ్ వెంటనే రంగంలోకి దిగి అన్వేషణ ప్రారంభించింది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ కోస్ట్‌గార్డ్ సిబ్బంది సాహసోపేతంగా వెదికి విశాఖకు తూర్పున 30 నాటికల్ మైళ్ల దూరంలో ఉన్న బోటును రాత్రి 2.35 గంటలకు గుర్తించారు. ఇంజన్ లోపంతో సముద్రంలో నిలిచిపోయిన ఆ బోటును, మత్స్యకారుల్ని బుధవారం ఉదయం 11 గంటలకు విశాఖ తీరానికి క్షేమంగా తీసుకొచ్చారు. యజమానికి బోటును అప్పగించారు. మత్స్యకారులకు సహాయం అందించడం కోసం కోస్ట్‌గార్డ్ 24గంటలూ అందుబాటులో ఉంటుందని కమాండెంట్ తెలిపారు. ఆపద వచ్చినపుడు టోల్‌ఫ్రీ నెంబర్ 1554ను సంప్రదించవచ్చని ఆయన సూచించారు.


