breaking news
Cattle Meat
-
బస్సులో 550 కిలోల పశు మాంసం స్వాధీనం
సింగరాయకొండ: ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో అక్రమంగా తరలిస్తున్న 550 కిలోల పశు మాంసాన్ని ప్రకాశం జిల్లా పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాలు.. విశాఖపట్నం నుంచి బెంగళూరుకు వెళ్తున్న ఎస్వీడీ వేదాంశ్ ట్రావెల్స్ బస్సులో గో మాంసాన్ని అక్రమంగా తరలిస్తున్నట్లు వచ్చిన సమాచారంతో ఎస్సై బి.మహేంద్ర శుక్రవారం తెల్లవారుజామున సింగరాయకొండ సమీపంలో తనిఖీలు చేశారు. అదే సమయంలో వచ్చిన ఎస్వీడీ వేదాంశ్ ట్రావెల్స్ బస్సును తనిఖీ చేయగా.. 11 ధర్మాకోల్ బాక్సుల్లో ప్యాకింగ్ చేసిన మాంసం బయటపడింది. దీంతో విజయవాడకు చెందిన బస్సు డ్రైవర్ గుజ్జుల కిరణ్‌కుమార్‌రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మండల పశువైద్యాధికారి హజరత్ మాంసాన్ని పరిశీలించి.. శాంపిల్స్ సేకరించారు. వాటిని హైదరాబాద్‌లోని ల్యాబ్‌కు పంపి.. గో మాంసమా, కాదా అన్నది నిర్ధారించుకోవాల్సి ఉందని పోలీసులు తెలిపారు. దీనిని ఎవరు పంపిస్తున్నారో.. ఎవరు బుక్ చేసుకున్నారనే సమాచారం కోసం విచారణ చేయాల్సి ఉందని చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై బి.మహేంద్ర వెల్లడించారు. -
గో మాంసం తరలిస్తున్న వాహనాలు స్వాధీనం
నిజామాబాద్: గో మాంసాన్ని అక్రమంగా తరలిస్తున్న వాహనాలను పోలీసులు ఆదివారం పట్టుకున్నారు. ఈ సంఘటనలో పోలీసులు రెండు డీసీఎమ్‌లు, మూడు ట్రాలీ ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. జాతీయ రహదారి 44పై వెళ్తున్న ఈ వాహనాలను పోలీసులు ఇందల్వాయి గ్రామ సమీపంలో గుర్తించారు. ఈ మాంసాన్ని నిజామాబాద్ నుంచి హైదరాబాద్‌కు తరలిస్తున్నట్లు పోలీసులు వివరించారు. ఈ వాహనాలను పోలీస్ స్టేషన్‌కు తరలించి, కేసు నమోదు చేశారు. -
‘పశువుల మాంసంతో నూనె తయారీ’ కేసులో...
ముగ్గురి అరెస్టు.. రిమాండ్ మర్రిగూడ : పశువుల మాంసంతో నూనె తయారు చేస్తున్న వారిలో ముగ్గురిని అరెస్టు చేసి కోర్టుకు రిమాండ్ చేసినట్లు నాంపల్లి సీఐ ఈ.వెంకట్‌రెడ్డి తెలిపారు. మర్రిగూడ మండలంలోని తానేదార్పల్లి గ్రామ గుట్టల్లో పెద్ద పెద్ద పొయ్యిలను ఏర్పాటుచేసి పశువుల మాంసంతో నూనె తయారు చేస్తున్న వైనంపై ఈ నెల ఒకటిన ‘సాక్షి’ ప్రధాన సంచికలో కథనం ప్రచురితమైంది. దీనికి స్పందించిన పోలీసులు పలు కోణాల్లో విచారణ జరిపారు. ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని ఆరాతీయగా మాంసంతో నూనె తయారు చేస్తున్నట్లు ఒప్పుకున్నారు. దీంతో ఆ ముగ్గురిని సీఐ వెంకట్‌రెడ్డి శుక్రవారం మీడియా ముందు ప్రవేశపెట్టారు. వీరిపై కేసు నమోదు చేసి దేవరకొండ కోర్టుకు రిమాండ్ చేసినట్లు సీఐ తెలిపారు. సమావేశంలో మర్రిగూడ ఎస్ఐ కె.మురళీమోహన్ తదితరులు ఉన్నారు.


