breaking news
Central Ministry of Panchayati Raj
-
దేశమంతా ‘క్లీన్ అండ్ గ్రీన్’
సాక్షి, న్యూఢిల్లీ: గ్రామీణ ప్రాంతాల్లో పారి శుధ్య నిర్వహణ, మొక్కల పెంపకం, సమృధ్ధిగా తాగునీరు, ఆహార భద్రత అందించే లక్ష్యంతో కేంద్ర పంచాయతీరాజ్ శాఖ తీసు కొచ్చిన ‘క్లీన్ అండ్ గ్రీన్ విలేజ్’కార్యక్రమాన్ని దేశ వ్యాప్తంగా అమలు చేయాలని పంచాయతీరాజ్ శాఖను చూసే పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సిఫార్సు చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్యకర వాతావరణాన్ని సృష్టించడంతో పాటు సామాజిక, ఆర్ధిక వృద్ధికి ఉద్దేశించిన ఈ కార్యక్రమం కోసం ప్రత్యేకంగా కేంద్రం ఎటువంటి పథకాన్ని అమలు చేయనందున కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాలు అమలవుతున్నా యని తెలిపింది. నిధుల లేమి కారణంగా కొన్ని రాష్ట్రాలు దీనిని పక్కనబెట్టాయంది. ఇటువంటి రాష్ట్రాల కోసం ప్రత్యేక ప్యాకేజీని కేంద్రం అందించాల్సిన అవసరముందని సూచించింది.నిధులు, శిక్షణ, అవగాహన కీలకంలోక్సభ ఎంపీ సప్తగిరి శంకర్ ఉలకా నేతృత్వంలోని స్టాండింగ్ కమిటీ ఇటీవలి శీతాకాల సమావేశాల్లో తన 23వ నివేదికను పార్లమెంట్‌కు సమర్పించింది. రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ కింద ఎన్నికైన ప్రతినిధులు, సంబంధీకులు, పంచాయతీ కార్యకర్తలకు క్లీన్ అండ్ గ్రీన్ విలేజ్‌పై సవివర ప్రణాళికలను సిద్ధం చేయడానికి కేంద్ర పంచాయతీరాజ్ శాఖ శిక్షణ అందించిందని నివేదిక గుర్తు చేసింది. ఈ శిక్షణతో 99వేల పంచాయతీలు ఈ కార్యక్రమంపై అవగాహ న ఏర్పడిందని తెలిపింది. గ్రామాల్లో సామా జిక, ఆర్థిక అభివృద్ధిని వేగవంతం చేసే సామర్థ్యం ‘క్లీన్ అండ్ గ్రీన్ విలేజ్‘కు ఉన్నప్ప టికీ అమలులో అనేక సవాళ్లను ఎదుర్కొంటోందని పేర్కొంది. కేంద్రం ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి నిధులను అందించని కార ణంగా దేశవ్యాప్తంగా అమలు పురోగతి ఏకరీ తిన లేని విషయాన్ని గుర్తించినట్లు పార్లమెంటరీ కమిటీ తెలిపింది. క్షేత్రస్థాయిలో తగు శిక్షణ అందిస్తున్నా, అమలు విషయంలో సమస్యలు ఎదురవుతున్నారని, ముఖ్యంగా స్థానికుల ప్రమేయం చాలా తక్కువగా ఉంటోందని గుర్తించింది. గ్రామాల్లో స్వచ్ఛభా రత్ మిషన్ కొనసాగుతున్నా.. వ్యర్థాల నిర్వ హణ, కంపోస్టింగ్ మౌలిక సదుపాయాలు, చిన్న తరహా నీటి సంరక్షణ కార్యక్రమాలు వంటి పర్యావరణ సంబంధిత పనుల అమలుకు పంచాయతీలు ఆర్థిక వనరులతో సన్నద్ధంగా లేవని కమిటీ గుర్తించింది. ఈ నేపథ్యంలో పలు తక్షణ చర్యలు చేపట్టాలని కేంద్రానికి సూచించింది. ‘క్లీన్ అండ్ గ్రీన్ విలేజ్’అమలులో సమానత్వాన్ని కొనసాగించేందుకు, పేద రాష్ట్రాలకు అదనపు ఆర్థిక సహాయాన్ని అందించేందుకు వీలుగా తగిన నిధులు, స్పష్టమైన మార్గదర్శకాలతో కేంద్ర పంచాయతీరాజ శాఖ స్వతంత్ర పారిశుధ్య పథకాన్ని ప్రారంభించాలని సిఫార్సు చేసింది. ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని, స్థానికులు చురుకుగా పాల్గొనేలా ప్రేరేపించడానికి ప్రత్యేక అవగాహన, ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని తెలిపింది. ఇంటింటి ప్రచారం, వాల్ ఆర్ట్, టాయిలెట్ల పరిశుభ్రతపై స్థానిక జానపద మీడియా వినియోగం, గృహాలు, బహిరంగ ప్రదేశాలు, సంస్థలలో చెత్తబుట్టల వాడకం వంటి భారీ కార్యకలాపాలకు వీలుగా పూర్తిస్థాయి ‘క్లీన్ విలేజ్ ఫండ్‘ను ఏర్పాటు చేయాలని సూచించింది. నిర్మించిన మరుగుదొడ్ల వినియోగాన్ని పర్యవేక్షించే చర్యలు చేపడట్టడంతో పాటు పురోగతిని ట్రాక్ చేయడానికి, అంతరాలను గుర్తించేందుకు ఈ–గ్రామ్స్వరాజ్తో పారిశుధ్య డాష్‌బోర్డ్‌ను అనుసంధానించాలని తెలిపింది. వంటింట్లో స్వచ్ఛ ఇంధనం ఉపయోగించేలా ప్రజల్లో మార్పు తెచ్చేందుకు స్వయం సహాయక సంఘాల సేవలను వాడుకోవా లని కమిటీ సిఫార్సు చేసింది. -
ఈ-ఆఫీస్ గా మార్చేయండి..ప్రధాని అవార్డు పట్టేయండి!
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ అన్ని శాఖల కార్యాలయాలు ఇకనుంచి కాగిత రహిత కార్యాలయాలుగా(ఈ-ఆఫీస్) మార్చాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు ప్రధాని కార్యాలయం ఆదివారం అన్ని శాఖలకు ఆదేశాలు జారీ చేసింది. దీంతోపాటు ఈ ఆఫీస్ నిర్వహణలో అత్యుత్తమ పనితీరు కనబరిచే శాఖకు ఏటా పౌరసేవల దినోత్సవం నాడు ప్రధాని అవార్డుతో సత్కరించనున్నారు. ‘ఈ-ఆఫీసు ఏర్పాటుతో పరిపాలన వేగవంత మవుతుందని..ఫలితంగా ప్రభుత్వ ఖజానాను ఆదా చేసినవారమవుతామ’ని పీఎంఓ వ్యవహారాల మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. ప్రజలకు పారదర్శకమైన, వేగవంతమైన, బాధ్యతాయుతమైన పాలనను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని.. అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను ఈ-ఆఫీసులుగా మార్చడం ద్వారా ఆ లక్ష్యానికి చేరవవుతామని జితేంద్ర సింగ్ అన్నారు. ప్రధామంత్రి లక్ష్యమైన ‘ప్రగతి’ని చేరుకునేందుకు ఈ-ఆఫీసు ఏర్పాటు అమలుకు పరిపాలనా సంస్కరణలు, ప్రజా ఫిర్యాదుల విభాగం ఆర్థికసాయం చేస్తుందని సింగ్ వెల్లడించారు. ఈ-ఆఫీసు ఏర్పాటుకు అవసరమైన సాంకేతిక సహకారాన్ని జాతీయ సమాచార కేంద్రం (ఎన్ఐసీ) అందిస్తుందని మంత్రి తెలిపారు. ఈ వరుసలో ముందుగా కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఈ-ఆఫీసుగా మారి లక్ష్యాన్ని చేరుకుంటున్న దశలో...ఇప్పుడు కేంద్ర పంచాయతీ రాజ్ శాఖ ఈ ఆఫీసుగా మారి ఆ లక్ష్యాన్ని చేరుకోనుంది. -
ఏపీని ప్రత్యేకంగా చూడలేం
♦ ప్రత్యేకంగా చూసేందుకు నిబంధనలు ఒప్పుకోవు ♦ కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి చౌదరి బీరేంద్రసింగ్ సాక్షి, విజయవాడ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ గురించి 14వ ఆర్థిక సంఘం సిఫారసుల్లో ప్రత్యేకంగా ఏమీ ప్రస్తావించలేదని, ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రాన్ని ప్రత్యేకంగా చూసేందుకు నిబంధనలు ఒప్పుకోవని కేంద్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి చౌదరి బీరేంద్రసింగ్ స్పష్టం చేశారు. ఆయన మంగళవారం విజయవాడలో గిరిజన మహిళా సర్పంచుల జాతీయ సదస్సును ప్రారంభించిన అనంతరం సహచర కేంద్ర మంత్రు లు, సీఎం చంద్రబాబు, రాష్ట్ర మంత్రులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. 14వ ఆర్థిక సంఘం నుంచి గానీ, వెనకబడిన ప్రాంతాలకు ప్యాకేజీల రూపంలోగానీ ఏపీకి కేంద్రం ప్రత్యేకంగా నిధులు ఇవ్వడం లేదంటూ మీడియా ప్రతినిధులు అడిగిన ఒక ప్రశ్నకు మంత్రి స్పందిస్తూ... 14వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు అన్ని రాష్ట్రాలతో సమానంగానే ఏపీని చూస్తామన్నారు. గ్రామీణాభివృద్ధి, మౌలిక సదుపాయాల కోసం ప్రాధాన్యతా క్రమంలో నిధులు ఇస్తామని చెప్పారు. అయినా ఆంధ్రప్రదేశ్ ఆర్థిక ప్రగతి (ఎకనమిక్ గ్రోత్) బాగుందని, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమర్థుడు కాబట్టి బయటి నుంచి కూడా అప్పులు తీసుకురాగలరని బీరేంద్రసింగ్ చమత్కరించారు. కేంద్రం కొద్దిపాటి సాయం అందించినా ఏపీ మరికొన్నేళ్లలో మిగిలిన రాష్ట్రాలతో సమానంగా అభివృద్ధి చెందుతుందని భావిస్తున్నామన్నారు. ఏపీలో అప్పుడే కొత్త రాజధానికి పునాది వేసుకున్నారని చెప్పారు. ఏపీ కొత్త రాష్ట్రమైనా తక్కువ సమయంలోనే అన్ని విధాలుగా నిలదొక్కుకుంటుందన్నారు. కలెక్టర్లు, మండలాధికారుల ప్రమేయం లేకుండా నేరుగా పంచాయతీలకే నిధులు విడుదల చేసి, ఖర్చు చేసుకునేలా కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకొస్తామని చౌదరి బీరేంద్రసింగ్ ప్రకటించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ... కొత్త రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయని, కేంద్ర ప్రభుత్వ సహాయంతో అభివృద్ధి సాధిస్తామని చెప్పా రు. మీడియా సమావేశంలో కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి జువాల్ ఒరం, నీరు, పారిశుధ్యం శాఖల సహాయ మంత్రి రామ్‌కృపాల్ యాదవ్, గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి సుదర్శన్ భగత్, పంచాయతీరాజ్ శాఖ సహాయ మంత్రి నెహాల్‌చంద్, రాష్ట్ర మంత్రులు చింతకాయల అయ్యన్నపాత్రుడు, దేవినేని ఉమామహేశ్వరరావు, రావె ల కిషోర్‌బాబు, మృణాళిని పాల్గొన్నారు.


