breaking news
Capati
-
మీరు కొట్టిన పిండే!
సంక్రాంతిని దాచి పెట్టుకోవాలి.అది అంత మంచి పండుగ.తొందరగా అయిపోతుందేమోనన్న దిగులుగా ఉందా!ఈ రోజు నుంచే పిండి కొట్టండి. వంటకాలు తయారుచేయండి. డబ్బాలలో దాచి పెట్టుకుని కొంచెం కొంచెం ఆస్వాదిస్తూ తినండి.అప్పుడు పండగ ఎన్నాళ్లో ఉంటుంది.ఇంటిల్లిపాదికీ ఇష్టమైన పిండి వంటలు మీకు కొట్టిన పిండే కదా! నేతి అరిసెలు/ బెల్లం అప్పాలు కావలసినవి: బియ్యం – ఒక కేజీ; బెల్లం – 700 గ్రా.; నువ్వులు – 100 గ్రా.; నెయ్యి/నూనె – డీప్ ఫ్రైకి సరిపడా; ఏలకుల పొడి – అర టీ స్పూను. తయారీ: ∙బియ్యాన్ని శుభ్రంగా కడిగి, తగినన్ని నీళ్లు జత చేసి, ముందురోజు రాత్రి నానబెట్టాలి ∙మరుసటి రోజు పెద్ద జల్లెడలాంటి దానిలో పోసి సుమారు పావుగంట సేపు బియ్యాన్ని వడకట్టాలి ∙తడిపోయాక, బియ్యాన్ని మిక్సీలో వేసి మెత్తగా చేయాలి ∙ఒక పాత్రలో బెల్లం పొడి, రెండు టేబుల్ స్పూన్ల నీళ్లు పోసి, స్టౌ మీద ఉంచి పాకం పట్టాలి ∙ఉండ పాకం వచ్చేవరకు ఉడికించాలి ∙బియ్యప్పిండి కొద్దికొద్దిగా పోస్తూ కలపాలి ∙అర టీ స్పూను ఏలకుల పొడి, 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి బాగా కలియబెట్టాలి ∙మిశ్రమం బాగా చిక్కబడేవరకు ఆపకుండా కలుపుతుండాలి ∙బాగా ఉడికిందనిఅనిపించాక దింపేయాలి ∙స్టౌ మీద బాణలిలో నూనె పోసి కాచాలి ∙తయారయిన అరిసెల పిండిని కొద్దికొద్దిగా తీసుకుంటూ, నెయ్యి పూసిన ప్లాస్టిక్ పేపర్ మీద ఒత్తి, కాగిన నూనెలో వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించి తీసేయాలి ∙అరిసెల బల్ల మీద ఉంచి, నూనె పోయేలా గట్టిగా ఒత్తాలి ∙బాగా చల్లారాక డబ్బాలో నిల్వ చేసుకోవాలి. గులాబీ గుత్తులు కావలసినవి: మైదా పిండి – 3 కప్పులు; బియ్యప్పిండి – ఒక కప్పు; పంచదార – ఒక కప్పు; ఉప్పు – కొద్దిగా; వంట సోడా – కొద్దిగా, మిఠాయి రంగు – కొద్దిగా తయారీ: ∙ఒక పాత్రలో బియ్యప్పిండి, పంచదార వేసి, తగినన్ని నీళ్లు జత చేస్తూ దోసెల పిండి మాదిరిగా కలుపుకోవాలి ∙కొద్దిగా నీళ్లలో మిఠాయి రంగు కలిపి, పిండిలో కలియబెట్టాలి ∙స్టౌ మీద బాణలిలో తగినంత నూనె పోసి కాచాలి ∙గులాబీ గుత్తులు తయారుచేసే గుత్తిని ముందుగా వేడి వేడి నూనెలో కొద్దిసేపు ఉంచి వేడి చేయాలి ∙కలిపి ఉంచుకున్న పిండిలో ఆ గుత్తిని జాగ్రత్తగా ముంచి, అదే గుత్తిని నూనెలో ఉంచాలి ∙కొద్దిగా వేగుతుండగా చాకుతో గుత్తి నుంచి గులాబీలను వేరు చే యాలి ∙దోరగా వేగిన తరవాత పేపర్ టవల్ మీదకు తీసుకోవాలి. రిబ్బన్ పకోడా కావలసినవి: బియ్యప్పిండి – 2 కప్పులు; సెనగ పిండి – ఒక కప్పు; వాము – 2 టీ స్పూన్లు; పసుపు – పావు టీ స్పూను; ఉప్పు – రుచికి తగినంత; మిరప కారం – అర టీ స్పూను; నూనె – డీప్ ఫ్రైకి సరిపడా. తయారీ: ∙ఒక పాత్రలో బియ్యప్పిండి, సెనగ పిండి, వాము, ఉప్పు, పసుపు, మిరప కారం వేసి కొద్దిగా నూనె వేసి బాగా కలపాలి ∙తగినన్ని నీళ్లు జత చేస్తూ జంతికల పిండిలా కలుపుకోవాలి ∙జంతికల గొట్టంలో రిబ్బన్ మురుకులు తయారుచేసే అచ్చు ఉంచాలి ∙జంతికల గొట్టంలో కొద్దిగా తడి చేయాలి ∙స్టౌ మీద బాణలిలో నూనె పోసి కాచాలి ∙జంతికల గొట్టంతో రిబ్బన్ మాదిరిగా వేసి దోరగా వేగాక పేపర్‌టవల్ మీదకు తీసుకోవాలి ∙బాణలిలో నూనెలో కొద్దిగా కరివేపాకు వేసి వేయించి తీసేయాలి ∙రిబ్బన్ మురుకులలో కలపాలి ∙బాగా చల్లారాక డబ్బాలో నిల్వ చేయాలి. మడత కాజా కావలసినవి: మైదా పిండి – ఒక కప్పు; పంచదార – ముప్పావు కప్పు; నెయ్యి – పావు కప్పు. తయారీ: ∙ఒక పాత్రలో మైదా పిండి, నెయ్యి, కొద్దిగా నీళ్లు వేసి గట్టిగా చపాతీ పిండిలా కలుపుకోవాలి ∙పిండి మరీ మెత్తగాను, మరీ గట్టిగాను కాకుండా ఉండాలి ∙గిన్నె మీద పల్చటి తడి వస్త్రం వేసి గంటసేపు వదిలేయాలి ∙ఆ తరవాత వస్త్రం తీసి చేతితో మరోమారు మెత్తగా కలపాలి ∙చపాతీలు ఒత్తే పీట మీద కొద్దిగా పొడి పిండి చల్లాలి ∙కలిపి ఉంచుకున్న మైదా పిండిని చపాతీ మాదిరిగా వీలైనంత పల్చగా ఒత్తాలి ∙ఒత్తిన చపాతీ మీద పొడి పిండి జల్లాలి ∙చపాతీని సన్నగా మడుచుకుంటూ రావాలి ∙అలా మొత్తం చపాతీని రోల్ చేయాలి ∙మధ్యమధ్యలో పొడి పిండి జల్లుతుండాలి ∙(అప్పుడే పొరలుపొరలుగా వస్తాయి కాజాలు) ∙అలా మొత్తం చపాతీని రోల్ చేశాక, చివరగా కొద్దిగా తడి చేసి మరోమారు రోల్ చేయాలి ∙చాకుతో కాజా ఆకారంలో ముక్కలుగా కట్ చేయాలి ∙ఒక పాత్రలో పంచదార, ఒక కప్పుడు నీళ్లు పోసి స్టౌ మీద ఉంచి, తీగ పాకం వచ్చేవరకు ఉడికించాలి ∙ఏలకుల పొడి జత చేసి కలియబెట్టి, దింపేయాలి ∙మరోపక్క స్టౌ మీద బాణలి ఉంచి వేడయ్యాక నూనె పోసి కాగనివ్వాలి ∙తయారుచేసి ఉంచుకున్న కాజాలను వేసి గోధుమ రంగులోకి వచ్చేవరకు వేయించి తీసేయాలి ∙తయారుచేసి ఉంచుకున్న పాకంలో వేసి సుమారు గంటసేపు మూత పెట్టి వదిలేయాలి ∙పాకం బాగా పీల్చుకుని కాజాలు తియ్యగా రుచిగా ఉంటాయి. మినప జంతికలు/ మురుకు కావలసినవి: మినప్పప్పు – 2 గ్లాసులు; బియ్యం – 6 గ్లాసులు; వెన్న – 2 టేబుల్ స్పూన్లు; మిరప కారం – ఒక టేబుల్ స్పూను; వాము – అర టేబుల్ స్పూను; నువ్వులు – ఒక టేబుల్ స్పూను; ఉప్పు – తగినంత; నువ్వుల నూనె – డీప్ ఫ్రైకి సరిపడా. తయారీ: ∙రెండిటినీ కలిపి మెత్తగా పిండి పట్టించాలి ∙2 టేబుల్ స్పూన్ల వెన్న జత చేయాలి ∙ఒక టేబుల్ స్పూను మిరప కారం, అర టేబుల్ స్పూను వాము, ఒక టేబుల్ స్పూను నువ్వులు, తగినంత ఉప్పు వేసి, కొద్దికొద్దిగా చల్ల నీళ్లు జత చేస్తూ, ఉండలుగా లేకుండా జంతికల పిండి కలుపుకోవాలి ∙జంతికల గొట్టం తీసుకుని లోపలి భాగాన్ని కొద్దిగా తడి చేయాలి ∙స్టౌ మీద బాణలి ఉంచి వేడయ్యాక నూనె పోసి కాచాలి ∙జంతికల గొట్టంలో తగినంత పిండి ఉంచాలి ∙కాగిన నూనెలో జంతికల మాదిరిగా చుట్టాలి ∙దోరగా వేగిన తరవాత చట్రం సహాయంతో పేపర్ టవల్ మీదకు తీసుకోవాలి ∙ఈ విధంగా అన్నీ తయారుచేసుకోవాలి ∙జంతికలు బాగా చల్లారాక డబ్బాలో నిల్వ చేసుకోవాలి. సజ్జప్పాలు కావలసినవి: మైదా పిండి – ఒక కప్పు; వేడి నూనె – అర కప్పు; ఉప్పు – చిటికెడు; నెయ్యి – పావు కప్పు; బొంబాయి రవ్వ. తయారీ: ∙ఒక పాత్రలో మైదా పిండి, వేడి నూనె, ఉప్పు, తగినన్ని నీళ్లు పోసి గట్టిగా చపాతీ పిండిలా కలుపుకోవాలి ∙గంటసేపు పక్కన ఉంచాలి ∙బాణలిలో నెయ్యి వేసి కరిగాక బొంబాయి రవ్వ వేసి వేయించాలి ∙అర కప్పు పంచదార, కప్పుడు నీళ్లు వేసి బాగా కలుపుతూ ఉడికించి దింపేయాలి ∙చల్లారాక చిన్న చిన్న ఉండలు చేసి పక్కన ఉంచాలి ∙మైదాపిండిని చిన్న సైజు పూరీలా ఒత్తి అందులో కొద్దిగా బొంబాయి రవ్వ ఉండను ఉంచి, అన్నివైపులా మూసేసి, ఉండలా చేయాలి ∙అరిటాకుకి కొద్దిగా నూనె పూసి ఈ ఉండలను చేతితో అరిసెల మాదిరిగా ఒత్తాలి ∙ఈ విధంగా అన్నీ తయారుచేసుకోవాలి ∙స్టౌ మీద బాణలిలో నూనె పోసి కాగాక, వీటిని అందులో వేసి దోరగా వేయించి, పేపర్ టవల్ మీదకు తీసుకోవాలి ∙చల్లారాక డబ్బాలో నిల్వ ఉంచాలి ∙ఇవి పది రోజులపాటు తాజాగా ఉంటాయి. -
హెల్త్‌టిప్స్
{బేక్‌ఫాస్ట్‌లో చపాతీ లేదా బ్రెడ్ మీద జామ్, జెల్లీలకు బదులు తేనె, దాల్చిన చెక్క పొడి మిశ్రమాన్ని రాసుకుని తింటే గుండె సంబంధ వ్యాధులు రావు. ఇది రక్తనాళాల్లో చేరిన కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. ఒకసారి గుండెపోటు వచ్చిన వాళ్లు కూడా దీన్ని పాటిస్తే రెండో స్ట్రోక్‌కు దూరంగా ఉంటారు. దాల్చిన చెక్క పొడి, తేనెల కాంబినేషన్ రక్తనాళాలను ఆరోగ్యవంతం చేసి, రక్తం గడ్డకట్టకుండా నిరోధిస్తుంది. ఒక మోతాదు తేనెలో రెండు మోతాదుల నీటినీ, ఒక స్పూను దాల్చిన చెక్క పొడినీ కలిపి ఆ మిశ్రమంతో కీళ్లనొప్పులున్న చోట మర్దన చేస్తే రెండు - మూడు నిమిషాలలోనే బాధ తగ్గుతుంది. -
ఇరాన్లో నరకం చూశాం
* చెడిపోయిన చపాతీలే ఆహారం * నిఠారుగా నిలువలేని సెల్లో దుర్భరం * నాగర్‌కోవిల్ జాలర్ల పరిస్థితి దయనీయం చెన్నై, సాక్షి ప్రతినిధి: ‘చెడిపోయిన చపాతీ, చంటిపిల్లల్లా ఒక ముద్ద అన్నం. నిఠారుగా నిల్చుకునేందుకు కూడా వీలులేని సెల్లో నరకం అనుభవించాం... బద్దశత్రువుకు కూడా ఇలాంటి బాధలు రాకూడదు’ అని తమిళనాడు జాలర్లు తల్లడిల్లిపోయారు. కన్యాకుమారి జిల్లా నాగర్‌కోవిల్ సమీపం కడియప్పట్టికి చెందిన అంతోనీరాజ్ (38), డేవిడ్(42), హిలారిడన్(51), ప్రభు(33) అనే నలుగురు మత్స్యకారులు చేపలుపట్టే వృత్తిపై 2015 జులైలో దుబాయ్‌కి వెళ్లారు. తమ దేశ సముద్రపు సరిహద్దుల్లో చేపలవేట సాగిస్తున్నారనే ఆరోపణలతో ఫిబ్రవరి 6 వ తేదీన ఇరాన్ ఈ నలుగురిని అరెస్ట్ చేసింది. నలుగురు జైలుపాలు కావడంతో కుటుంబ సభ్యులతో సంబంధాలు తెగిపోయాయి. బాధిత కుటుంబాల వారు కన్యాకుమారి జిల్లా కలెక్టరుకు వినతిపత్రం సమర్పించారు. నేషనల్ డొమెస్టిక్ వర్క్స్ మూమెంట్ అనే సంస్థకు సమాచారం చేరవేశారు. వారి ద్వారా ఇరాన్‌లోని భారత రాయబార కార్యాలయం చర్చలు జరిపి నలుగురిని విడుదల చేయించింది. ఈ నలుగురు జాలర్లు ఆదివారం దుబాయ్ నుంచి విమానం ద్వారా చెన్నైకి సురక్షితంగా చేరారు. వీరందరినీ తమిళనాడు పునరావాసశాఖ సహాయ కమిషనర్ రమేష్ పరామర్శించి వాం గ్మూలం నమోదు చేసుకున్నారు. ఆ తరువాత బస్సు టిక్కెట్లు కొనుగోలు చేసి నాగర్‌కోవిల్‌కు పంపారు. పునరావాస కమిషనర్‌కు ఇచ్చిన వాంగ్మూలంలో దయనీయమైన పరిస్థితులను వారు వివరించారు. నరకం చూపిన ఇరాన్ విదేశాలకు వెళ్తే అధికంగా సంపాదించవచ్చన్న ఆశతో తాము చేసిన ప్రయత్నం ప్రాణాల మీదకి తెచ్చిందని బాధితులు నలుగురు బావురుమన్నారు. బతికి ఉండగానే ఇరాన్ అధికారులు తమకు నరకం చూపారని వాపోయారు. దుబాయ్ సముద్రంలో ఫిబ్రవరి 6వ తేదీన తాము చేపలవేట సాగిస్తుండగా తమ హద్దుల్లోకి వచ్చారని ఆరోపిస్తూ ఇరాన్ సముద్ర తీర గస్తీదళాలు తమపై కాల్పులు జరిపాయని తెలిపారు. ఒక బుల్లెట్ తన వీపుపై గాయం చేయగా మరో బుల్లెట్ తనను రాచుకుంటూ వెళ్లిందని అంతోనీరాజ్ తెలిపాడు. తీవ్రంగా గాయపడిన తనను ఆసుపత్రిలో చేర్చకుండా నేరుగా అక్కడి జైల్లో పెట్టేశారని చెప్పాడు. తమ నలుగురిని ఒక గుహ వంటి సెల్లో పెట్టారని, ఆ సెల్లో నిఠారుగా నిల్చుకునేందుకు వీలుండే ఎత్తు ఉండదని తెలిపారు. నిరంతరం ఒంగోనే ఉండాలని వాపోయారు. సరైన ఆహారం కూడా పెట్టేవారు కాదన్నారు. ఉదయం పూట చిన్న పిల్లలకు పెట్టినట్లు ఒక ముద్ద అన్నం, రాత్రివేళల్లో చెడిపోయిన చపాతీ ఇచ్చేవారని తెలిపారు. పారవేయాల్సిన ఆహారం తింటూ ఇరాన్ రాక్షసుల నుంచి ప్రాణాలను కాపాడుకున్నామని తమిళనాడు జాలర్లు వాపోయారు. ఒక సెల్ నుంచి మరో సెల్‌కు తమను మార్చేపుడు కళ్లకు గంతలు కట్టి, చేతులు కట్టివేసి తీసుకెళ్లేవారని అన్నారు. గుడ్డలు మార్చుకునేందుకు కూడా వీలులేక మాసిన గుడ్డలతోనే చెరలో మగ్గిపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. అదే జైలు నుంచి విడుదలవుతున్న ఇతర ఖైదీలు దయతో ఇచ్చిన గుడ్డలు ధరించి కాలం వెళ్లదీశామని అన్నారు. ఇరాన్ జైలు నుంచి ఇక ఇళ్లకు వెళ్లే అవకాశం లేదని జీవితంపై ఆశలు వదులుకున్నామని, జీవచ్ఛవాలుగా కాలం వెళ్లదీశామని తెలిపారు. తమ కుటుంబ సభ్యులు, అధికారులు తీసుకున్న చర్యల వల్ల బతికి బైటపడ్డామని కన్నీళ్లు పెట్టుకున్నారు. తాము ప్రాణాలతో బైటపడటమే గొప్ప అదృష్టమని, ఇది తమకు పునర్జన్మని వారు పేర్కొన్నారు.