breaking news
Christmas celebrations.
-
Christmas Day 2022: మెర్రీ క్రిస్మస్: ‘నీ రాజ్యం వచ్చును గాక...’
ఆకురాలే కాలం తర్వాత చెట్లు చిగిర్చే వసంతం – ‘క్రిస్మస్ సీజన్’కు మనోహరమైన దృశ్య నేపథ్యం కావడంతో, విశ్వాసాలకు అతీతమైన భావన మన లోపలికి చేరి,’ఫీల్ గుడ్’ మానసిక స్థితికి మనల్ని చేరుస్తుంది. ఒంటరిగా ఏ చలిరాత్రిలోనో రెండు చేతులు జేబుల్లో ముడుచుకుని నడుస్తూ వెళుతుంటామా, చీకటి తెరలు చీల్చుకుంటూ ఎవరిదో బాల్కనీలో వెలుగుతూ వేలాడుతున్న ‘క్రిస్మస్ స్టార్’ కనిపిస్తుంది. అటు చూస్తూ దాన్ని మనం దాటతాం. అయితే అదక్కడ ఆగదు, దాన్ని దాటాక కూడా అది మన వెంట వస్తూ మన లోపలికి చేరి, కొంతసేపు అది అక్కడ తిష్టవేస్తుంది. ఎందుకలా? అది ‘ఫీల్ గుడ్’ సీజన్ కావడం వల్లా? అంతే కావచ్చు... ఐరోపాలో మొదలైన ఈ ‘సీజన్’ భావన ‘క్రిస్మస్’ను ప్రపంచ పండగ చేసింది. కానీ ఆసియాలోని బేత్లెహేములో అప్పట్లో జీసస్ పుట్టిన స్థలం ఏమంత పరిశుభ్రమైనదేమీ కాదు. అయినా ఆ జననం నేరుగా రాజమందిరంలో ప్రకంపనలు పుట్టించింది. చివరికి జనాభా నమోదు కోసం స్వగ్రామం నజరేతు నుంచి వచ్చిన దంపతులు తమతోపాటు ‘రాజ్యం’ జాబితాలో వారి మగ శిశువుకు కూడా ఒక ‘నంబర్’ వేయించుకుని, స్వగ్రామానికి తిరిగి వెళ్లారు. అలా చరిత్రలో క్రీస్తును రెండు శకాల మధ్య ప్రతిష్టించడం మొదలయింది. అందుకే ప్రపంచ చరిత్రలో జీసస్ ‘ఫిక్షన్’ కాలేదు. యువకుడైన జీసస్‌ను ప్రార్ధన చేయడం ఎలా? అని శిష్యులు అడుగుతారు. అయన చెబుతాడు– ‘పరలోకమందున్న మా తండ్రీ! నీ నామము పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం వచ్చును గాక...’ అంటూ సాగుతుంది ఆయన చెప్పింది. మరొక రాజ్యమేదో మున్ముందు రావలసి ఉన్నది అనేది అక్కడి సారాంశం. ఆయన దృక్పథం‘రాజ్యం’ ప్రాతిపదికగా ఉంది. మరొకసారి ‘బోధకుడా జార్ చక్రవర్తికి పన్ను చెల్లించాలా?’ అని కొందరు అడుగుతారు. జీసస్ వాళ్ళ చేతిలోని నాణెం తీసుకుని– ‘దీనిమీద వున్న ఈ బొమ్మ ఎవరిది?’ అని అడుగుతాడు. ‘అది జార్ చక్రవర్తిది’ అని వాళ్ళు బదులిస్తారు. ‘అయితే, రాజుది రాజుకు, దేవునిది దేవుడికి ఇవ్వండి’ అంటాడు. ఒకపక్క తండ్రి ‘రాజ్యం’ రావాలి అంటూ ప్రార్థన నేర్పుతూనే, మరోపక్క మనకు పౌరసత్వమున్న ‘రాజ్యాన్ని’ మనం అంగీకరించాలి అంటాడు. అయితే, చరిత్రలో ఈ భావధార ఎక్కడా ఆగినట్టుగా కనిపించదు. దీనికి కొనసాగింపు అన్నట్టుగా మరొక యూదు తత్వవేత్త కార్ల్ మార్క్స్ ‘రాజ్యం అంతరిస్తుంది...’ అంటాడు. ‘రాజ్యం’పై ఆధారపడుతున్న వారు క్రమంగా తగ్గడం, అందుకు సూచిక అయితే కావొచ్చు. బాలుడైన జీసస్ పశువుల పాకలో చలి తగలకుండా గుడ్డలతో చుట్టి ఖాళీగా వున్న పశువులు నీళ్లు తాగే తొట్టెలో ఉన్నట్టుగా ‘క్రిస్మస్’ గ్రీటింగ్ కార్డ్స్ బొమ్మల్లో చూస్తాం. మేరీ, జోసఫ్‌లతో పాటుగా గొర్రెల కాపరులు, తూర్పుదేశం నుంచి వచ్చిన జ్ఞానులు విలువైన కానుకలు సమర్పిస్తారు. రెండు విభిన్న సామాజిక–ఆర్థిక సమూహాలు జీసస్ వద్దకు రావడం– ‘క్రిస్మస్’తోనే సాధ్యమయిందా? నాటి వారి కలయిక ప్రక్రియ కొనసాగుతూనే ఉన్నదా అంటే, లేదని అనడానికి కారణాలు కనిపించవు. ప్రపంచం ‘క్రిస్మస్’ జరుపుకోవడం రెండు భిన్న సమూహాలు మధ్య దూరాలు తగ్గడంగా కనిపిస్తున్నది. ఒకరికొకరు బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం, ‘కేక్స్’ కట్ చేయడం, ఆనందోత్సాహాలను పంచుకోవడం వంటివి తరాలు మారుతూ ఉంటే అది మరింత ‘ట్రెండీ’గా మారుతున్నది. ‘క్రిస్మస్’ సీజన్లో అన్ని దేశాల్లో రిటైల్ మార్కెట్ ఊపందుకుంటుంది. దుస్తులు, ఫ్యాషన్ల ప్రకటనలు ఇప్పటికే పత్రికల్లో చూస్తున్నాం. ‘కరోనా’ కారణంగా రెండేళ్ల విరామం తర్వాత ఎయిర్ పోర్టుల్లో ‘క్రిస్మస్’ సందడి నెల ముందే మొదలయింది. – జాన్ సన్ చోరగుడి -
అందరికీ సమన్యాయం
క్రిస్మస్ వేడుకలో మంత్రి పోచారం నిజామాబాద్ కల్చరల్: తమ ప్రభుత్వం అన్నివర్గాల ప్రజలకు సముచిత న్యాయం చేసే దిశగా ముందుకు సాగుతోందని వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని కంఠేశ్వర్‌లో ఉన్న సీఎస్ఐ చర్చిలో గురువారం జరిగిన క్రిస్మస్ వేడుకలకు ఆయన హాజరయ్యారు. కేక్ కట్ చేసి చర్చి ఫాస్టర్ ఆండ్రూస్ ప్రేమ్ సుకుమార్ తదితరులకు తినిపించారు. అనంతరం మాట్లాడుతూ క్రిస్మస్ వేడుకలను మరింత ఘనంగా నిర్వహించుకోవాలనే సదాశయంతో రూ.10 కోట్లతో క్రైస్తవభవన్ నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందన్నారు. చర్చీల మరమ్మతులు, ఇతర సౌకర్యాలకు కుడా తగు ప్రాధాన్యతనిస్తామన్నారు. క్రైస్తవుల సంక్షేమం కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ వీజీ గౌడ్, ఎమ్మెల్యేలు బిగాల గణేశ్ గుప్తా, బాజిరెడ్డి గోవర్ధన్, నగర మేయర్ ఆకుల సుజాత, జడ్పీ చెర్మైన్ దఫేదార్ రాజు, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈగ గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. వీరందరిని చర్చి నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. తరువాత చర్చి ఆవరణలో క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. చిన్నారులు బైబిల్ పఠనం చేశారు. కా్రం గెస్ అర్బన్ ఇన్చార్జి బి.మహేశ్‌కుమార్‌గౌడ్, మహి ళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు ఆకుల లలిత చర్చిని సందర్శించి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. నగరంలోని సుభాష్‌నగర్ నిర్మల హృదయ కళాశాల ప్రాంగణంలోని సెయింట్ ఆన్స్ చర్చి, ఎన్జీఓస్ కాలనీలోని గ్లోరియస్ చర్చి, ఎల్లమ్మగుట్ట, తారక రామారావునగర్‌లోని వీపీఎం చర్చి, ఆక్స్ చర్చిలో క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కామారెడ్డి, ఆర్మూరు, బాల్కొండ, ఎల్లారెడ్డి, జుక్కల్, బాన్సువాడ, బోధన్ తదితర ప్రాంతాలలోనూ క్రిస్మస్ పండుగను శోభాయమానంగా జరుపుకున్నారు. -
వైఎస్ జగన్ ప్రత్యేక ప్రార్థనలు
-
పులివెందుల చర్చిలో వైఎస్ జగన్ ప్రత్యేక ప్రార్థనలు
పులివెందుల : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం ఉదయం క్రిస్మస్ ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఏసుక్రీస్తు జన్మదిన వేడుకలను పురస్కరించుకుని పులివెందులలోని సీఎస్ఐ చర్చిలో జరిగిన ప్రార్థనలకు ఆయనతో పాటు కుటుంబ సభ్యులు హాజరయ్యారు. క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న వారు ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు చేశారు. క్రిస్మస్ వేడుకలలో పాల్గొన్న అందరికీ వైఎస్ జగన్ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. చర్చిలో ప్రతి ఒక్కరిని ఆయన ఆత్మీయంగా పలకరించారు. అంతేకాకుండా ప్రార్థనలలో పాల్గొన్న వారి యోగక్షేమాలను వైఎస్ జగన్ అడిగి తెలుసుకున్నారు.