breaking news
conferred officers
-
TG: ముగ్గురు ఎస్పీఎస్ అధికారులకు కన్ఫర్డ్ ఐపీఎస్లగా పదోన్నతి
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సర్వీస్‌లకు చెందిన ముగ్గురు పోలీస్ అధికారులకు ఐపీఎస్ కన్ఫర్డ్ ఐపీఎస్ పదోన్నతి దక్కింది ఈ మేరకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం పంపింది. ముగ్గురు పోలీసు అధికారులకు కన్ఫర్డ్ ఐపీఎస్‌లుగా ప్రమోట్ అయిన విషయాన్ని తెలియజేసింది. వీరిలో ఎస్. శ్రీనివాస్, కే. గుణశేఖర్, డీ. సునీతలు ఉన్నారు. గతంలో సీఎం సెక్యూరిటీ వింగ్ చీఫ్‌గా ఎస్శ్రీనివాసన్ పనిచేశారు. కాగా, కన్ఫర్డ్ ఐపీఎస్అంటే, రాష్ట్ర పోలీసు సర్వీసులో ఉన్న అధికారులకు భారతీయ పోలీసు సేవ(IPS)లో పదోన్నతి ఇవ్వడం. ఇది సాధారణంగా జరుగుతూ ఉంటుంది. యూపీఎస్సీ ఆధ్వర్యంలో ఒక కమిటీ సమావేశమై, అర్హత కలిగిన ఎస్పీఎస్ అధికారుల పేర్లను పరిశీలించి, ఐపీఎస్‌లుగా పదోన్నతి ఇవ్వాలని నిర్ణయిస్తుంది. పదోన్నతి పొందిన వారు ఐపీఎస్ అధికారులుగా గుర్తింపు పొందుతారు, -
‘కన్ఫర్డ్’ వయసు 56కు పెంచిన కేంద్రం
న్యూఢిల్లీ: రాష్ట్ర కేడర్ అధికారులకు శుభవార్త. అఖిల భారత సర్వీసులైన ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్‌ల్లోకి ప్రవేశం కల్పించేందుకు రాష్ట్ర కేడర్ అధికారుల వయసును 54 ఏళ్ల నుంచి 56 ఏళ్లకు పెంచారు. కన్ఫర్డ్ పదోన్నతి వయసు పెంపుపై కేంద్ర సిబ్బంది, శిక్షణ విభాగం(డీఓపీటీ) ఈమేరకు నిబంధనలను నోటిఫై చేసింది. దీని ప్రకారం యూపీఎస్సీ.. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్‌ల్లోకి రాష్ట్రాల అధికారులను ఎంపిక చేస్తుంది. ప్రతి ఏటా జనవరి 1నాటికి 56 సంవత్సరాలు దాటిన అధికారులను ఈ మూడు సర్వీసుల్లోకి పరిగణించరు. ఇంతకుముందు ఈ పరిమితి 54 సంవత్సరాలు ఉండేది.


