breaking news
Bulletproof cars
-
బుల్లెట్ ఫ్రూఫ్ కారు.. అంతా సక్రమమే
నగరంపాలెం(గుంటూరు వెస్ట్): మాజీ సీఎం వైఎస్ జగన్ బుల్లెట్ ఫ్రూఫ్ కారును గుంటూరు రవాణాశాఖ అధికారులు (ఆర్టీవో) శుక్రవారం పరిశీలించారు. ఈ నెల 18న వైఎస్ జగన్ పల్నాడు జిల్లా సత్తెనపల్లి పర్యటన సందర్భంగా ఏటుకూరు రోడ్డు వద్ద జరిగిన ప్రమాదంలో వెంగళాయపాలెం వాసి సింగయ్య మృతి చెందిన విషయం విదితమే. తొలుత వైఎస్ జగన్ కాన్వాయ్కి ముందు వెళ్లిన వాహనం కింద పడి సింగయ్య మరణించాడని ఎస్పీ చెప్పారు. ఆ తర్వాత జగన్ వాహనం కింద పడినట్లు తప్పుడు కేసు పెట్టారు. ఈ నెల 24న తాడేపల్లిలోని మాజీ సీఎం వైఎస్ జగన్ ఇంటి నుంచి బుల్లెట్ ఫ్రూఫ్ కారు ఏపీ40డిహెచ్2349ను రవాణా శాఖ అధికారులు స్వా«దీనం చేసుకుని, నల్లపాడు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. రెండు రోజుల అనంతరం వాహనాన్ని గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలోని ఓ షెడ్లో ఉంచారు. ఎంవీఐ గంగాధర్‌ప్రసాద్ నేతృత్వంలో శుక్రవారం కారును విస్తృతంగా తనిఖీ చేశారు. అన్ని రికార్డులు సక్రమంగా ఉన్నాయని తనిఖీల్లో వెల్లడైంది. స్వయంగా ఎంవీఐ అధికారి బుల్లెట్‌ఫ్రూఫ్ కారును 20 నిమిషాలు (టెస్ట్ డ్రైవ్) నడిపి, ఎటువంటి లోపాల్లేవని గుర్తించారని తెలిసింది. బుల్లెట్ ఫ్రూఫ్ కారు వల్ల ఎటువంటి ఇబ్బందుల్లేవని ఆర్టీవో అధికారులు తేల్చి చెప్పారు. -
జగన్ కు ప్రాణహాని.. బుల్లెట్ ప్రూఫ్ కారు సీజ్.. తరువాత జరగబోయేది ఇదే!
-
YS జగన్ బుల్లెట్ ప్రూఫ్ వాహనం సీజ్ పై KS ప్రసాద్ ఫైర్
-
జగన్ బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని తీసుకెళ్తున్న పోలీసులు
-
ప్రజల వద్దకు వెళ్లకుండా.. జగన్‌ను అడ్డుకునే కుట్రే!
సాక్షి, అమరావతి: విశేష ప్రజాదరణతో సాగుతున్న వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటనలను అడ్డుకునేందుకు చంద్రబాబు సర్కారు కుతంత్రాలను కొనసాగిస్తోంది. కూటమి ప్రభుత్వం వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ ప్రజల్లో చైతన్యం రలిగిస్తున్న వైఎస్ జగన్‌ను అడ్డుకోవడమే ఏకైక లక్ష్యంగా బరి తెగించి వ్యవహరిస్తోంది. జడ్ ప్లస్ కేటగిరీ భద్రత కలిగిన మాజీ సీఎం జగన్ భద్రతా ఏర్పాట్ల పట్ల కుట్రపూరిత వైఖరిని అవలంబిస్తోంది. వైఎస్ జగన్‌కు చెందిన బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని ఏకపక్షంగా జప్తు చేయడం చంద్రబాబు సర్కారు పన్నాగంలో తాజా అంకం. తద్వారా వైఎస్ జగన్ భద్రతపై ఉద్దేశపూర్వకంగా ఏడాదిగా సాగిస్తున్న కుట్రలకు మరింత పదునుపెట్టింది. పాలనలో తన ఘోర వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించే డైవర్షన్ రాజకీయాల్లో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు తెర తీసిన తాజా పన్నాగం ఇదిగో ఇలా ఉంది...అక్రమ కేసు... ఏకపక్షంగా బుల్లెట్ ప్రూఫ్ వాహనం సీజ్ఇటీవల పల్నాడు జిల్లా రెంటపాళ్లలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటన ఉదంతాన్ని వక్రీకరిస్తూ టీడీపీ కూటమి సర్కారు కుట్రలను కొనసాగిస్తోంది. ఆ పర్యటనలో సింగయ్య అనే వ్యక్తి ఓ వాహనం ఢీకొనడంతో మృతి చెందారు. అధికారిక కాన్వాయ్‌లో లేని ఓ ప్రైవేట్ వాహనం (ఏపీ 26 సీఈ 0001 టాటా సఫారీ) ఢీకొనడంతో సింగయ్య మృతి చెందినట్లు తమ విచారణలో వెల్లడైందని స్వయంగా గుంటూరు జిల్లా ఎస్పీ సతీశ్ అధికారికంగా ప్రకటించారు. ఆ వాహనాన్ని పోలీసులు జప్తు చేసి పోలీస్ స్టేషన్‌కు కూడా తరలించారు. కానీ ఆ ఉదంతాన్ని వక్రీకరిస్తూ వైఎస్ జగన్‌పై అక్రమ కేసు నమోదుకు ప్రభుత్వ పెద్దలు కుట్ర పన్నారు. ప్రభుత్వ పెద్దల ఒత్తిడితో ఎస్పీ సతీశ్ మూడు రోజుల్లోనే మాట మార్చాల్సి వచ్చింది.వైఎస్ జగన్ ప్రయాణిస్తున్న వాహనం ఢీకొనే సింగయ్య మృతి చెందారని ఓ కథను తెరపైకి తెచ్చి అక్రమ కేసు నమోదు చేశారు. మూడు రోజుల్లోనే మాట మార్చి అక్రమ కేసు నమోదు చేయడం వెనుక కుట్ర కోణం తాజాగా బయటపడింది. వైఎస్ జగన్ ప్రయాణించిన బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని గుంటూరు పోలీసులు మంగళవారం జప్తు చేసి తరలించుకుపోవడంతో ప్రభుత్వ పన్నాగం స్పష్టమైంది. అంటే వైఎస్ జగన్ ప్రయాణించేందుకు పటిష్ట భద్రతా ప్రమాణాలతో ఉన్న బుల్లెట్ ప్రూఫ్ వాహనం అందుబాటులో లేకుండా చేయడమే లక్ష్యమన్నది తేటతెల్లమైంది. ఎందుకంటే ఇదే కేసులో ఇప్పటికే ఓ ప్రైవేటు వాహనాన్ని (ఏపీ 26 సీఈ 0001 టాటా సఫారీ) పోలీసులు జప్తు చేశారు. అదే కేసులో మళ్లీ వైఎస్ జగన్ బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని తాజాగా జప్తు చేయడం గమనార్హం. తద్వారా బుల్లెట్ ప్రూఫ్ వాహనం అందుబాటులో లేకుండా చేయడమే ప్రభుత్వ పెద్దల లక్ష్యమన్నది స్పష్టమైంది. జగన్ భద్రతపై బాబు కుట్రలు..వైఎస్ జగన్ ప్రజల్లోకి వెళ్లకుండా అడ్డుకోవాలన్నదే చంద్రబాబు ప్రభుత్వ కుట్ర. అందుకోసం ఏడాదిగా కుతంత్రాలు పన్నుతూనే ఉంది. ఏడాదిగా వైఎస్ జగన్ పర్యటనల్లో భద్రతా ఏర్పాట్లపై ఉద్దేశపూర్వకంగానే నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తోంది. మాజీ సీఎంహోదాలో ఆయన పర్యటనలకు పూర్తి భద్రతా ప్రమాణాలతో ఉన్న బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని సమకూర్చాలి. కానీ పాతబడిన ఓ డొక్కు వాహనాన్ని ప్రభుత్వం ఇచ్చింది. ఆ వాహనం మొరాయిస్తుండటంతో తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి. దాంతో ఓ పర్యటనలో ప్రభుత్వం సమకూర్చిన డొక్కు వాహనం నుంచి దిగి మరో ప్రైవేటు వాహనంలో వైఎస్ జగన్ పర్యటించారు.బుల్లెట్ ప్రూఫ్ కాని వాహనంలో ఆయన ప్రయాణించాల్సి రావడంతో వైఎస్సార్సీపీ నేతలు తీవ్ర ఆందోళ చెందారు. ఎందుకంటే వైఎస్ జగన్ పర్యటనలకు విఘాతం కలిగించేందుకు టీడీపీ గూండాలు ఎటువంటి దుస్సాహసానికైనా తెగించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు అనుమతితో పార్టీనే ఓ కొత్త బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని కొనుగోలు చేసింది. ఆ వాహనంలోనే ప్రస్తుతం వైఎస్ జగన్ జిల్లాల్లో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ వాహనాన్ని ఆయనకు అందుబాటులో లేకుండా చేయాలని ప్రభుత్వం కుట్ర పన్నింది. అందుకే సింగయ్య మృతి ఉదంతాన్ని వక్రీకరిస్తూ అక్రమ కేసు నమోదు చేసి వైఎస్ జగన్ బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని జప్తు చేసింది. ప్రజల వద్దకు వెళ్లకుండా అడ్డుకునే కుట్రే...వైఎస్ జగన్ పట్ల వెల్లువెత్తుతున్న విశేష ప్రజాదరణను తట్టుకోలేకే చంద్రబాబు ప్రభుత్వం ఈ కుతంత్రాలు పన్నుతోంది. ఆయన ఎంత విస్తృతంగా పర్యటిస్తే... తమ ప్రభుత్వ వైఫల్యాలు అంతగా వెలుగులోకి వస్తాయన్నది టీడీపీ పెద్దల భయం! జగన్ పర్యటనలకు దారి పొడవునా వేలాది మంది జనం తరలి వస్తుండటం ప్రభుత్వ పెద్దలను కలవరపరుస్తోంది. ఆ అక్కసుతోనే వైఎస్ జగన్‌ను భూస్థాపితం చేస్తానని సీఎం చంద్రబాబు ఇటీవల మీడియా చానెళ్ల ఇంటర్వ్యూల్లో ప్రకటించడం గమనార్హం. మరోవైపు వైఎస్ జగన్ పర్యటనల్లో ఉద్దేశపూర్వకంగా భద్రతా ఏర్పాట్లలో వైఫల్యాలను గమనిస్తుంటే చంద్రబాబు తన వ్యాఖ్యలను చేతల్లో చూపిస్తున్నారన్నది స్పష్టమవుతోంది. ఈ క్రమంలోనే వైఎస్ జగన్ బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని అక్రమంగా జప్తు చేశారు. కేసు దర్యాప్తు పేరిట ఆ వాహనాన్ని సుదీర్ఘ కాలం జప్తులో ఉంచాలన్నది పన్నాగం.మరోవైపు టీడీపీ ప్రభుత్వం ఎలాగూ పూర్తి కండిషన్లో ఉన్న బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని సమకూర్చదు. తద్వారా వైఎస్ జగన్ జిల్లా పర్యటనలను అడ్డుకోవాలన్నదే ప్రభుత్వ కుతంత్రమన్నది స్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు సర్కారు కుట్రలకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ న్యాయ పోరాటానికి సన్నద్ధమవుతోంది. వైఎస్ జగన్ భద్రత పట్ల ప్రభుత్వం కుట్రపూరితంగా నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తోందని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లనుంది. సింగయ్య మృతి ఉదంతాన్ని వక్రీకరిస్తూ నమోదు చేసిన అక్రమ కేసుపైనా న్యాయ పోరాటం చేయనుంది. వైఎస్ జగన్ భద్రత పట్ల ప్రభుత్వ కుతంత్రాలపై అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. రాజకీయాలకు అతీతంగా మాజీ ముఖ్యమంత్రికి పటిష్ట భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని గుర్తు చేస్తున్నారు. 40 ఏళ్ల సీనియర్‌నని తరచూ చెప్పుకునే చంద్రబాబు పూర్తి దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని మండిపడుతున్నారు.బయటపడిన భద్రతా వైఫల్యాలుజడ్ ప్లస్ కేటగిరీ భద్రత కలిగిన మాజీ సీఎం వైఎస్ జగన్ భద్రత పట్ల ప్రభుత్వం కుట్రపూరిత వైఖరి ప్రదర్శిస్తోంది. ఆయన జిల్లాల పర్యటనలో ప్రభుత్వం, పోలీసులు ఉద్దేశపూర్వకంగా తగిన భద్రతా ఏర్పాట్లు చేయడం లేదు. జిల్లా పర్యటనలపై ముందుగా పోలీసులకు సమాచారం ఇచ్చినా సరే కనీస స్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేయడం లేదు. గతంలో అనంతపురం, పల్నాడు, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో పర్యటనల్లో అడుగడుగునా భద్రతా వైఫల్యాలు బయటపడ్డాయి. అయినా ప్రభుత్వ తీరు ఏమాత్రం మారడం లేదు. తాజాగా పల్నాడు జిల్లా సత్తెనపల్లి పర్యటనలోనూ భద్రతా వైఫల్యం బయటపడింది. వైఎస్ జగన్ వాహనం ముందు ఎస్కార్టు వాహనాలు ఏర్పాటు చేయలేదు. ఆయన వాహనానికి ఇరువైపులా రోప్ పార్టీ పోలీసులు లేరు. దాంతో వైఎస్సార్సీపీ అభిమానులే కాదు... ఆ ముసుగులో గుర్తుతెలియని వ్యక్తులు, ఆగంతకులు వైఎస్ జగన్ వాహనంపైకి చొచ్చుకొచ్చారు.ఓ యువకుడు ఏకంగా వాహనం బానెట్‌పైకి ఎక్కి మరీ హల్చల్ చేశాడు. జడ్ ప్లస్ భద్రత ఉన్న ఓ మాజీ సీఎం వాహనం బానెట్‌పైకి యువకుడు ఎక్కినా కూడా పోలీసులు పట్టించుకోకపోవడం విస్మయం కలిగించింది. అదేదో కాకతాళీయంగా జరిగింది కాదు.. పోలీసులు ఉద్దేశపూర్వకంగానే వైఎస్ జగన్ భద్రత పట్ల నిర్లక్ష్యంగా ఉన్నారన్నది సుస్పష్టం. జగన్ జిల్లాల పర్యటనలకు వెళ్లినప్పుడు ఆయన హెలికాఫ్టర్ ల్యాండ్ అయ్యే హెలీప్యాడ్ వద్ద కనీస భద్రతా ఏర్పాట్లు చేయడం లేదు. తద్వారా భారీ సంఖ్యలో అభిమానులతోపాటు ఆ ముసుగులో విద్రోహ శక్తులు హెలికాఫ్టర్ వద్దకు చొచ్చుకుని వచ్చేందుకు అవకాశం కల్పిస్తున్నారు. ఇటీవల అనంతపురం పర్యటనలో ఇటువంటి పరిస్థితే తలెత్తి హెలికాఫ్టర్‌కు సాంకేతిక సమస్య ఎదురైంది. దాంతో జగన్ అనంతపురం జిల్లా నుంచి బెంగళూరుకు హెలికాఫ్టర్‌లో కాకుండా రోడ్డు మార్గంలో వెళ్లాల్సి వచ్చింది. -
ప్రాణభయం.. బుల్లెట్ ప్రూఫ్ కారు కొన్న సల్మాన్ ఖాన్
మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిఖీని నడిరోడ్డుపై దుండగులు కాల్చి చంపడం కొన్నిరోజుల క్రితం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్‌కి ఇతడు ఆప్తుడు కావడం వల్లే.. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సిద్దిఖీని చంపేశారనే టాక్ వినిపించింది. రెండు రోజుల క్రితం సల్మాన్‌ని చంపేస్తామని ముంబై ట్రాఫిక్ పోలీసులకు వాట్సాప్ మెసేజ్ రావడం కలకలం రేపిందని చెప్పొచ్చు. ఇలా వరస సంఘటన కారణంగా సల్మాన్‌లో ప్రాణభయం మరింత పెరిగింది. ఈ క్రమంలోనే కొత్త కారు కొన్నారట.(ఇదీ చదవండి: ఓటీటీలోకి కార్తీ ఫీల్ గుడ్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?)1999లో కృష్ణ జింకలు వేటాడిన కేసులో సల్మాన్‌పై అప్పట్లో విమర్శలు వచ్చాయి. ఈ విషయాన్ని చాలామంది మర్చిపోయారు కానీ బిష్ణోయ్ తెగకు చెందిన లారెన్స్ అనే కుర్రాడు మాత్రం మర్చిపోలేదు. ఎప్పటికప్పుడు సల్మాన్‌ని చంపేందుకు కుట్ర పన్నుతూనే ఉన్నాడు. గత రెండేళ్లలోనూ ఆ ప్రయత్నాలు చేశారు. బాబా సిద్దిఖీ మర్డర్, రూ.5 కోట్లు ఇవ్వకపోతే చంపేస్తామని తాజాగా బెదిరింపు మెసేజ్.. ఇలా బోలెడన్ని కారణాల వల్ల సల్మాన్ అప్రమత్తమయ్యాడు.సుమారు రూ.2 కోట్ల విలువైన బుల్లెట్ ప్రూఫ్ కారును దుబాయ్ నుంచి ఆయన దిగుమతి చేసుకోనున్నాడట. త్వరలోనే ఇది సల్మాన్ గ్యారేజ్‌లో చేరనుందని బాలీవుడ్లో వార్తలు వస్తున్నాయి. ఆయన ఎంపిక చేసుకున్న ఆ మోడల్ కారు మన దేశంలో దొరకదని సమాచారం. అందుకే అక్కడి నుంచి ఇక్కడికి తెప్పించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రూ.6 కోట్ల విలువైన మరో బుల్లెట్ ప్రూఫ్ కారు సల్మాన్ దగ్గరుంది. కానీ లేటెస్ట్ మోడల్లో ఎక్కువ ఫీచర్స్ ఉండటంతో ఈ కొత్త కారును కొనుగోలు చేశాడని సమాచారం.ఈ కారులో ఎవరున్నారనేది బయట నుంచి చూస్తే కనిపించదు. అలానే ఎలాంటి బులెట్‌ని అయినా సరే ఈ కారుకి ఉన్న గ్లాస్ అడ్డుకుంటుంది. ఈ కారుకు సంబంధించిన మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది.(ఇదీ చదవండి: అరెస్ట్ న్యూస్.. వీడియో రిలీజ్ చేసిన బిగ్ బాస్ శేఖర్ భాషా) -
ఒబామా నడిచొస్తే..!
వాషింగ్టన్: ఒబామా.. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన నేతల్లో ఒకరు.. అగ్రరాజ్యం అమెరికాకు అధ్యక్షుడు... చుట్టూ అంగరక్షకులతో.. బుల్లెట్‌ప్రూఫ్ కారులో ప్రయాణించే ఆయన తన కార్యాలయం వైట్‌హౌజ్‌కు ఒక సామాన్యుడిలా నడిచి వచ్చి ప్రత్యేకతను చాటుకున్నాడు. ప్రొటోకాల్‌ను కాదనుకొని సమీపంలోని యూ.ఎస్. డిపార్ట్మెంట్ ఆఫ్ ది ఇంటీరియర్ నుంచి వైట్‌హౌజ్‌కు నడుచుకుంటూ వెళ్లారు. మార్గం మధ్యలో తారసపడిన యాత్రికులు, పిల్లలు, దుకాణదారులను పలకరించారు. ఓ మహిళ అయితే ఇదంతా చూసి షాక్‌కు గురైంది. ఇది నిజమేనా అంటూ ఒబామానే ప్రశ్నించింది. మరికొందరు అధ్యక్షుడితో కలసి ఫొటోలు కూడా దిగారు.