breaking news
	
		
	
  controversial tweets
- 
      
                   
                               
                   
            సూపర్ కింగ్స్ వైద్యుని క్షమాపణ
న్యూఢిల్లీ: గాల్వాన్ లోయలో మృతి చెందిన జవాన్లపై, కేంద్ర ప్రభుత్వంపై వివాదాస్పద ట్వీట్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ వైద్యుడు మధు తొట్టప్పిలిల్ గురువారం బేషరతు క్షమాపణ చెప్పాడు. సంక్షోభ సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ చేస్తోన్న సంక్షేమ కార్యక్రమాలను తక్కువ చేసే ఉద్దేశం తనకు లేదని ఆయన ట్విట్టర్లో పేర్కొన్నాడు. తన చర్య పట్ల బాధ పడిన ప్రతీ ఒక్కరికి క్షమాపణ చెబుతున్నానని అన్నాడు. ‘జూన్ 16న నేను చేసిన ట్వీట్లో వాడిన పదాలు సరైనవి కావని తర్వాత తెలుసుకున్నా. వెంటనే దాన్ని తొలగించా. కానీ అప్పటికే అది సామాజిక మాధ్యమాల్లోకి వెళ్లిపోయింది. దేశ పౌరుల కోసం, ఆర్మీ కోసం కేంద్రం తీసుకునే నిర్ణయాలను గౌరవిస్తా. నా ట్వీట్ వేలాది మంది భారతీయుల మనోభావాల్ని దెబ్బతీసింది. దానికి చింతిస్తున్నా. హృదయపూర్వకంగా క్షమాపణలు చెబుతున్నా’ అని రాసుకొచ్చాడు. - 
      
                   
                               
                   
            తుపాకులు గర్జిస్తాయి: ట్రంప్
వాషింగ్టన్: అలర్లు,ఆందోళనలతో అమెరికా అట్టుడుకుతోంది. వాషింగ్టన్ డీసీలోని వైట్‌హౌస్ ముందు ఆందోళనలు మిన్నంటాయి. ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ట్వీట్లు అగ్నికి మరింత ఆజ్యం పోశాయి. ‘‘ఆందోళనకారులపై కుక్కలను ఉసిగొల్పుతాం..లూటీలు ఆపకపోతే తుపాకులు గర్జిస్తాయి’’ అంటూ ట్రంప్ ట్వీట్‌తో రెండు రోజులుగా వైట్‌హౌజ్ ముందు ఆందోళనలు వెలువెత్తుతున్నాయి. నిరసనకారులు వైట్‌హౌస్ ముందు ఉన్న పోలీసు కారును దహనం చేశారు. ఆందోళనకారులను ఆపేందుకు సీక్రెట్ సర్వీస్ పోలీసులు యత్నించారు. విద్యుత్ నిలిపివేయడంతో వైట్‌హౌజ్‌లో రాత్రి కొంతసేపు అంధకారం నెలకొంది. (ట్రంప్ ట్వీట్: ఫేస్బుక్ మద్దతు) మినియాపొలిస్‌లో రాజుకున్న అశాంతి అగ్గి అమెరికాలోని ఇతర నగరాలకూ వ్యాపిస్తోంది. జార్జి ఫ్లాయిడ్ అనే ఆఫ్రికన్ అమెరికన్‌ను శ్వేత జాతి పోలీసు అధికారులు పొట్టనబెట్టుకోవడంపై ఆగ్రహం పెల్లుబికింది. పోలీసులతో ఆందోళనకారులు బాహాబాహీకి దిగడంతో పాటు షాప్‌లు, ఆఫీస్‌లు, వాహనాలకు నిప్పుపెట్టారు. ఫ్లాయిడ్ మృతికి నిరసనగా వాషింగ్టన్లో ఆదివారం శాంతియుతంగా ప్రదర్శన జరిగింది. ఆందోళనకారులు అధ్యక్ష భవనం సమీపంలో చెత్త కుప్పకు నిప్పుపెట్టారు. (భగ్గుమంటున్న అగ్రరాజ్యం) - 
      
                   
                               
                   
            ఎవరు, ఎందుకు, ఎక్కడ : సోనూ సూద్

 స్టైలిష్ యాక్టర్‌గా టాలీవుడ్ బాలీవుడ్ సినీ అభిమానులను అలరిస్తున్న సోనూసూద్, అనుకోని చిక్కుల్లో ఇరుక్కున్నాడు. తనకు సంబంధం లేని విషయంలో నెటిజన్లు తనపై హేట్ కామెంట్స్ చేస్తుండటంపై ఆశ్యర్యం అసహనం వ్యక్తం చేస్తున్నాడు. ఇటీవల గాయకుడు సోనూనిగమ్ మతపరమైన వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ముస్లిం లు చేసే నమాజ్ ను ఉద్దేశించి,' ఇలా రోజు ప్రజల్ని బలవంతం నిద్రలేపటం ఎంత వరకు సమజసం' అంటూ కామెంట్ చేశాడు.
 
 సోనూ నిగమ్ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. అయితే ట్విట్టర్ పేజ్ లో సోనూ అని టైప్ చేయగానే ముందుగా సోనూ సూద్ పేరు వస్తుండటంతో నెటిజన్ లు సోనూ నిగమ్ కు బదులు సోనూసూద్ ను ట్యాగ్ చేస్తూ హేట్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ కామెంట్స్ పై అసహనం వ్యక్తం చేసిన సోనూసూద్ 'ఎవరు ఎవరితో ఏం చెప్పారు. దాని గురించి ఎవరు ఎందుకు నన్ను అడుగుతున్నారు. నాసా దీని గురించి రిసెర్చ్ చేస్తోంది. నేను ఇందులోకి ఎలా వచ్చాను?' అంటూ కామెంట్ చేశాడు.
 
 
 God bless everyone. I'm not a Muslim and I have to be woken up by the Azaan in the morning. When will this forced religiousness end in India
 — Sonu Nigam (@sonunigam) 16 April 2017
 
 And by the way Mohammed did not have electricity when he made Islam.. Why do I have to have this cacophony after Edison?
 — Sonu Nigam (@sonunigam) 17 April 2017
 
 I don't believe in any temple or gurudwara using electricity To wake up people who don't follow the religion . Why then..? Honest? True?
 — Sonu Nigam (@sonunigam) 17 April 2017
 
 I am still wondering WHO said WHAT n to WHOM
 - 
      
                   
                               
                   
            ఇదేం ‘ట్వీటు’డు!

 పలు వివాదాస్పద ట్వీట్ లు
 
 సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా వ్యవహరించే దేశాధినేతల్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ముందు వరుసలో ఉంటారు. ట్వీటర్లో ఆయనను సుమారు 2.35 కోట్ల మంది అనుసరిస్తున్నారు. వివిధ అంశాలపై ఎప్పటికప్పుడు ఆయన ట్వీటర్లో తన అభిప్రాయలను పంచుకుంటుంటారు. ఈ విషయం అటుంచితే... ఇటీవలి కాలంలో పలు కేంద్ర ప్రభుత్వ విభాగాల అధికారిక ట్వీటర్ ఖాతాల్లో వివాదాస్పద ట్వీట్లు దర్శనమిస్తున్నాయి. ఈ ఖాతాల్లో కేవలం ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ట్వీట్లు మాత్రమే పోస్ట్ చేయాల్సి ఉంది. అయితే అందుకు విరుద్ధంగా వివాదాస్పద ట్వీట్లు వెలువడుతుండడం విమర్శలకు తావిస్తోంది. ఈ నేపథ్యంలో వాటిని ఓ సారి పరిశీలిద్దాం...
 
 వ్యక్తిగత ఖాతాల మాదిరిగా...
 ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్‌ని ఉద్దేశిస్తూ భారత తపాలా శాఖకు చెందిన అధికారిక ట్వీటర్ ఖాతాలో ఈ నెల 5న ఓ వివాదాస్పద ట్వీట్ చేశారు. పాక్ ఆక్రమిత కశ్మీర్లోకి ప్రవేశించి ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం జరిపిన సర్జికల్ స్రై్టక్పై కేజ్రీవాల్ వ్యాఖ్యలను విమర్శిస్తూ ఆ ట్వీట్ చేశారు. అయితే అనంతరం తపాలా శాఖ క్షమాపణ కోరింది. తమ ఖాతాను ఎవరో హ్యాక్ చేశారని వివరణ ఇచ్చింది. ప్రభుత్వ శాఖలు, సంస్థలకు చెందిన అధికారిక ట్వీటర్ ఖాతాల్లో వెలువడిన వరుస వివాదస్పద ట్వీట్లలో ఇది తాజాది. ప్రభుత్వ పథకాలకు సంబంధించిన సమాచారాన్ని ప్రకటించాల్సిన ప్రభుత్వ అధికారిక ఖాతాలు వ్యక్తిగత ఖాతాలుగా మారాయానే విమర్శలు వినిపిస్తున్నాయి.
 
 సెప్టెంబర్–8
 కశ్మీర్‌లోని నిరసనకారులను చంపేయాలని భారత సైన్యానికి సూచిస్తున్న ఓ హిందీ కవితను ‘డిజిటల్ ఇండియా’ అధికారిక ట్వీటర్ ఖాతాలో సెప్టెంబర్ 8న రీట్వీట్ చేశారు. ఆ వెంటనే నేషనల్ ఈ– గవర్నెన్స్ డివిజన్ సీఈఓ రాధా చౌహాన్ ఈ ట్వీట్‌పై వివరణ ఇచ్చారు. డిజిటల్ ఇండియా ట్వీటర్ ఖాతాను నిర్వహించే వ్యక్తి పొరపాటున ఈ ట్వీట్ చేశాడని, అతడి ట్వీటర్ ఖాతాలో పోస్ట్ చేయాలనుకున్నది ఇందులో పోస్టు చేశాడని వివరించారు.
 
 సెప్టెంబర్–8
 చార్జీల పెంపుపై ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ చేసిన ట్వీట్‌ను ఖండిస్తూ ‘శతాబ్ది’ ప్యాసింజర్ ఒకరు చేసిన ట్వీట్‌ను సెప్టెంబర్ 8న రైల్వే మంత్రిత్వ శాఖ అధికారిక ట్వీట్ల ఖాతాలో రీట్వీట్ చేశారు. అనంతరం కొద్దిసేపటికే దాన్ని తొలగించారు.
 
 సెప్టెంబర్–1
 ఆర్ఎస్ఎస్ దాఖలు చేసిన పరువునష్టం దావాపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై వ్యంగ్యంగా వ్యాఖ్యానిస్తూ ఆలిండియా రేడియా అధికారిక ట్వీటర్ ఖాతాలో సెప్టెంబర్ 1న ఓ ట్వీట్ చేశారు. ‘ఆయన మొదట ఎందుకు భయపడ్డారు? ఆర్ఎస్ఎస్ను మళ్లీ నిందించే ధైర్యం ఎలా వచ్చింది? వ్యాఖ్యల పట్ల ఆయన కట్టుబడి ఉండాలి’ అని అందులో పోస్ట్ చేశారు. అనంతరం ఆ సంస్థ ఆ ట్వీట్‌ను తొలగించింది.
 
 ఆగస్టు–22
 పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్‌లో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనపై బలూచిస్తాన్ పౌరుడు చేసిన ట్వీట్‌ను ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అధికారిక ట్వీటర్ ఖాతాలో ఆగస్టు 22న రీట్వీట్ చేశారు. అనంతరం బ్యూరో ఆ ట్వీట్‌ను డిలీట్ చేసింది. అనుభవం లేని ఓ యువ అధికారి దాన్ని ట్వీట్ చేశాడని వివరణ ఇచ్చింది.
 
 జూలై–27
 
 పాకిస్తాన్‌కు అనుకూలంగా వ్యవహరిస్తున్న మీడియాను కట్టడి చేసేందుకు ఇండియన్ ఆర్మీకి మరింత స్వేచ్ఛ ఇవ్వాలని సూచిస్తున్న ఓ ట్వీట్‌ను ‘స్టార్టప్ ఇండియా’ అధికారిక ట్వీటర్ ఖాతాలో రీట్వీట్ చేశారు. దీనిపై ఆ ట్వీటర్ ఖాతాను పర్యవేక్షిస్తున్న ప్రైవేట్ ఏజెన్సీని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తప్పుపట్టారు.
 
 ‘హైరింగ్’ సమస్య...
 ప్రభుత్వ అధికారిక ట్వీటర్ ఖాతాలను నిర్వహించేందుకు ఎలాంటి వారిని నియమించాలనే విషయంలో నిర్దిష్ట విధానం లేకపోవడం ప్రధాన సమస్య. తమ ఖాతాను నిర్వహించేందుకు పలు మంత్రిత్వ శాఖలు పలువురు ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేట్ ఏజెన్సీలకు చెందిన ఉద్యోగులతో ఓ బృందాన్ని ఏర్పాటు చేసుకున్నాయి. ఎన్నికల సమయంలో పార్టీలు తమ ఆన్లైన్ క్యాంపెయినింగ్ కోసం సోషల్ మీడియా కన్సల్టెంట్లను నియమించుకున్నాయి. ఆ రంగంలో నైపుణ్యం కలిగిన వారు, పార్టీకి అనుబంధంగా ఉన్నవారు, నాయకులకు సంబంధించిన వారిని నియమించుకున్నాయి. ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం దాదాపు అన్ని ప్రభుత్వ విభాగాలు తమ డిజిటల్ విభాగాన్ని ఏజెన్సీలకు అప్పగించాయి. గతంలో పార్టీ, నాయకుల వద్ద పనిచే సిన వారే ఆ ఏజెన్సీల ద్వారా తిరిగి నియమితులవుతున్నారు.
 
 ఏదేమైనా, వివాదాస్పద ట్వీట్లు వెలువడినపుడు ఆయా మంత్రిత్వ శాఖలు ఆ నెపాన్ని ప్రైవేట్ ఏజెన్సీలపైకి నెట్టివేస్తున్నాయి. ‘ప్రభుత్వ విభాగాలకు సోషల్ మీడియా మార్గదర్శకాలు కొరవడ్డాయి. సామాజిక మాధ్యమాలకు కొత్త అయినపుడు ఎవరైనా తప్పులు చేస్తారు. అయితే ప్రభుత్వ అధికారిక ఖాతా వినియోగించి ఏదైనా వ్యాఖ్యానించినపుడు కేవలం ‘అయ్యో!’ అంటూ తప్పించుకోకుండా, ప్రభుత్వం మరింత బాధ్యత వహించాల్సి ఉంటుంది’ అని ఢిల్లీలోని నేషనల్ లా యూనివర్సిటీకి చెందిన సెంటర్ ఫర్ కమ్యూనికేషన్ గవర్నెన్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చిన్మయి అరుణ్ అభిప్రాయపడ్డారు.
 – సాక్షి, ఏపీ డెస్క్ - 
      
                   
                               
                   
            వివాదస్పద వ్యాఖ్యలపై వర్మ క్షమాపణ!

 గణనాథునిపై వివాదస్పద వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో ప్రముఖ సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ సోషల్ మీడియా వెబ్ సైట్ ట్విట్టర్లో క్షమాపణలు తెలిపారు. ఇప్పటి వరకు చేసిన పలు ట్వీట్స్ పై వర్మ క్షమాపణలు తెలపడం ఇదే తొలిసారి. ఎలాంటి ఉద్దేశం లేకుండా గణేషుడుపై ట్విటర్ లో పెట్టిన అన్ని ట్విట్స్ ఎవరినైనా బాధిస్తే అందుకు నా క్షమాపణులు తెలుపుతున్నానని వర్మ ట్విటర్ లో వెల్లడించారు. 
 
 వినాయక చవితి సందర్భంగా ‘ఇది గణేషుడు పుట్టిన రోజా... తండ్రి శివుడు అతని తల నరికిన రోజా...’ అంటూ ట్విట్టర్లో చేసిన వ్యాఖ్యలు హిందువుల మనోభావాలను దెబ్బతీశాయని పేర్కంటూ ఆయనపై పలు కేసుల నమోదైన సంగతి తెలిసిందే 


