breaking news
chalasani
-
ICUలో ఉండగానే రాజీనామా చేయిస్తారా ? ఇదేనా మీ సభ్యత
-
హెరిటేజ్ అభివృద్ధి కోసం విజయ డెయిరీ నాశనం.. చలసాని ఆంజనేయులు రాజీనామా..
-
హెరిటేజ్ కోసమే చలసానిపై లోకేష్ కుట్ర: పేర్ని నాని
కృష్ణా జిల్లా: విజయ డెయిరీ చైర్మన్ చలసాని ఆంజనేయులు రాజీనామా వ్యవహారంపై మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నాయకుడు పేర్ని నాని తీవ్రస్థాయిలో స్పందించారు. విజయ డెయిరీని దెబ్బతీసి హెరిటేజ్ వ్యాపారాన్ని పెంచుకునేందుకు మంత్రి నారా లోకేష్ ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. కంచే చేను మేసిన చందంగా లోకేష్ తీరు ఉంది అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.ఆంజనేయులు రాజీనామా అంశంపై పేర్ని నాని తాజాగా స్పందిస్తూ.. సహకార సంఘాల ద్వారా నిర్మితమై విజయవంతంగా కొనసాగుతున్న విజయ డెయిరీని లోకేష్ ధనదాహం, అధికార మదంతో దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. దాదాపు రూ.1,000 కోట్ల వ్యాపార లావాదేవీలతో విజయ డెయిరీ బలమైన సంస్థగా ఎదిగిందని, దాని విలువైన ఆస్తులను హస్తగతం చేసుకునే కుట్ర జరుగుతోందని విమర్శించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సహకారంతో మండవ జానకిరామయ్య హయాంలో విజయ డెయిరీ అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు. 2019-24 మధ్య సహకార సంఘాల ద్వారా కొనసాగుతున్న డెయిరీ అభివృద్ధికి జగన్ ప్రభుత్వం కృషి చేసిందన్నారు. మండవ జానకిరామయ్య బాటలోనే చలసాని ఆంజనేయులు కూడా విజయ డెయిరీ అభివృద్ధికి సేవలు అందించారని చెప్పారు.చలసాని ఆంజనేయులు రాజీనామా వెనుక ‘రెడ్ బుక్ రాజ్యాంగం’ ఉందని ఆరోపించారు. సహకార సంఘాల సభ్యుల ద్వారా ఎన్నికైన చైర్మన్‌ను పదవి నుంచి తప్పించేందుకు మంత్రులకు ఏం హక్కు ఉందని ప్రశ్నించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆంజనేయులును ఐసీయూలోనే బెదిరించి రాజీనామా చేయించారని, రాజీనామా చేయకపోతే అక్రమ కేసులు పెట్టి ఆయన కుమార్తె, కుమారుడిని అరెస్టు చేయిస్తామని బెదిరించినట్లు ఆరోపించారు. కూటమి నేతల ఒత్తిడి, బెదిరింపుల కారణంగానే ఆంజనేయులుకు గుండెపోటు వచ్చింది. వైఎస్సార్సీపీ శ్రేణులపై అక్రమ కేసులు, అరెస్టుల పర్వం కొనసాగిస్తున్న కూటమి ప్రభుత్వం.. ఇప్పుడు టీడీపీ, జనసేన నేతలపైనా అదే విధానాన్ని ప్రయోగిస్తోందని విమర్శించారు.పాలు, పాల ఉత్పత్తుల విక్రయాలతో విజయవంతంగా నడుస్తున్న విజయ డెయిరీని బలహీనపరిచి హెరిటేజ్‌ను అభివృద్ధి చేసుకునేందుకు కుట్రలు జరుగుతున్నాయని నాని ఆరోపించారు. సహకార సంఘాల ద్వారా సమర్థవంతంగా నడుస్తున్న విజయ డెయిరీని అక్రమార్కుల చేతుల్లోకి వెళ్లనివ్వబోమన్నారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత డెయిరీపై కుట్రలకు పాల్పడిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. -
విజయ డెయిరీ ఛైర్మన్ పదవికి చలసాని ఆంజనేయులు రాజీనామా
సాక్షి, విజయవాడ: విజయ డెయిరీ ఛైర్మన్ పదవికి చలసాని ఆంజనేయులు రాజీనామా చేశారు. మంత్రుల ఒత్తిడి తట్టుకోలేక రాజీనామా చేశారు. ఛైర్మన్ పదవికి రాజీనామా చేయాలంటూ నిన్నటి నుంచి చలసాని ఆంజనేయులపై తీవ్ర ఒత్తిడి చేస్తున్నారు. మంత్రుల ఒత్తిడి తట్టుకోలేక చలసాని ఆంజనేయులు ఆసుపత్రి పాలయ్యారు. ఆసుపత్రి బెడ్ మీద ఉన్నా రాజీనామా చేయాలని ఒత్తిళ్లకు గురిచేశారు. దీంతో మంత్రుల ఒత్తిళ్లతో చలసాని ఆంజనేయులు రాజీనామా చేశారు.రెండు గంటల పాటు ఆసుపత్రిలో చలసాని ఆంజనేయులతో చర్చించిన మంత్రులు కొల్లు రవీంద్ర, కొలుసు పార్ధసారథి.. ఆయనపై తీవ్ర ఒత్తిడి తెచ్చారు. పార్టీ ఆదేశాలతో చలసాని ఆంజనేయులు రాజీనామా చేశారని మంత్రి పార్థసారథి ప్రకటించారు. విజయ డెయిరీ చైర్మన్ చలసాని ఆంజనేయులును మంత్రులు టార్గెట్ చేశారు. ఈ క్రమంలో తీవ్ర ఒత్తిడికి లోనైన ఆంజనేయులు అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.అయితే, బుధవారం సాయంత్రం జరిగిన సమావేశం అనంతరం విజయ డెయిరీ కార్యాలయానికి వచ్చిన టీడీపీ మంత్రులు కొల్లు రవీంద్ర, పార్థసారథి.. చలసాని ఆంజనేయులతో సమావేశమైనట్లు సమాచారం. ఈ సందర్భంగా ఎట్టి పరిస్థితుల్లోనూ చైర్మన్ పదవికి రాజీనామా చేయాల్సిందేనని, అధిష్టానం ఆదేశాలు ఉన్నాయని ఆయనకు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.దీనిపై స్పందించిన చలసాని ఆంజనేయులు నిర్ణయం తీసుకోవడానికి ఒక్కరోజు గడువు ఇవ్వాలని కోరినప్పటికీ, అందుకు అవకాశం లేదని, వెంటనే పదవి నుంచి తప్పుకోవాల్సిందేనని మంత్రులు స్పష్టం చేసినట్లు తెలిసింది. ఈ పరిణామాల మధ్య మంత్రుల సమక్షంలోనే చలసాని ఆంజనేయులు అస్వస్థతకు గురికాగా, వెంటనే ఆయనను ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఆసుపత్రిలో ఉన్నా కానీ చలసాని ఆంజనేయులను మంత్రులు వదల్లేదు. రాజీనామా చేయాలంటూ తీవ్ర ఒత్తిడి చేశారు. దీంతో ఇవాళ ఆంజనేయులు.. విజయ డెయిరీ ఛైర్మన్ పదవికి రాజీనామా చేశారు. -
చైర్మన్ రాజీనామాకు మంత్రుల ఒత్తిడి.. ఆసుపత్రిలో చేరిన చలసాని
-
మంత్రుల ఒత్తిడి.. ఆసుపత్రిలో చేరిన చలసాని
సాక్షి, విజయవాడ: ఏపీలో కూటమి నేతల కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. విజయ డెయిరీ చైర్మన్ చలసాని ఆంజనేయులును మంత్రులు టార్గెట్ చేసి రాజీనామా చేయాలని ఒత్తిడికి గురిచేస్తున్నారు. ఈ క్రమంలో తీవ్ర ఒత్తిడికి లోనైన ఆంజనేయులు అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.అయితే, బుధవారం సాయంత్రం జరిగిన విజయ డెయిరీ డైరెక్టర్ల సమావేశంలో ఆయన ఏకగ్రీవంగా చైర్మన్‌గా ఎన్నికయ్యారు. ఈ సమావేశం అనంతరం విజయ డెయిరీ కార్యాలయానికి వచ్చిన టీడీపీ మంత్రులు కొల్లు రవీంద్ర, పార్థసారథి.. చలసాని ఆంజనేయులతో సమావేశమైనట్లు సమాచారం. ఈ సందర్భంగా ఎట్టి పరిస్థితుల్లోనూ చైర్మన్ పదవికి రాజీనామా చేయాల్సిందేనని, అధిష్టానం ఆదేశాలు ఉన్నాయని ఆయనకు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.దీనిపై స్పందించిన చలసాని ఆంజనేయులు నిర్ణయం తీసుకోవడానికి ఒక్కరోజు గడువు ఇవ్వాలని కోరినప్పటికీ, అందుకు అవకాశం లేదని, వెంటనే పదవి నుంచి తప్పుకోవాల్సిందేనని మంత్రులు స్పష్టం చేసినట్లు తెలిసింది. ఈ పరిణామాల మధ్య మంత్రుల సమక్షంలోనే చలసాని ఆంజనేయులు అస్వస్థతకు గురికాగా, వెంటనే ఆయనను ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నారు. -
విభజన హామీలు ముగిశాయనే వాళ్లు ఆంధ్రా ద్రోహులు: చలసాని
-
చలసాని సాహిత్య సర్వస్వం
‘తాళాలు లేని ఇళ్లు, పరీక్షలు లేని చదువులు, పోలీసుల అవసరం లేని సమాజం ఏర్పాటు చేసుకుందామని’ కల కనేవారట చలసాని ప్రసాద్. దానికోసం ఆయన ‘మార్క్సిస్టు’, ‘రాజకీయాల్లో స్టాలినిస్టు’ అయ్యారు. ‘నా అయిదో ఏట (1937) నుంచే నేను కమ్యూనిస్టునే’ అని ప్రకటించుకున్నారు. ‘ఆయనకు ఎంత పెద్ద లైబ్రరీ ఉన్నదో అంతకన్న పెద్ద స్నేహ ప్రపంచం ఉన్నది. బహుశా జీవితకాలంలో ఈ రెండు ప్రపంచాలలో తేలియాడే ఆనందాన్ని అనుభవించడానికే అనుకుంటాను తన తర్వాత మిగిలే రచన మీద ఎక్కువ దృష్టి పెట్టలేదు,’ అంటారు వరవరరావు. బహుశా అందువల్లే, (తక్కువగా) రచయితా, (ఎక్కువగా) చదువరీ అయిన చలసాని ఆ రాసిన ‘కొన్ని’ వ్యాసాలూ, ముందుమాటలూ, సంపాదక లేఖలూ, వెల్లడించిన అభిప్రాయాలూ, స్పందనలూ, చేసిన–ఇచ్చిన ఇంటర్వ్యూలూ, వేసిన కరపత్రాలూ కూడా కలిపి అన్నింటినీ ‘చలసాని ప్రసాద్ సాహిత్య సర్వస్వం–1’గా తెచ్చింది విరసం. శ్రీశ్రీతో తన అనుబంధం ‘ఎన్ని పుస్తకాలకైనా సరిపోనిది’ అంటారు ప్రసాద్. ‘కమ్యూనిస్టులు రాసేది ప్రచార సాహిత్యం అయితే, కమ్యూనిస్టు వ్యతిరేకులు రాసేది ప్రచార సాహిత్యం కాదా?’ అని ఇస్మాయిల్‌ను విమర్శిస్తారు. విరసం పీపుల్స్‌వార్ పార్టీ ఆదేశాల ప్రకారం నడిచే అనుబంధ సంస్థ కాదనీ, అది అఖిల భారత విప్లవ సాంస్కృతిక సమాఖ్యలో అంతర్భాగమనీ సంఘ కార్యదర్శిగా ప్రకటిస్తారు. రావిశాస్త్రి రచనల్లో అధిక వర్ణన ఉంటుందన్న రా.రా. అభిప్రాయంతో ‘తీవ్రంగా’ విభేదిస్తారు. ‘రష్యన్ నవల ఏది చదువుతున్నా అసలు సాహిత్యమంటే ఇదేననిపిస్తుంది. మిగతావి చప్పగా, పిప్పిగా ఉంటాయి’ అని చలం దగ్గర రష్యన్ సాహిత్యం మీద అభిప్రాయం తీసుకుంటారు. ‘సాహిత్యంలో రాజకీయాల ప్రవేశం ఎంతవరకుండాలి?’ అంటే, ‘జీవితంలో ఉన్నంతమేరకు’ అని సమాధానం చెబుతారు. ‘జీవితంలో, రాజకీయాల్లో, నిర్మాణాల్లో, సిద్ధాంతాల్లో తలెత్తే ఏ వాద వివాదానికైనా, అన్వేషణకైనా, అర్థానికైనా ఆయన సాహిత్యంలోంచి ఏదో ఒక ఉటంకింపు తీసి మన చేతికి అందించేవాడు’ అంటారు పాణి. అలాంటి చలసానిని ‘సమగ్రం’గా కాకపోయినా(‘ప్రసంగాలు, పాఠాలు, లేఖలు, ముఖ్యంగా కవిత్వం’ ఈ సంకలనంలో లేవు) చాలా మేరకు అర్థం చేయించే పుస్తకం! సాహిత్యం డెస్క్ -
విభజన హామీల సాధన కోసం కలిసి పోరాడాలి
వేసవి తరువాత ప్రత్యేక కార్యాచరణ విభజన హామీల సాధన సమితి అధ్యక్షుడు చలసాని తాళ్లరేవు (ముమ్మిడివరం) : కేంద్ర ప్రభుత్వం విభజన హామీలను అమలు చేయాలంటే అన్ని పక్షాలు కలిసి పోరాడాలని విభజన హామీల సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ పేర్కొన్నారు. మంగళవారం ఆయన తాళ్లరేవు మండలం పోలేకుర్రు పంచాయతీలోని బాపనపల్లిలో పేరిచర్ల రాజగోపాల్‌రాజు ఫార్మ్‌హౌస్‌ను సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కేంద్రం రాష్ట్రం పట్ల పక్షపాత ధోరణిలో వ్యవహరిస్తుందన్నారు. ఉత్తరాదిలో ఓ రాష్ట్రానికి రూ.43వేల కోట్లు ఇచ్చి, మన రాష్ట్రానికి మాత్రం రూ.2500 కోట్లు ముష్టి వేశారన్నారు. ఏపీలో జిల్లాకు 50 కోట్లు ఇచ్చి చట్టబద్ధత తీసుకొచ్చాం పండగ చేసుకోండి అనడం ఎంతవరకు న్యాయమన్నారు. తెలంగాణాలో హైదరాబాద్ మినహా అన్ని జిల్లాలకు ఏడాదికి రూ.50 కోట్లు చొప్పున ఇచ్చారని, అయితే ఆంధ్రాలో కేవలం రాయలసీమలో 4, ఉత్తరాంధ్రలో 3 జిల్లాలకు ఇచ్చారన్నారు. ఇక కేంద్రం రాష్ట్రానికి చేసిందేంటని ప్రశ్నించారు. పోలవరంపై సరైన స్పష్టత లేదని, పోలవరం ప్రాజెక్టుకు రూ.ఏడు వేల కోట్లు కేటాయించాల్సి ఉండగా, రూ.1900 కోట్లు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి స్కీం నుంచి ఇచ్చామంటున్నారు. విభజన చట్టం ప్రకారం రాష్ట్ర రాజధాని నిర్మాణానికి కావాల్సిన మౌలిక సదుపాయాలు అన్నింటికీ కేంద్రమే నిధులు ఇవ్వాలన్నారు. అమరావతి నిర్మాణానికి రూ.7500 కోట్లు హడ్కో ద్వారా అప్పు ఇప్పిస్తామని కేంద్రం చెబుతోందని, ఆంధ్రప్రదేశ్ రాజధాని అప్పులతో కట్టాల్సిన పరిస్థితి ఏంటన్నారు. హైదరాబాద్ నుంచి రావాల్సిన ఉమ్మడి నిధులు సుమారు రూ.32 వేల కోట్లు రావాలని అంటున్నారని అయితే ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా రాలేదన్నారు. దీనిపై ఇంత వరకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదన్నారు. నాగార్జున సాగర్‌నుంచి నీళ్లు రావాలంటే తెలంగాణా ప్రభుత్వం విడుదల చేయాలి. దానిని సెంట్రల్ కమిటీకి అప్పగించమంటే దానిపై స్పందించడం లేదన్నారు. 2018లోపు మన రాష్ట్రంలో పోర్టును అభివృద్ధి చేయాలని విభజన చట్టంలో ఉంటే ఒక్క రూపాయి ఇవ్వకపోగా, రూ.25 వేల కోట్లతో తమిళనాడులో మూడో పోర్టు కొల్లేచల్కు కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేయడం దారుణమన్నారు. విభజన చట్టం 108వ అధికరణం ప్రకారం రాష్ట్రపతికి ఉన్న అధికారాలు జూన్ 1తో అయ్యిపోతున్నా, ఏ ఒక్కరూ స్పందించడం లేదన్నారు. తెలుగువాళ్ల మధ్య ఐక్యత లేకపోవడంతో రాష్ట్రం అన్ని రంగాలలో వెనక్కిపోతుందన్నారు. ఇప్పటికైనా ఎంపీలు భయం వదిలి పోరాడితే విభజన చట్టంలో ఉన్న హామీలు అన్నీ నెరవేరతాయన్నారు. ప్రత్యేక హోదాపై భవిష్యత్ కార్యాచరణ చేస్తున్నామని, దీనిలో భాగంగా పలు గీతాలు, పుస్తకాల ద్వారా చైతన్యం చేస్తామన్నారు.


