breaking news
Cable network
-
ఏఐ యుగం.. సముద్రంలో కేబుళ్లు కాపాడుకోవడమే కీలకం
న్యూఢిల్లీ: ఏఐ యుగంలో డిజిటల్ లక్ష్యాల సాధనకు సముద్ర అంతర్భాగంలో (సబ్ సీ) వేసే కేబుల్ నెట్వర్క్ కీలకమైందని టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ చైర్మన్ అనిల్ కుమార్ లాహోటి తెలిపారు. అయితే, ప్రకృతి విపత్తులు, భౌగోళిక–రాజకీయ ఉద్రిక్తతలు, డేటాకి డిమాండ్ మొదలైన వాటి వల్ల తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్న సబ్‌మెరైన్ కేబుల్ వ్యవస్థల భద్రతకు మరింత ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పారు.ఇందుకు సంబంధించిన సవాళ్లను పరిష్కరించేందుకు సాంకేతిక ఆవిష్కరణలు, నిర్వహణపరమైన సామర్థ్యాలను మెరుగుపర్చుకోవడం, విధానాలపరమైన చర్యల్లాంటి బహుముఖ వ్యూహం అవసరమని పేర్కొన్నారు. కేబుల్స్ వేసే మార్గాల ప్లానింగ్, రిస్కులు తక్కువగా ఉండే ప్రాంతాలను ఎంచుకోవడం, రియల్ టైమ్ మానిటరింగ్ సిస్టమ్‌లను వినియోగించడంలాంటి అంశాలతో నష్టాలను నివారించవచ్చని బ్రాడ్‌బ్యాండ్ ఇండియా ఫోరం నిర్వహించిన సదస్సులో పాల్గొన్న సందర్భంగా లాహోటి చెప్పారు.సబ్మెరీన్ కేబుల్ వ్యవస్థ భద్రతను బలోపేతం చేసేందుకు అంతర్జాతీయ సహకారం, పటిష్టమైన నియంత్రణ విధానాలు అవసరమన్నారు. సబ్ సీ కేబుల్, డిజిటల్ క్లౌడ్ మౌలిక సదుపాయాలు డిజిటల్ ప్రపంచానికి, ఏఐ యుగానికి కీలకమైన ఇన్‌ఫ్రాగా మారాయని చెప్పారు. ఈ నేపథ్యంలో క్లౌడ్ మౌలిక సదుపాయాలకు సంబంధించి పటిష్టమైన సైబర్ సెక్యూరిటీ చర్యలు, నిరంతరం పొంచి ఉన్న ముప్పులను పర్యవేక్షించడం కీలకమని ఆయన పేర్కొన్నారు. రికార్డు స్థాయిలో డేటా వినియోగం.. దేశీయంగా డిజిటల్ వినియోగం చాలా వేగంగా వృద్ధి చెందుతోందని, గత దశాబ్దకాలంలో బ్రాడ్‌బ్యాండ్ యూజర్ల సంఖ్య ఆరు రెట్లు ఎగిసిందని లాహోటి చెప్పారు. 2025 నవంబర్ నాటికి ఇది 100 కోట్ల మైలురాయిని అధిగమించిందని వివరించారు. కనెక్టివిటీ వల్ల డేటా వినియోగం రికార్డు స్థాయిలో పెరిగిందని, ప్రపంచంలోనే అత్యధికంగా మొబైల్ యూజర్లు నెలకు సగటున 27 జీబీ మేర వినియోగిస్తున్నారని పేర్కొన్నారు. ‘డేటా వినియోగం, డిజిటలీకరణ, ఏఐ వృద్ధి మొదలైన వాటి వల్ల గ్లోబల్ డేటా సెంటర్ల మౌలిక సదుపాయాలకు, సబ్‌మెరైన్ కేబుల్ వ్యవస్థలకు డిమాండ్ పెరుగుతోంది’ అని లాహోటి చెప్పారు. -
కేబుల్ నెట్‌వర్క్‌లో నీలిచిత్రాల ప్రసారం
నందికొట్కూరు: నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలోని ఓ ప్రైవేటు కేబుల్ నెట్‌వర్క్‌లో నీలిచిత్రాలు ప్రసారం కావడంతో ప్రజలు అవాక్కయ్యారు. నందికొట్కూరు పట్టణంలోని ఫిరోజ్ డిజిటల్ నెట్వర్క్ నుంచి పగిడ్యాల, జూపాడుబంగ్లా, నందికొట్కూరు టౌన్, మండలాల్లోని ప్రజలు డిష్ కనెక్షన్ పొందారు. కాగా మంగళవారం మధ్యాహ్నం ఇళ్లల్లో టీవీ చూస్తుండగా అకస్మాత్తుగా నీలిచిత్రాలు ప్రసారమైన విషయం నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. కొందరు వ్యక్తులు వెంటనే కేబుల్ నెట్వర్క్ యజమాని షబ్బీర్‌కు ఫోన్ చేసి విషయం చెప్పడంతో నిలిపివేశారు. నీలిచిత్రాలు ప్రసారం కావడంతో ఫిరోజ్ డిజిటల్ యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై పగిడ్యాల మండల కేంద్రానికి చెందిన ఉదయ్ కిరణ్‌రెడ్డితో పాటు మరి కొందరు కేబుల్ నెట్వర్క్ యాజమాని షబ్బీర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
సాక్షి కార్టూన్: 02-06-2022
ఈ రిమోట్‌తో ఎలాంటి ప్రోగ్రామ్ అయినా మార్చి మన ప్రోగ్రామ్ పెట్టుకోవచ్చు! -
‘కేబుల్ వార్’
అన్నాడీఎంకే, డీఎంకే మధ్య పరోక్షంగా సాగుతున్న కేబుల్‌వార్ మరోసారి తెరపైకి వచ్చింది. తమిళనాడు అరసు టీవీ ప్రసారాల్లో డిజిటల్ సౌకర్యానికి అనుమతి కోరుతూ ముఖ్యమంత్రి జయలలిత శుక్రవారం కేంద్రానికి లేఖ రాయడం ద్వారా డీఎంకేకు మరోసారి గురిపెట్టారు. చెన్నై, సాక్షి ప్రతినిధి: డీఎంకే అధినేత కరుణానిధి సోదరి కుమారుడైన దయానిధి మారన్ యూపీఏ 1 ప్రభుత్వంలో కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రిగా పనిచేసిన విషయం తెలిసిందే. కరుణ పెద్దకుమారుడు అళగిరి నేతృత్వంలోని సుమంగళి కేబుల్ నెట్వర్క్ విషయంలో మారన్ కుటుంబంతో విభేదాలు పొడసూపాయి. దీనికి ఆగ్రహించిన కరుణానిధి మారన్ సోదరుల నేతృత్వంలోని సన్‌టీవీ గ్రూపును దెబ్బతీయాలని భావించారు. ఇందులో భాగం గా అన్నా అరివాలయంలోని సన్‌టీవీ నెట్‌వర్క్‌ను బయటకు పంపివేసి పోటీగా కలైంజర్ టీవీని ప్రారంభించారు. అదేవిధంగా రాష్ట్రంలో తమిళనాడు అరసు టీవీ కార్పొరేషన్‌ను స్థాపిం చి తక్కువ చందాతో ఎక్కువ చానళ్లను ప్రసా రం చేసేలా పథకాన్ని రూపొందించారు. ఈ క్రమంలోనే కేబుల్ టీవీ ప్రసారాలకు డిజిటల్ సౌకర్యాన్ని కల్పించాలని 2008లో ట్రాయ్ నిర్ణయం తీసుకుంది. దీంతో తమిళనాడులో డిజిటల్ సేవలకనుగుణంగా సెట్‌టాప్ బాక్సు లు, ఇతర వస్తు సామగ్రికి అప్పటి కరుణ ప్రభుత్వం రూ.50 కోట్లు ఖర్చుచేసింది. ఈ లోగా ఇరువర్గాల మధ్య అవగాహన కుదరడంతో అరసు టీవీ పథకాన్ని ఉద్దేశపూర్వకంగా అటకెక్కించారు. 2011లో అధికారంలోకి వచ్చిన జయలలిత అరసు టీవీ పథకాన్ని అమలుపై దృష్టి సారించారు. డీఎంకే నేతృత్వంలోని ప్రైవే టు చానళ్ల ప్రవాహానికి అరసు టీవీతో అడ్డుకట్ట వేస్తూ సెప్టెంబరు 2న అరసు కేబుల్ టీవీ ప్రసారాలను ప్రారంభించారు. రాష్ట్రంలో కేబుల్ సేవ ల కోసం వినియోగదారుల ద్వారా రూ.150 నుంచి రూ.250 వరకు వసూలు చేస్తూ 30 నుంచి 70 చానళ్లను మాత్రమే ప్రసారం చేసేవారు. అరసు టీవీ రాష్ట్రంలోని అన్ని ప్రధాన నగరాల్లో రూ.70లకు 100 చానళ్లను అందజేస్తోంది. 24 వేల కేబుల్ టీవీ ఆపరేటర్ల ద్వారా 65 లక్షల చందాదారులు అరసు టీవీ సేవలను అందుకుంటున్నారు. తక్కువ ధరతో ప్రసారాలను అందజేస్తుండడంతో అరసు టీవీ ప్రజాభిమానం చూరగొంది. ట్రాయ్ నిర్ణయం ప్రకా రం అరసు టీవీకి డిజిటల్ ప్రసారం హక్కును కల్పించాల్సిందిగా 2012లో జయ కేంద్రానికి లేఖ రాశారు. రాష్ట్ర ఎంపీలు, మంత్రులు అప్పటి ప్రధానిని నేరుగా కలిసి విన్నవించారు. యూపీఏ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న డీఎంకే సహజంగానే అమ్మ ప్రయత్నాలకు అడ్డుతగిలింది. రాష్ట్రంలోని ఇతర ప్రైవేటు టీవీ కంపెనీలకు, ఆపరేటర్లకు డిజిటల్ ప్రసారాల అనుమతులు మంజూరు చేసిన కేంద్రం అరసు టీవీకి మొండిచేయి చూపింది. రాష్ట్రంలోని కొన్ని ప్రైవేటు టీవీలకు మేలు చేసేందుకే అర సు టీవీకి అనుమతి నిరాకరించారని భావిస్తున్నట్లు పరోక్షంగా కరుణ చానళ్లను ఉద్దేశించి సీఎం జయ అప్పట్లో వ్యాఖ్యానించారు. ఈ క్రమంలోనే 2014 ఎన్నికల్లో కేంద్రంలో యూపీ ఏ ప్రభుత్వం పతనమై ఎన్డీఏ ప్రభుత్వం రావ డం, రాష్ట్రంలో కరుణ నేతృత్వంలో ‘ఉదయ సూర్యుడు’ అస్తమించడంతో జయకు కలిసి వచ్చింది. అరసు టీవీకి డిజిటల్ ప్రసార సౌకర్యం కల్పించాలని కోరుతూ కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్‌కు లేఖ రాశారు. ఈ లేఖను అన్నాడీఎంకే ఎంపీలు శుక్రవారం స్వయంగా ఢిల్లీలో మంత్రిని కలిసి అమ్మ తరపున అందజేశారు. ఎన్డీఏ ప్రభుత్వంతో సఖ్యతగా మెలుగుతున్న జయలలిత డిజిటల్ ప్రసారాలు సాధిస్తారని ఆశించవచ్చు.


