breaking news
car-bike collisioned
-
ఊరికి వెళ్తుండగా విషాదం.. కారు పల్టీలు కొట్టి..
సాక్షి, ఉప్పల్: వరంగల్ జాతీయ రహదారి పరిధిలోని నారపల్లి నందనవనం వద్ద శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారును అతివేగంగా నడిపి డివైడర్‌ను ఢీకొట్టడంతో..పల్టీలు కొట్టి రోడ్డుకు అవతలి వైపు బైకుపై వెళ్తున్న తండ్రీ కొడుకులను ఢీకొంది. దీంతో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన మేడిపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ అంజిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం జనగాం జిల్లా పాలకుర్తి మండలం రాగాపురానికి చెందిన మానుపాటి సోమయ్య (70) పండుగ సెలవుల నేపథ్యంలో తన చిన్నకుమారుడు కృష్ణ, మనవడు వినేష్‌తో కలిసి శుక్రవారం ఉదయం బైకుపై కూకట్పల్లి నుంచి స్వగ్రామం రాగాపురానికి బయలుదేరారు. వీరు మేడిపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని నారపల్లికి చేరుకోగానే వరంగల్ వైపు నుండి మేడిపల్లి వైపు వస్తున్న కారు ఒక బస్సును ఓవర్టేక్ చేస్తూ డివైడర్‌ను ఢీకొని రోడ్డు అవతల నుండి వస్తున్న కృష్ణ వాహనాన్ని ఢీ కొట్టింది. దీంతో తీవ్ర గాయాలపాలైన సోమయ్య, కృష్ణలు అక్కడికక్కడే మృతిచెందగా వినేష్‌కు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కారులో ప్రయాణిస్తున్న చౌదరిగూడ ప్రాంతానికి చెందిన విక్రాంత్‌రెడ్డి (20) స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. సమాచారం అందుకున్న మేడిపల్లి పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. సోమయ్య కుమార్తె శారద ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. -
కారు,బైక్ ఢీ.. ముగ్గురికి గాయాలు
జడ్చర్ల(మహబూబ్‌నగర్): ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఢీకొన్న ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల న్యూ బస్టాండ్ సమీపంలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. ఎదురెదురుగా వస్తున్న కారు-బైక్ ఢీకొనడంతో.. ఈ ప్రమాదం చోటుచేసుకుంది. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించగా.. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఎవరి నిర్లక్ష్యం కారణంగా ప్రమాదం జరిగింది, ఘటన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
కారు, బైక్ ఢీ.. వ్యక్తి మృతి
కుడేరు: ద్విచక్రవాహనంపై వెళ్తున్న వ్యక్తిని ఓ కారు ఢీకొట్టడంతో అతను అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటన అనంతపురం జిల్లా కుడేరు మండల కేంద్రం సమీపంలో అగ్రిగోల్డ్ బిల్డింగ్ వద్ద శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. జిల్లాలోని కుడేరు మండలం పి.నారాయణపురం గ్రామానికి చెందిన ప్రభాకర్‌రెడ్డి ద్విచక్ర వాహనంపై అనంతపురం వైపు వెళుతుండగా ఎదురుగా వచ్చిన కారు ఢీకొంది. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన ప్రభాకర్‌రెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు.