breaking news
computer science degree
-
ఆచార్యునిగా కూలీ బిడ్డ!
సాక్షి, ఒంగోలు మెట్రో: మనో వికాసం కలిగించే గొప్ప మార్గం ‘నాటకం’ అంటున్నారు డాక్టర్ ఇండ్ల చంద్రశేఖర్. ఇప్పుడు ప్రకాశం జిల్లా రంగస్థల ప్రతిభ పుణే ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ దాకా చేరింది. అంతేకాదు. వందలాదిమంది కళాకారులను రంగస్థలం మీద మెరిపిస్తూనే, ‘థియేటర్’ను ఉపాధి జెండాగా కూడా ఎగరేస్తున్నారు. ప్రపంచ యవనిక మీద షేక్స్పియర్ నాటకాలు ఆడి, అట్నుంచటు హైద్రాబాద్ తెలుగు విశ్వవిద్యాలయంలో థియేటర్స్ ఆర్ట్స్ ప్రొఫెసర్‌గా ఎదిగిన ప్రకాశం జిల్లా ఒంగోలుకు సమీపంలోని కందులూరు గ్రామానికి చెందిన ఇండ్ల చంద్రశేఖర్ గురించిన కథనం... డాక్టర్ ఇండ్ల చంద్రశేఖర్ ’మట్టిమనుషుల జీవితంలోని అనేక కరుణాత్మక సంఘటనల గురించి గొప్ప కథలు రాశారు. అదే సమయంలో నాటకాలు రాసి అనేక చోట్ల ప్రదర్శించి జాతీయ స్థాయి ప్రతిభ చూపారు. ఔత్సాహిక నటులకు రంగస్థలంలో శిక్షణ ఇస్తున్నారు. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ద్వారా ఫెలోషిప్ పొంది హైద్రాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో థియేటర్లో స్నాతకోత్తర విద్యను పూర్తి చేసిన డాక్టర్ చంద్రశేఖర్ ప్రతిష్టాత్మక ఆగాఖాన్ అకాడెమీలో థియేటర్ విద్యార్థులకు ఐదేళ్లపాటు పాఠాలు చెప్పే ఆచార్యుడయ్యారు. వందలాదిమంది విద్యార్థులను థియేటర్లో రాణింపజేస్తున్న చంద్రశేఖర్ పలు పోటీల్లో తన నాటకాలు, దర్శకత్వం ద్వారా అవార్డులు పొందారు. కంప్యూటర్ సైన్స్‌లో డిగ్రీ చేసిన చంద్రశేఖర్ తర్వాత కాలంలో హెచ్‌సీయూ ఎంట్రన్స్ రాసి థియేటర్లో పీజీ చేశారు. ఈ క్రమంలో యూజీసీ ఉత్తీర్ణుడై ఇప్పుడు విశ్వవిద్యాలయ ఆచార్యుడిగా వ్యవహరిస్తున్నారు. తల్లిదండ్రులు కూలీలు.. ఆయన తల్లిదండ్రులు రోజు కూలీలు. అక్కా చెల్లెళ్లు పచ్చాకు పనిచేస్తారు. తెలుగు కథా సాహిత్యంలో వెంటనే గుర్తొచ్చే పేరుగా ఉన్న చంద్రశేఖర్‌కు ప్రఖ్యాత రచయిత కె.ఎన్వై.పతంజలి అంంటే చాలా ఇష్టం. ట్రాజిక్ కామెడీలో ఉండే ’ మిస్ మీనా‘ అనే నాటకం ఇప్పటికి 100కి పైగా పరిషత్‌లలో ప్రదర్శించి బహుమతులు స్వీకరించారు. థియేటర్ రంగం మీద అనేక పరిశోధనా పత్రాలతో అంతర్జాతీయ సదస్సుల్లో ఆయన రాణించాడు. అనేకచోట్ల కళాపరిషత్‌లలో ఆయన దర్శకత్వం వహించిన నాటకాలు కోసం అవార్డులు ఎదురుచూశాయి. 2017లో అమరావతి జాతీయ నాటకోత్సవాల్లో ఆయన దర్శకత్వంలోని నాటకాలు ప్రదర్శించి ప్రశంసలందుకున్నాయి. ’యాక్టింగ్, కమ్యూనికేషన్, కాన్ఫిడెన్స్, క్రియేటివిటీ, సృజనాత్మక ఆలోచనలతో విద్యార్థులను రంగస్థలం ఉన్నతంగా తీర్చిదిద్దుతుంద‘నే చంద్రశేఖర్ ఇప్పటికి పలు గొప్ప కథలతో కథానిక సాహిత్యంలో పేరు తెచ్చుకున్నారు. పాండిచ్చేరి యూనివర్సిటీలో నాటకరంగం మీద పరిశోధన చేస్తున్న సమయంలో తమిళనాడుకు చెందిన ఎజిల్మతిని ప్రేమించి పెళ్లాడారు. తెలుగు నాటక,సినీ ప్రముఖులు అనేకమందికి చిరపరిచితమే కాక, అనేకమందిని సినీ రంగానికి కూడా పరిచయం చేసిన ఇండ్ల చంద్రశేఖర్ రాణించేలా చేస్తుందంటున్నారు. ప్రకాశం జిల్లా మాండలికాన్ని తన కథల్లో ప్రతిఫలిస్తూ, ప్రకాశం జిల్లా జీవితాన్ని తన రంగస్థల పాఠాల ద్వారా ఉద్దీపితం చేస్తూ ప్రపంచ నాటక రంగ అధ్యాపనంలో తన మేధోశక్తితో రాణిస్తున్న చంద్రశేఖర్ అనేకమంది విద్యార్థుల ఉన్నత భవిష్యత్తుకు బాటలు వేస్తున్నారు. సంప్రదాయ కోర్సులతో నిరుద్యోగులుగా కుదేలయ్యే అనేకమంది మార్గాన్ని మార్చి జీవనోపాధులతో తీర్చిదిద్దుతున్నారు. కథకుడిగా, నాటక రచయిత, దర్శకుడిగా, ఆచార్యుడిగా రాణిస్తున్న చంద్రశేఖర్ అభినందనీయుడు. -
కంప్యూటర్ చదువుకు బెస్ట్ వర్సిటీ ఏదో తెలుసా?
యాపిల్, గూగుల్, ఫేస్ బుక్ లాంటి టెక్ దిగ్గజాల్లో కొలువు సాధించాలని కలలు కంటున్నారా? అయితే, అందుకు ప్రపంచంలోనే ఉత్తమ యూనివర్సిటీ నుంచి కంప్యూటర్ సైన్స్ డిగ్రీ కోర్సును పూర్తి చేయాల్సి ఉంటుంది. మరీ ఏ యూనివర్సిటీ నుంచి డిగ్రీ పట్టా తీసుకోవాలి? కంప్యూటర్ సైన్స్ కోర్సును అందించే ఉత్తమ యూనివర్సిటీలు ఏవి? ఏ యూనివర్సిటీలో చదివితే కోరుకున్న కంపెనీ నుంచి జాబ్ పిలుపు వస్తుంది? అన్నఅంశాలపై తాజాగా వరల్డ్ ఎకనామిక్ ఫోరం అధ్యయనం చేసి ప్రపంచంలోని 50 ఉత్తమ యూనివర్సిటీలతో జాబితా రూపొందించింది. క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్ ఆధారంగా.. కంప్యూటర్ సైన్స్ కోర్సును చదవడంలో విద్యార్థులు ఏ వర్సిటీకి అధిక ప్రాధాన్యమిస్తున్నారు? కంపెనీలు ఏ వర్సిటీ నుంచి రిక్రూట్ చేసుకోవడానికి మొగ్గు చూపుతున్నారు అనే అంశాలను బేరిజు వేసి గుర్తించిన ఆ టాప్ యూనివర్సిటీల వివరాలివి.. 1. మసాచూసెట్స్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (మిట్) ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీ ఇది. ఇక్కడే ప్రపంచంలోని ఉత్తమ కంప్యూటర్ సైన్స్ , ఇన్ఫర్మేషన్ సిస్టమ్ కోర్సులు లభిస్తున్నట్టు తాజాగా తేలింది. గార్డియన్ పత్రిక ప్రచుంరిచిన ఓ సర్వే ప్రకారం మిట్ పూర్వ విద్యార్థులు ఇప్పటివరకు 25,800 కంపెనీలను స్థాపించారు. 30 లక్షలమందికి ఉపాధి కల్పించారు. సిలికాన్ వ్యాలీలోని ఉద్యోగుల్లో మూడోవంతు ఈ కంపెనీకి చెందినవారే. క్యూఎస్ ర్యాంకింగ్ సిస్టమ్ కోర్సుల విషయంలో ఈ వర్సిటీకి 93.8 స్కోర్ ఇచ్చింది. 2. స్టాన్ ఫర్డ్ యూనివర్సిటీ కాలిఫోర్నియాకు చెందిన స్టాన్ ఫర్డ్ యూనివర్సిటీకి ఓ ఘనత ఉంది. ఇందులో చదివిన విద్యార్థులు ప్రపంచంలోనే అతిపెద్ద టెక్నాలజీ కంపెనీలైన గూగుల్, హెచ్ పీ, ఇన్ స్టాగ్రామ్, స్నాప్ చాట్ వంటివాటిని స్థాపించారు. ఈ వర్సిటీకి 93.2 స్కోర్ లభించింది. 3. యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ ఫర్డ్ యూకేలో నెలకొన్న ఈ యూనివర్సిటీ అతి పురాతనమైనది. 1096లో ఏర్పాటైన ఈ వర్సిటీ ఇప్పటికీ ఉత్తమమైన టెక్నాలజీ విద్య అందిస్తుండటం విశేషం. డీప్ మైండ్ వంటి చాలా స్టార్టప్ కంపెనీలు ఈ వర్సిటీతో సంబంధాలు కలిగి ఉన్నాయి. ఈ వర్సిటీకి 92.5 స్కోరు లభించింది. 4. హార్వర్డ్ యూనివర్సిటీ ప్రపంచంలో ఉత్తమ విశ్వవిద్యాలయంగా పేరుంది. అయినా ఈ వర్సిటీ కంప్యూటర్ సైన్స్ కోర్సు విషయంలో నాలుగో స్థానానికి పరిమితమైంది. ఫేస్ బుక్ సీఈవో మార్క్ జుకర్ బర్గ్ ఈ వర్సిటీ డ్రాపౌటే. ఈ వర్సిటీ 92.4 స్కోరు సాధించింది. 5. కార్నెగీ మెలాన్ యూనివర్సిటీ అమెరికా పెన్సిల్వేనియాలోని పిట్స్ బర్గ్ కు చెందిన ప్రైవేటు యూనివర్సిటీ ఇది. హర్వర్డ్, స్టాన్ ఫర్డ్ వర్సిటీల మాదిరిగా ప్రపంచస్థాయి పేరుప్రఖ్యాతలు లేకపోయినప్పటికీ కంప్యూటర్ సైన్స్ విద్యను అందించడంలో ఉత్తమ విశ్వవిద్యాలయంగా ఘనత సొంతం చేసుకుంది. ఈ వర్సిటీకి 91.4 స్కోరు లభించింది. 6. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ యూకేలోనే అతిపెద్ద టెక్నాలజీ హబ్ గా కేంబ్రిడ్జ్ నగరానికి పేరుంది. ఈ నగరం ఎదుగుదల వెనుక కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ కృషి చాలా ఉంది. అంతర్జాతీయ టాప్ వర్సిటీగా పేరొందిన ఈ విశ్వవిద్యాలయానికి కంప్యూటర్ సైన్స్ కోర్సు అందించడంలో 89.8 స్కోరు లభించింది. 7. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, బర్కెలీ సాన్ ఫ్రాన్సికోలో భారీ భవనాలతో బర్కెలీలోనే అత్యంత ప్రతిష్టాత్మక వర్సిటీగా దీనికి పేరుంది. కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ సిస్టమ్ కోర్సులు అందించడంలో ఈ వర్సిటీ 89.4 స్కోరు సాధించింది. 8. ఈహెచ్‌టీ జురిచ్ (స్విస్ ఫెడరల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ) అత్యధిక స్కోరు సాధించిన తొలి అమెరికా, బ్రిటన్ యేతర వర్సిటీ ఇదే. ఈ వర్సిటీకి చెందిన 23మంది విద్యార్థులు, లేదా ప్రొఫెసర్లకు నోబెల్ అవార్డు లభించింది. కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ సిస్టమ్ కోర్సులు అందించడంలో ఈ వర్సిటీ 86.3 స్కోరు సాధించింది. 9. నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ (ఎన్‌యూఎస్) సింగపూర్ లో ప్రాచీనమైన ఉన్నత విద్యాకేంద్రం ఇది. దాదాపు 35వేలమంది విద్యార్థులకు ఈ వర్సిటీ విద్యనందిస్తోంది. ఈ వర్సిటీకి 85.9 స్కోరు లభించింది. 10. ప్రిన్స్టన్ యూనివర్సిటీ న్యూజెర్సీలో ఏర్పాటైన ఈ వర్సిటీకి ప్రపంచవ్యాప్తంగా మంచిపేరుంది. కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ సిస్టమ్ కోర్సులు అందించడంలో ఈ వర్సిటీ 85.6 స్కోరు సాధించింది. ఇంకా జాబితాలో చోటుసాధించిన టాప్ 50 యూనివర్సిటీలు- ర్యాంకుల వరుసక్రమంలో వాటి స్కోరు వివరాలివి.. 11. టొరంటో విశ్వవిద్యాలయం, కెనడా - స్కోరు 83.8 స్కోరు 12. ఇంపీరియల్ కాలేజ్ లండన్, - 83,8 స్కోరు 13. మెల్బోర్న్ యూనివర్సిటీ- స్కోరు 83.1 14. నాన్యంగ్ టెక్నోలాజికల్ విశ్వవిద్యాలయం, సింగపూర్ (NTU)- స్కోరు 82.9 15. ద హాంగ్ కాంగ్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ- స్కోరు 82.9 16. కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం, లాస్ ఏంజెల్స్ (యూసీఎల్ఏ) - స్కోరు 82.8 17. సింఘ్వా యూనివర్సిటీ, బీజింగ్- స్కోరు 82.7. 18. ఎకోల్ పాలిటెక్నిక్ ఫెడరల్ దే లౌసన్నె (EPFL) - స్విస్ విశ్వవిద్యాలయం- స్కోరు 82.6 19 హాంగ్ కాంగ్ విశ్వవిద్యాలయం- స్కోరు 82.1 20 ఎడిన్ బర్గ్ విశ్వవిద్యాలయం - స్కోరు 81.9 . 21. టోక్యో విశ్వవిద్యాలయం- స్కోరు 81.8 22. హాంగ్ కాంగ్ చైనీస్ విశ్వవిద్యాలయం (సీయూహెచ్ కే)- స్కోరు 81.7 23. పెకింగ్ విశ్వవిద్యాలయం, బీజింగ్ - స్కోరు 81,0 24. యూనివర్సిటీ ఆఫ్ బ్రిటిష్ కొలంబియా- స్కోరు 80.6 25. జార్జియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ - స్కోరు 80.5 26. కార్నెల్ విశ్వవిద్యాలయం - స్కోరు 80.4 27. వాటర్లూ యూనివర్సిటీ, కెనడా- స్కోరు 80.4 28. కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (కాల్టెక్)- స్కోరు 80.3 29. వాషింగ్టన్ విశ్వవిద్యాలయం- స్కోరు 80.3 30. ఇల్లినాయిస్ విశ్వవిద్యాలయం (అర్బనా-కాంపెయిన్)- స్కోరు 79.6 31. ఆస్ట్రేలియన్ నేషనల్ యూనివర్సిటీ, కాన్ బెరా- స్కోరు 79.5 32. కొలంబియా విశ్వవిద్యాలయం, న్యూయార్క్ - స్కోరు 79.5 33. యూసీఎల్ (యూనివర్సిటీ కాలేజ్ లండన్) - స్కోరు 79.3 34. టెక్సాస్ విశ్వవిద్యాలయం, ఆస్టిన్- స్కోరు 79,2 35. యూనివర్సిటీ ఆఫ్ న్యూ సౌత్ వేల్స్, ఆస్ట్రేలియా- స్కోరు 78.0 36. కొరియా అడ్వాన్స్ డ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ- స్కోరు 77.9 36. మ్యూనిక్ టెక్నికల్ యూనివర్సటీ, జర్మనీ - స్కోరు 77.9 38. యేల్ విశ్వవిద్యాలయం- స్కోరు 77.7 39. పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయం- స్కోరు 77.2 . 40. సియోల్ నేషనల్ యూనివర్శిటీ, దక్షిణ కొరియా- స్కోరు 76.9 41. సిడ్నీ విశ్వవిద్యాలయం - స్కోరు 76.9 42. న్యూయార్క్ విశ్వవిద్యాలయం - స్కోరు 76.8 43. పాలిటెక్నికో డి మిలానో, ఇటలీ- స్కోరు 76.3 44. షాంఘై జియో టోంగ్ విశ్వవిద్యాలయం- స్కొరు 76.2 45. కాలిఫోర్నియా యూనివర్శిటీ, శాన్ డియాగో - స్కోరు 76.2 46. నేషనల్ తైవాన్ యూనివర్శిటీ- స్కోరు 76.0 47. మిచిగాన్ యూనివర్సిటీ- స్కోరు 75.1 48. షికాగో విశ్వవిద్యాలయం- స్కోరు 74.8. 49. హాంగ్ కాంగ్ సిటీ యూనివర్సిటీ- స్కోరు 74.1 50. హాంగ్ కాంగ్ పాలిటెక్నిక్ విశ్వవిద్యాలయం - స్కోరు 74.1