breaking news
chop off tongue
-
కట్నం కోసం ఓ కసాయి భర్త..
లక్నో : కట్నం కోసం కట్టుకున్న భార్య నాలుకను కోసేశాడు ఓ ప్రబుద్ధుడు. 10 రోజుల క్రితం జరిగిన ఈ దారుణమైన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాలు.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కాన్పూర్ జిల్లా బర్రా ప్రాంతానికి చెందిన ఆకాష్ అనే వ్యక్తి కట్నం కోసం భార్యను వేధింపులకు గురి చేసేవాడు. ఈ క్రమంలో చాలా రోజులుగా కట్నం విషయంలో ఇరువురి మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి. అయితే నవంబర్ 6న భార్యాభర్తల మధ్య వివాదం తారా స్థాయికి చేరింది. ఆగ్రహంతో విచక్షణ కోల్పొయిన ఆకాష్ తన భార్య నాలుకను కోసేశాడు. ఈ విషయం బయటకు రాకుడదనే ఉద్దేశంతో.. 10 రోజుల పాటు ఆమెను ఇంట్లోనే నిర్భందించాడు. మొత్తానికి బాధితురాలి తండ్రి రావడంతో జరిగిన దారుణం వెలుగులోకొచ్చింది. అనంతరం తన తండ్రితో కలిసి బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే ఆకాష్ తండ్రి పోలీసు హెడ్ కానిస్టేబుల్ కావడంతో పోలీసులు చర్యలు తీసుకోవడం లేదని బాధితురాలు ఆరోపించింది. దాంతో నిందితుడిని తక్షణమే అరెస్టు చేయాలని ఎస్ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు. -
'మావాళ్ల జోలికొస్తే నాలుక చీరేస్తా'
పాట్నా: బిహార్ లో అధికార పార్టీ ఎమ్మెల్యేల ఆగడాలు మితిమీరుతున్నాయి. ఆర్జేడీ ఎమ్మెల్యే రాజ్ బల్లాబ్ యాదవ్.. బాలికపై అత్యాచారానికి తెబగడి పారిపోగా తాజాగా జేడీ(యూ) ఎమ్మెల్యే ఒకరు బహిరంగంగా బెదిరింపులకు దిగారు. తన మద్దతుదారుల జోలికివస్తే నాలుక చీరేస్తానంటూ భగల్పూర్ జిల్లా గోపాల్ పూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే నరేంద్ర కుమార్ నీరజ్ అలియాస్ గోపాల్ మండల్ హెచ్చరించారు. నావగాచియా బజార్ ప్రాంతంలో ఆదివారం క్రికెట్ టోర్నీని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... 'మా వాళ్లను ఎవరైనా బెదిరిస్తే వాళ్ల నాలుకలు చీరేస్తా. నా రెండు కాళ్లలో ఒకటి జైలులో, మరొకటి బయట ఉంటుంది. ముందు నేను గోపాల్ మండల్ ని, తర్వాతే ఎమ్మెల్యేని. సమాజంలో నాకో స్టేటస్ ఉంద'ని పేర్కొన్నారు. గోపాల్ మండల్ వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. ఎమ్మెల్యేల వ్యవహార శైలి మహా కూటమి పాలనకు అద్దం పడుతోందని బీజేపీ నేత నంద కిశోర్ అన్నారు. గోపాల్ వ్యాఖ్యలపై స్పందించేందుకు సీఎం నితీశ్ కుమార్ నిరాకరించారు. గోపాల్ మండల్ కు వివాదాలు కొత్త కాదు. గతంలో తన కారును ఆపినందుకు డీఎస్పీ స్థాయి అధికారిపై దౌర్జన్యంగా ప్రవర్తించారు. తనను అవమానించాలని చూస్తే మోదీ ప్రభుత్వాన్నైనా, నితీశ్ సర్కారునైనా లెక్క చేయబోనని అన్నారు.