పులివెందుల చర్చిలో వైఎస్ జగన్ ప్రత్యేక ప్రార్థనలు | ys jagan mohan reddy family offer prayers at church in pulivendula | Sakshi
Sakshi News home page

పులివెందుల చర్చిలో వైఎస్ జగన్ ప్రత్యేక ప్రార్థనలు

Dec 25 2014 9:40 AM | Updated on Jul 25 2018 4:09 PM

పులివెందుల చర్చిలో వైఎస్ జగన్ ప్రత్యేక ప్రార్థనలు - Sakshi

పులివెందుల చర్చిలో వైఎస్ జగన్ ప్రత్యేక ప్రార్థనలు

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి గురువారం ఉదయం క్రిస్మస్‌ ప్రార్థనల్లో పాల్గొన్నారు.

పులివెందుల : వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి గురువారం ఉదయం క్రిస్మస్‌ ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఏసుక్రీస్తు జన్మదిన వేడుకలను పురస్కరించుకుని పులివెందులలోని సీఎస్ఐ చర్చిలో జరిగిన ప్రార్థనలకు ఆయనతో పాటు కుటుంబ సభ్యులు హాజరయ్యారు. క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న వారు ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

క్రిస్మస్ వేడుకలలో పాల్గొన్న అందరికీ వైఎస్ జగన్ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. చర్చిలో ప్రతి ఒక్కరిని ఆయన ఆత్మీయంగా పలకరించారు. అంతేకాకుండా ప్రార్థనలలో పాల్గొన్న వారి యోగక్షేమాలను వైఎస్ జగన్ అడిగి తెలుసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement