breaking news
Church gate station
-
త్వరలో చీపురు పట్టనున్న సానియా మీర్జా
టెన్నిస్ స్టార్ సానియా మీర్జా త్వరలో చీపురు పట్టనుంది. స్వచ్ఛ భారత్‌లో భాగంగా రిలయన్స్ గ్రూపు అధినేత అనీల్ అంబానీ ఆహ్వానాన్ని ఆమె స్వీకరించారు. ఈ సందర్భంగా సానియా మాట్లాడుతూ అనీల్ అంబానీ చాలెంజ్‌ను స్వీకరిస్తున్నానని, త్వరలో సమయం చూసుకుని డబ్ల్యూటీఏ చాంపియన్ షిప్‌కు వెళ్లేలోపే స్వచ్ఛ భారత్‌లో పాల్గొంటానని తెలిపింది. కాగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గాంధీ జయంతి రోజున "స్వచ్ఛ భారత్'ను ప్రారంభిస్తూ.. ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవాల్సిందిగా తొమ్మిది మంది ప్రముఖులను ఆహ్వానించిన సంగతి తెలిసిందే. వారిలో అనిల్ అంబానీ కూడా ఉన్నారు. మోడీ పిలుపు మేరకు అనిల్ బుధవారం తన స్నేహితులతో కలిసి ముంబయి చర్చి గేట్ ముందు పరిసరాలను శుభ్రపరిచారు. ఈ సందర్భంగా ఆయన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాలుపంచుకోవాల్సిందిగా మరో తొమ్మిదిమంది ప్రముఖులకు ఆహ్వానం పలికారు. వారిలో సానియాతో పాటు టాలీవుడ్ హీరో నాగార్జున కూడా ఉన్నారు. -
నాగార్జున, సానియాకు అనీల్ అంబానీ ఆహ్వానం
ముంబయి : రిలయన్స్ గ్రూప్ ఛైర్మన్ అనీల్ అంబానీ చీపురు పట్టారు. ప్రధాని మోడీ స్వచ్ఛ భారత్ పిలుపు మేరకు ఆయన బుధవారం ఉదయం ముంబాయిలోని చర్చ్ గేట్ స్టేషన్ బయట చీపురు పట్టి శుభ్రం చేశారు. అనంతరం అనీల్ అంబానీ స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొనాలని పలువురు సెలెబ్రెటీలకు సవాల్ విసిరారు. మేరీ కోమ్, అమితాబ్ బచ్చన్, సానియా మీర్జా, శోభా డే, ప్రముఖ జర్నలిస్ట్ శేఖర్ గుప్తా, పాటల రచయిత ప్రషన్ జోషి, హృతిక్ రోషన్, టాలీవుడ్ హీరో నాగార్జునలతో పాటు రన్నర్స్ క్లబ్ ఆఫ్ ఇండియాను ఆయన ఆహ్వానించారు. స్వచ్ఛ భారత్ పథకం విజయవంతమయ్యేందుకు అంకితభావంతో పనిచేస్తానని ఈ సందర్భంగా అనీల్ చెప్పారు. మరోవైపు అనీల్ అంబానీని స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొనటాన్ని మోడీ ప్రశంసించారు. అనీల్ అంబానీ, ఇతరులతో కలిసి చర్చ్‌గేట్ స్టేషన్ వద్ద పరిశుభ్రం చేయటం మంచి ప్రయత్నమని ఆయన ట్విట్ చేశారు. కాగా అక్టోబర్ 2వ తేదీన మోడీ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన తొమ్మిదిమంది ప్రముఖలకు ఛాలెంజ్ విసిరిన విషయం తెలిసిందే. ఆ తొమ్మిదిమంది ప్రముఖుల్లో అనీల్ అంబానీ ఉన్నారు.