breaking news
chinnam ramakotaiah
-
‘పదవిలో ఉండి పేకాట క్లబ్బులు నడుపుతున్నారు’
సాక్షి, కృష్ణా: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రాబుబు నాయుడి వంటి దుర్మార్గపు రాజకీయ నాయకుడు దేశంలోనే కాదు ప్రపంచంలో కూడా ఎక్కడా ఉండడని బీజేపీ ఏలూరు లోక్‌సభ అభ్యర్థి డాక్టర్ చిన్నం రామకోటయ్య విమర్శించారు. కృష్ణాజిల్లా నూజివీడులో బీజేపీ అభ్యర్థుల విజయాన్ని అకాంక్షిస్తూ శనివారం ఆయన ప్రచారం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నూజివీడుకు రాజధాని రాకుండా ఇక్కడి ప్రజలను నిట్టనిలువునా ముంచిన నయవంచకుడు చంద్రబాబు నాయుడని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అమరావతిలో రైతుల వద్దనుంచి వ్యవసాయ భూములను బలవంతంగా తీసుకుని పనికిరాని నిర్మాణాలు చేపడుతున్నారని ఆరోపించారు. రాజధాని ప్రాంతంలో ఇప్పటి వరకు అధికారికంగా ఒక్కభవనం నిర్మాణం కూడా నిర్మించలేదని మండిపడ్డారు. ఏలూరు టీడీపీ ఎంపీ మాగంటి బాబు పదవిని అడ్డం పెట్టుకుని పేకాట క్లబ్బులు నడుపుతున్నారని రామకోటయ్య విమర్శించారు. ఏపీలో అమలయ్యే సంక్షేమ పథకాలన్ని కేంద్ర ప్రభుత్వ నిధులతోనే అమలు చేస్తున్నారని స్పష్టం చేశారు. -
చంద్రబాబు తప్పులు బయటకు వస్తాయనే..
సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన తప్పులు బయటకు వస్తాయనే బీజేపీపై ఎదురు దాడి చేస్తున్నారని బీజేపీ నేత చిన్నం రామకోటయ్య వ్యాఖ్యానించారు. రాజధాని నిర్మాణానికి అన్ని వేల ఎకరాలు ఎందుకో చంద్రబాబు చెప్పాలని డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రం ఇచ్చిన నిధులు చంద్రబాబు దుబారా చేసింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఇచ్చిన నిధులకు లెక్క చెప్పకుండా కేంద్రంపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. దేశంలో ఎక్కడా లేని విధంగా నిర్మాణాల పేరుతో కాంట్రాక్టర్లకు దోచి పెడుతున్నారని ఆరోపించారు. ఏపీలో అసమర్ధ పాలనను పారద్రోలాలని ఏప్రిల్11న ప్రజలు నిర్ణయించుకున్నారని చెప్పారు. చంద్రబాబును ఓడించే సత్తా బీజేపీకే ఉందన్నారు. 2009లో నూజివీడు నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలుపొందానని, గత ఎన్నికలలో బీజేపీ తరపు నుంచి పోటీ చేయాలని భావించినా పొత్తుల వల్ల సాధ్యం కాలేదని తెలిపారు. నేడు ప్రధాని నరేంద్రమోదీ పాలనను దేశ ప్రజలంతా మెచ్చుకుంటున్నారని వెల్లడించారు. గత ఎన్నికలలో బీజేపీకి మిత్రునిగా ఉన్న బాబు.. ఇప్పుడు శత్రువుగా మారారన్నారు. బీజేపీ అండ కారణంగానే అధికారంలోకి బీజేపీ అండ కారణంగానే 2014లో చంద్రబాబు అధికారంలోకి వచ్చారని బీజేపీ నేత బాష వ్యాఖ్యానించారు. నాలుగున్నరేళ్లల్లో అవినీతితో కోట్ల రూపాయలు దోచుకున్నారుని ఆరోపించారు. 600 హామీలను ఇచ్చి, అమలు చేయలేక నెట్లో కూడా మేనిఫెస్టో తొలగించిన పిరికివాడంటూ మండిపడ్డారు. అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన చంద్రబాబుకు ఓట్లు అడిగే అర్హత లేదన్నారు. తన తప్పులను కప్పి పుచ్చుకునేందుకు బీజేపీపై అసత్యాలను ప్రచారం చేస్తున్నారని చెప్పారు. -
లోక్‌సభ సీటిస్తే బీజేపీలో చేరతా
ఎమ్మెల్యే చిన్నం రామకోటయ్య సాక్షి, హైదరాబాద్: వచ్చే సాధారణ ఎన్నికల్లో తనకు ఏలూరు లోక్‌సభ స్థానం కేటాయిస్తానంటేనే బీజేపీలో చేరతానని నూజివీడు ఎమ్మెల్యే చిన్నం రామకోటయ్య చెప్పారు. లేనిపక్షంలో నూజివీడు అసెంబ్లీ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతానని తెలిపారు. సోమవారం అసెంబ్లీ లాబీల్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల కమిషన్ నిర్దేశించిన మేర ఖర్చు చేస్తానని, ద్విచక్ర వాహనంపై మాత్రమే ఊరూరూ తిరిగి ప్రచారం చేస్తానన్నారు. పోతే అందరం టీడీపీలోకి పోతాం: ఏరాసు కర్నూలు జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేతలందరం ఉమ్మడిగా టీడీపీలోనే చేరతామని రాష్ట్ర న్యాయ శాఖ మంత్రి ఏరాసు ప్రతాప్‌రెడ్డి చెప్పారు. సోమవారం అసెంబ్లీ లాబీల్లో మాట్లాడిన ఆయన.. ఎవరెవరు వెళతారన్న ప్రశ్నకు మాత్రం స్పందించలేదు. మల్కాజ్గిరి నుంచి పోటీచేస్తా: మహేందర్‌రెడ్డి లోక్‌సభకు ముందస్తు ఎన్నికలు జరిగితే రంగారెడ్డి జిల్లా మల్కాజ్గిరి నియోజకవర్గం నుంచి పోటీచేస్తానని తాండూరు ఎమ్మెల్యే పట్నం మహేందర్‌రెడ్డి చెప్పారు. మహబూబ్‌నగర్ జిల్లా కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి, సీఎంఆర్ విద్యా సంస్థల అధిపతి మల్లారెడ్డి ఈ సీటును ఆశిస్తున్నారు కదా.. అని ప్రశ్నించగా వారు ఎవరు? అని ప్రశ్నించిన ఆయన.. తాను రంగారెడ్డి జిల్లా వాసినని చెప్పారు.