-
ఇక మీదట హీరోగానే..!
‘ఒక విచిత్రం’ సినిమాతో హీరోగా పరిచయం అయిన యంగ్ హీరో ఆది పినిశెట్టి కోలీవుడ్‌లో హీరోగా మంచి విజయాలు సాధించాడు. అయితే తెలుగులో మాత్రం హీరోగా కన్నా ఎక్కువగా ప్రతినాయక పాత్రల్లో, సహాయ పాత్రల్లోనే గుర్తింపు తెచ్చుకున్నాడు. సరైనోడు, అజ్ఞాతవాసి సినిమాల్లో విలన్‌గా, ఆకట్టుకున్న ఆది ఇటీవల రంగస్థలం సినిమాలో హీరో అన్నగా నటించి మెప్పించాడు. అయితే ఇక మీద ఇలాంటి పాత్రలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడట ఈ యువ నటుడు. ఆది పినిశెట్టి ఇక మీద సోలో హీరోగానే సినిమాలు చేసే ఆలోచనలో ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం యూటర్న్ రీమేక్ తో పాటు కోన వెంకట్ నిర్మిస్తున్న సినిమాలో లీడ్ రోల్లో కనిపించనున్నాడు ఆది. ఇప్పటికే కోలీవుడ్ లో హీరోగా ప్రూవ్ చేసుకున్న ఆది త్వరలోనే తెలుగులో కూడా సోలో హీరోగా సత్తా చాటే ఆలోచనలో ఉన్నాడు. -
దర్శకురాలైన షకీలా
శృంగార తారగా ఉర్రూతలూపిన షకీలా ఇప్పుడు కొత్త అవతారమెత్తారు. నిన్న మొన్నటి దాకా క్యారెక్టర్ పాత్రలు చేస్తూ వస్తున్న ఆమె ఇప్పుడు ఏకంగా మెగాఫోన్ పట్టారు. తొలిసారిగా తెలుగు, హిందీ భాషల్లో ఓ చిత్రాన్ని రూపొందించారు. ఇంకా పేరు ఖరారు కాని ఈ చిత్రం సత్యం సినిమా క్రియేషన్స్ పతాకంపై ప్రొడక్షన్ నంబర్ 2గా షూటింగ్ పూర్తి చేసుకుంది. హైదరాబాద్‌లోని సిగ్నేచర్ స్టూడియోలో శుక్రవారం సాయంత్రం జరిగిన విలేకరుల సమావేశంలో చిత్రం వివరాలను షకీలా, నిర్మాణ బృందం వివరించారు. ‘‘దర్శకత్వం వహించాలన్నది చాలా రోజులుగా నా కోరిక. అది ఇన్నాళ్ళకు తీరింది. ఈ చిత్రంతో దర్శకురాలిగా నా ప్రయాణం మొదలైంది’’ అని షకీలా అన్నారు. ‘‘కథానాయిక ప్రధానంగా సాగే ఈ చిత్రానికి’’ కథ, స్క్రీన్‌ప్లే బాధ్యతలు కూడా షకీలావే కావడం విశేషం. ‘‘దాదాపు 20 ఏళ్ళుగా సినీ రంగంలో నటుడిగా ఉన్నా. తొలిసారిగా నిర్మాణ బాధ్యతలు చేపట్టి, అఫ్జల్ సమర్పణలో, వెంకటేశ్వరరావు, బాబా, కట్టా శ్రీకర్ ప్రసాద్ తదితరుల సహకారంతో ఈ సినిమాను తీస్తున్నా’’ అని నిర్మాత మెంటా సత్యనారాయణ చెప్పారు. ఈ చిత్రం తెలుగు రూపంలో నరేశ్ (అలియాస్ నరేంద్ర) హీరో కాగా, హిందీ వెర్షన్లో కథానాయక పాత్రను పాత తరం సినీ విలన్ నాగభూషణం మనుమడైన భూషణ్ పోషిస్తున్నారు. ‘‘ఎంతో అనుభవమున్న దర్శకురాలి లాగా ఈ చిత్రాన్ని ఎంతో బాగా షకీలా అక్క తీశారు’’ అని భూషణ్ చెప్పారు. శ్వేత, శ్రీదేవి ఈ చిత్రంలో కథానాయికలు. ‘‘ఏప్రిల్ 20 నుంచి జూన్ 12 మధ్య దాదాపు 50 రోజుల పాటు హైదరాబాద్ చుట్టుపక్కల విభిన్న లోకేషన్లలో చిత్రీకరణ జరిపాం’’ అని తన 113వ చిత్రానికి ఛాయాగ్రహణం వహిస్తున్న సీనియర్ కెమేరామన్ కంకణాల శ్రీనివాసరెడ్డి తెలిపారు. అభిషేక్, కార్తీక్‌లు సంగీతం అందించగా, నందమూరి బెనర్జీ కూర్పు జరుపుతున్న ఈ చిత్రంలో షకీలా సైతం కానిస్టేబుల్‌గా ఓ భిన్నమైన పాత్ర పోషిస్తున్నారు. ‘‘అత్యాచారాలు, అన్యాయాలను మహిళే ఎదిరిస్తే ఎలా ఉంటుందన్నది నాదైన శైలిలో తీశా’’ అంటున్న షకీలా డెరైక్టర్‌గానూ సంచలనం రేపుతారేమో చూడాలి.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
విద్య, వైద్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు
డ్రైవర్ నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి
ప్రభుత్వ వైద్యశాలల్లో మెరుగైన వైద్యం
చంద్రబాబూ 14 ఏళ్లు ఏం చేశావు?
నీట్‌కు ఏర్పాట్లు పూర్తి
‘పోస్టల్ బ్యాలెట్’ను వినియోగించుకోండి
పార్లమెంట్లో గళం వినిపిస్తా..
స్వర్ణకవచాలంకరణలో రామయ్య
హామీలపై ఆశలు..
నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
తప్పక చదవండి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్‌కప్‌కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్‌గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్‌లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
Advertisement