breaking news
central locking system
-
సంక్రాంతికి ఊరెళ్తున్నారా... ఇల్లు భద్రం
సాక్షి, ఘట్కేసర్: సంక్రాంతి పండగకు సొంతూర్లకు వెళ్లేవారు తమ ఇళ్లల్లో చోరీలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. తాళం వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేసి కొళ్లగొట్టే గ్యాంగులు పండగ సమయాల్లో కాచుకు కూర్చుంటాయి. పట్టణానికి దూరంగా ఉన్న ఇళ్లు, కాలనీ చివరలో నివాసించే వారు ఇంటికి తాళం వేసి ఊర్లకు వెళ్లే ముందు తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఘట్కేసర్ డీఐ కిరణ్‌కుమార్ సూచిస్తున్నారు. నివారణ చర్యలే ప్రధానం.. సెంట్రల్ లాక్ సిస్టమ్‌ను ఏర్పాటు చేసుకోవాలి. ఇంటి లోపల ద్వారాలు, కిటికీలకు గడియా పెట్టాలి. తాళం కనిపించకుండా కర్టెన్లు వేయాలి. రాత్రికి ఇంటి లోపల, బయట లైట్లు వేలిగేలా చూడాలి. ఆభరణాలు, నగదు బ్యాంకులో భద్రపర్చుకోవాలి, లేదా నమ్మకస్తుల వద్ద భద్రపర్చుకోవాలి. ఊరెళ్లే ముందు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి సమాచారం ఇవ్వాలి. ఇలా చేయడం వల్ల పోలీసులు మీ ఇంటిపై ఓ కన్నేసి ఉంచుతారు. రాత్రి పూట గస్తీ పోలీసులను మీ ఇంటిని చూడమని పంపిస్తారు. పోలీసుల సూచనలు పాటించండి పండగలకు సొంతూళ్లకు వెళ్లేవారు పోలీసుల సూచనలు పాటిస్తే చోరీలు జరగకుండా ఆపవచ్చు. మాకు సమాచారం ఇస్తే ఆయా ప్రాంతాల్లో నిఘా పెంచుతాం. ఇంటిలో సీసీ కెమెరాలు బిగించుకోవాలి. కాలనీల్లో అనుమానితులు తిరుగుతుంటే 100కు డయల్ చేసి సమాచారం ఇవ్వండి. – కిరణ్‌కుమార్, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ ఘట్కేసర్ -
సెంట్రల్ లాకింగ్ సిస్టమ్.. జర జాగ్రత్త..
పటాన్ః సీఎన్జీ కిట్, సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ ఉన్న కారు వాడుతున్నారా? అయితే జర జాగ్రత్తగా ఉండాల్సిందేనని చెప్తోంది గుజరాత్ లో జరిగిన తాజా ఘటన. ఉన్నట్లుండి కారులో ఏర్పడిన షార్ట్ సర్క్యూట్ కు తోడు... సెంట్రల్ లాకింగ్ సిస్టం.. ఇద్దరు వ్యక్తుల సజీవ దహనానికి కారణమైంది. పటాన్ జిల్లా హైవేలో జరిగిన ఘటన.. అందర్నీ షాకింగ్ కు గురిచేసింది. గుజరాత్ పటాన్ జిల్లాలో జరిగిన ఘటన చూపరులను విస్మయానికి గురి చేసింది. ఇద్దరు దంపతులు హైవేలో వెడుతుండగా కారులో మంటలు చెలరేగడంతో ప్రమాదం సంభవించింది. కారులో ప్రయాణిస్తున్న భార్యాభర్తలిరువురూ ముఖ్యంగా అందులోని సెంట్రల్ లాకింగ్ సిస్టం వల్ల బయటకు రాలేకపోయి ఉండొచ్చని భావిస్తున్నారు. పటాన్ జిల్లాలోని హైవేలో జరిగిన కారు ప్రమాదంలో దంపతులిద్దరూ అగ్నికి ఆహుతైపోయారు. కారులో సీఎన్జీ కిట్ తో పాటు, సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ తో.. వారు ప్రాణాలు కాపాడుకోలేక పోయినట్లు ప్రాధమిక సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.