breaking news
coffiee
-
రెగ్యులర్‌గా కాఫీ... వయసు పెరిగిపోతుంది జాగ్రత్త!
సాధారణంగా చాలామందికి ‘కాఫీ’తోనే రోజు మొదలవుతుంది. ఈ వేడివేడి పానీయం సమయానికి అందకపోతే విలవిలలాడిపోతుంటారు. అయితే తరచూ ‘కాఫీ’ తాగడంతో వచ్చే సమస్యలపై ఒక వైద్య నిపుణుడు చెప్పిన వివరాలు అందరినీ ఆలోచింపజేస్తున్నాయి. ఇవి కాఫీ ప్రియులకు ఆందోళన కలిగించేలా ఉన్నాయి. మనం కొత్త ఉత్సాహం కోసం కాఫీని తాగుతుంటాం. అయితే ఇది మన మెదడుపై తీవ్ర ప్రభావం చూపుతుందని బెంగళూరులోని సాక్రా వరల్డ్ హాస్పిటల్ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ ఎం రవికుమార్ హెచ్చరించారు. ఆయన ‘హిందుస్తాన్ టైమ్స్’తో మాట్లాడుతూ ‘కాఫీ’తో వచ్చే సైడ్ ఎఫక్ట్స్కు సంబంధించిన వివరాలను తెలియజేశారు.తరచుగా కాఫీ తాగితే, అది మెదడులోని ‘గ్రే మ్యాటర్’ పరిమాణాన్ని తగ్గించే అవకాశం ఉందని, ఫలితంగా ఒత్తిడి నుండి మెదడు కోలుకోవడం కష్టమవుతుందని, అంతేకాకుండా, కెఫీన్ ప్రభావం సుమారు 12 గంటల వరకు ఉండి, గాఢ నిద్రకు ఆటంకం కలిగిస్తుందని డాక్టర్ రవికుమార్ హెచ్చరించారు. ఇటువంటి స్థితిలో మెదడుకు కావాల్సిన విశ్రాంతి దొరకక క్రమంగా ‘బ్రెయిన్ ఫాగ్’ వంటి సమస్యలకు దారితీస్తుందన్నారు.మనం తీసుకునే ఆహారంలోని కాల్షియం, ఐరన్ వంటి ముఖ్యమైన ఖనిజాలు శరీరానికి అందకుండా చేయడంలో కాఫీ ‘పోషకాల దొంగ’గా మారుతుందని డాక్టర్ రవికుమార్ పేర్కొన్నారు. కాఫీలోని కెఫీన్, టానిన్లు పేగుల్లో పోషకాల శోషణను అడ్డుకుంటాయని, ఫలితంగా ఎముకల సాంద్రత తగ్గిపోవడం, రక్తహీనత వంటి సమస్యలు తలెత్తుతాయన్నారు. అలాగే ఖాళీ కడుపుతో కాఫీ తాగడం వల్ల గ్యాస్ట్రిక్ యాసిడ్ ఉత్పత్తి పెరిగి, కడుపు లోపలి పొరలు దెబ్బతినే అవకాశం ఉందని, ఇది జీర్ణక్రియపై దీర్ఘకాలికంగా ప్రతికూల ప్రభావం చూపుతుందని ఆయన వివరించారు.అతిగా కాఫీ తాగడం వల్ల శరీరంలో ‘కార్టిసాల్’ అనే ఒత్తిడి హార్మోన్ స్థాయిలు పెరుగుతాయి. ఇది మానసిక ఒత్తిడికే కాకుండా, చర్మ సమస్యలకు కూడా దారితీస్తుంది. ముఖ్యంగా మొటిమలు రావడం, చర్మం తన బిగుతును కోల్పోయి, త్వరగా వృద్ధాప్య ఛాయలు కనిపించడం లాంటివి జరుగుతాయని డాక్టర్ రవికుమార్ తెలిపారు. మహిళల విషయంలో ఇది మరింత ఆందోళనకరంగా మారుతుందని, అధిక కెఫీన్ వినియోగం వల్ల నెలసరి క్రమం తప్పడమే కాకుండా, హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుంది. దీనివల్ల ఆందోళన, గుండె దడ లాంటి లక్షణాలు కూడా కనిపిస్తాయన్నారు.సాధారణంగా చాలామంది బరువు తగ్గడానికి కాఫీ సహాయపడుతుందని అనుకుంటారు. కానీ రోజుకు నాలుగు కప్పుల కంటే ఎక్కువ తాగితే అందుకు విరుద్ధమైన ఫలితాలు వస్తాయని డాక్టర్ కుమార్ తెలిపారు. అతిగా కాఫీ తాగడం వల్ల పొట్ట దగ్గర కొవ్వు చేరడం, జీవక్రియ సంబంధిత సమస్యలు తలెత్తుతాయన్నారు. అంతేకాకుండా నోటిలోని, కడుపులోని మంచి బ్యాక్టీరియా సమతుల్యత దెబ్బతిని ‘లీకీ గట్’ సమస్య వస్తుందన్నారు. ఫలితంగా తిన్న ఆహారం పడకపోవడం, కడుపు ఉబ్బరం లాంటి ఇబ్బందులు ఎదురవుతాయి. అందుకే కాఫీని పరిమితంగా తీసుకుంటేనే ఆరోగ్యకరమని డాక్టర్ ఎం రవికుమార్ సూచిస్తున్నారు.ఇది కూడా చదవండి: ట్రంప్ ‘టారిఫ్’ పిడుగు: మరో దేశంపై ప్రతీకారం? -
జామపండు, మిరపకాయతో కాఫీ!
పుర్రెకో బుద్ధి... జిహ్వకో రుచి అని పాత సామెత. యువతరం.. కొత్త తరం విషయంలో ఇది మరింత సత్యం. అందుకే నగరాల్లో రకరకాల కాఫీలు ప్రత్యక్షమవుతున్నాయి. పాపులర్ అవుతున్నాయి కూడా. తాజాగా ఈ జాబితాలోకి చేరుతోంది ప్రఖ్యాత కంపెనీ టాటాకు చెందిన స్టార్‌బక్స్. విషయం ఏమిటంటే.. హైదరాబాద్‌లోని కాజాగూడ ప్రాంతంలో స్టార్‌బక్స్ దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటి ‘ఎక్స్పెరిమెంటల్ స్టోర్’ను ప్రారంభించింది. ప్రపంచం నలుమూలల్లోని వేర్వేరు దేశాల కాఫీ రుచులను హైదరాబాదీలకు పరిచయం చేయడమే కాకుండా.. దేశీ వెరైటీలు కొన్నింటిని అందుబాటులోకి తెచ్చింది. మలబార్ కోకనట్ క్రీమ్ పేరుతో కాఫీలోకి కొబ్బరిపాల మీగడను చేర్చి అందిస్తుండగా .. మహారాష్ట ఎర్ర జామ పండ్ల ముక్కలకు, తమిళనాట పెరిగే కాంతారి మిరపకాయల రుచులను చేర్చింది. అలాగే తాటిబెల్లంతో తయారైన కాఫీని కూడా ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా అందిస్తున్నారు.‘‘కాఫీ గింజలు ఎక్కడైనా ఒక్కటే అని చాలామంది అనుకుంటూ ఉంటారు. అయితే ప్రాంతాన్ని బట్టి అక్కడి కాఫీ గింజల లక్షణాలు మారిపోతాయి. అక్కడి నీరు, మట్టిలోని ఖనిజాలు, వాతావరణాల ప్రభావంతో ఆ గింజలతో తయారైన కాఫీ రుచిలోనూ తేడాలొస్తాయి’’ అని వివరించారు స్టార్‌బక్స్ కాఫీ అంబాసిడర్ విభోర్ మిశ్రా. దీంతోపాటు డికాక్షన్ తయారు చేసే పద్ధతిని బట్టి కూడా రుచి మారుతూంటుందని తెలిపారు. కాఫీ గింజలు/పొడికి వేడి నీటిని కలిపి కాగితపు న్యాప్కిన్ ద్వారా ఫిల్టర్ చేస్తే కాఫీలోని నూనెలు తగ్గుతాయని, సాధారణ ఫిల్ట్రేషన్‌తో ఇలా జరగదని కూడా ఆయన వివరించారు. కాఫీతోపాటు స్టార్‌బక్స్ ఎక్స్పెరిమెంటల్ స్టోర్‌లో రెడ్వెల్వెట్, చాకొలెట్ ట్విస్ట్, ఇటాలియన్ వంటకం ‘క్రాసో’ వంటివి కూడా అందిస్తున్నారు. అప్పుడప్పుడు తాము కాఫీ తయారీకి సంబంధించిన వర్క్‌షాపులు కూడా నిర్వహిస్తూంటామని విభోర్ తెలిపారు. ‘‘కాఫీ అనగానే మన మనసుల్లో ఎన్నో జ్ఞాపకాలు మెదలుతాయి. నాకైతే స్టార్‌బక్స్ ఎక్స్పెరిమెంటల్ స్టోర్‌లో లభిస్తున్న దేశీ కాఫీ వెరైటీలకు, క్రాసో, చాకొలెట్ ట్విస్ట్, రెడ్వెల్వెట్ లకు మంచి లింకు కుదిరినట్లు అనిపిస్తుంది’’ అని వివరించారు పేస్ట్రీ షెఫ్, చాకొలటీర్ నికిత ఉమేశ్! ఇంకో విషయంలో ప్రపంచంలోని సుమారు 40 వేల ఔట్లెట్లలో మాదిరిగానే ఇక్కడ కూడా లాటే, డార్క్ రోస్ట్, బ్లాండ్ రోస్ట్ వంటివి ఇక్కడ కూడా లభిస్తాయి.! -
అయ్యయ్యో..తప్పై పోయింది క్షమించండి..!
ఆన్లైన్లో ఆర్డర్ పెట్టిన కాఫీ తాగుతున్నారా? అయితే ఒక్క క్షణం. కాఫీ తాగే ముందు చెక్ చేసుకొని తాగండి. లేదంటే కాఫీ బదులు చికెన్ ముక్కల్ని తినాల్సి వస్తుంది. ఏం నమ్మడం లేదా? ఢిల్లీకి చెందిన సుమిత్ కాఫీ తాగి రిలాక్స్ అవ్వాలని అనుకున్నాడు. అందుకే 10 నిమిషాల్లో డెలివరీ చేసే జొమాటోలో కాఫీ ఆర్డర్ పెట్టాడు. ఇలా ఆర్డర్ పెట్టాడో లేదో థర్డ్ వేవ్ ఇండియా అనే తన రెగ్యులర్ ప్లేస్‌లో ఒక బ్రాంచి నుండి కాఫీ ఇలా వచ్చేసింది. వేడి వేడి కాఫీని తన భార్యతో కూర్చొని తాగుతున్నాడు. ఆ కాఫీ తాగే సమయంలో చికెన్ ముక్క బయట పడడంతో సుమిత్, అతని భార్య షాక్ తిన్నారు. దీంతో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని ట్వీట్టర్లో షేర్ చేశాడు. Ordered coffee from @zomato , (@thirdwaveindia ) , this is too much . I chicken piece in coffee ! Pathetic . My association with you officially ended today . pic.twitter.com/UAhxPiVxqH — Sumit (@sumitsaurabh) June 3, 2022 "@జొమాటో, @థర్డ్ వేవ్ నుంచి కాఫీని ఆర్డర్ చేశాను. ఇది చాలా దారుణం. కాఫీలో ఒక చికెన్ ముక్క కనిపించింది. మీతో నా అనుబంధం ఈరోజుతో అధికారికంగా ముగిసింది" అని పోస్ట్‌లో పేర్కొన్నారు.దీంతో తప్పై పోయింది క్షమించండి అంటూ జొమాటో ఆయనను క్షమాపణలు కోరింది. జరిగిన పొరపాటుకు విచారం వ్యక్తం చేస్తూ ఆ వ్యక్తికి ప్రో మెంబర్ షిప్‌ను అందిస్తామని ఆఫర్ చేసింది. అతని వివరాలను షేర్ చేయమని కోరింది. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్లను సుమిత్ పోస్ట్ చేశారు.ఈ ఇన్సిడెంట్‌పై నెటిజన్లు జొమాటోపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. I am really curious, how in the world, coffee which is prepared in a very different counter/machine has chicken piece in it? Unless it is deliberately done. — Lutyens' Rasputin™ (@hujodaddy1) June 3, 2022 మెషిన్లో తయారు చేసే కాఫీలోకి చికెన్ ముక్కలు ఎలా వస్తాయి. ఇది కావాలనే ఎవరో చేశారని ఓ నెటిజన్ అనుమానం వ్యక్తం చేశాడు I can feel this .. I am a Vegetarian too and if this would have happened with me.. I would never have ordered anything from this store — IDidNotCodeThis (@dreamersan18) June 3, 2022 నేను శాఖా హారిని సుమిత్‌కు జరిగినట్లు నాకు జరిగితే.. ఇక ఆర్డర్ పెట్టడం మానేస్తానంటూ మరో నెటిజన్ కామెంట్ చేశాడు -
కాఫీ తాగడంపై జన్యు ప్రభావం
స్కాట్లాండ్: మన చుట్టూవున్న వాతావరణం చలి, చలిగా ఉన్నప్పుడు వేడి వేడి కాఫీ తాగాలని అనిపించడం ఎవరికైనా అనుభవమే. అయితే కొందరు తక్కువ తాగుతారు. కొందరు ఎక్కువ కప్పులు తాగుతారు. మరి కొందరు గబ,గబా తాగేస్తారు. ఇంకొందరు అసలే తాగరు. కాఫీ తాగడంలో వ్యక్తికి, వ్యక్తికి మధ్య వ్యత్యాసానికి కారణం ఏమిటీ? మన అలవాట్లా, మన ప్రవర్తనా? ఇదే అంశాన్ని తేల్చుకుందామని ఎడిన్బర్గ్ యూనివర్శిటీకి చెందిన ‘యుషర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పాపులేషన్ హెల్త్ సెన్సైస్ ఇన్ఫార్మిటిక్స్’కు చెందిన నిపుణులు పరిశోధనలు చేశారు. మానవ డీఎన్ఏలో ఉండే ‘పీడీఎస్‌ఎస్2’ అనే జన్యు రకం మానవులు కాఫీ తాగడాన్ని ప్రభావితం చేస్తోందని, ఈ జన్యువును కలిగిన వారు అది లేనివారికన్నా తక్కువ కప్పుల కాఫీ తాగుతారని పరిశోధనల్లో తేలింది. మరో విధంగా చెప్పాలంటే కాఫీ తాగడాన్ని ఈ జన్యువు నియంత్రిస్తుంది. మన ఆహారపు అలవాట్లు, రుచులకు మనలోని జన్యువులకు ప్రత్యక్ష సంబంధం ఉంటుందని శాస్త్రవేత్తలు ఎప్పుడో కనిపెట్టినప్పటికీ కాఫీ తాగే అలవాటుపై జన్యువుల ప్రభావం ఎలా ఉంటుందో విఫులంగా పరిశోధించడం దాదాపు ఇదే మొదటిసారి. దక్షిణ ఇటలీలోని 370 మంది, ఈశాన్య ఇటలీకి చెందిన 843 మంది కాఫీ తాగే అలవాటున్న వారి డీఎన్ఏలోని జన్యువుల క్రమాన్ని శాస్త్రవేత్తలు అధ్యయనం చేశారు. పీడీఎస్‌ఎస్ 2 రకం జన్యువు ఉన్నవారు తక్కువ కప్పుల టీ తాగగా ఇది లేని వారు ఎక్కువ కప్పుల టీ తాగుతున్నట్లు తేలింది. నెదర్లాండ్స్‌కు చెందిన 1731 మందిపై కూడా ఈ పరిశోధనలు జరపగా ఒకే రకమైన ఫలితాలు వచ్చాయి. అసలు టీ అనేది తాగడానికి పరిస్థితులు, పరిసరాలు, సంస్కృతి, అలవాటు కారణం అనే విషయం తెల్సిందే. అయితే కాఫీ ఎక్కువ, తక్కువ తాగడానికి మానవ జీర్ణక్రియకున్న ప్రత్యక్ష సంబంధం ఏమిటో తెలుసుకునేందుకు ఈ అంశంలో మరింత లోతుగా అధ్యయనం చేయాల్సి ఉంటుందని శాస్త్రవేత్తలు తెలిపారు. కాఫీ తాగే అలవాటు మనుషుల్లో ఒక్కో దేశంలో ఒక్కో విధంగా ఉంటుందన్న విషయం తెల్సిందే. అమెరికాలో 65 శాతం మంది ప్రజలు రోజుకు ఒక్క కప్పయిన కాఫీ తాగుతారు.


