breaking news
Chine snacting
-
మహిళా ఎంపీపై చైన్ స్నాచర్ దాడి
న్యూఢిల్లీ: రాజధానిలో మహిళలకు భద్రత కరువవుతున్నదనే మాట తరచూ వినిపిస్తుంటుంది. తాజాగా కాంగ్రెస్ ఎంపీ సుధా రామకృష్ణన్ వాకింగ్‌కు వెళుతూ చైన్ స్నాచర్ బారిన పడ్డారు. ఢిల్లీలోని చాణక్యపురిలో ఉదయం నడకకు వెళుతుండగా ఆమెకు చేదు అనుభవం ఎదురయ్యింది. ఆ ప్రాంతంలో భారీ భద్రత ఉన్నప్పటికీ, ఆమె మెడలో నుంచి చైన్ లక్కెళ్లిన దొంగ అత్యంత చాకచక్యంగా అక్కడి నుంచి తప్పించుకున్నాడు.ఈ సంఘటన తమిళనాడు భవన్ సమీపంలో జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని గుర్తించేందుకు, ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నారు. తమిళనాడు భవన్ నుండి ఎంపీ సుధ.. మరో మహిళా పార్లమెంటు సభ్యురాలు రాజతి వాకింగ్‌కు వెళుతూ, రాయబార కార్యాలయం సమీపంలో ఉన్నప్పుడు ఒక స్కూటీపై వచ్చిన ఒక వ్యక్తి ఎంపీ సుధ మెడలోని బంగారు గొలుసును లాక్కొని పారిపోయాడు. ఆ సమయంలో అతను హెల్మెట్ ధరించి ఉండటంతో ఇద్దరు ఎంపీలు అతనిని గుర్తించలేకపోయారు. ఈ ఘటనలో ఎంపీ మెడకు గాయాలయ్యాయి. -
చైన్‌స్నాచింగ్ చేయకపోతే నిద్రపట్టదు
యశవంతపుర: బెంగళూరు నగరంలోని 51 పోలీసుస్టేషన్ల పరిధిలో నాలుగు సంవత్సరాలుగా గొలుసు చోరీలకు పాల్పడుతున్న తమిళనాడుకు చెందిన సంతోష్ అనే చైన్స్నాచర్ను, అతనికి సహకరించిన రవి అనే నిందితుడిని పుట్టేనహళ్లి పోలీసులు అరెస్ట్ చేశారు. కేజీ బంగారు నగలు స్వాధీనం చేసుకున్నారు. విచారణలో సంతోష్ చెప్పిన విషయాలు విని పోలీసులు అవాక్కయ్యారు. సూర్యోదయం కాకముందే ఇంటినుంచి పల్స్ర్పై రోడ్డెక్కే సంతోష్ ఒక చైన్స్నాచింగ్నైనా చేయకుంటే రాత్రికి నిద్ర పట్టేదికాదు. బైక్‌కు రోజుకొక నంబర్ ప్లేట్ మార్చేవాడు.ఆర్టీఓ అఫీసుకెళ్లి బైకు నంబర్లను సెర్చ్ చేసేవాడు. ముఖాన్ని ఎవరూ గుర్తు పట్టకుండా హెల్మెట్ తీసేవాడు కాదు. పోలీసులకు తలనొప్పిగా మారిన ఈ నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు జేపీనగర, పుట్టేనహళ్లి, హొసకోట, జయనగర, బన్నేరఘట్ట, యలహంక, కొడిగేహళ్లి, అమృతహళ్లి ప్రాంతాల్లో 300 కిలోమీటర్ల మేర అమర్చిన సీసీ కెమెరాలను పరిశీలించి నిందితుడిని గుర్తించారు. చోరీ సొత్తును సిటీ పోలీస్ కమిషనర్ సీహెచ్ ప్రతాప్ రెడ్డి పరిశీలించారు. (చదవండి: అవమాన భారంతో ఉపాధ్యాయుని ఆత్మహత్య) -
చైన్ స్నాచింగ్ నగర్
నగరంలో స్త్రీలు ఇంటి నుండి బయటకు వెళ్లాలంటేనే భయంతో వణికి పోతున్నారు. బంగారం దోచుకోడం మాటెలా ఉన్నా, ప్రాణాలు కూడా దక్కుతాయో? లేదోనని భయంతో వణికిపోతున్నారు. ఇంత మంది పోలీసులు ఉండి, అత్యంత సాంకేతిక పరిజ్ఞానం కలిగి ఉన్న వాహనాలు ఉండి నేరాలు తగ్గిస్తామని చెప్పిన పోలీసులను చైన్ స్నాచర్స్ మూడు చెరువులు నీళ్లు తాగిస్తున్నారు. ఇన్నాళ్లు కొన్ని ప్రాంతాల్లో ఎక్కడో ఒకటో రెండో జరిగేవి, కానీ ఇప్పుడు మన నగరంలో చైన్ దొంగతనాలు జరగని ప్రాంతం లేదంటే, ఆశ్చర్యం లేదని చెప్పవచ్చు. ఒక పక్క కాల్పులు జరుపుతున్నా భయం లేకుండా రెచ్చిపోతున్నారు. ఇంతవరకూ జరిగిన సంఘటనల్లో బాధితులు పోగొట్ట్టుకున్న వస్తువులు దొరికిన దాఖలాలు లేవు. సరికదా ప్రాణాలు కూడా పోయిన సంఘటనలు చోటు చేసుకోవడం దురదృష్టకరం. ఇంక మన అభాగ్య నగరంలో స్త్రీలు బంగారం ధరించి బయటకు వెళ్లడం ఏ మాత్రం భద్రత లేదని రుజువవుతోంది. పోలీసులు నిఘా ఎంత పెంచినా బూడిదలో పోసిన పన్నీరు చందంగా ఉంది. హిందూ స్త్రీకి పవిత్రమైన మంగళ సూత్రం కూడా లేకుండా ఎలాగ? అని మహిళలు దుమ్మెత్తి పోస్త్తున్నారు. ఇప్పటికైనా గట్టి నిఘా పెట్టి మహిళలకు భరోసా కల్పించే దిశగా పోలీసులు పక్కాగా గొలుసు దొంగల భరతం పట్టి నగరంలో మహిళలకు భద్రత కల్పించాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఆ దిశగా మన పోలీసులు కృషి చేయాలి. - ఎస్.రాజ్యలక్ష్మి చిక్కడపల్లి, హైదరాబాద్