TG: ముగ్గురు ఎస్‌పీఎస్‌ అధికారులకు కన్ఫర్డ్ ఐపీఎస్‌లగా పదోన్నతి | Three More SPS Officers From TG Promoted To Conferred IPS | Sakshi
Sakshi News home page

TG: ముగ్గురు ఎస్‌పీఎస్‌ అధికారులకు కన్ఫర్డ్ ఐపీఎస్‌లగా పదోన్నతి

Oct 27 2025 9:12 PM | Updated on Oct 27 2025 9:21 PM

Three More SPS Officers From TG Promoted To Conferred IPS

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర సర్వీస్‌లకు చెందిన ముగ్గురు పోలీస్‌ అధికారులకు ఐపీఎస్‌  కన్ఫర్డ్ ఐపీఎస్‌ పదోన్నతి దక్కింది ఈ మేరకు యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(యూపీఎస్సీ) రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం పంపింది. ముగ్గురు పోలీసు అధికారులకు కన్ఫర్డ్ ఐపీఎస్‌లుగా ప్రమోట్‌ అయిన విషయాన్ని తెలియజేసింది. 

వీరిలో ఎస్. శ్రీనివాస్, కే. గుణశేఖర్, డీ. సునీతలు ఉన్నారు. గతంలో సీఎం సెక్యూరిటీ వింగ్‌ చీఫ్‌గా ఎస్‌శ్రీనివాసన్‌ పనిచేశారు. కాగా, కన్ఫర్డ్ ఐపీఎస్అంటే, రాష్ట్ర పోలీసు సర్వీసులో ఉన్న అధికారులకు  భారతీయ పోలీసు సేవ(IPS)లో పదోన్నతి ఇవ్వడం. ఇది సాధారణంగా జరుగుతూ ఉంటుంది.   యూపీఎస్సీ ఆధ్వర్యంలో ఒక కమిటీ సమావేశమై,  అర్హత కలిగిన ఎస్‌పీఎస్‌ అధికారుల పేర్లను పరిశీలించి, ఐపీఎస్‌లుగా పదోన్నతి ఇవ్వాలని నిర్ణయిస్తుంది. పదోన్నతి పొందిన వారు ఐపీఎస్‌ అధికారులుగా గుర్తింపు పొందుతారు, 

 

 

 

 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement