సీఎంఏ ఇంటర్ ఫలితాల్లో రెండో ర్యాంకు
కంబాలచెరువు (రాజమహేంద్రవరం) :
సీఎంఏ ఇంటర్ ఫలితాల్లో రాజమహేంద్రవరం మాస్టర్‌మైండ్ విద్యార్థి పులగం సాయికుమార్‌రెడ్డి అఖిలభారత స్థాయిలో రెండో ర్యాంకు సాధించాడు. ఈ మేరకు ఆ వివరాలను ఆ కళాశాల బ్రాంచ్ అడ్మిన్ ప్రిన్సిపాల్ విజయ్‌కుమార్ శనివారం విలేకరుల సమావేశంలో తెలిపారు. మొత్తం 50 ర్యాంకులకు తమ విద్యార్థులు 44 ర్యాంకులు సా«ధించారన్నారు. ఇటీవల ప్రకటించిన సీఏ సీపీటీ, సీఏ ఐపీసీసీ, సీఏ ఫైనల్ ఫలితాల్లో అధిక ర్యాంకులు సాధించారన్నారు. అనంతరం ర్యాంకర్ సాయికుమార్‌రెడ్డిని సత్కరించారు. కార్యక్రమంలో బ్రాంచ్ ప్రిన్సిపాల్ భవానీప్రసాద్, అధ్యాపకులు పాల్గొన్నారు.