breaking news
Carnival dance
-
జుంబారే మొంబాసా!
కార్నివాల్ అంటే బ్రెజిల్లో జరిగే రియో కార్నివాల్ ఎక్కువమందికి గుర్తుకొస్తుంది. ఆఫ్రికా దేశమైన కెన్యాలో కూడా దాదాపుగా అదే స్థాయి కార్నివాల్ ఏటా జరుగుతుంది. కెన్యా తీర నగరమైన మొంబాసాలో ఏటా నవంబర్ నెలలో నెల పొడవునా కార్నివాల్ సందడిగా జరుగుతుంది. ఈ నెల్లాళ్లూ మొంబాసా నగరంలోని వీథులన్నీ రకరకాల ఊరేగింపులతో, సంప్రదాయ నృత్య సంగీత ప్రదర్శనలతో కోలాహలంగా కనిపిస్తాయి. తూర్పు ఆఫ్రికాలో జరిగే అతిపెద్ద సాంస్కృతిక వేడుక ఇది. తూర్పు ఆఫ్రికాలోని సాంస్కృతిక భిన్నత్వాన్ని ఏకతాటిపైకి తెచ్చే వేడుకగా సాగే ఈ కార్నివాల్లో ప్రతిరోజూ సంప్రదాయ వేషధారణలతో నృత్య సంగీతాలతో జరిగే ఊరేగింపులు ఉంటాయి. బహిరంగ వేదికల మీద నృత్య, సంగీత ప్రదర్శనలు ఉంటాయి. కళా ప్రదర్శనలు, రకరకాల పోటీలు జరుగుతాయి. తూర్పు ఆఫ్రికా సంప్రదాయ సంగీత రీతులైన ‘బెంగా’, ‘తారబ్’, సంప్రదాయ నృత్యరీతులైన ‘చకాచా’, ‘గిరియామా’ ప్రదర్శనలతో పాటు, స్థానిక మత్స్యకారులు చేసే వివిధ సంప్రదాయ నృత్య సంగీత ప్రదర్శనలు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటాయి. స్వాహిలి, మిజికెందా, తైటా తెగల ప్రజలు ఎక్కువగా ఈ ప్రదర్శనలు చేస్తారు. ఈ కార్నివాల్లో కొత్తతరం యువతీ యువకులు హిప్ హాప్, ఆఫ్రో ఫ్యూజన్ వంటి ఆధునిక సంగీత, నృత్య ప్రదర్శనలు చేస్తారు. మొంబాసా కార్నివాల్ స్థానిక చేతివృత్తుల వారికి ప్రధాన వేదికగా నిలుస్తుంది. హస్తకళా నైపుణ్యంతో వారు తయారు చేసిన సంప్రదాయ వస్తువుల అమ్మకాల కోసం ప్రధాన కూడళ్లలోను, ప్రత్యేక మైదానాల్లోను తాత్కాలికంగా దుకాణాలతో ప్రదర్శనశాలలు ఏర్పాటవుతాయి. దేశ విదేశాల నుంచి ఈ కార్నివాల్‌ను తిలకించేందుకు వచ్చే పర్యాటకులు ఇక్కడి చేతివృత్తుల వారు తయారు చేసిన వస్తువులను జ్ఞాపికలుగా కొనుగోలు చేసి తీసుకువెళుతుంటారు. ఈ ప్రదర్శనశాలలోనే ఆఫ్రికన్ సంప్రదాయ వంటకాలు, విదేశీ వంటకాలతో ఆహారశాలలు కూడా ఏర్పాటవుతాయి. కార్నివాల్ జరిగే నెల్లాళ్లూ విందు వినోదాలు, కళా ప్రదర్శనలు, రకరకాల పోటీలు, శిక్షణ శిబిరాలు, సాంస్కృతిక పరిరక్షణపై చర్చా కార్యక్రమాలు విరివిగా జరుగుతాయి. -
హార్ట్లీ వెల్కమ్..
కార్నివాల్ డ్యాన్స్‌ల నుంచి ఖవ్వాలి పాటల దాకా... జానపద నృత్యాల నుంచి జాజ్ మ్యూజిక్ దాకా... కాదేదీ స్వాగత సన్నాహాలకు అనర్హం అంటున్నారు ఈవెంట్ నిర్వాహకులు. సకల కళల సమాహారంగా సాగుతున్నాయ్ స్వాగత సన్నాహాలు. కొత్త కొత్త ఆశలతో నవవసంతాన్ని ఆహ్వానించే సందర్భాన్ని చిరస్మరణీయం చేసేందుకు, సిటీజనుల హార్ట్స్‌ను ఆర్ట్స్‌తో కొల్లగొట్టేందుకు సిద్ధమయ్యాయి. కొత్త ఏడాదిని ఎంత కొత్తగా స్వాగతించాలా అంటూ వేదికల అన్వేషణలో యువత.. అందుకు అనుగుణంగానే నగరవ్యాప్తంగా ఈవెంట్ల మోత.. దేశ విదేశాల నుంచి డీజే, వీజేలు, గాయకులు, మ్యుజీషియన్ల రాక. వెరసి వెల్కమ్ 2015 ఈవెంట్స్. ఆర్ట్ ఆఫ్ డీజే- వీజేయింగ్... న్యూ ఇయర్ ఈవెంట్లలో డీజేల సందడి గురించి చెప్పక్కర్లేదు. విభిన్న రకాల డీజేయింగ్ ఆర్ట్స్ చవిచూపుతూ టర్న్‌టేబుల్ క్వీన్ల దగ్గర్నుంచి రీమిక్స్‌ల కింగ్‌ల దాకా సిటీలో వీనుల విందు అందిస్తారు. ఈ ఏడాది ఆ కోవలో గండిపేటలోని గోల్కొండ రిసార్ట్స్‌లో అలీ నైట్ ఇంటర్నేషనల్ డీజేలు ఐరా క్రాఫ్ట్, అర్నాల్డ్లు సందడి చేయనున్నారు. షామిర్‌పేటలోని లియోనియో రిసార్ట్స్‌లో జరిగే ఈవెంట్ కోసం యూరోపియన్ డీజే బుక్ జింక్స్, న్యూ డిస్కో నుంచి డీప్ హౌజ్, టెక్నోలను పండించడంలో సిద్ధహస్తురాలైన డీజే నిఫ్రా, ఇండియాలోని బెస్ట్ 6 డీజేలలో ఒకరైన ఆర్యన్, 128 బీపీఎం ప్రోగ్రెసివ్ సౌండ్‌ను ప్రొడ్యూస్ చేసే ఏకైక డీజే ఫాల్గున్ తరలివస్తున్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్, ఎయిర్టెల్ చాంపియన్ లీగ్‌ల పోస్ట్పార్టీలకు డీజేగా వర్క్ చేసిన దమన్ కూడా వస్తున్నాడు. బంజారాహిల్స్ అవర్ ప్లేస్‌లో సిటీ లేడీ వీజే షరాన్, యూకేకు చెందిన లేడీ డీజే పింక్‌లు జంటగా మ్యూజిక్‌ని కదం తొక్కిస్తున్నారు. మరో ఇటలీ డీజే ఒల్లె ఎస్సె... టాప్క్లబ్స్లో ప్లే చేసిన పేరును వెంటపెట్టుకుని నగరానికి వచ్చేస్తోంది. దుర్గం చెరువులోని మారకేష్‌లో లండన్ కెటివికి చెందిన వీజే హెలెన్ తళుక్కుమననుంది. మరో ఈవెంట్ కోసం లండన్ నుంచి వీజే సేజల్ శర్మా రానుంది. బంజారాహిల్స్ రాడిసన్ బ్లూ ప్లాజా హోటల్లో రష్యన్ డీజే ఒస్కాన్నా పవర్ ఆఫ్ మ్యూజిక్ చూపనుంది. డిస్ట్రిక్ట్ ఎన్లో జర్మనీ డీజే నీల్ రిచర్ క్రియేట్ చేసే టెంపరేచర్‌ను గమనించవచ్చు. థీమ్ ఆర్ట్... థీమ్ అనేది సిటీలో న్యూ ఇయర్ ఈవెంట్స్‌ను కమ్మేస్తున్న సరికొత్త ట్రెండ్. ది వైట్ ైనె ట్ సెన్సేషన్ అనే ప్రపంచవ్యాప్త న్యూ ఇయర్ పార్టీల పాపులర్ థీమ్‌ను అవర్‌ప్లేస్ అందిపుచ్చుకుంది. ఎంట్రన్స్ నుంచి వెన్యూ అంతా థీమ్ మయంగా, ప్రధాన వేదిక వైట్ థీమ్ లైటింగ్‌తో వెలుగుతూ ఉంటుంది. ప్లష్ వైట్ సీటింగ్, డైనింగ్ ఏరియా కూడా వైట్ సీట్స్‌తో ఉంటుంది. మాస్క్ థీమ్ కూడా ఈసారి అనేక ఈవెంట్లలో హైలైట్‌గా మారింది. హార్డ్‌రాక్ కేఫ్ నిర్వహిస్తున్న మస్క్యురాదె పార్టీ, కాక్టైల్ పబ్‌లో మాస్క్‌లు, బీడ్స్, ఫెదర్స్ ధరించి మరీ డ్యాన్స్ చేయమంటూ నిర్వాహకులు ఆహ్వానిస్తున్నారు. అలాగే డొలారీ ధనిలో జరిగే ఈవెంట్‌ను లాస్‌వెగాస్ థీమ్‌తో నిర్వహిస్తున్నారు. పాటల పొంగు... గచ్చిబౌలి సంధ్యా కన్వెన్షన్ సెంటర్లో సెన్సేషనల్ సింగర్ యుతిక పెర్ఫార్మెన్స్ మొదలుకుని లలిత కళాతోరణంలో తెలుగు గాయకుల దాకా ఎక్కడ చూసినా పాటల పందిళ్లే. కెనడాకు చెందిన భారతీయ సెన్సేషన్... శ్వేత సుబ్రమ్ డీజేలతో కలిసి గచ్చిబౌలి ఎల్లా గ్రూప్ ఆఫ్ హోటల్స్‌లో సందడి చేయనుంది. షామీర్పేట లియోనియా రిసార్ట్స్‌లో ఇండియన్ ఐడల్ పెర్ఫార్మర్, ఏషియన్ గేమ్స్ 2010లో సందడి చేసిన తాన్యాగుప్తా సాంగు భళా అనిపించనుంది. ప్లేబ్యాక్ సింగర్ ప్రణవి... పాప్, రెట్రో, సుఫీ, ఫోక్లను అలవోకగా అందించే అస్మిత్సింగ్, ఇంకా మరెందరో గాయనీ గాయకులు తమ గాత్ర మాధుర్యంతో స్వాగతవేడుకలకు ఊపు తెచ్చేందుకు సిద్ధమయ్యారు. కళ... కళ... వేదిక వీరే కాదు మరెన్నో కళలు, కళాకారులు సిటీకి వెల్లువెత్తుతున్నాయ్. అంతర్జాతీయ రష్యన్ కళాకారులు అందించే క్విక్ ఏంజెల్స్, ఫైర్ ఏంజెల్స్, ఇల్యూజన్ యాక్ట్, ఆక్రో యాక్ట్ వంటివన్నీ నూతన సంవత్సరపు వేడుకల్లో భాగంగా మారుస్తూ మారియట్ హోటల్ ఎక్స్ప్లోజన్ 2015ను నిర్వహిస్తోంది. ప్రగతి రిసార్ట్స్‌లో స్కైలాంతర్స్, ఫోక్ డ్యాన్సర్స్, కార్నివాల్ డ్యాన్సర్స్, బాలీవుడ్ డ్యాన్సర్స్, రాక్‌బ్యాండ్.. ఇలా విభిన్న రకాల కళల సమ్మేళనంగా ఈవెంట్‌ను నిర్వహిస్తున్నారు. అమీర్‌పేటలోని ఆదిత్య పార్క్ ఇన్‌లో వెలాసిటీ 2015 కార్నివాల్లో వార్సి బ్రదర్స్ ఖవ్వాలి కాంతులు వెదజల్లనుంటే... హోటల్ బసేరాలోని మెహ్ఫిల్లో ప్రసిద్ధ గజల్ కళాకారులు హాయిని పంచనున్నారు. - ఎస్.సత్యబాబు