breaking news
contract killing
-
సవతి కొడుకును సుపారీ ఇచ్చి చంపించిన సవతితల్లి
నిర్మల్‌టౌన్: నిర్మల్ జిల్లా కేంద్రంలో ఈ నెల 15న సంచలనం సృష్టించిన ఆటోడ్రైవర్ అస్లాంఖాన్ హత్య కేసు మిస్టరీ వీడింది. రూ.6లక్షలు సుపారీ ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకుని సవతి తల్లి హత్య చేయించింది. ప్రధాన కుట్రదారు అన్వరీబేగంతోపాటు మరో ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. నిర్మల్‌లోని ప్రధాన పోలీసు కార్యాలయంలో ఎస్పీ జానకి షర్మీల శుక్రవారం వివరాలు వెల్లడించారు. నిర్మల్ పట్టణంలోని వైఎస్సార్ కాలనీకి చెందిన అస్లాంఖాన్(23)కు సవతి తల్లి అన్వరీబేగంతో కొంతకాలంగా వివాహేతరసంబంధం ఉంది. అతడు మరో యు వతిని పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో ఆమె అభ్యంతరం వ్యక్తం చేసింది. పెళ్లి చేసుకోవద్దని, తమ సంబంధాన్ని కొనసాగించాలని ఒత్తిడి చేసింది.పెళ్లి చేసుకుంటే చంపేస్తానని బెదిరించింది. ఈ విషయం అస్లాంఖాన్ తన బాబాయికి చెప్పడంతో కుటుంబ సభ్యులు, బంధువులకు తెలిసి వివాదం ఏర్పడింది. అస్లాంఖాన్ భయంతో అదే కాలనీలోని తన బాబా యి ఇంటి వద్ద ఉంటూ ఆటో నడుపుతుండేవాడు. తమ సంబంధం అందరికీ తెలిసి పరువు పోయిందని, తనకు దూరమై మరో వివాహం చేసుకుంటాడని అన్వరీబేగం కక్ష పెంచుకుంది. రూ.6లక్షలతో సుపారీ హత్యకు మహారాష్ట్రకు చెందిన తన పరిచయస్తుడు ముఖీద్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. రూ.50వేలు చెల్లించి హత్య తర్వాత మిగతా మొత్తం చెల్లించడానికి ఒప్పందం చేసుకుంది. అస్లాంఖాన్ ఫొటోలు, వ్యక్తిగత వివరాలు అందజేసింది. తన సోదరుడు షేక్ మహమ్మద్‌కు కూడా ఆర్థిక సహాయం చేస్తానని చెప్పి ఈ కుట్రలో భాగస్వామిని చేసింది.అస్లాంఖాన్ హత్యకు ముఖీద్, అఫ్రోజ్, సాయినాథ్ పవార్ జూలై ఒకటిన నిర్మల్‌కు వచ్చారు. ప్రభుత్వ ఆస్పత్రి వద్ద హత్యకు యత్నించగా.. జన సంచారం ఎక్కువగా ఉండడంతో వెనక్కి తగ్గి మహారాష్ట్రకు వెళ్లిపోయారు. తొలి ప్రయత్నం విఫలం కావడంతో జూలై 14న ముఖీద్, అఫ్రోజ్, షేక్ షాహిద్ అలియాస్ సల్మాన్, సాయినాథ్ పవార్ అద్దె స్కార్పియోలో మహారాష్ట్ర నుంచి బయల్దేరి నిర్మల్‌లోని అంబేడ్కర్ విగ్రహం వద్ద అన్వరీబేగం, షేక్ మహమ్మద్‌లను కలిశారు. అస్లాంఖాన్ కదలికలను ఎప్పటికప్పుడు అన్వరీబేగం నిందితులకు చేరవేసింది. అస్లాంఖాన్ ప్రయాణికులతో ఆటోలో నిర్మల్ బస్టాండ్ వైపు వెళ్తుండగా.. ముఖీద్, అఫ్రోజ్ స్కారి్పయో వాహనం నుంచి దిగి అడ్డగించారు. అస్లాంఖాన్‌ను బయ టకు లాగి విచక్షణారహితంగా కత్తులతో దాడి చేశారు.తీవ్రంగా గాయపడిన అతడిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ అదే రోజు మృతిచెందాడు. ఘటన అనంతరం నిందితులు నాందేడ్ వైపు పారిపోయారు. పోలీసులు ప్రత్యేక దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేసి నిందితుల ఆచూకీ గుర్తించారు. ముఖిద్, అఫ్రోజ్, షేక్ షాహిద్ అలియాస్ సల్మాన్, సాయినాథ్ పవార్, షేక్ మహమ్మద్‌లను అరెస్ట్ చేసి స్కార్పియో కారు, మోటార్‌సైకిల్, రెండు కత్తులు, ఐదు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.అన్వరీబేగంను ఈ నెల 17న అరెస్ట్ చేసి విచారించగా విషయాలు వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు. ఆమెను కోర్టులో హాజరుపర్చగా న్యాయస్థానం జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. నిందితులను అరెస్ట్ చేయడంలో కీలకంగా పనిచేసిన నిర్మల్ డీఎస్పీ పి.శ్రీనివాస్, సీఐలు ఎం.కృష్ణ, రవీంద్రనాయక్, ఎస్సైలు జి.లింబాద్రి, ఎస్.శ్రీకాంత్, గోపి, గణేష్, అశోక్, దర్యాప్తు బృందాన్ని ఎస్పీ అభినందించి రివార్డులు అందజేశారు. -
డీ-గ్యాంగ్ ముఠా గుట్టు రట్టు
రాజ్‌కోట్: గుజరాత్ లో కాంట్రాక్ట్ హత్యలకు పథకం వేసిన హంతక ముఠా గుట్టును పోలీసులు చేధించారు. అండర్ వరల్డ్ డాన్ దావూద్ చెందిన వ్యక్తులుగా ఈ ముఠాను పోలీసులు గుర్తించారు. వీరిలో షార్ప్ షూటర్ సహా ముగ్గురిని నగర శివార్లలో అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులకే దిమ్మతిరిగే ప్లాన్ తో ఈ గ్యాంగ్ హత్యకు పథకం పన్నింది. చివరికు పోలీసులు అప్రతమత్తతో ముఠా ఆటకట్టింది. పోలీసుల సమాచారం దేశంలో దావూద్ అక్రమ వ్యాపారాలను నిర్వహిస్తున్న పాకిస్తాన్ ఆధారితుడిగా భావిస్తున్న అనీస్ ఇబ్రహీం ఈ కిరాయి హత్యకు కుట్ర పన్నినట్టు పోలీసులు తెలిపారు. జామ్‌నగర్ చెందిన ఒక వ్యాపారవేత్త ను మట్టుమెట్టడానికి ఈ గ్యాంగ్ భారీ పథకమే రచించాడు. ఇందుకు గాను కాంట్రాక్ట్ కిల్లర్ రాందాస్ రహానే తదితర గ్యాంగ్ తో ఒప్పందం కుదర్చుకొని. రూ. 10లక్షలు సుపారీ ఇచ్చాడు. జామ్ నగర్ లో రియల్టీ వ్యాపారి, షిప్పింగ్ వ్యాపారవేత్త ను హత్య చేయడానికి వీరు పథకం పన్నారు. ఈ క్రమంలో ఈ గ్యాంగ్ ఒక ప్రైవేట్ బస్సు రాజ్‌కోట్ వస్తుండగా అరెస్ట్ చేసినట్టు నగర డీసీపీ ఎస్ ఆర్ ఓడెదరా చెప్పారు. మరోవైపు ఆ వ్యాపారవేత్తను అష్ఫాక్ ఖత్రిగా గుర్తించామన్నారు. జామ్‌నగర్ చేరుకొని వాహనాన్ని దొంగిలించి, హత్య చేసి అనంతరం, నకిలీ నంబర్ ప్లేట్ల సహాయంతో తప్పించుకోవాలని చూశారంటూ ఈ కిల్లర్ గ్యాంగ్ మొత్తం ఆపరేషన్ వివరాలను రాజ్‌కోట్ పోలీసు కమిషనర్ అనుపమ్ సింహ్ గెహ్లాట్ వెల్లడించారు. మహారాష్ట్ర నుంచి ఒక ప్రైవేట్ బస్సు లో వస్తున్న రాజ్‌కోట్-అహ్మదాబాద్ జాతీయ రహదారిపై అనుమానాస్పద పద్ధతిలో వెళుతుండగా ఈ నలుగురిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించామన్నారు. వీరినుంచి ఒక పిస్టల్, ఆరు లైవ్ గుళికలు, రెండు కత్తులు , గుజరాత్, మహారాష్ట్ర కు తప్పుడు వాహన రిజిస్ట్రేషన్ నెంబర్లున్న నకిలీ సంఖ్య ప్లేట్లను స్వాధీనం చేసుకున్నట్టు డీసీపీ వెల్లడించారు. ఈ క్రమంలో వ్యాపారవేత్త చంపడానికి అనీస్ ఇబ్రహీంరూ.10 లక్షలు చెల్లించినట్టుగా అంగీకరించాడని తెలిపారు. కాగా డి-గ్యాంగ్ కాంట్రాక్ట్ కిల్లర్‌గా పూరొందిన రాందాస్ పై మహారాష్ట్ర లో పలు ఆరోపణలు ఉన్నాయి. అనేక కేసులు నమోదైనాయి. ముఖ్యంగా 2011 లో బిల్డర్ మనీష్ ధోలకియా కార్యాలయం కాల్పులు, గార్డు మృతి కేసులో కొంతకాలం జైలుకి వెళ్లాడు. అయితే వారు అయితే మిగిలిన ముగ్గురు వ్యక్తుల పేర్లను అధికారులు బహిర్గతం చేయలేదు.


