breaking news
cess hike
-
కొత్త కారు కొనేవారికే కష్టమే! జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయంతో..
సాధారణంగా ఎప్పటికప్పుడు వాహన తయారీ సంస్థలు తన ఉత్పత్తుల ధరలను పెంచుతూనే ఉంటాయి. ముడిసరుకుల ధరల కారణంగా.. ఇతరత్రా కారణాలు చూపిస్తూ ఏడాదికి కనీసం ఒక్క సారైనా పెంచుతుందన్న విషయం అందరికి తెలిసిందే. కాగా తాజాగా జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలతో మల్టీ యుటిలిటీ వెహికల్స్ (MUV), క్రాస్ఓవర్ యుటిలిటీ వెహికల్స్ (XUV) ధరలు పెరిగినట్లు స్పష్టంగా తెలిసింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. మంగళవారం జరిగిన 50వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో కొత్త కారు కొనాలనుకునే వారికి జీఎస్టీ కౌన్సిల్ పెద్ద షాక్ ఇచ్చింది. ఎంపిక చేసిన మోడళ్ల మీద జీఎస్టీ సెస్ పెంచుతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. కావున ఇప్పుడు కొత్త ఎమ్‌యూవీ కార్లను కొనుగోలు చేసేవారు ఎక్కువ ధరలు చెల్లించాల్సి వస్తుందని తెలుస్తోంది. 28 శాతం జీఎస్టీ ఉండగా.. దీనిపైన 22 శాతం సెస్ విధించారు. దీంతో వాహన ధరలకు రెక్కలొచ్చాయి. (ఇదీ చదవండి: షాకిచ్చిన ఇన్ఫోసిస్.. తీవ్ర నిరాశలో ఉద్యోగులు - కారణం ఇదే!) ఎస్యూవీ అంటే పొడవు 4 మీటర్ల కంటే ఎక్కువ ఉండటమే కాకుండా.. ఇంజిన్ కెపాసిటీ 1500 సీసీ కంటే ఎక్కువ ఉండాలి. గ్రౌండ్ క్లియరెన్స్ కూడా 170 మీమీ కంటే ఎక్కువ ఉండాలి. ఇవన్నీ ఉన్న కార్లు మాత్రమే ధరల పెరుగుదల అందుకుంటాయని తెలుస్తోంది. గతంలో సెస్ అనేది 20 శాతంగా ఉండేది. ఇది తాజాగా రెండు శాతం పెరిగి సెస్ 22 శాతానికి చేరింది. ధరల పెరుగుదల సామాన్య ప్రజల మీద ఎక్కువ ప్రభావం చూపించే అవకాశం ఉందని భావిస్తున్నాము. -
జీఎస్టీ సెగ: ఐటీసీ క్రాష్
ముంబై: జీఎస్టీ ఎఫెక్ట్‌తో ఎఫ్ఎంసీజీ దిగ్గజం ఐటీసీ భారీగా పతనమైంది. సిగరెట్లపై సెస్ పెంపు కారణంగా ఐటీసీ తదితర సిగరెట్ తయారీ కంపెనీల షేర్లు నేడు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొనే అవకాశమున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. ఈ అంచనాలకనుగుణంగానే ఇన్వెస్టర్లలో ఆందోళన అమ్మకాల ఒత్తిడిని పెంచింది. సోమవారం జీఎస్టీ కౌన్సిల్ ఇచ్చిన షాక్‌తో దాదాపు సిగరెట షేర్లన్నీ నీరసించాయి. ముఖ్యంగా ఇటీవల భారీగా లాభపడిన ఐటీసీ ఇన్వెస్టర్ల అమ్మకాలతో 14శాతం పతనాన్ని నమోదు చేసింది. 15ఏళ్ల కనిష్టానికి చేరింది. దీంతో బ్రోకరేజ్ సంస్థలు కూడా నెగిటివ్ ట్రేడ్కాల్ ఇస్తుండటం గమనార్హం. గాడ్ఫ్రే ఫిలిప్స్ 4.5 శాతం, వీఎస్టీ ఇండస్ట్రీస్ 4.5 శాతం నష్టపోయాయి. ఈ ప్రభావంతో ఎఫ్ఎంసీజీ రంగం ఏకంగా 7.5 శాతం పతనమైంది. ఇది మార్కెట్లను ప్రభావితం చేస్తోందని మార్కెట్ ఎనలిస్టులు భావిస్తున్నారు. ఇక మిగతా షేర్ల విషయానికి వస్తే గెయిల్ (1.45 శాతం), అరబిందో ఫార్మా (1.37 శాతం), రిల్ (0.70 శాతం), టాటా పవర్ (0.12 శాతం) నష్టపోయాయి. గెయిల్ (1.45 శాతం), అరబిందో ఫార్మా (1.37 శాతం), రిల్ (0.70 శాతం), టాటా పవర్ (0.12 శాతం) నష్టాల్లో ట్రేడ్ అవుతుండగా, ఫలితాల జోష్‌తో ఏసీసీ 3.16 శాతం లాభాల్లో కొనసాగుతోంది. ఇంకా భారతీ ఎయిర్టెల్ 2.71 శాతం, విప్రో 1.57 శాతం, అంబుజా సిమెంట్స్ 1.47 శాతం, టీసీఎస్ (1.47 శాతం) లాభపడుతున్నాయి. వస్తు, సేవల పన్ను(జీఎస్టీ)లో భాగంగా సిగరెట్లపై సెస్ పెంపును జీఎస్టీ కౌన్సిల్ ఆమోదించింది. సిగరెట్లపై వాలోరెమ్ సెస్ విధించాలని జిఎస్టి కౌన్సిల్ సోమవారం నిర్ణయం తీసుకుంది. సోమవారం అర్థరాత్రి నుంచే ఇది అమల్లోకి వచ్చింది. తద్వారా ప్రభుత్వానికి ఏడాదికి రూ. 5వేల కోట్లమేర అదనపు ఆదాయం లభించనుందని ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ తెలిపారు. కాగా సిగరెట్లపై ఇప్పటికే జిఎస్టిలో భాగంగా 28 శాతం పన్నురేటు వుందని, దీనికి అదనంగా 5 శాతం వాలోరెమ్ సెస్‌ను అమలు చేస్తున్నామని ప్రకటించిన సంగతి తెలిసిందే.