సంక్రాంతికి ఊరెళ్తున్నారా... ఇల్లు భద్రం

Ghatkesar Police Awareness on Robberies in Festival Season - Sakshi

సాక్షి, ఘట్‌కేసర్‌: సంక్రాంతి పండగకు సొంతూర్లకు వెళ్లేవారు తమ ఇళ్లల్లో చోరీలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. తాళం వేసి ఉన్న ఇళ్లను టార్గెట్‌ చేసి కొళ్లగొట్టే గ్యాంగులు పండగ సమయాల్లో కాచుకు కూర్చుంటాయి. పట్టణానికి దూరంగా ఉన్న ఇళ్లు, కాలనీ చివరలో నివాసించే వారు ఇంటికి తాళం వేసి ఊర్లకు వెళ్లే ముందు తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఘట్‌కేసర్‌ డీఐ కిరణ్‌కుమార్‌ సూచిస్తున్నారు.

నివారణ చర్యలే ప్రధానం..
సెంట్రల్‌ లాక్‌ సిస్టమ్‌ను ఏర్పాటు చేసుకోవాలి. ఇంటి లోపల ద్వారాలు, కిటికీలకు గడియా పెట్టాలి. తాళం కనిపించకుండా కర్టెన్లు వేయాలి. రాత్రికి ఇంటి లోపల, బయట లైట్లు వేలిగేలా చూడాలి. ఆభరణాలు, నగదు బ్యాంకులో భద్రపర్చుకోవాలి, లేదా నమ్మకస్తుల వద్ద భద్రపర్చుకోవాలి. ఊరెళ్లే ముందు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి సమాచారం ఇవ్వాలి. ఇలా చేయడం వల్ల పోలీసులు మీ ఇంటిపై ఓ కన్నేసి ఉంచుతారు. రాత్రి పూట గస్తీ పోలీసులను మీ ఇంటిని చూడమని పంపిస్తారు.

పోలీసుల సూచనలు పాటించండి  
పండగలకు సొంతూళ్లకు వెళ్లేవారు పోలీసుల సూచనలు పాటిస్తే చోరీలు జరగకుండా ఆపవచ్చు. మాకు సమాచారం ఇస్తే ఆయా ప్రాంతాల్లో నిఘా పెంచుతాం. ఇంటిలో సీసీ కెమెరాలు బిగించుకోవాలి. కాలనీల్లో అనుమానితులు తిరుగుతుంటే 100కు డయల్‌ చేసి సమాచారం ఇవ్వండి.
– కిరణ్‌కుమార్, డిటెక్టివ్‌  ఇన్‌స్పెక్టర్‌ ఘట్‌కేసర్‌

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top