breaking news
China social media
-
చైనా సోషల్ మీడియాలో భారత్‌పై విషం
బీజింగ్: చైనా సోషల్ మీడియాలో భారత్‌కు వ్యతిరేకంగా దూషణాత్మక కంటెంట్ పెరిగిపోతోంది. భారత వృత్తి నిపుణులకు చైనా ప్రభుత్వం వర్క్ వీసాలు జారీ చేయకుండా తిరస్కరిస్తోంది. చైనాలో పని చేస్తున్న భారతీయుల జీవిత భాగస్వాములు ఉద్యోగాలు, ఉపాధి పొందడంపై ఆంక్షల విధిస్తోంది. ఈ పరిణామాలపై చైనాలోని ప్రవాస భారతీయలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బీజింగ్‌లోని భారత రాయబార కార్యాలయం నిర్వహించిన ఓపెన్ హౌస్ కార్యక్రమలో వారు తమ అభిప్రాయాలు వెల్లడించారు. భారతీయ వృత్తి నిపుణులను ఒకచోట చేర్చి, ఆ వర్గానికి సంబంధించిన అంశాలపై చర్చించేందుకు రాయబార కార్యాలయం శుక్రవారం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది. భారత రాయబారి విక్రమ్ దొరైస్వామి, కౌన్సిలర్లు నితిన్జీత్ సింగ్, రమేష్ సింగ్‌లతో కలిసి ప్రవాస భారతీయులు వివిధ అంశాలపై చర్చించారు. చైనా సోషల్ మీడియా వేదికలపై భారతీయుల ఆహారపు అలవాట్లు, సంస్కృతిని లక్ష్యంగా చేసుకుని వారిపై దూషణలతో కూడిన కంటెంట్ పెరుగుతోందని వెల్లడించారు. కాన్సులర్ సేవలకు సంబంధించిన ఇబ్బందులను ప్రస్తావించారు. తమ జీవిత భాగస్వాములకు ఇక్కడ ఉద్యోగాలు నిరాకరిస్తున్నారని తెలిపారు. ఆయా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని విక్రమ్ దొరైస్వామి చెప్పారు. చైనా సోషల్ మీడియాలో ప్రతికూల, దూషణాత్మక కంటెంట్ పట్ల వ్యక్తమవుతున్న ఆందోళనలపై స్పందించారు. అటువంటి కంటెంట్ పెరుగుదల పట్ల చైనా ప్రభుత్వం ఆందోళన చెందుతోందని, ఈ సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటోందని అన్నారు. తమ వంతుగా వాస్తవ ఆధారిత సమాచారాన్ని తమ సోషల్ మీడియా ఖాతాల ద్వారా ప్రచారం చేయడం ద్వారా తప్పుడు సమాచార వ్యాప్తిని ఎదుర్కొంటున్నామని ప్రకటించారు. భారతదేశపు విభిన్న సంస్కృతి, వంటకాలను ప్రదర్శించేందుకు చైనాలో పలు కార్యక్రమాలను నిర్వహించాలని ఎంబసీ యోచిస్తున్నట్లు తెలిపారు. -
సీఈవో రాబిన్ లీకి చేదు అనుభవం
-
చైనా సోషల్ మీడియాలోనూ మోదీ హవా!
బీజింగ్: భారత ప్రధాని నరేంద్ర మోదీ చైనా సోషల్ మీడియాలోనూ దూసుకుపోతున్నారు. గత వారం చైనా సోషల్ మీడియా ఖాతాను తెరిచిన మోదీ తన ఫాలోవర్ల సంఖ్యను గణనీయంగా పెంచుకున్నారు. చైనా ట్విటర్ గా పేర్కొనే 'వీబో'లో ఎకౌంట్ ఓపెన్ చేసిన ఆరు రోజుల్లోనే మోదీ 46 వేల మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఒక విదేశీ నాయకుడు చైనా సోషల్ మీడియాలో ఈ రకమైన ఘనతను సాధించడం చాలా అరుదైన విషయంగా విశ్లేషకులు పేర్కొంటున్నారు. దీంతో పాటు చైనా మీడియాలో కూడా మోదీ పర్యటనపై పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. చైనా డైలీ, గ్లోబల్ టైమ్స్ తదితర పత్రికలు మోదీని ఆకాశానికి ఎత్తేస్తున్నాయి. మే 14 నుంచి 16 వరకు చైనాలో పర్యటించనున్న మోదీ.. ఆ దేశాధినేతలతో చర్చలు జరుపుతారు. చైనా పర్యటనలో భాగంగా మోదీ జియాన్, బీజింగ్, షాంఘై నగరాల్లో పర్యటించనున్నారు. అనంతరం 17వ తేదీన మోదీ మంగోలియా చేరుకుంటారు. అక్కడి దేశాధినేతలతో మోదీ సమావేశం కానున్నారు. -
చైనా సోషల్ మీడియాను వదలని మోదీ
న్యూఢిల్లీ: సోషల్ మీడియాలో దూసుకుపోతున్న ప్రధాని నరేంద్ర మోదీ మరో ముందడుగు వేశారు. చైనా సోషల్ మీడియాలోనూ ఖాతా తెరిచారు. చైనా ట్విటర్ గా పేర్కొనే 'వీబో'లో ఎకౌంట్ ఓపెన్ చేశారు. 'వీబో'లో చేరినట్టు ట్విటర్ ద్వారా తెలిపారు. చైనా భాషలో సందేశం పోస్ట్ చేశారు. 'హలో చైనా!.. వీబోతో చైనా స్నేహితులతో సంబంధాలను మరింత ముందుకు తీసుకెళతానని ట్విటర్ లో పేర్కొన్నారు. చైనా పర్యటనకు కొద్ది వారాల ముందు ఆయన 'వీబో'లో ఖాతా తెరవడం విశేషం. మోదీ చైనా పర్యటనను విజయవంతం చేసేందుకు ఇరుదేశాల ఉన్నతాధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ పర్యటనలో పలు కీలక ఒప్పందాలు కుదిరే అవకాశముందని ఆసియా వ్యవహారాల డిప్యూటీ డైరెక్టర్ జనరల్ హాంగ్ జిలియన్ తెలిపారు. కాగా, కోటి 9 లక్షల 2 వేల 510 మంది ఫోలోవర్లతో ట్విటర్ లో మోదీ మూడో స్థానంలో ఉన్నారు.


