breaking news
CGI
-
100% VFX ఉన్న ఫస్ట్ మూవీ.. పోస్టర్ చూశారా?
తల్లాడ సాయికృష్ణ,అమ్మినేని స్వప్న చౌదరి, తుమ్మలపల్లి రామసత్యనారాయణ, కిషోర్ దాస్,వినోధ్ నువ్వుల, కృష్ణ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం హనీ కిడ్స్. వీరి నటనకు తోడు అత్యాధునిక గ్రాఫిక్స్ టెక్నాలజీ ఈ సినిమాను అద్భుతమైన విజువల్ అనుభవంగా మార్చబోతోంది. భారతదేశంలో మొట్టమొదటి పూర్తి స్థాయి 100% VFX ఆధారిత సినిమాగా దీనికి గుర్తింపు రాబోతోంది. హర్ష.ఎం దర్శకత్వంలో అత్యాధునిక టెక్నాలజీతో తెరకెక్కుతున్న ఈ ఫాంటసీ-సైన్స్ ఫిక్షన్ చిత్రాన్ని తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మిస్తున్నారు. ఈ మూవీ చివరి షెడ్యూల్ విజయవంతంగా పూర్తయ్యింది. తాజాగా ఈ సినిమాలో హీరోయిన్ పోస్టర్ లుక్ విడుదల చేశారు. ఈ సందర్భంగా కథానాయిక స్వప్న చౌదరి అమ్మినేని మాట్లాడుతూ ఈ జోనర్ సినిమాలు పక్కా పిల్లలకి నచ్చుతాయంది. తనకు అవకాశం ఇచ్చిన చిత్ర బృందానికి ధన్యవాదాలు తెలిపింది. -
అనుపమ్ రేకు ఐఏఎఫ్సీ స్వాగతం
హూస్టన్:అమెరికాలో భారత కౌన్సిల్ జనరల్ ఆఫ్ ఇండియా(సీజీఐ)గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన డాక్టర్. అనుపమ్ రే ను ఇండియన్ అమెరికన్ ఫ్రెండ్ షిప్ కౌన్సిల్(ఐఎఎఫ్ సీ) ఘనంగా స్వాగతించింది. ఐఏఎఫ్సీ అధ్యక్షుడు డా. ప్రసాద్ తోటకూర ఈ సందర్భంగా ఇండియన్ అమెరికన్ ఫ్రెండ్ షిప్ కౌన్సిల్ గురించి అనుపమ్ రే కు వివరించారు. భారతీయ అమెరికన్లు మాతృభూమి అభివృద్ధికి తోడ్పడడానికి కృషి చేస్తున్నట్లు ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. త్వరలో కౌన్సిల్ ఆధ్వర్యంలో డాల్లస్ లో నిర్వహించబోతున్న కార్యక్రమానికి అనుపమ్ రే ను ఆహ్వానించారు.