breaking news
cg project
-
'విశ్వంభర' కోసం తల ఒంచుకుని పనిచేస్తున్నా
మెగాస్టార్ చిరంజీవి చేసిన భారీ బడ్జెట్ సినిమా 'విశ్వంభర'. లెక్క ప్రకారం గతేడాదిలోనే థియేటర్లలోకి రావాలి కానీ అనివార్య కారణాల వల్ల ఆలస్యమవుతూ వస్తోంది. దీని తర్వాత చిరు చేసిన 'మన శంకరవరప్రసాద్' రిలీజై నెలలు గడిచిపోతోంది గానీ దీని అప్డేట్ ఏంటనేది ఇప్పటివరకు తెలియట్లేదు. ఈ ఏడాది ద్వితియార్థంలోనే రిలీజ్ ఉండొచ్చని అంటున్నారు గానీ అదెప్పుడనేది తెలియట్లేదు. ఇకపోతే ఇప్పుడీ చిత్రం గురించి, ఇందులో గ్రాఫిక్స్ గురించి ప్రముఖ సినిమాటోగ్రాఫర్ చోటా కే నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ మూవీ ప్రెస్మీట్లో మాట్లాడుతూ ప్రస్తుతం ఇండస్ట్రీలో కెమెరామ్యాన్స్ పరిస్థితి ఎలా ఉందో బయటపెట్టారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన అనుపమ పరమేశ్వరన్ థ్రిల్లర్ సినిమా)'సినిమాటోగ్రాఫర్ ఎవరైనా పర్లేదు. సీజీ(కంప్యూటర్ గ్రాఫిక్స్)వాళ్లు ఇప్పుడు చాలా ముఖ్యం. వాళ్లు ఎంత బాగా ఇస్తే కెమెరామ్యాన్ అంత బాగా చేయగలడు. సీజీ ఉన్న సినిమాలు హిట్, ఫ్లాప్ అవ్వడానికి కెమెరామ్యాన్‌కి ఎలాంటి సంబంధం లేదు. వాళ్లకేం కావాలో అడిగి.. వాళ్లకు నచ్చినట్లే చేస్తున్నాం. నేను కూడా! నేనో పెద్ద పుడింగి, 'అంజి' చేశాను, 'ఢమరుకం' చేశాను నంది అవార్డ్ వచ్చింది, ఫిల్మ్‌ఫేర్ అవార్డ్ వచ్చిందని చెప్పట్లే. మా ఇగోలని పక్కనబెట్టి వాడు అడిగిందే ఇస్తాం. వాడు అడిగిన లైట్ రాంగ్ అని మాకు తెలుసు. అయినా రేపు క్వాలిటీ బాగోలేకపోతే కెమెరామ్యాన్ సహకరించలేదని వాడు వెళ్లి ఎవరితోనో మాట్లాడి చెడ్డపేరు రావడం ఆ ప్రాజెక్టుకి మంచిది కాదు ఆ కెమెరామ్యాన్‌కి కూడా మంచిది కాదు. అందుకని వాళ్లకు ఏం కావాలో అదే చేస్తున్నాం. రాకపోతే వాడి ఖర్మ. మా తప్పయితే ఏం లేదు. ప్రేక్షకులు, మీడియా మాట్లాడుకోవట్లేదు గానీ ఏదైనా తేడా జరిగితే కెమెరామ్యాన్ చెడగొట్టేశాడని మాట్లాడుకుంటున్నారు. కానీ కెమెరామ్యాన్‌కి ఎలాంటి సంబంధం లేదు. ఇప్పుడు సీజీ కంటూ వేరేగా ఓ టెక్నీషియన్ కొత్తగా వచ్చాడు. సినిమా మొదలైన దగ్గర నుంచి చివరి వరకు అతడు మా దగ్గరే ఉంటాడు. మాతోనే ట్రావెల్ చేస్తాడు. అతడు చెప్పకుండా ఒక్క ఫ్రేమ్ కూడా మేం తీయం. ఇప్పుడు రూల్ ప్రకారం తీయకూడదు. నేనైతే అతడు లేకుండా కెమెరా ఆన్ చేయట్లేదు'ఇక 'విశ్వంభర' ఎలా ఉండబోతుంది? అనే ప్రశ్నకు బదులిస్తూ.. ''అంజి' అయితే తలెత్తుకు పనిచేశాం. 'విశ్వంభర' కోసం తల ఒంచుకుని పనిచేస్తున్నాను. ఎందుకంటే 'విశ్వంభర' అనేదానిలో చాలా సీజీలు ఉన్నాయి. అక్కడికి పోయి నేను, చోటా కె నాయుడు. నాకు చాలా తెలుసు అని అంటే కుదరదు. చాలా బాగుండాలి. ఎందుకంటే ఆ మూవీ వెనక రూ.400 కోట్లు ఉంది. అక్కడికి పోయి నా ఇగో చూపిస్తే వర్కౌట్ అవ్వదు! అక్కడే ఏం కావాలో అదే చేశాం. బాగా జరుగుతుంది. అందుకే బాగా టైమ్ తీసుకుంటున్నాం. ది బెస్ట్ ఫిల్మ్ అవుతుంది' అని చెప్పుకొచ్చాడు. ఇప్పుడీ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.(ఇదీ చదవండి: మహేశ్ అభిమానులకు సారీ చెప్పిన హరీశ్ శంకర్) -
2026 ఆఖర్లో టాటా ‘ధోలేరా’ చిప్
ధోలేరా (గుజరాత్): టాటా ఎల్రక్టానిక్స్ తలపెట్టిన ధోలేరా (గుజరాత్) ప్లాంటు నుంచి చిప్‌ల తొలి బ్యాచ్ 2026 డిసెంబర్ నాటికి అందుబాటులోకి రాగలదని కేంద్ర ఐటీ, కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్ తెలిపారు. ఈ ప్లాంటులో 28, 50, 55 నానోమీటర్ నోడ్ల చిప్స్ తయారు కానున్నాయని పేర్కొన్నారు. టాటా గ్రూప్‌నకు చెందిన రెండు, సీజీ పవర్‌కి చెందిన ఒక చిప్ ప్లాంటుకు ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం శంకుస్థాపన చేసిన సందర్భంగా మంత్రి ఈ విషయాలు తెలిపారు. ఈ మూడింటిపై కంపెనీలు మొత్తం రూ. 1.26 లక్షల కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నాయి. మూడు భారీ సెమీకండక్టర్ల ప్లాంట్లకు ఒకే రోజున శంకుస్థాపన చేయడం రికార్డని మంత్రి చెప్పారు. 2029 నాటికి టాప్ 5 సెమీకండక్టర్ల వ్యవస్థల్లో భారత్ ఒకటిగా నిలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. టాటా ఎల్రక్టానిక్స్ సెమీకండక్టర్ల ప్రాజెక్టులతో అస్సాంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా 72,000 పైచిలుకు ఉద్యోగాల కల్పన జరగగలదని టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ తెలిపారు. -
కల చెదిరింది !
- వర్షాలు లేక అడుగంటిపోయిన సీజీ ప్రాజెక్టు - మూడేళ్లుగా బీళ్లుగా మారిన 909 ఎకరాలు - వలసలే శరణ్యమంటున్న రైతన్నలు కదిరి: తనకల్లు మండల పరిధిలోని సీజీ ప్రాజెక్టు పూర్తిగా అడుగంటిపోయింది. దీంతో ఆయకట్టుకు మూడేళ్లుగా నీటి విడుదల బంద్ అయ్యాయి. ఈ ప్రాజెక్టు నిండితే 909 ఎకరాలు కుడి, ఎడమ కాలువల ద్వారా సాగవుతుంది. తవళం, టీ.చదుం, బాలసముద్రం, ముండ్లవారిపల్లి పంచాయితీల పరిధిలోని 60 గ్రామాల రైతులు సీజీ ప్రాజెక్టు ద్వారా లబ్ధి పొందుతూ వచ్చారు. మూడేళ్లుగా వర్షాలు సరిగా లేకపోవడంతో ప్రాజెక్టులో నీరు కరువైంది. 1927 అడుగుల నీటి మట్టం ఉండాల్సిన ప్రాజెక్టు ఇప్పుడు 15 అడుగులకు పడిపోయింది. ఆ› ప్రాంతంలో సరాసరి వర్షపాతం 18 మిల్లీ మీటర్లు గతంలో నమోదయ్యేది. మూడేళ్లుగా చినుకు జాడలేక కనీస వర్షపాతం కూడా న మోదు కాకపోవడంతో ప్రాజెక్టు కళతప్పింది. కరవుకు అద్దం సాగు సందడితో కళకళలాడాల్సిన భూములు నేడు బీడుగా దర్శనమిస్తున్నాయి. ‘అయ్యా..ఇంతటి కరవు మేమెప్పుడూ చూడలేదు. రైతుకు ఎంత కష్టమొచ్చిందయ్యా..బోర్లన్నీ ఎండిపోయాయి. గతంలో ఎన్ని కరువులొచ్చినా ఎండిపోని బోర్లు ఈ మూడేళ్లలో ఎండిపోయాయి. ఇట్లే ఉంటే ఏం తినాలి..ఎట్లా బతకాలి’ అని కొక్కంటి క్రాస్‌కు చెందిన రైతు ఆదినారాయణ వాపోయాడు. ‘ప్రాజెక్టులో నీళ్లుంటే మండలమంతా పనులుండేవి. ఎవరింట్లో చూసినా ధాన్యానికి కొదవుండేది కాదు. ప్రాజెక్టు గేట్లెత్తి సరిగ్గా మూడేళ్లు దాటిపోయింది. ఈసారి కూడా వాన రాకపోతే గంజి నీళ్లే గతి’ అని టీ. సదుంకు చెందిన రైతు వెంకటరమణ తన గోడు వెల్లబోసుకున్నాడు. ఒకరు కాదు, ఇద్దరు కాదు ఏ రైతును కదిపినా, రైతు కూలీని పలకరించినా కన్నీటి గాథలే విన్పిస్తున్నాయి. నీరు చేరేది ఇలా... పాపాఘ్ని నది కర్ణాటకలోని కోలార్ జిల్లా నందికొండ వద్ద పుట్టి వివిధ ప్రాంతాల్లో ప్రవహిస్తుంది. అందులో ఒక చీలిక మన రాష్ట్రంలోని చిత్తూరు జిల్లా కందుకూరు చెరువులో కలుస్తుంది. అక్కడి మిగులు జలాలు అనంతపురం జిల్లా తనకల్లు మండలంలో ఉన్న సీజీ ప్రాజెక్టులో కలుస్తాయి. ఈ మిగులు జలాల ఆధారంగానే ఎన్పీ కుంట మండలంలో పెడబల్లి ప్రాజెక్టు నిర్మించారు. ఆ మిగులు జలాలు వైఎస్సార్ జిల్లాలోని వెలిగల్లు ప్రాజెక్టుకు చేరతాయి. టీడీపీ నేతల స్వార్థం చిత్తూరు జిల్లా కందుకూరు నుండి వచ్చే జలాలు సీజీ ప్రాజెక్టుకు రాకుండా చిత్తూరు జిల్లాకే పరిమితమయ్యే విధంగా అక్కడి అధికార టీడీపీ నాయకులు చర్యలు తీసుకున్నారు. ఆ జిల్లాలోని కమ్మచెరువుతో పాటు మరో 6 చెరువులకు ఆ నీటిని మళ్లించారు. ప్రస్తుతం కర్ణాటకలోని వందమానేరు నుండి వచ్చే మిగులు జలాలు మాత్రమే సీజీ ప్రాజెక్టుకు చేరుతున్నాయి. అక్కడ భారీ వర్షాలు కురిస్తేగాని సీజీ ప్రాజెక్టుకు నీరు చేరే పరిస్థితి లేదు. మూడేళ్లుగా బీడే – వెంకటనారాయణ, రైతు, బాలసముద్రం ప్రాజెక్టుకింద ఉన్న నా మూడెకరాల పొలం మూడేళ్లుగా బీడుగానే ఉంది. ఒకసారి ప్రాజెక్టులో నీళ్లున్నాయని వరి పంట సాగుచేస్తే తీరా పంట చేతికొచ్చేసరికి ప్రాజెక్టులో నీళ్లు అయిపోయి పంట అంతా ఎండిపోయింది. ఆ తర్వాత ప్రాజెక్టులోకి నీళ్లు రాలేదు. నేనే కాదు సుమారు వెయ్యి ఎకరాలు బీళ్లుగా ఉన్నాయి. శని పట్టుకుంది – రైతు బాషుసా»Œ , కొక్కంటి క్రాస్ సీజీ ప్రాజెక్టును 1954లో కట్టారు. 1994 తర్వాత వచ్చిన ఏడేళ్ల వరుస కరవుల్లో తప్ప ప్రాజెక్టులో ఎప్పుడూ నీళ్లుండేవి. ఆ కరవు మళ్లీ ఇప్పుడొచ్చింది. మూడేళ్లుగా మాకే కాదు.. రాష్ట్రమంతా శని పట్టుకుంది. నాకు ప్రాజెక్టు కింద రెండున్నర ఎకరాలు ఉంది. ఇంతకు ముందు బాగా వరి పండేది. ఇప్పుడు అది బీడుగా మారింది.


