breaking news
the circle
-
ఈ వారం యూట్యూబ్ హిట్స్
ఐష్ సూయిసైడ్ : న్యూస్ నిడివి: 1ని.34సె. హిట్స్: 29,26,481 బచన్ల కోడలు ఐశ్వర్యారాయ్ దాంపత్యంలో కలతలు రేగాయని కొంతకాలంగా మీడియాలో వినిపిస్తోంది. ఆ మధ్య భార్యతో కలిసి ఫొటో దిగడానికి అభిషేక్ బహిరంగంగానే నిరాకరించడం, ఫొటోగ్రాఫర్లతో, ‘ఆమెను తీస్కోండి’ అని దూరంగా వెళ్లిపోవడం పెద్ద చర్చ అయింది కూడా. ఇప్పుడు లేటెస్టుగా ఐశ్వర్య ఆత్మహత్యాయత్నం చేశారన్న వార్త రౌండ్లు కొడుతోంది. ఐశ్వర్య మోతాదుకు మించి నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించిందనీ, ఆ విషయాన్ని చివరి నిమిషంలో గుర్తించి, కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రిలో చే ర్పించారని ముంబైలోని చిన్న పత్రికలు, టీవీ చానళ్లు బ్రేకింగ్ న్యూస్‌లు ఇచ్చాయి. అయితే ఇవన్నీ వదంతులేననీ బచన్ల ఫ్యామిలీ ఖండించింది. దంపతులిద్దరూ సంతోషంగా ఉన్నారని, ఆ కుటుంబం ప్రతిష్ట మీద బురద చల్లడానికే, పని లేని వారు ఇలాంటివి పుట్టిస్తున్నారని బచన్లను అభిమానించేవారు అంటున్నారు. అసలేం జరిగింది, ఏం జరగబోతోంది అని తెలుసుకోడానికి ఎం.ఎన్.ఎఫ్ అనే న్యూస్ చానల్ చేసిన ఎనాలసిస్ను మీరీ క్లిప్పింగ్‌లో చూడొచ్చు. మమ్మీ : అఫీషియల్ ట్రైలర్ నిడివి: 2ని.32సె. హిట్స్: 2,31,69,072 జేమ్స్‌బాండ్ సినిమాల్లా ‘మమ్మీ’ సినిమాలు ఒక లైన్లో వచ్చేస్తూ ఉంటాయి. మమ్మీల జానర్లో తాజా చిత్రం ‘ది మమ్మీ’. పాత టైటిలే కానీ, ఈ యాక్షన్ అడ్వెంచర్ హారర్ ఫిల్మ్‌లో కొత్త థ్రిల్లర్స్ మీ ఒళ్లు గగుర్పొడిచేలా చేస్తాయని డైరెక్టర్ అలెక్స్ కర్జ్మేన్ ఇప్పటికే ఓ స్టేట్మెంట్ విడుదల చేశారు. ఇప్పుడీ ట్రైలర్‌ను చూస్తే ఆ మాట నిజమేననిపిస్తుంది. ఒక పెద్ద మమ్మీని తాళ్లతో కట్టేసుకుని ఓ విమానం గాల్లోకి లాక్కుపోయే దృశ్యాన్ని ఊహించండి. ఆ తర్వాత గంటపాటు అనూహ్యంగా సంభవిస్తూ ఉండే పరిణామాలను ట్రైలర్లో చూడండి. అల్జీరియా నటి సోఫియా బౌటెల్లా ఈ చిత్రంలో మమ్మీగా నటించారు. సోఫియా ఒక ప్రాచీనకాలపు మహారాణి. ఆమె అనుమానాస్పద స్థితిలో మరణిస్తుంది. ఆమె ‘మమ్మీ’ని చర్చి అడుగున సమాధి చేస్తారు. కొన్నేళ్ల తర్వాత ఆ మమ్మీ నిద్ర లేస్తుంది. తనను చంపినవాళ్లపై పగ తీర్చుకుంటుంది. 2017 జూన్ 9న విడుదలౌతున్న ఈ హాలీవుడ్ మూవీ ట్యాగ్‌లైన్ ఇప్పటికైతే.. ‘వెల్కం టు ది న్యూ వరల్డ్ ఆఫ్ గాడ్స్ అండ్ మాన్స్టర్స్’. ఈ ట్యాగ్‌లైన్‌ని బట్టికూడా మీ ఊహల్లో కొంత కథను పొడిగించుకోవచ్చు. మూడు ఆస్కార్ అవార్డులు గెలుచుకున్న టామ్ క్రూజ్ కూడా ఈ చిత్రంలో మీ ఊహల్ని నిజం చేయగల పాత్రనే పోషిస్తున్నారు. అమెజాన్ గో : షాపింగ్: నిడివి: 1ని.49సె. హిట్స్: 67,52,460 నో లైన్స్, నో చెకౌట్స్, జస్ట్ గ్రాబ్ అండ్ గో! క్యూలు ఉండవు. చెకింగ్ ఉండదు. బిల్లు అక్కడికక్కడే ఇచ్చేయడం ఉండదు. కావలసింది తీసుకోవడం. వెళ్లిపోవడం. అంతే. ఆన్లైన్ మార్కెటింగ్‌తో ప్రపంచంలో మూలమూలకు చొచ్చుకుపోయిన అమెజాన్ డాట్ కామ్ ఇప్పుడు ఓ పెద్ద సూపర్ మార్కెట్‌ను ప్రారంభించబోతోంది! అందులో మనకు కావలసిన వస్తువుల్ని, పదార్థాలను తీసుకోవడం ఒక్కటే కాదు, అక్కడికక్కడ మనకు వండిపెట్టే చెఫ్‌లూ ఉంటారు. మన స్మార్ట్ ఫోన్లో అమెజాన్ గో ఆప్ యాక్టివేట్ చేస్తే చాలు అమెజాన్ స్టోర్స్‌లోకి ప్రవేశం లభిస్తుంది. ఆ తర్వాత అదంతా మన సామ్రాజ్యం. క్యాష్‌లెస్ కింగ్డమ్. షెల్ఫ్లోంచి మనం ఏం తీసుకున్నా, తీసుకున్న దాన్ని మళ్లీ షెల్ఫ్‌లో పెట్టేసినా, లోపల డైనింగ్ హాల్లో కూర్చొని తిన్నా ఎప్పటికప్పుడు అదంతా మన స్మార్ట్‌ఫోన్‌లోని వర్చువల్ కార్ట్ (స్క్రీన్‌పై కనిపించే సరకుల బుట్ట)లో రికార్డ్ అవుతుంటుంది. షాపింగ్ అయి బయటికి వచ్చేసిన కొద్దిసేపటికే మన అమెజాన్ అకౌంట్లో బిల్లు డెబిట్ అయి, ఆ రసీదు మనకు ఎస్ఎమ్ఎస్ అవుతుంది. క్షణం తీరిక లేకుండా ఉండే కస్టమర్ల కోసం సియాటిల్ 1800 చదరపు అడుగుల విస్తీర్ణంలో తయారౌతున్న ఈ అమెజాన్ స్టోర్స్ 2017 జూన్ లోపు ప్రారంభం అవుతుందట. తర్వాత మిగతా దేశాలకు, ఆ దేశాల్లోని మహా నగరాలకూ! బాగుంది కదా. ది సర్కిల్ : అఫీషియల్ ట్రైలర్ నిడివి: 1ని. 50సె. హిట్స్: 17,21,748 ఇరవై ఆరేళ్ల బ్రిటిష్ నటి ఎమ్మా వాట్సన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సైన్స్ ఫిక్షన్ హాలీవుడ్ మూవీ ‘ది సర్కిల్’.. ట్రైలర్ ఇది. ఎమ్మా ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తుంటుంది. మంచి వర్కర్‌గా పేరు సంపాదించుకుని త్వరత్వరగా పెద్ద పొజిషన్లోకి వెళుతుంది. గోప్యత, నిఘా అవసరమైన అత్యున్నత స్థాయిలోకి వెళ్లాక ఆమెకు కొన్ని రహస్యాలు తెలుస్తాయి. తను తీసుకోబోయే నిర్ణయాలపైనే మానవాళి భవిష్యత్తు ఆధారపడి ఉంటుందన్న సంగతి తెలియగానే దిగ్భ్రమకు లోనవుతుంది. అక్కడి నుంచి సినిమా అంతా ఉత్కంఠే. సినిమా నిర్మాతలలో ఒకరైన అరవై ఏళ్ల అమెరికన్ నటుడు టామ్ హ్యాన్స్ ఈ చిత్రంలో విరోధి పాత్రను పోషిస్తున్నారని వినికిడి. ఎవరితో అతడి విరోధం అన్నదానిపై ఇప్పటికీ క్లారిటీ లేదు. నిజానికి ‘ది సర్కిల్’ కథాంశం ఏమిటన్నది కూడా పూర్తిగా బయటికి రాలేదు. ట్రైలర్‌కి హిట్స్ మాత్రం గంటగంటకూ పెరిగిపోతున్నాయి. మూవీ 2017 ఏప్రిల్ 28న విడుదలౌతోంది. -
ఐబీ సర్కిల్లో కొత్త కలెక్టరేట్
వరంగల్ : నూతనంగా ఏర్పాటు కానున్న కలెక్టర్ కార్యాలయాన్ని చిన్న నీటిపారుదల శాఖకు చెందిన సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేస్తామని, అందుకు వెంటనే భవనాన్ని ఖాళీ చేసి అప్పగించాలని కలెక్టర్ కరుణ ఎస్ఈ శ్రీనివాస్‌రెడ్డిని ఆదేశించారు. మంగళవారం ఆమె ఐబీ ఎస్ఈ కార్యాలయ భవనాన్ని పరిశీలించారు. వరంగల్ జిల్లా నాలుగు జిల్లాలుగా ఏర్పాటు కావడం ఖాయమనే సంకేతాలు అధికారుల నుంచి వెలువడుతున్నాయి. జయశంకర్, మహబూబాబాద్ జిల్లాల ఏర్పాటులో ఎలాంటి సందేహాలు లేవు. వరంగల్, హన్మకొండ లేక వరంగల్ రూరల్, వరంగల్ అర్భ¯ŒSల పేరుతో మరో రెండు జిల్లాలు ఏర్పాటు కానున్నాయి. ఇప్పటి వరకు కొత్తగా ఏర్పడే వరంగల్ జిల్లా కలెక్టరేట్‌ను పాత కలెక్టరేట్లోనే కొనసాగిస్తూ కొత్తగా ఏర్పడే జిల్లాకు కలెక్టర్ కార్యాలయం ఐబీ కార్యాలయంలో ఏర్పాటు చేస్తే బాగుంటుందని కలెక్టర్ బావిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న ఐబీ ఎస్ఈ కార్యాలయాన్ని అదే అవరణలో ఉన్న డీఎంసీ(గెస్ట్‌హౌజ్)లో ఏర్పాటు చేసుకోవాలని ఎస్ఈ శ్రీనివాసరెడ్డికి సూచించారు. ఈ విషయాన్ని ఇరిగేష¯ŒS శాఖ మంత్రి హరీశ్‌రావుతో పాటు రాష్ట్ర ఉన్నతాధికారులకు ఎస్ఈ వివరించినట్లు తెలిసింది. చిన్న నీటివనరుల పునరుద్ధరణలో భాగంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మిష¯ŒS కాకతీయ’ కార్యక్రమానికి చిహ్నంగా సర్కిల్ కార్యాలయ అవరణలో పైలా¯ŒS నిర్మించారు. ఈ పథకం మరో మూడేళ్లు సాగనున్నందున ఇక్కడే యథావిధిగా కార్యాలయం కొనసాగించాలన్న డిమాండ్ అ«ధికారుల నుంచి వినిపిస్తోంది. కదిలిస్తే ఖతం... జిల్లా చిన్న నీటిపారుదల శాఖ కార్యాలయంలోని రికార్డ్ గదిలో ఉన్న ఫైళ్లు కదిలిస్తే పూర్తిగా శిథిలం అయ్యే అవకాశాలున్నాయి. ఈ కార్యాలయానికి 110 ఏళ్ల చరిత్ర ఉంది. తెలంగాణ రాష్ట్రం అవిర్భవించిన అనంతరం 2015 వరకు ఈ కార్యాలయంలోనే ఖమ్మం, వరంగల్ జిల్లాల పరిధిలోని చిన్న నీటి వనరుల అభివృద్ధి, పర్యవేక్షణ చూసేవారు. ఎన్నో చిన్న, మధ్య తరహా ప్రాజెక్టుల భూములకు సంబంధించిన విలువైన రికార్డులు ఇక్కడ భద్రపరిచారు. ప్రస్తుతం వాటిని తీస్తే పూర్తిగా శిథిలమయ్యే ప్రమాదం ఉందని అధికారులు చెబుతున్నారు.