breaking news
Cellulose
-
వృక్షాలతో.. సూపర్ కెపాసిటర్లు!
ఉత్పత్తి చేసుకున్నప్పుడు వాడుకోవాల్సిందేగానీ.. రేపటి కోసం దాచుకోవడమనేది విద్యుత్తు విషయంలో సాధ్యంకాదు. బ్యాటరీల్లో దాచుకోగలిగేదీ తక్కువే. అయితే ఒరెగాన్ స్టేట్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఈ దిశగా కీలక విజయం సాధించారు. వృక్షాల్లో ఉండే సెల్యులోజ్‌తో సూపర్కెపాసిటర్లు తయారుచేయవచ్చని వారు నిరూపించారు. సూపర్ కెపాసిటర్లు అధికమొత్తంలో విద్యుత్తును నిల్వ చేసుకునేందుకు పనికొస్తాయి. వీటిని యంత్రాలు నడిపేందుకు అవసరమైన విద్యుత్తు నిల్వకు, వాహనాల్లో బ్రేకులేయడం ద్వారా వృథా అయ్యే శక్తిని తిరిగి వాడుకునేందుకూ ఉపయోగించొచ్చు. కానీ సూపర్కెపాసిటర్ల తయారీకి అవసరమైన నాణ్యమైన కార్బన్ ఎలక్ట్రోడ్లను ఉత్పత్తి చేయడం బాగా ఖర్చుతో కూడుకున్న ప్రక్రియగా ఉంది. అయితే సెల్యులోజ్‌ను అమ్మోనియా సమక్షంలో వేడిచేస్తే.. అది అత్యంత పలుచనైన నానో కార్బన్ పొరలుగా మారుతుందని ఒరెగాన్ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ నానో కార్బన్ పొరలు ఎంత పలుచగా ఉంటాయంటే.. ఒక్క గ్రాము పొరలనే 2 వేల చదరపు మీటర్ల స్థలంపై పరిచేయొచ్చట! ఈ పద్ధతిలో నానో కార్బన్ పొరలను తయారు చేయడం చాలా సులభం, చవక, పర్యావరణ అనుకూలమే కాదు.. పని కూడా వేగంగా అయిపోతుందట. -
ప్రోటీన్ల తయారీకి తోడ్పడే కణాంగం?
1. ‘మమోపియా’ను సరిచేయడానికి ఉపయోగించే కటకం? పుటాకార కటకం 2. వర్ణ అందత్వం ఉన్న వ్యక్తులు ఏ రంగుల మధ్య తేడాలను స్పష్టంగా గుర్తించలేరు? ఆకుపచ్చ, ఎరుపు 3. ఏ విటమిన్ లోపం వల్ల వృద్ధుల కంటిలో నీరు కారుతుంది? రైబో ఫ్లేవిన్ 4. కన్నీటి గ్రంథులు (లాక్రిమల్ గ్రంథులు) ఆరోగ్యంగా పని చేయడానికి తోడ్పడే విటమిన్? విటమిన్ - ఎ (రెటినాల్) 5. కంటి నల్లగుడ్డుకు రంగును కలగజేసే పదార్థం? మెలనిన్ 6. దీర్ఘదృష్టి (హైపరోపియా)ను సరి చేయడానికి ఉపయోగించే కటకం? కుంభాకార కటకం 7. టెలిస్కోపిక్ దృష్టిని కలిగి ఉండే జంతువులు? పక్షులు 8. ‘విటిలిగో’ అనే వ్యాధి ఏ అవయవానికి సంబంధించింది? చర్మం 9. {Mోమోజోమ్ల్లో ఉండేవి? DNA, ప్రొటీన్లు 10. బ్యాక్టీరియాలో క్రోమోజోమ్‌ల సంఖ్య? ఒకటి 11. జీవులు నిర్జీవులకు మధ్య సంధానకర్తలుగా వేటిని పరిగణిస్తారు? వైరస్లు 12. వైరస్ అనే పేరుకు అర్థం? విషం 13. మానవుడిలో క్యాన్సర్‌కు కారణమయ్యే ఒకే ఒక జీవ కారకం? వైరస్ 14. హ్యూమన్ పాపిలోమా వైరస్ కలిగించే క్యాన్సర్? గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ (సర్వైకల్ క్యాన్సర్) 15. రసాయనికంగా వైరస్? న్యూక్లియో ప్రొటీన్ 16. మొక్కల్లో కిరణజన్య సంయోగక్రియకు తోడ్పడే కణాంగం? క్లోరో ప్లాస్ట్ (హరిత రేణువు) 17. పండ్లు, కూరగాయలు, పుష్పాలకు రంగులను కలిగించే కణాంగాలు? క్రోమోప్లాస్ట్లు 18. జన్యుశాస్త్ర పితామహుడు? గ్రెగెర్ జాన్ మెండల్ 19. క్యారెట్లో విటమిన్-ఎ ఏ రూపంలో ఉంటుంది? బీటా కారోటిన్ 20. {పోటీన్ల తయారీకి తోడ్పడే కణాంగం? రైబోజోమ్‌లు 21. కణంలో స్వయం విచ్ఛిత్తి సంచులుగా వేటిని పరిగణిస్తారు? లైసోజోమ్‌లు 22. నేల సారాన్ని పెంచడానికి ఉపయోగపడే శైవలాలు? నీలి ఆకుపచ్చ శైవలాలు 23. మెదడులో అతిపెద్ద భాగం? మస్తిష్కం 24. మానవుడి తర్వాత తెలివైన జంతువు? డాల్ఫిన్ 25. మానవుడి మెదడులో తెలివి తేటలకు కేంద్రం? మస్తిష్కం 26. దేహ సమతాస్థితిని కాపాడే మెదడులోని భాగం? అనుమస్తిష్కం 27. శరీరంలోని అతి చిన్న గ్రంథి? పిట్యూటరీ గ్రంథి 28. ఎక్కువ రకాల హార్మోన్లను విడుదల చేసే అంతస్స్రావీ గ్రంథి? పిట్యూటరీ గ్రంథి 29. {స్తీలలో ప్రసవ సమయంలో విడుదలయ్యే హార్మోన్? ఆక్సిటోసిన్ (రిలాక్సిన్) 30. కండరాలు సంకోచించడానికి తోడ్పడే మూలకం? కాల్షియం 31. {స్తీలలో అండం విడుదల కావడానికి తోడ్పడే హార్మోన్? ల్యూటినైజింగ్ హార్మోన్ 32. పాముల్లో ఏ జ్ఞానం ఎక్కువగా ఉంటుంది? ఘ్రాణశక్తి 33. శ్వాస క్రియను నియంత్రించే మెదడులోని భాగం? మజ్జాముఖం 34. క్షీర గ్రంథుల్లో క్షీరోత్పత్తిని ప్రేరేపించే హార్మోన్? ప్రోలాక్టిన్ 35. మానవుడిలో మానసిక అభివృద్ధికి తోడ్పడే హార్మోన్? థైరాక్సిన్ 36. శారీరక, మానసిక పరిపక్వతకు తోడ్పడే హార్మోన్? థైరాక్సిన్ 37. అతిమూత్ర వ్యాధి ఏ హార్మోన్ లోపం వల్ల కలుగుతుంది? ఆంటి డై యూరిక్ హార్మోన్ (వాసోప్రెసిన్) 38. ఏ గ్రంథిలో లోపం వల్ల అతిమూత్ర వ్యాధి కలుగుతుంది? పిట్యూటరీ గ్రంథి 39. శరీరంలో నీటి సమతాస్థితిని కాపాడే గ్రంథి? పిట్యూటరీ గ్రంథి 40. శరీర ఉష్ణోగ్రతను నియంత్రించే మెదడులోని భాగం? ద్వార గోర్ధం 41. గుండె పనితీరును నియంత్రించే మెదడులోని భాగం? మజ్జాముఖం 42. పోలియో వైరస్ ఏ నాడులను దెబ్బతీస్తుంది? చాలకనాడులు 43. నాళ, వినాళ గ్రంథిగా పనిచేసేది? క్లోమం 44. మానవుని అండంలో ఉన్న క్రోమోజోమ్‌ల సంఖ్య? 23 45. మానవుని శుక్ర కణంలోని క్రోమోజోమ్‌ల సంఖ్య? 23 46. సంకరజాతి పశువుల ఉత్పత్తిలో ఉపయోగపడే హార్మోన్? గొనాడో ట్రాపిక్ హార్మోన్లు 47. సంకర జాతి పశువుల ఉత్పత్తిలో అండాలను ఏ విధంగా నిల్వ చేస్తారు? ద్రవ నైట్రోజన్‌లో - 196o C వద్ద 48. దేహ సమతాస్థితికి తోడ్పడే జ్ఞానేంద్రియం? చెవి 49. ఒక చెవిలో ధ్వనిని గ్రహించడానికి తోడ్పడే ఎముకల సంఖ్య? మూడు 50.శరీరంలోని అతిచిన్న ఎముక? స్టాపిస్ 51. మసక వెలుతురులో దృష్టికి ఉపయోగపడే కణాలు? దండ కణాలు (Rods) 52. నిశాచరుల కంటి రెటీనాలో ఏ కణాల సంఖ్య చాలా ఎక్కువ? దండ కణాలు (Rods) 53. రంగులను గుర్తించడానికి తోడ్పడే కంటిలోని కణాలు? శంఖు కణాలు (కోన్స) 54. మానవుని శరీరంలో ఫలీకరణం జరిగే ప్రాంతం? ఫాలోపియన్ నాళాలు 55. మానసిక ఉద్వేగాల సమయంలో ఎక్కువగా విడుదలయ్యే హార్మోన్? అడ్రినలిన్ 56. వ్యక్తిని పోరాటానికి ప్రేరేపింప చేసే హార్మోన్? అడ్రినలిన్ 57. ‘జీరోఫైట్స్’ అంటే? ఎడారిలో పెరిగే మొక్కలు 58. సామ్మోఫైట్స్ అంటే? ఇసుకలో పెరిగే మొక్కలు 59.హైడ్రోఫైట్స్ అంటే? నీటిలో పెరిగే మొక్కలు 60.క్లోరోఫిల్ రహిత మొక్కలు? శిలీంధ్రాలు 61. పెన్సిలిన్‌ను వేటి నుంచి అభివృద్ధి చేస్తారు? శిలీంధ్రాలు 62. ఆల్కహల్ ఉత్పత్తికి వినియోగించే శిలీంధ్రం? ఈస్ట్ 63. వాణిజ్యపరంగా యాంటీబయాటిక్ మందులను దేని నుంచి ఉత్పత్తి చేస్తారు? బ్యాక్టీరియా 64. ‘టెట్రాసైక్లిన్’ యాంటీబయాటిక్ మందును కనుగొన్న శాస్త్రవేత్త? డా. ఎల్లాప్రగడ సుబ్బారావు 65. మొక్కలకు అవసరమైన ప్రధాన ఆవశ్యక మూలకాలు? N.P.K. (నత్రజని, భాస్వరం, పొటాషియం) 66. సుగంధ ద్రవ్యంగా ఉపయోగించే లవంగం ఒక? పుష్పపు మొగ్గ 67. {పపంచంలో చెరుకు తర్వాత ఎక్కువ చక్కెరను ఇచ్చే పంట? షుగర్ బీట్ 68. సుగంధ ద్రవ్యంగా ఉపయోగించే రైజోమ్? పసుపు, అల్లం 69. సెల్యూలోజ్ నుంచి తయారుచేసే దారం? రేయాన్ 70. ఏ అవయవం పనితీరును క్రమబద్దీకరించడానికి పేస్‌మేకర్‌ను ఉపయోగిస్తారు? గుండె