breaking news
business firm
-
అడ్డంకులు అధిగమించి ముందడుగు
న్యూఢిల్లీ: ప్రపంచ వాణిజ్యం అంతరాయాలు లేకుండా కొనసాగాలంటే నౌకాయాన స్వేచ్ఛ, సురక్షిత సముద్ర మార్గాలు, నావికుల భద్రత అత్యవసరమని ప్రధాని మోదీ తేల్చిచెప్పారు. పెరుగుతున్న ఆర్థిక బలాన్ని భారీ పెట్టుబడులుగా, నూతన వ్యాపార సంబంధాలుగా మార్చుకోవాలని బ్రిక్స్ సభ్య దేశాలకు పిలుపునిచ్చారు. శుక్రవారం ఢిల్లీలో ‘బ్రిక్స్ బిజినెస్ ఫోరమ్’లో ఆయన ప్రసంగించారు. 10 ప్రధాన వాణిజ్య అవరోధాలను గుర్తించి తొలగించాలని చెప్పారు. ప్రతి సంవత్సరం 100 బ్రిక్స్ స్టార్టప్‌లను ఇతర సభ్య దేశాల మార్కెట్లలోకి విస్తరించాలని, అలాగే ఏటా 1,000 కొత్త వ్యాపార భాగస్వామ్యాలను నిర్మించాలని పేర్కొన్నారు. ఈ మూడు అంశాలపై మన పురోగతిని ప్రతి ఏటా సమీక్షించుకోవాలని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా వాణిజ్యపరమైన అడ్డంకులు పెరుగుతున్నాయని గుర్తుచేశారు. ఇలాంటి అడ్డంకులను అధిగమిస్తూ మన ఆర్థిక శక్తిని నూతన వ్యాపార అవకాశాలుగా మార్చుకోవాలని స్పష్టంచేశారు. నౌకాయాన స్వేచ్ఛకు, నావికుల భద్రతకు భారత్ మద్దతిస్తోందని తెలిపారు. బ్రిక్స్ సభ్య దేశాలు, భాగస్వామ్య దేశాలు ప్రస్తుతం ప్రపంచ జనాభాలో దాదాపు సగం, ప్రపంచ జీడీపీలో 40 శాతం మరియు ప్రపంచ వాణిజ్యంలో నాలుగో వంతు కంటే ఎక్కువ వాటాను కలిగి ఉన్నాయని మోదీ గుర్తుచేశారు. గత రెండు దశాబ్దాల్లో ప్రపంచ జీడీపీ సుమారు రెండున్నర రెట్లు వృద్ధి చెందగా, బ్రిక్స్ దేశాల ఉమ్మడి జీడీపీ మాత్రం నాలుగున్నర రెట్లు పెరిగిందని హర్షం వ్యక్తంచేశారు. ప్రపంచ తయారీ కేంద్రంగా భారత్ ప్రపంచ వ్యాపారాలకు భారతదేశం చేసే ప్రతిపాదనలో మౌలిక సదుపాయాలు, వ్యూహాత్మక సాంకేతికతలను ప్రధానాంశంగా మోదీ పేర్కొన్నారు. రోడ్లు, రైల్వేలు, ఓడరేవులు, విమానాశ్రయాల వేగవంతమైన విస్తరణతోపాటు నౌకా నిర్మాణం, సెమీకండక్టర్లు, క్వాంటమ్ టెక్నాలజీ, కీలక ఖనిజాలు, బయోటెక్నాలజీ రంగాల్లో నూతన సామర్థ్యాలను ప్రస్తావించారు. ‘మేక్ ఇన్ ఇండియా, ఇన్నోవేట్ విత్ ఇండియా, స్కేల్ ఫర్ వరల్డ్’అన్నారు. ప్రపంచ మార్కెట్లకు భారత్ ఒక తయారీ కేంద్రంగా, సాంకేతికత, ఆవిష్కరణల కేంద్రంగా మారిందని పేర్కొన్నారు. బ్రిక్స్ దేశాల మధ్య మరింత లోతైన సహకారం కోసం భారతదేశ డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలను ఒక వేదికగా ఉపయోగించుకోవాలని సూచించారు. బ్రిక్స్ దేశాలు తమ సొంత మార్కెట్లకు అనువైన డిజిటల్ పరిష్కారాలను అభివృద్ధి చేయడానికి భారతదేశ అనుభవాన్ని వాడుకోవచ్చని అన్నారు. ఇండియాలో 2 లక్షలకు పైగా స్టార్టప్‌లు, 120కి పైగా యూనికార్న్‌లు ఉన్నాయని గుర్తుచేశారు. ఇలాంటి ఆవిష్కరణలను ప్రపంచ మార్కెట్లకు తీసుకెళ్లడంలో బ్రిక్స్ సహాయపడాలని కోరారు. వాణిజ్య అనుసంధానం అనేది మరో ప్రధాన అంశమని చెప్పారు. 2014 నుంచి భారత్ దాదాపు 40 దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుందని వెల్లడించారు. వాణిజ్య అడ్డంకులను తగ్గించడం, వ్యాపార అవకాశాలను విస్తరించడంపై బ్రిక్స్ ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని ప్రధానమంత్రి చెప్పారు. -
క్రిమినల్ చర్యల నుంచి వ్యాపారాలకు ఊరట
చెన్నై: ప్రతీ సంస్థనూ అనుమానించే విధంగా చట్టాలు ఉండకూడదన్నదే తమ ప్రభుత్వ అభిమతమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. దీనికి అనుగుణంగానే కంపెనీల చట్టంలో వ్యాపార సంస్థలపై క్రిమినల్ చర్యలు సూచించే నిబంధనలన్నింటినీ సమీక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. 5 లక్షల కోట్ల డాలర్ల ఎకానమీగా ఎదగాలన్న లక్ష్యాన్ని సాధించే క్రమంలో ప్రభుత్వం, వ్యాపారవర్గాల మధ్య విశ్వసనీయత పెంపొందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. నానీ పాల్కీవాలా స్మారకోపన్యాసం కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ విషయాలు వివరించారు. నిజాయితీగా పన్ను చెల్లించేవారికి వేధింపులు ఉండరాదన్నారు. -
పేలనున్న ‘ఫైర్’ బాంబ్
పిఠాపురం, న్యూస్‌లైన్ : అగ్నిమాపక శాఖ ఎన్ఓసీ పేరుతో జిల్లా వ్యాపారులపై రూ.25 కోట్ల భారం పడనుంది. అగ్ని ప్రమాదాలు జరగకుండా ప్రతీ వ్యాపార సంస్థ ముందుజాగ్రత్తలు తీసుకోవాలని, లేకపోతే చర్యలు తప్పవని అగ్నిమాపక శాఖాధికారులు హెచ్చరించడం మినహా ఇప్పటివరకు పెద్దగా చర్యలు తీసుకున్న దాఖలాల్లేవు. అయితే ఇప్పటి నుంచి ప్రతీ వ్యాపార సంస్థకు ఫైర్ ఎన్ఓసీ తప్పక ఉండాలని, లేకపోతే ఆయా సంస్థల లెసైన్స్ రద్దు చేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. తద్వారా ఆదాయాన్ని పొందేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర అగ్నిమాపక శాఖ డెరైక్టర్ జనరల్ ఎస్వీ రమణమూర్తి ఆంధ్రప్రదేశ్ ఫైర్ సర్వీస్ యాక్ట్-1999 ప్రకారం ఓ సర్క్యులర్ విడుదల చేశారు. ఈ నేపథ్యంలో ఆ ప్రక్రియలో అగ్నిమాపక సిబ్బంది నిమగ్నమయ్యారు. ఇందులో భాగంగా ప్రతీ గ్రామంలోను కిళ్లీ షాపుల నుంచి బడా వ్యాపార సంస్థల వరకు అన్నింటి వివరాలు సేకరిస్తున్నారు. ఆయా వ్యాపార సంస్థల వాడుక స్థలం, వ్యాపార తీరు, వినియోగించే వస్తువులు తదితర వివరాల ఆధారంగా ఒక్కో వ్యాపార సంస్థకు రూ.500, రూ.1000, రూ.1500, రూ.2000, రూ.2500 నుంచి రూ.5 వేల వరకు చెల్లించి ఎన్ఓసీ పొందాల్సి ఉంటుంది. చిన్న కిళ్లీబడ్డీల నుంచి పెద్ద వ్యాపార సంస్థల వరకు 613 రకాల వ్యాపారాలు ఈ ఎన్ఓసీ పరిధిలోకి రానున్నాయి. వ్యాపార సంస్థల వివరాల సేకరణ జిల్లాలోని అన్ని వ్యాపార సంస్థల వివరాలు సేకరిస్తున్న ఫైర్ సిబ్బంది ఆ నివేదికను ప్రభుత్వానికి పంపడం పూర్తయ్యాక, దీనిపై చట్టం చేయడానికి రంగం సిద్ధం చేశారు. ఇప్పటికే వ్యాట్ వంటి పన్నులతో సతమతమవుతున్న వ్యాపారులపై ఈ అదనపు భారం తడిసిమోపుడు కానుంది. 15 మీటర్లకు మించి ఉండే అపార్ట్మెంట్లు, రెస్టారెంట్లు, స్కూల్స్, ట్రాన్స్‌పోర్టు గొడౌన్లు, ఎగ్జిబిషన్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు, బేకరీలు, వ్యాపార, వ్యాపార రహిత భవనాలకు ఎన్ఓసీ పొందాల్సి ఉంటుంది. త్వరలో జీఓ ఎన్ఓసీ లేకుండా వ్యాపారం కొనసాగించకుండా దాడులు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రతీ వ్యా పార సంస్థ తప్పనిసరిగా ఎన్ఓసీ తీసుకోవాల్సి ఉంది. ఇప్పటికే జిల్లాలో వ్యాపార సంస్థల వివరాలు సేకరించడం పూర్తి కావస్తున్న నేపథ్యంలో త్వరలో ప్రభుత్వం జీఓ జారీ చేయనుంది.


