breaking news
case mystery
-
టీడీపీ మెడకు...వీరముడి
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: నాగులుప్పలపాడు మాజీ ఎంపీపీ, తెలుగుదేశం పార్టీ నాయకుడు ముప్పవరపు వీరయ్య చౌదరి హత్య కేసులో ప్రధాన అనుమానితులుగా అదే పారీ్టకి చెందిన నేతలు, సానుభూతిపరుల పేర్లు వినిపిస్తుండటం అధికార టీడీపీని కలవరపెడుతోంది. హత్యలో పాల్గొన్నది, మొదలు వ్యూహరచన చేసింది అందరూ ఆ పార్టీ వారేనని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఇది తమ పార్టీకి ఎక్కడ చెడ్డపేరు తెస్తుందోనన్న ఆందోళన ఆ పార్టీ నేతల్లో నెలకొంది. హత్యకు గురైన వీరయ్య చౌదరి, పోలీసుల అదుపులో ఉన్న ప్రధాన అనుమానితుడికి తెలుగుదేశం పార్టీ అధినాయకులతో సన్నిహిత సంబంధాలున్నాయని ప్రచారం జరుగుతోంది. ఇందుకు సంబంధించిన చిత్రాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ నెల 22వ తేదీ రాత్రి 7.30 గంటలకు నగరంలోని ఎస్పీ కార్యాలయానికి, తాలూకా పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలో జాతీయ రహదారి పక్కనున్న భవనంలో వీరయ్య చౌదరి దారుణ హత్యకు గురయ్యాడు. ముసుగులు ధరించిన నలుగురు యువకులు కేవలం మూడు నిముషాల్లోనే ఆయన శరీరంలోకి 53 కత్తి పోట్లు పొడిచి దారుణంగా హత్య చేశారు. ఈ హత్య రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. హత్య జరిగిన రాత్రే హోం మంత్రి అనిత ఒంగోలు చేరుకున్నారు. మరుసటి రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నేరుగా అమ్మనబ్రోలు చేరుకుని వీరయ్య చౌదరికి నివాళులర్పించారు. ఇంత దారుణానికి పాల్పడిన హంతకులు భూమి మీద ఉండడానికి అనర్హులని ప్రకటించారు. నిందితులు ఎంతటి వారైనా వదిలి పెట్టేదిలేదని హెచ్చరించారు. దీంతో పోలీసులు ఈ కేసును సవాల్‌గా తీసుకున్నారు. ఈ క్రమంలో గత శుక్రవారం చీమకుర్తి బైపాస్ వద్ద జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న ఒక దాబా సమీపంలో హంతకులు వినియోగించిన స్కూటీ లభించింది. దీంతో ఈ కేసులో పోలీసులకు కీలక ఆధారం లభించినట్లయింది. కేసు కీలక మలుపు తిరిగింది. స్కూటీ ఆధారంగా చేసిన విచారణలో వీరయ్య చౌదరి హత్య కేసులో అమ్మనబ్రోలు గ్రామానికి చెందిన టీడీపీ యువనేత ప్రధాన నిందితుడిగా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. స్కూటీ స్వా«దీనంతో లభించిన ఆధారాలతో నగరానికి చెందిన కొప్పోలు వాసి ప్రధాన పాత్రధారిగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. అలాగే రెండో వాహనాన్ని కూడా స్వా«దీనం చేసుకోవడంతో హత్యలో పాల్గొన్న మిగిలిన ముగ్గురూ జిల్లా వాసులుగానే గుర్తించారు. వారి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. జిల్లా టీడీపీ నేతల్లో కలకలం... వీరయ్య హత్య కేసులో ప్రధాన అనుమానితుడిగా పోలీసులు అదుపులో ఉన్న టీడీపీ యువనేతకు ఆ పారీ్టలోని ముఖ్య నాయకులందరితోనూ సన్నిహిత సంబంధాలున్నాయని తెలుస్తోంది. స్థానిక నాయకులతో పాటు జిల్లాకు చెందిన కీలక ఎమ్మెల్యేలు, మంత్రులతో సదరు వ్యక్తి అత్యంత సన్నిహితుడిగా మెలిగేవాడని ప్రచారం జరుగుతోంది. ఇప్పుడా నాయకులు తేలుకుట్టిన దొంగల్లా మౌనం పాటిస్తున్నారు. ఏం మాట్లాడితే ఏమవుతుందోనని ఆందోళనకు గురవుతున్నారు. ఈ కేసు ఎటుపోయి ఎటు వస్తుందో, చివరికి ఎవరి తలకు చుట్టుకుంటుందోనని కలత చెందుతున్నారు. అలాగే ప్రచారంలో ఉన్న హవాలా వ్యాపారికి, రేషన్ బియ్యం డాన్‌కు సైతం టీడీపీ నేతలతో మంచి సంబంధాలున్నాయని ప్రచారం. అలాగే హత్యలో పాల్గొన్న ప్రధాన అనుమానితుడికి సైతం ఆ పారీ్టతో లింకులున్నాయని విశ్వసనీయంగా తెలుస్తోంది. ఇది కూడా తెలుగుదేశం పార్టీ నాయకులను ఇరుకున పెడుతోంది.వీరయ్య కేసును ఏం చేస్తారు... వీరయ్య చౌదరి అంత్యక్రియలకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నిందితులు భూమి మీద ఉండేందుకు అర్హులు కారని చెప్పడం, నిందితులు ఎంతటి వారైనా ఒదిలిపెట్టేది లేదనడంతో ఈ కేసు గురించి ప్రజలు అనేక రకాలుగా చర్చించుకుంటున్నారు. హత్యకు గురైన వీరయ్య చౌదరి టీడీపీకి చెందిన నాయకుడు కావడం, హత్యలో ప్రధాన అనుమానితుడిగా పోలీస్ కస్టడీలో ఉన్న యువనేత కూడా టీడీపీకి చెందిన నాయకుడే కావడంతో ఇప్పుడీ కేసును ఏం చేస్తారోనన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. నిజంగా సీఎం చంద్రబాబు చెప్పినట్లు నిందితులను కఠినంగా శిక్షిస్తారా? లేక క్రమంగా నీరుగార్చేందుకు ప్రయత్నిస్తారా? అనే అంశాలు జోరుగా ప్రచారం సాగుతున్నాయి. ఈ కేసులో అనుమానితులుగా భావిస్తున్న మిగతా వారు కూడా అధికార పారీ్టకి చెందిన సామాజికవర్గానికి చెందిన వారు కావడం, అధికార పార్టీ స్థానిక నాయకులతో, రాష్ట్రంలోని కీలక నాయకులతో రాసుకుని పూసుకుని తిరిగిన వారు కావడంతో ఈ కేసు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందోనన్న చర్చ జరుగుతోంది.డైలమాలో పోలీసులు...వీరయ్య కేసులో పోలీసుల పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్న చందంగా తయారైంది. హత్య జరిగి దాదాపు ఎనిమిది రోజులు కావస్తున్నా ఇంతవరకూ ఒక కొలిక్కి రాలేదని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. వాస్తవానికి హతుడు వీరయ్య చౌదరి చుట్టూ అనేక వివాదాలు ఉన్నాయి. మద్యం సిండికేట్, బియ్యం మాఫియా, భూ, ఆర్థిక వివాదాలున్నాయి. అయినా ఆయన టీడీపీ నాయకుడు కావడం, ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్‌తో సంబంధాలు కలిగి ఉండడంతో పోలీసులు ఈ కేసును సీరియస్‌గా తీసుకున్నారు. విచారణ ముందుకు సాగుతున్న కొద్దీ ఈ కేసు పోలీసులకు పలు సవాళ్లు విసురుతోంది. విచారణలో అనుమానితులంతా టీడీపీ నాయకులే కావడంతో పాటు వారికి జిల్లా టీడీపీ నాయకులతో, మంత్రులతో పాటుగా ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ తో సన్నిహిత సంబంధాలు ఉండడంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఉన్నట్లు సమాచారం. స్కూటీ లభించిన రోజు టీడీపీ మీడియా చానళ్లలో అధికార పార్టీ నేతల ప్రమేయాన్ని పేర్లతో సహా ప్రసారం చేశారు. అయితే, ఆ తర్వాత ఏమైందో తెలియదు రోజుకో పేరు తెరపైకి వస్తున్నాయి. ఈ కేసు మరకలను ఇతర పారీ్టలకు అంటగట్టేలా ఆ పత్రికల్లో కథనాలు వస్తుండటంతో కేసు పక్కదోవ పడుతోందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ పెద్దల వద్ద నుంచి కూడా పోలీసులకు ఒత్తిడి వస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. అందుకే ఇలా ఇతర పారీ్టలకు చెందిన వారి పేర్లను ప్రచారంలోకి తెస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
హత్యా.. నరబలా ?.. అంతుచిక్కని జహేందర్ హత్యోదంతం
సాక్షి, చింతపల్లి (నల్గొండ) : సూర్యాపేట జిల్లా పాలకీడు మండలం శూన్యపాడుతండాకు చెందిన జహేందర్(30) హత్యోదంతం కేసు మిస్టరీ వీడడం లేదు. చింతపల్లి మండలం విరాట్‌నగర్ కాలనీ మహంకాళి అమ్మవారి పాదాల వద్ద ఈ నెల 10న మొండెం నుంచి వేరుచేయబడిన జహేందర్ తల లభ్యమైంది. మూడు రోజుల తర్వాత అతడి మొండెం రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్‌లోని ఓ నిర్మాణంలో ఉన్న భవనంలో లభించిన విషయం తెలిసిందే. అయితే, జయేందర్ది హత్యా.. నరబలినా అనేది ఇప్పటికీ పోలీసులకు అంతుచిక్కడం లేదు. జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి ఈ కేసును సవాలుగా తీసుకున్నా ముందుకు సాగడం లేదని తెలుస్తోంది. చదవండి: (ఘోర రోడ్డు ప్రమాదం.. క్షతగాత్రులను చూసి.. చలించిన యువ డాక్టర్) దుండగులు ఈ హత్యోదంతంలో అత్యంత చాకచక్యంగా వ్యవహరించినట్లు పోలీసు వర్గాల ద్వారా తెలుస్తోంది. కేసు ఛేదనకు పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. తుర్కయంజాల్‌లో జహేందర్ మొండెం లభ్యం కావడంతో రంగారెడ్డి జిల్లా పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే నిర్మాణంలో ఉన్న భవన యజమానిని అదుపులోకి తీసుకుని జయేందర్ మొండెం ఇక్కడికి ఎలా వచ్చిందనే కోణంలో విచారిస్తున్నట్లు తెలిసింది. చదవండి: (ఆరు నెలల క్రితమే వివాహం.. రోడ్డు ప్రమాదంలో ఏఆర్ కానిస్టేబుల్ మృతి) -
మహిళతో అసభ్యంగా ప్రవర్తించాడనే..
సాక్షి, శాలిగౌరారం (తుంగతుర్తి) : భూతవైద్యం పేరిట మహిళతో అసభ్యంగా ప్రవర్తించాడన్న కారణంతోనే శాలిగౌరారం మండలం గురుజాల గ్రామానికి చెందిన వెంపటి శంకర్ దారుణహత్యకు గురైనట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. మండల పరిధిలోని గురుజాలలో ఈ నెల 4వ తేదీన వెలుగుచూసిన శంకర్ హత్యోందం కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. హత్యోందంలో భాగస్వాములైన ఏడుగురు నిందితులను మంగళవారం నకిరేకల్‌లోని సీఐ కార్యాలయంలో నల్లగొండ డీఎస్పీ వెంకటేశ్వర్‌రెడ్డి మీడియా ఎదుట ప్రవేశపెట్టి కేసు వివరాలు వెల్లడించారు. గురుజాల గ్రామానికి చెందిన ఎడ్ల సాలమ్మ–చినవెంకన్న దంపతుల కుమారుడికి ఆరోగ్యం సరిగా లేకపోవడంతో పలు ఆస్పత్రులో వైద్యం చేయించారు. అయినా ఫలితం లేకపోవడంతో అదే గ్రామానికి చెందిన భూత వైద్యుడు వెంపటి యాదయ్యను సంప్రదించారు. ఈ క్రమంలోనే యాదయ్య, సాలమ్మల మధ్య చనువు పెరిగి వివాహేతర సంబంధానికి దారి తీసింది. అయితే కొంతకాలానికి సాలమ్మ అనారోగ్యం బారిన పడింది. ఆమెకు యాదయ్య భూతవైద్యం చేసినా ఆరోగ్యం కుదుట పడలేదు. దీంతో యాదయ్య ఇదే గ్రామానికి చెంది హైదరాబాద్‌లో నివాసం ఉంటున్న భూతవైద్యుడు వెంపటి శంకర్‌ను సంప్రదించాడు. సాలమ్మను అతడికి పరిచయం చేసి భూతవైద్యం చేయాలని కోరాడు. భూతవైద్యం చేసే క్రమంలో.. సాలమ్మకు భూతవైద్యం చేసేందుకు వెంపటి శంకర్ గత నెల 31న ఉదయం 9 గంటలకు గురుజాల గ్రామ సమీపంలోని మొండిఏనె వద్దకు చేరుకున్నాడు. అప్పటికే యాదయ్య, సాలమ్మలు అక్కడికి చేరుకున్నారు. అయితే సాలమ్మకు భూతవైద్యం చేసే క్రమంలో శంకర్ ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో కోపోద్రిక్తులైన యాదయ్య, సాలమ్మ అతడిని అంతమొందించాలని నిర్ణయించుకున్నారు. పథకం ప్రకారం.. తన పట్ల శంకర్ అసభ్యంగా ప్రవర్తించిన తీరును అప్పుడే అక్కడికి చేరుకున్న భర్త ఎడ్ల చినవెంకన్నకు వివరించింది. దీంతో అతను గురుజాల గ్రామానికి చెందిన బాకి రమేశ్, ఎడ్ల మారయ్య, గూని యా దయ్య, ఎడ్ల మారయ్యను అక్కడికి రప్పించాడు. ప్రథకం ప్రకారం అదును చూసి అందరూ కలిసి వెంపటి శంకర్ గొంతుకోసి దారుణంగా హత్య చేశారు. అనంతరం మూసీనది ఇసుకలో పాతిపెట్టి పారిపోయారు. ఫోన్ కాల్‌డేటా ఆధారంగా.. కాగా, ఈ నెల 4వ తేదీన వెలుగుచూసిన శంకర్ హత్యోదంతంపై వీఆర్వో తిరుమలేశ్ ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. హతుడి జేబులో లభించిన మత్స్య సహకార సొసైటీ గుర్తింపు కార్డు ఆధారంగా గురుజాలకు చెందిన శంకర్‌గా గుర్తించారు. అతడి ఫోన్ కాల్‌డేటా ఆధారంగా యాదయ్యను అనుమానించారు. అప్పటినుంచి గ్రామానికి చెందిన ఏడుగురు పరారీలో ఉండడంతో వారే హత్య చేసి ఉంటారని భావించారు. అనుమానితులు నార్కట్‌పల్లి మండలం చెర్వుగట్టులో ఉన్నట్టు గుర్తించి అక్కడికి వెళ్లి అరెస్ట్ చేసినట్టు డీఎస్పీ వివరించారు. విచారణలో నిందితులు నేరం అంగీకరించారని తెలిపారు. వారి వద్ద హత్యకు ఉపయోగించిన కత్తి, రెండు బైక్‌లు, ఏడు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఏడుగురు నిందితులపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచినట్లు డీఎస్పీ తెలిపారు. కేసును ఛేదించిన శాలిగౌరారం సీఐ పి.నాగదర్గప్రసాద్, ఎస్ఐ రాజు, ఏఎస్ఐ బండి యాదగిరి, స్టేషన్ రైటర్లు నజీర్, ముజీబ్, పోలీస్‌కానిస్టేబుల్స్ గురువారెడ్డి, చంద్రయ్య, అంజయ్య, టెక్నికల్ టీం జగన్, ఖలీల్, సుదర్శన్‌లను డీఎస్పీ అభినందించారు. -
వీడని మిస్టరీ..!
ఒంగోలు/మద్దిపాడు:తల్లీబిడ్డ హత్యకేసు మిస్టరీ వీడలేదు. రెండు రోజులు గడిచినా మృతుల వివరాలు తెలియరాలేదు. మద్దిపాడు మండలం మారెళ్లకుంటపాలెం సమీప పొలాల్లో మంగళవారం రాత్రి తల్లీబిడ్డను హతమార్చి, పెట్రోలుపోసి దహనం చేసిన ఘటన సంచలనం కలిగించిన విషయం విధితమే. ఈ ఘటనలో మృతుల వివరాలు తెలిస్తేనే హంతకుడు దొరికే అవకాశం ఉందని భావించిన పోలీసులు మృతుల ఆచూకీ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సంఘటనను సీరియస్‌గా తీసుకున్న జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ ఒంగోలు డీఎస్పీ ప్రసాద్ నేతృత్వంలో 14 బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తును వేగవంతం చేశారు. మృతురాలి వేలి ముద్రలను హైదరాబాద్‌లోని అడిషనల్ జనరల్ ఆఫ్ ఆధార్‌కు పంపారు. ఆమె ధరించిన చెప్పులు, దుస్తులు సేకరించి ఒంగోలు నగరంలోని చెప్పుల షాపులు, రెడిమేడ్ షాపుల్లో సీసీ ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నారు. పెద్దకొత్తపల్లి, పేర్నమిట్ట గ్రామాలతోపాటు ఒంగోలు నగరంలోని జాతీయ రదారిపై ఉన్న పెట్రోలు బంకుల్లో సీసీ ఫుటేజ్‌లను సేకరించే పనిలో పడ్డారు. మృతదేహాల ఫొటోలతో కరపత్రాలు ముద్రించి వాటిని గ్రామాల్లో పంచుతూ వారి ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నారు. తల్లీబిడ్డలకు సంబంధించిన వివరాల కోసం అంగన్వాడీలు, ఏఎన్ఎమ్ల ద్వారా విచారణ చేయిస్తున్నారు. సంఘటనా స్థలంలో ఓ బృందాన్ని ఉంచి అటుగా వెళ్తున్న రైతులు, పాదచారులను ఆరా తీస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల లబ్ధిదా రుల జాబితాను పరిశీలిస్తున్నారు. ఘటనా స్థలం వద్ద బుధవారం వాహన చోదకులను విచారిస్తున్న సీఐ జ్యోతిరాణి ప్రత్యక్ష సాక్షుల ఆధారంగా దర్యాప్తు వేగవంతం: ప్రత్యక్ష సాక్షులుగా భావిస్తున్న పలువురిని పోలీసులు గుర్తించారు. మంటలను గమనించిన పేర్నమిట్టవాసితోపాటు అతను అందించిన సమాచారంతో అక్కడకు వెళ్లిన వారిని కూడా పోలీసులు విచారిస్తున్నారు. ఈ క్రమంలో శివమాల ధరించిన భక్తులు ఇద్దరు బిడ్డతో ఉన్న ఓ మహిళతో 32 ఏళ్ల వ్యక్తి మారెళ్ళగుంట పొలాల వద్ద గొడవ పడుతుండటం తాము గమనించామని, అతడు తాము భార్యాభర్తలమని బదులిచ్చాడని పోలీసులకు తెలిపారు. నీలిరంగు గ్లామర్ బైక్‌పై వారు వచ్చినట్టు చెప్పారు. ఆ తర్వాత గంటలోపే ఈ ఘటన చోటు చేసుకున్నట్లు గుర్తించారు. ఈ వివరాల ఆధారంగా ఆ మార్గంలో సీసీ కెమెరా పుటేజిని కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. అటువైపుగా వచ్చే వాహనచోదకులను మహిళా సిఐ జ్యోతిరాణి, ఎస్సై సాంబయ్యలు ఆరా తీస్తున్నారు. సీడీఎస్ ప్రాజెక్టు ఆధికారిణి చిలకా భారతి అంగన్వాడీ సూపర్ వైజర్లతో కలిసి సంతనూతలపాడు, చీమకుర్తి, మద్దిపాడు ప్రాంతాలలో బుధవారం విచారించారు. పోలీసులు మాత్రం గ్రామాలలో జల్లెడ పడుతున్నారు. సోమ, మంగళవారాల్లో ఈ ప్రాంతంలో వర్షం కురిసిన కారణంగా పోలీసు జాగిలం కూడా మృతురాలి చుట్టే తిరుగాడింది. ఘటనా స్థలంలో పొగ రావడం గమనించి అక్కడకువెళ్లిన పెదకొత్తపల్లి గ్రామానికి చెందిన, బేల్దారి పనులు చేసే వ్యక్తిని కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. పెదకొత్తపల్లి గ్రామంలోని ఒక నాయకుడి గోడౌన్లో ఏర్పాటు చేసిన సీసీ కెమేరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. పేర్నమిట్ట ఒంగోలు సమీపంలోని పీర్లమాన్యం తదితర ప్రాంతాలలో ఇతర జిల్లా నుంచి వచ్చి ఇక్కడ పనులు చేసుకుంటూ జీవిస్తున్న వారిని విచారిస్తే ఏమైనా వాస్తవాలు బయటకు రావచ్చనే కోణంలోనూ విచారణ చేయాల్సిన అవసరం ఉంది. మృతుల ఆచూకీ కోసం గ్రామాల్లో విచారిస్తున్న పోలీసులు నిందితుడి నేరప్రవృత్తిపై సందేహాలు.. జరిగిన ఘటనపై మీడియాలో ఫొటోలతో సహా వార్తలు వచ్చాయి. అయినా పోలీసులకు కనీస సమాచారం అందలేదు. మృతురాలు ధరించిన చెప్పులు, దుస్తుల ఆధారంగా ఆమె ఇతర రాష్ట్రాలకు చెందిన మహిళ అయి ఉండవచ్చనే భావన వ్యక్తమవుతోంది. బైకు మీద వచ్చిన ఇద్దరు దంపతులే అయితే నిర్మానుష్య ప్రాంతంలోకి ఆమె ఎందుకొచ్చిందనే అంశం అనుమానాలకు తావిస్తోంది. త్రోవగుంట నుంచి దగ్గర దారి అని నమ్మించి చీమకుర్తి వైపు తీసుకువెళ్లేందుకు నిందితుడు ప్రయత్నం చేసి ఉండొచ్చని భావించి గ్రానైట్ ఫ్యాక్టరీలలో పనిచేసే ఇతర రాష్ట్రాలకు చెందిన కూలీలు, ఫ్యాక్టరీ యజమానులను సైతం పోలీసులు విచారిస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో ఎక్కడైనా మిస్సింగ్ కేసు నమోదైనా లేక ఫిర్యాదు వచ్చినా తక్షణమే తెలుసుకునే ప్రయత్నం చేయాలని ఎస్పీ సిద్ధార్థ కౌశల్ బుధవారం రాత్రి తన చాంబరులో దర్యాప్తు అధికారులకు సూచించారు. నిందితుడు పెట్రోలు సీసా, కత్తి వెంట తీసుకొచ్చాడు. బండరాయితో మహిళను హతమార్చాడు. కత్తితో చిన్నారి గొంతు కోశాడు. ఇద్దరిపై పెట్రోలు పోసి తగులబెట్టాడు. ఈ అంశాలను పరిశీలిస్తే నిందితుడు తీవ్రమైన నేరప్రవృత్తి గలవాడనే సందేహాలు కలుగుతున్నాయి. పోస్టర్లతో ఆరా.. తల్లిని దారుణంగా కొట్టి చంపి, పసిబిడ్డ గొంతు కోసి హతమార్చిన దారుణ ఘటనకు ఆనవాళ్లు గురిస్తే పోలీసుశాఖకు తెలియజేసి దర్యాప్తుకు సహకరించాలని జిల్లా ఎస్పీ సిద్థార్థ కౌశల్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ ఘటనకు సంబంధించిన ఆనవాళ్లను తెలిపే బ్రోచర్‌ను ఆయన బుధవారం రాత్రి విడుదల చేశారు. మృతుల ఆనవాళ్లు గుర్తిస్తే ఒంగోలు డీఎస్పీ 9121102120, రూరల్ సీఐ 9121102130, మద్దిపాడు ఎస్సై 9121102133 నంబర్లకు సమాచారం అందించాలని పేర్కొన్నారు. మహిళ ఆనవాళ్లు.. 20 నుంచి 25 ఏళ్ల మధ్య వయసు మహిళ ఎత్తు సుమారు 5అడుగులు, చామనచాయ రంగులో ఉంటుంది. గులాబీరంగు పంజాబీ డ్రస్సు, దానిపై తెలుపురంగులో ఎంబ్రాయిడరీ పువ్వు డిజైన్ ఉంది. లెగ్గిన్, చున్నీ తెలుపురంగులో ఉండి కాలిపోయాయి. మెడలో ఉన్న నైలాన్ పసుపు తాడులో నల్లపూసలు, ఒక ఎర్రపూస ఉన్నాయి. తాడు కాలిపోయింది. రెండు కాలివేళ్లకు రెండు జతల మెట్టెలున్నాయి. రెండు కాళ్లకు గులాబీరంగు గూడ చెప్పులు ఉన్నాయి. చంటిబిడ్డ ఆనవాళ్లు.. బిడ్డ వయస్సు 6 నెలల నుంచి ఏడాది ఉండవచ్చు. 2.25 అడుగుల ఎత్తు, చామన చాయగా ఉంటుంది. గులాబీరంగు డ్రాయర్, తెలుపు గోధుమరంగు అడ్డ నిలువు గీతల బనియన్ ధరించి ఉంది. రెండు కాళ్లకు నల్లని మొలతాడు కట్టి ఉంది. -
అనుమానంతో అంతమొందించాడు!
⇔ మహిళను చంపి మృతదేహాన్ని తగులబెట్టిన వైనం ⇔ కేసు మిస్టరీని ఛేదించిన పోలీసులు ⇔ నలుగురు నిందితుల అరెస్ట్ ⇔ మరొకరి కోసం గాలిపు నందికొట్కూరు: ఓ మహిళ అదృశ్యం కేసు మిస్టరీ వీడింది. ఆమెతో వివాహేతర సంబంధం నడుపుతున్న వ్యక్తే ఆమెను దారుణంగా చంపేశాడు. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు 39 రోజుల్లో మిస్టరీ ఛేదించి నిందితులను అరెస్ట్ చేశారు. వీరిని డీఎస్పీ సుప్రజ ఎదుట హాజరు పరిచారు. కర్నూలు జిల్లా నందికొట్కూరు సీఐ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో కేసు వివరాలను ఆమె వివరించారు. మల్యాల గ్రామానికి చెందిన వడ్డే పద్మావతి భర్త ఎనిమిది సంవత్సరాల క్రితం మృతి చెందాడు. ఆమెకు ఇద్దరు కుమారులు. పద్మావతికి అదే గ్రామానికి చెందిన వడ్డె దండుగుల శ్రీనివాసులుతో పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధానికి దారి తీసింది. కొన్నాళ్ల తర్వాత ఆమె.. శ్రీనివాసులుకు దూరంగా ఉండటంతో అనుమానం వచ్చింది. మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానంతో కడతేర్చాలని కుట్ర పన్నాడు. ఈ మేరకు నందికొట్కూరు పట్టణానికి చెందిన కొంగర నాగశేషులు, మల్యాలకు చెందిన దండుగుల బాల నాగన్న, జూపాడుబంగ్లా మండలం తంగెడంచకు చెందిన తెప్పలి రవీంద్రకుమార్, అనంతపురం జిల్లాకు చెందిన రిటైర్డు డీఎస్పీ కుమారుడు.. ఓ పత్రికా విలేకరి ఫణియాదవ్ సహాయం తీసుకున్నాడు. మే 8న పద్మావతిని వెలుగోడు కస్తూర్బా పాఠశాల సమీపంలోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి హత్య చేసి మృతదేహాన్ని తగుల బెట్టారు. అదే నెల 20న పద్మావతి కనిపించడం లేదని ఆమె కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అనుమానంతో శ్రీనివాసులును అదుపులోకి తీసుకుని విచారించగా కేసు మిస్టరీ వీడింది. నాలుగు రోజుల క్రితం ఘటనా స్థలంలో మహిళ పుర్రె, ఎముకలను స్వాధీనం చేసుకున్నారు. హత్యలో పాల్గొన్న నలుగురు నిందితులను గురువారం అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ తెలిపారు. హత్యకు సహకరించిన ఫణియాదవ్‌ను అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక టీం గాలిస్తున్నట్లు చెప్పారు. జూపాడుబంగ్లా మండలం మండ్లెం గ్రామంలో ఇటీవల అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఎలిషా కేసును కూడా త్వరలో చేధిస్తామన్నారు. సమావేశంలో సీఐ రామకృష్ణ, ఎస్ఐలు లక్ష్మీనారాయణ, సుబ్రహ్మణ్యం, అశోక్ పాల్గొన్నారు. -
ఆ రాత్రి ఏం జరిగింది..?
► నరసాపురంలో యువకుడి అనుమానాస్పద మృతి ► డబ్బు కోసం వదినకు మరిది వేధింపులు ► తెల్లవారే సరికి ఉరికి వేలాడిన నిందితుడు ► అనుమానాలకు బలం చేకూరుస్తున్న గాయాలు అనంతపురం: పెద్దపప్పూరు మండలం నరసాపురంలో ఆదివారం తెల్లవారుజామున కలకలం రేగింది. గ్రామానికి చెందిన పవన్‌కుమార్(28) అనుమానాస్పద స్థితిలో మరణించడం అనేక అనుమానాలను రేకెత్తిస్తోంది. ఇంట్లోని ఫ్యాన్‌కు ఉరి వేసుకున్నాడన్న సమాచారం క్షణాల్లో అందరికీ తెలిసిపోయింది. అప్పుడప్పుడే నిద్ర నుంచి మేల్కొంటున్న గ్రామస్తులు ఏం జరిగిందో అర్థం కాక ఆందోళనకు గురయ్యారు. మద్యానికి బానిసై... ట్రాక్టర్ డ్రైవర్‌గా పని చేసే పవన్‌కుమార్ అన్న ఓబులేసు, వదిన ఎరుకలమ్మతో కలసి జీవించేవాడు. ఏడాది కిందట అనారోగ్యంతో అన్న చనిపోయినా వదినతో కలసే ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో తాగుడుకు బానిసయ్యాడు. మందు కోసం తెలిసిన వారి దగ్గర చిల్లర అప్పులు చేశాడు. వాటిని తీర్చేందుకు వదినను వేధించేవాడు. ఈ క్రమంలో శనివారం రాత్రి 10 గంటలకు డబ్బుల కోసం వదినతో గొడవకు దిగాడు. అంతటితో ఆగక ఆమెపై చేయి చేసుకున్నాడు. పుట్టింటోళ్లకు విషయం తెలిపి.. మరిది పవన్‌కుమార్ చేతిలో దెబ్బలు తిన్న ఎరుకలమ్మ తన పరిస్థితిని తండ్రితో పాటు అన్నలకు ఫోన్లో తెలిపి విలపించింది. అక్కడి నుంచి వారు బైక్‌లో వచ్చి రాత్రికి రాత్రే పవన్‌తో గొడవపెట్టుకున్నారు. ఆ తరువాత ఎరుకలమ్మను పొరుగింట్లో ఉంచి వెళ్లిపోయారు. తెల్లారేసరికి ఉరికి వేలాడిన పవన్ ఆ రాత్రి ఏం జరిగిందో ఏమో గానీ తెల్లారేసరికి ఇంట్లోనే ఫ్యాన్‌కు పవన్‌కుమార్ ఉరి వేసు కున్నాడు. విషయం తెలిసిన వెంటనే ఎస్ఐ శ్రీహర్ష తమ సిబ్బందితో కలసి గ్రామానికి చేరుకున్నారు. మృతుని తల, వీపు, కాళ్లపై గాయాలుండడాన్ని గుర్తించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఉదంతంలో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కేసులో పోస్టుమార్టం రిపోర్టు కీలకం కానుంది. పోలీ సులు నిష్పక్షపాతంగా విచారణ జరిపితే నిజనిజాలు వెల్లడవుతాయని గ్రామస్తులు అంటున్నారు. మృతుని వదిన ఎరుకలమ్మను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.