breaking news
carry bag
-
సిటీ సెంటర్‌మాల్‌లో క్యారీ బ్యాగ్‌కు బిల్లు.. రూ.20 వేల జరిమానా
సాక్షి, హైదరాబాద్: బంజారాహిల్స్‌లోని సిటీ సెంటర్‌మాల్‌లో లైఫ్ స్టైల్ దుస్తుల షోరూం క్యారీ బ్యాగ్‌కు రూ.5 వసూలు చేయడంతో సదరు దుస్తుల కంపెనీకి జిల్లా కన్జ్యూమర్ డిస్పూట్స్ రెడ్రెసల్ కమిషన్ రూ.20 వేల జరిమానా విధించింది. వినియోగదారులకు క్యారీ బ్యాగ్‌లు ఉచితంగా ఇవ్వాల్సి ఉండగా షాపు నిర్వాహకుడు డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఓ బాధితుడు కమిషన్‌ను ఆశ్రయించారు. విచారణ చేపట్టి ఆ షోరూంకు జరిమానా విధించింది. చదవండి: ఈ పిల్లిని ఎలా రక్షిస్తారు? పోలీసు ఫేస్బుక్లో పోస్టు చేస్తూ.. -
ప్లాస్టిక్ భూతం ఆటకట్టు!
ప్రపంచానికి ఇప్పుడు ప్లాస్టిక్ సవాలుగా మారింది. ఎన్ని దేశాలు, ప్రభుత్వాలు ప్లాస్టిక్‌ను నిషేధించినా వాటి వాడకం మాత్రం ఆగట్లేదు. దీంతో పర్యావరణానికి ఎంతో ముప్పు వాటిల్లుతోంది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని చిలీకి చెందిన ఇద్దరు ఇంజనీర్లు కరిగిపోయే క్యారీబ్యాగులను తయారు చేశారు. ఇది ప్లాస్టిక్‌కు చెక్ పెడుతుందని చెబుతున్నారు. క్యారీబ్యాగ్‌లను తయారుచేసే సాల్యుబ్యాగ్ కంపెనీ జనరల్ మేనేజర్ రాబర్టో అస్టెటే, మరో మేనేజర్ క్రిస్టియన్ ఆలివేర్స్ కలసి ఈ బ్యాగు వివరాలు వెల్లడించారు. నీటిలో వేసి కలపగానే ఆ బ్యాగు కరిగిపోతుందట. ఈ బ్యాగు పర్యావరణహితంగా ఉంటుందని, ఎలాంటి హానీ కలిగించదని చెబుతున్నారు. వీటి తయారీ ఖర్చు తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నామని పేర్కొంటున్నారు. -
భారీ క్యారీబ్యాగ్‌తో గిన్నిస్‌లోకి
సాక్షి, ముంబై: కేవలం 9.02 గంటల వ్యవధిలో 21/27 పర్యావరణ అనుకూల అడుగుల క్యారీబ్యాగ్‌ను తయారు చేసిన ఠాణే మహిళ మనీషా ఓగ్లే గిన్నిస్‌బుక్‌లో చోటు దక్కించుకున్నారు. ఈమే చేసిన ఈ పనిని లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ వారు కూడా గుర్తించి సర్టిఫికెట్ జారీ చేశారు. 2013, ఏప్రిల్‌లో ఠాణేలోని కోరమ్ మాల్లో ఈ భారీ క్యారీబ్యాగ్‌ను తయారు చేయడమే కాకుండా దానిపై పర్యావరణ అనుకూల సందేశాలను రాసి ఈ ఘనత సాధిం చారు. నీటిని పొదుపుగా వాడుకోవాలని, చెట్లను కాపాడుకోవాలని, మొక్కలు నాటాలని, ప్లాస్టిక్ క్యారీబ్యాగుల వినియోగాన్ని తగ్గించుకోవాలని తన కళ ద్వారా చాటి చెప్పారు. గిన్నిస్బుక్వారు, లిమ్కాబుక్వారు అందజేసిన సర్టిఫికెట్లను మనీషా మీడియాకు చూపారు. ఈ సందర్భంగా మనీషా ఓగ్లే మాట్లాడుతూ.. లిమ్కా, గిన్నిస్ బుక్‌లో తనకు చోటు దక్కడం సంతోషంగా ఉందన్నారు. తన కల నెరవేరేందుకు మంచి అవకాశం లభించిందన్నారు. నా సామర్థ్యంపై ఉన్న నమ్మకంతో ఈ అవకాశం కల్పించిన కోరమ్‌మాల్ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపారు. కోరమ్‌మాల్ జనరల్ మేనేజరు దేవా జ్యోతుల మాట్లాడుతూ.. ఓగ్లే సాధించిన ఈ రికార్డుల కారణంగా తమ మాల్‌కు మంచి గుర్తింపు వచ్చిందన్నారు. ఇదివరకు ఠాణే జిల్లాకే పరిమితమైన పేరు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా మార్మోగిందన్నారు. పర్యావరణానికి మేలుచేసే కార్యక్రమం కావడంతో తామం తా సహకరించామని చెప్పారు. ఇలాంటి వారిని ప్రోత్సహించేందుకు కోరమ్‌మాల్ ఎప్పుడూ ముందుంటుందన్నారు. ఠాణే జిల్లాకు చెందిన 35 ఏళ్ల మనీషా ఓగ్లే ఎనిమిదేళ్లుగా ఈ కళారంగంలో ఉన్నారు. ఆమె వద్ద అనేక రకాల పెయింటింగులు ఉన్నాయి. అందులో ఆమెకు నచ్చింది ఫ్యాబ్రిక్ పెయింటింగ్. మధుబని పెయింటింగ్, వార్లీ పెయింటింగ్‌లో కూడా నైపుణ్యత సాధించారు. చీర, కుర్త, దుపట్టాలపై ఇజిప్టు స్టైల్లో వేసిన డిజైన్లు కొనుగోలుదారులను ఎంతో ఆకట్టుకుంటున్నాయి. ఆమె ఇటీవల చీరపై వేసిన డిజైన్‌కు దుబయిలో మంచి గుర్తింపు లభించింది. తన కళ ద్వారా ముంబై, ఠాణేలో అనేక పురస్కారాలు కూడా అందుకున్నారు. ఆమె కళా నైపుణ్యానికి సంబంధించి అనేక కార్యక్రమాలు టీవీలో ప్రసారమయ్యాయి. గతంలో 40/20 అడుగుల భారీ కుర్తాను 29.27 గంటల్లో సిద్ధం చేసి లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులోకెక్కారు. -
బ్యాంకు దోపిడీ
ఖాతా తెరుస్తామంటూ నలుగురు వ్యక్తులు బ్యాంకు లోనికి ప్రవేశించారు. తర్వాత రావాలంటూ మేనేజర్ సూచిస్తుండగానే ఇద్దరు వ్యక్తులు ఆయనకు పిస్టల్ ఎక్కుపెట్టారు. గేటు వద్ద మరో ఇద్దరు వ్యక్తులు ఉండి బ్యాంకులోకి వస్తున్న సిబ్బంది ఒక్కొక్కరిని పిస్టళ్లు, కత్తులతో బెదిరించారు. అందరినీ ఓ గదిలో బంధించి సెల్ఫోన్లు, తాళాలు లాక్కున్నారు. స్ట్రాంగ్‌రూమ్ తెరిచి అందులో ఉన్న రూ.46 లక్షల నగదును కాటన్ క్యారీ బ్యాగుల్లో నింపేసుకున్నారు. సిబ్బందిని గదిలోపలే ఉంచి బయటనుంచి తాళం వేసి డబ్బు సంచులతో బైక్‌లపై పరారయ్యారు. ఇదేదో సినిమా సన్నివేశాన్ని తలపిస్తోంది కదూ..! చొప్పదండి మండల కేంద్రంలోని ఎస్బీఐలో శనివారం సినీఫక్కీలో జరిగిన దోపిడీ ఇది. చొప్పదండి, న్యూస్‌లైన్ : నిత్యం రద్దీగా ఉండే రాయపట్నం-వరంగల్ రహదారి పక్కన చొప్పదండిలోని వ్యాపార ప్రాంతంలో జరిగిన ఈ దోపిడీపై సంఘటనపై స్థానికులు ముక్కున వేలేసుకుంటున్నారు. పెద్ద మొత్తం నిలువ ఉండే బ్యాంకు శాఖకు కనీసం సెక్యూరిటీగార్డు లేకపోవడంతోనే దొంగలు ముందుగా రెక్కీ నిర్వహించి తమ పని సులువుగా కానిచ్చేశారని చర్చించుకుంటున్నారు. దోపిడీ జరిగిన క్రమం ఇదీ.. శనివారం ఉదయం 9.15 గంటలకు మేనేజర్ విశ్వేశ్వర్రావు బ్యాంకుకు వచ్చారు. వెనుకవైపునున్న తలుపు తెరుచుకుని తన గదిలోకి వెళ్లారు. బ్యాంకు సమయం ఉదయం 10.30 గంటలకు కాగా, శనివారం లావాదేవీలు ఒకేపూట నిర్వహిస్తారు. జనవరి మాసానికి సంబంధించిన లావాదేవీలను సరిచూసుకునేందుకు తాను ముందుగా వచ్చినట్టు మేనేజర్ చెప్పారు. ఆ సమయంలో ఆయనొక్కరే బ్యాంకులో ఉండగా, సిబ్బంది విధులకు వస్తారనే ఉద్దేశంతో ద్వారం తెరిచే ఉంచారు. ఆ తర్వాత సరిగ్గా పది నిమిషాలకు అంటే.. 9.25 గంటలకు నలుగురు వ్యక్తులు బ్యాంకులోకి ప్రవేశించి ఖాతా తాము ఖాతా తెరుస్తామన్నారు. బ్యాంకు సమయంలో రావాలని మేనేజర్ సూచిస్తుండగానే.. ఇద్దరు వ్యక్తులు ఆయన గదిలోకి వెళ్లి పిస్టల్‌తో బెదిరించారు. ఆయన వద్దనున్న స్ట్రాంగ్‌రూమ్ తాళంచెవి తీసుకుని, పక్కనున్న గదిలో బంధించారు. మరో తాళంచెవి క్యాషియర్ వద్ద ఉందని చెప్పడంతో అతడి రాకకోసం వేచిచూశారు. ఆ సమయంలో కరెంట్ లేకపోవడంతో బ్యాంకులోపల చీకటిగా ఉంది. 9.40 ప్రాంతంలో తాత్కాలిక ఉద్యోగి పొన్నాల రాజు బ్యాంకులోకి ప్రవేశించారు. వెనుకవైపు గేటు వద్దనున్న ఇద్దరు వ్యక్తులు ఆయనను పిస్టల్‌తో బెదిరించి మేనేజర్‌ను బంధించిన గదిలోకి తీసుకెళ్లారు. 10.10 గంటలకు మరో తాత్కాలిక ఉద్యోగి గీత లోనికి రాగానే ఆమె అరవకుండా నోరుమూసి అదే గదిలోకి తీసుకెళ్లి బంధించారు. 10.15 గంటలకు క్లర్కు అశోక్, ఆపై కొద్ది నిమిషాలకు క్యాషియర్ కృష్ణ బ్యాంకులోకి వచ్చారు. వారు రావడంతోనే పిస్టల్, కత్తులు చూపి బెదిరించి అదే గదిలో బంధించారు. లోపల ఉన్న ఇద్దరు వ్యక్తులు అందరివద్దనున్న సెల్ఫోన్లు లాక్కున్నారు. క్యాషియర్ వద్దనున్న తాళంచెవి తీసుకొని, స్ట్రాంగ్‌రూమ్‌ను తెరిచి లోనికి ప్రవేశించారు. 10.30 గంటల్లోగా స్ట్రాంగ్‌రూమ్‌లో ఉన్న రూ.46 లక్షల నగదును కాటన్ సంచుల్లో నింపుకున్నారు. సిబ్బంది గది నుంచి బయటకు రా కుండా తాళం వేసి డబ్బు సంచులతో బయటకు వెళ్లారు. బ్యాంకు ముందు నిలిపిన తమ రెండు బైక్‌లపై మంచిర్యాల వైపు పరారయ్యారు. 10.40 గంటలకు సిబ్బంది తమ వద్దనున్న తాళాలతో గ్రిల్స్ నుంచి చేతులు పెట్టి తాళం తీసుకొని బయటపడ్డారు. వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు జిల్లాలోని అన్ని పోలీస్స్టేషన్లకు సమాచారం అందించడంతోపాటు ఆదిలాబాద్ జిల్లాలోని పోలీసులను అప్రమత్తం చేశారు. ఎస్పీ శివకుమార్, పెద్దపల్లి డీఎస్పీ వేణుగోపాల్‌రావు సంఘటన స్థలాన్ని పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. దోపిడీ దొంగలు 25-30 ఏళ్లలోపు ఉన్నారని, హిందీలో మాట్లాడరని సిబ్బంది తెలిపారు. పోలీసులు బ్యాంకులోని సీసీ కెమెరా ఫుటేజీలను స్వాధీనం చేసుకుని పరిశీలించారు. ఆ సమయంలో కరెంటు లేకపోవడంతో సీసీ కెమెరాల్లో నిందితులు సరిగా రికార్డు కాలేదని తెలిసింది. నాలుగుృబందాలను ఏర్పాటు చేశామని, దోపిడీ దొంగలను త్వరలోనే వారిని పట్టుకుంటామని ఎస్పీ శివకుమార్ విలేకరులతో చెప్పారు.