breaking news
Chaitanya colleges
-
చైతన్య గ్రూప్ కాలేజీస్ ఛైర్మన్ సంచలన ఆరోపణలు
-
లింగమనేని రమేష్ మోసం చేశారు: చైతన్య గ్రూప్ ఛైర్మన్ ఆరోపణలు ఇవే..
సాక్షి, అమరావతి: చైతన్య గ్రూప్ ఆఫ్ కాలేజీస్ ఛైర్మన్ బీఎస్ రావు సంచలన ఆరోపణలు చేశారు. పారిశ్రామికవేత్త లింగమనేని రమేష్ తనను మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. చైతన్య విద్యా సంస్థల విస్తరణకు డబ్బు తీసుకున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడికి అత్యంత సన్నిహితుడు లింగమనేని రమేష్. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కరకట్టపై ఉన్న తన ఇంటిని చంద్రబాబుకు అప్పగించాడు లింగమనేని రమేష్. కాగా, బీఎస్ రావు మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. లింగమనేని రమేష్‌కు 2012-13లో రూ.310 కోట్లు ఇచ్చాం. చైతన్య విద్యా సంస్థల విస్తరణకు డబ్బు తీసుకున్నారు. లింగమనేని కావాలనే మమ్మల్ని మోసం చేశాడు. రమేష్ ఇచ్చిన 10 చెక్కులు చెల్లలేదు. లింగమనేని మోసాలపై హైదరాబాద్ సీసీఎస్‌లో ఫిర్యాదు చేశాం. ఆయన మోసాలపై ఆరు ఎఫ్ఐఆర్లు నమోదు అయ్యాయి. తీసుకున్న డబ్బుకు మాకు న్యాయం చేస్తానని పెద్దల సమక్షంలో హామీ ఇచ్చారు. 2016లో ఎంవోయూ రాసి భూములు ఇప్పిస్తా అని హామీ ఇచ్చారు. కానీ, పైసా కూడా ఇవ్వలేదని అన్నారు. లింగమనేని చేసిన మోసాలపై ఇప్పటివరకు 6 FIR లు ఫైల్ అయ్యాయని తెలిపారు. ఈ అంశంపై సుప్రీంకోర్టులో కేసు వేయగా.. లింగమనేని చేసిన మోసాలపై నెలవారీగా తనకు వడ్డీతో సహా చెల్లించాలని సుప్రీం కోర్టు ఆదేశించిందని బీఎస్ రావు తెలిపారు. -
68 కాలేజీల మూసివేతకు అనుమతివ్వండి
సాక్షి, హైదరాబాద్: అగ్నిమాపక శాఖ నుంచి నిరభ్యంతర పత్రాలు (ఎన్ఓసీ) లేకుండా నిర్వహిస్తున్న 68 కార్పొరేట్ కాలేజీలను మూసేస్తామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలియజేసింది. వాటిలో నారాయణ కాలేజీలు 26, శ్రీచైతన్య కాలేజీలు 18 ఉన్నాయని తెలిపింది. ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్ వెలువడిన దృష్ట్యా మూసివేత నిర్ణయం వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు చేయాలని నిర్ణయించినట్లు తెలిపింది. ఇప్పటికే 68 కాలేజీలకు నోటీసులు జారీ చేసినట్లు చెప్పింది. ఇంటర్ పరీక్షలు అయ్యాక ఈ ఏడాది మార్చి 28 తర్వాత 68 కాలేజీల మూసివేతకు ఉత్తర్వులు జారీ చేయాలని హైకోర్టును కోరింది. ఈ మేరకు ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ అఫిడవిట్ ద్వారా హైకోర్టుకు నివేదించారు. అనుమతులు లేకుండా చట్ట వ్యతిరేకంగా నిర్వహిస్తున్న నారాయణ, శ్రీచైతన్య కాలేజీలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మేడ్చల్‌కు చెందిన డి.రాజేశ్ ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ పిల్‌ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ.అభిషేక్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం గురువారం మరోసారి విచారణ జరిపింది. ఇంటర్ పరీక్షలు అవ్వగానే మార్చి 28 తర్వాత ఎన్ఓసీలు లేకుండా నడుపుతున్న కాలేజీలను మూసివేయాల్సిందేనని ఇంటర్మీడియట్ బోర్డు తేల్చి చెప్పింది. ఈ హామీని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. తదుపరి విచారణను ఏప్రిల్ 7కి వాయిదా వేసింది. నారాయణ, శ్రీచైతన్య ఇతర విద్యా సంస్థలు ఎన్ఓసీ లేకుండా ఎన్ని కాలేజీలను నిర్వహిస్తున్నాయో, ఎన్ని కాలేజీలను అధికారులు తనిఖీలు చేశారో, ఆయా కాలేజీల్లో పరిస్థితులెలా ఉన్నాయో పూర్తి వివరాలతో ఏప్రిల్ 3లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని ఇంటర్ బోర్డును ఆదేశించింది. షోకాజ్ నోటీసుల జారీ అనేది కంటితుడుపు చర్యే అవుతుందని హైకోర్టు అభిప్రాయపడింది. కాలేజీలకు నోటీసులు ఇచ్చాం..: ఇంటర్ బోర్డు తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సంజీవ్‌కుమార్ స్పందిస్తూ.. షోకాజ్ నోటీసు ఇవ్వకుండా అగ్నిమాపక శాఖ నుంచి ఎన్వోసీ లేని కాలేజీలపై చర్యలు తీసుకోడానికి వీలుకాదన్నారు. ఆ 68 కాలేజీలు తాత్కాలిక ఎన్వోసీలతో నడుపుతున్నాయని, ఇకపై అగ్నిమాపక శాఖ ఎన్ఓసీ ఇచ్చే అవకాశాలు కూడా లేవని చెప్పారు. షోకాజ్ నోటీసుకు స్పందించి వివరణ ఇస్తున్నాయని తెలిపారు. ఈ 68 కాలేజీల్లో 29,808 మంది విద్యార్థులున్నారని చెప్పారు. వీరందరి భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ విద్యా సంవత్సరానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్లు చెప్పారు. వచ్చే విద్యా సంవత్సరం (2020–21) నుంచి ఆ కాలేజీలకు అనుమతి ఇవ్వకూడదని ప్రభుత్వం నిర్ణయించిందని, ఇందుకు అనుగుణంగా ఉత్తర్వులు జారీ చేయాలని ధర్మాసనాన్ని కోరారు. ప్రభుత్వమే అన్నీ చేయలేక..: ప్రభుత్వ కాలేజీల్లో పూర్తి స్థాయి సౌకర్యాలు లేనందున ప్రైవేటు కాలేజీలకు అనుమతి ఇవ్వాల్సి వచ్చిందని ఇంటర్ బోర్డు కార్యదర్శి జలీల్ హైకోర్టుకు నివేదించారు. గతంలో హైకోర్టు ఆదేశించిన మేరకు ఆయన అఫిడవిట్ దాఖలు చేశారు. ఎన్వోసీ లేని కాలేజీల్లోని విద్యార్థులు వారు చదివే కాలేజీలకు బదులుగా మరో కాలేజీలో పరీక్షలు రాస్తారని తెలిపారు. ఈ విద్యా సంవత్సరం పూర్తి అవ్వగానే మార్చి 28 తర్వాత నుంచే ఎన్ఓసీలు లేని 68 కాలేజీలను మూసేస్తామని పేర్కొన్నారు. -
వారిపై అనర్హత వేటు తప్పదు : ధర్మాన
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేందరిపై చట్టప్రకారం అనర్హత వేటు తప్పదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు అన్నారు. హైదరాబాద్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో మంగళవారం ఆయన మాట్లాడుతూ..కేంద్ర ప్రభుత్వం 2003లో పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టంలో సవరణలు చేసిన విషయాన్ని గుర్తుకు చేశారు. ఆ చట్టప్రకారం పార్టీ ఫిరాయించినా ఎమ్మెల్యేందరిపై చర్యలు తప్పవన్నారు. కేశవరెడ్డి విద్యాసంస్థలో విద్యార్థుల డిపాజిట్లు రూ.740 కోట్లు ఉన్నాయని అలాంటి విద్యాసంస్థలను చైతన్య సంస్ధలకు అప్పగించడం సరికాదన్నారు. దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని ధర్మాన డిమాండ్ చేశారు.