breaking news
Buchi Babu Invitation Cricket Tournament
-
Buchi Babu Trophy: హైదరాబాద్ హ్యాట్రిక్ విజయం.. టేబుల్ టాపర్‌గా
చెన్నై: బ్యాటర్లు విజృంభించడంతో బుచ్చిబాబు ఇన్విటేషన్ క్రికెట్ టోర్నమెంట్లో హైదరాబాద్ జట్టు మూడో విజయం ఖాతాలో వేసుకుంది. గ్రూప్ ‘డి’లో భాగంగా జరిగిన పోరులో హైదరాబాద్ జట్టు ఇన్నింగ్స్ 59 పరుగుల తేడాతో మధ్యప్రదేశ్‌ను చిత్తుచేసింది. దీంతో గ్రూప్ దశలో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ గెలిచిన హైదరాబాద్ 19 పాయింట్లతో పట్టిక అగ్రస్థానంలో నిలిచింది. తన్మయ్, వరుణ్ సెంచరీలుమధ్యప్రదేశ్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 181 పరుగులకే ఆలౌట్ కాగా... హైదరాబాద్ 87 ఓవర్లలో 414/7 వద్ద తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. తన్మయ్ అగర్వాల్ (162 బంతుల్లో 130; 18 ఫోర్లు, 2 సిక్స్‌లు), వరుణ్ గౌడ్ (110 బంతుల్లో 100 నాటౌట్; 5 ఫోర్లు) సెంచరీలతో కదంతొక్కారు. కెప్టెన్ రాహుల్ సింగ్ (100 బంతుల్లో 59; 5 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్‌సెంచరీతో ఆకట్టుకున్నాడు. మధ్యప్రదేశ్ బౌలర్లలో రోహిత్ రజావత్ 3... అన్వేశ్, విష్ణు చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం మధ్యప్రదేశ్ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 45 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 174 పరుగులు చేసింది. సక్షమ్ పురోహిత్ (121 బంతుల్లో 78; 4 ఫోర్లు), ఆర్యన్ తివారి (91 బంతుల్లో 65; 6 ఫోర్లు) అర్ధశతకాలు చేశారు. హైదరాబాద్ బౌలర్లలో అనికేత్ రెడ్డి, వరుణ్ గౌడ్ చెరో వికెట్ పడగొట్టారు. ఇదీ చదవండి: హైదరాబాద్‌లో ప్రైమ్ వాలీబాల్ లీగ్సాక్షి, హైదరాబాద్: ప్రైమ్ వాలీబాల్ లీగ్ (పీవీఎల్) నాలుగో సీజన్ పోటీలకు రంగం సిద్ధమైంది. నగరంలోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో అక్టోబర్ 2 నుంచి ఈ టోర్నమెంట్ జరుగుతుంది. టోర్నీ సెమీఫైనల్స్, ఫైనల్ సహా మొత్తం 38 మ్యాచ్‌లను ఇక్కడే నిర్వహిస్తారు. పీవీఎల్ మ్యాచ్‌లకు సంబంధించిన పోస్టర్‌ను గురువారం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... నగరంలో క్రీడలపై అభిమానులకు చాలా ఆసక్తి ఉందని, ఇదే క్రమంలో వాలీబాల్ లీగ్ కూడా పెద్ద స్థాయిలో విజయవంతం కావాలని కోరుకుంటున్నట్లు సీఎం చెప్పారు. టోర్నీ సమర్థ నిర్వహణకు తమ వంతుగా రాష్ట్ర ప్రభుత్వం కూడా సహకరిస్తుందని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో క్రీడా మంత్రి వాకిటి శ్రీహరి, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ చైర్మన్ శివసేనా రెడ్డి, ఎండీ సోనీబాలాదేవి, ప్రభుత్వ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్‌తో పాటు లీగ్‌లో పాల్గొంటున్న హైదరాబాద్ హాక్స్ జట్టు యజమాని కంకణాల అభిషేక్ రెడ్డి పాల్గొన్నారు. -
శతక్కొట్టిన పృథ్వీ షా.. నాకు ఎవరి సానుభూతి అక్కర్లేదంటూ..
టీమిండియా ఆటగాడు పృథ్వీ షా (Prithvi Shaw) కాంపిటేటివ్ క్రికెట్ పునరాగమనంలో అదరగొట్టాడు. చెన్నై వేదికగా బుచ్చిబాబు ఇన్విటేషనల్ టోర్నమెంట్ అరంగేట్ర పోరులో సెంచరీ (141 బంతుల్లో 111; 15 ఫోర్లు, 1 సిక్స్)తో రాణించాడు. ఈ సందర్భంగా పృథ్వీ షా చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. కాగా 2021లో టీమిండియా తరఫున చివరిగా ఆడిన ఈ ముంబై బ్యాటర్.. గత కొన్నాళ్లుగా గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నాడు.వేటు వేసిన ముంబై సెలక్టర్లుక్రమశిక్షణా రాహిత్యం, ఫిట్నెస్ లేమి, అధిక బరువు తదితర కారణాల వల్ల దేశవాళీ క్రికెట్‌కూ పృథ్వీ దూరమయ్యాడు. ముంబై సెలక్టర్లు కీలక మ్యాచ్‌ల నుంచి అతడిని తప్పించడంతో పృథ్వీ కెరీర్ ప్రశ్నార్థకంగా మారింది. మరోవైపు.. ఐపీఎల్ మెగా వేలం-2025లో కూడా అతడు అమ్ముడుపోకుండా మిగిలిపోయాడు. ఒకప్పుడు సచిన్ టెండుల్కర్‌కు సరైన వారసుడిగా కీర్తించబడిన పృథ్వీ కెరీర్.. అంతే వేగంగా పతనమైంది.ఆదరించిన మహారాష్ట్ర ఈ నేపథ్యంలో దేశీ క్రికెట్లో ముంబై నుంచి మహారాష్ట్ర (Maharashtra) జట్టుకు మారిన పృథ్వీ షా.. కొత్త ప్రయాణంలో శుభారంభం అందుకున్నాడు. బుచ్చిబాబు రెడ్ బాల్ ఈ టోర్నీలో మహారాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న పృథ్వీ షా... ఛత్తీస్‌గఢ్‌తో మ్యాచ్‌లో ‘శత’క్కొట్టాడు. ఛత్తీస్‌గఢ్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 89.3 ఓవర్లలో 252 పరుగులకు ఆలౌట్ కాగా... అనంతరం మహారాష్ట్ర జట్టు 73 ఓవర్లలో 217 పరుగులు చేసింది.ఇన్నింగ్స్ ప్రారంభించిన పృథ్వీ షా సెంచరీతో ఒంటరి పోరాటం చేయగా... అతడికి సహచరుల నుంచి తోడ్పాటు లభించలేదు. రుతురాజ్ గైక్వాడ్ (1) విఫలమయ్యాడు. వికెట్ కీపర్ సౌరభ్ (50 నాటౌట్; 5 ఫోర్లు) అండతో పృథ్వీ షా జట్టుకు మెరుగైన స్కోరు అందించాడు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన చత్తీస్‌గఢ్ ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 43 పరుగులు చేసింది.నాకు ఎవరి సానుభూతి అక్కర్లేదుఇక సెంచరీ చేసిన అనంతరం పృథ్వీ షా తన మనసులోని ఆవేదనను పంచుకున్నాడు. ‘‘నేను బాగున్నాను. నిజంగానే బాగున్నా. నాకు ఎవరి సానుభూతి అక్కర్లేదు. మరేం పర్లేదు. ఇంతకు ముందు కూడా నాకు ఇలాగే జరిగింది.ఎవరూ లేకపోయినా.. నా కుటుంబం నాకు మద్దతుగా ఉంది. మానసికంగా నేను కుంగిపోయినపుడు నా స్నేహితులు నాతోనే ఉన్నారు. అయితే, మరికొందరు మాత్రం తమ తమ పనులతో బిజీ అయిపోయారు. వాళ్లకు కూడా కుటుంబాలు ఉంటాయి కదా!.. ఎవరి పని వాళ్లది.నాకు ఆత్మవిశ్వాసం ఎక్కువనాకు సాయంగా రాలేదని వారిని నేను తప్పుబట్టను. ఏం చేసినా ఒంటరిగానే చేయాలి.. నన్ను నేను నిరూపించుకోవాలి అని గట్టిగా అనుకున్నాను. నిజానికి నాకు అదే మంచిది కూడా!జీవితంలో ఇప్పటికే ఎన్నో ఎత్తుపళ్లాలు చూశాను. ఒకసారి ఉన్నత శిఖరాలు.. మరోసారి అధఃపాతాళం. అయినా నేను తిరిగి పుంజుకున్నాను. కాబట్టి అసాధ్యమనేది ఏదీ ఉండదని నమ్ముతాను.నాకు ఆత్మవిశ్వాసం ఎక్కువ. పనిపట్ల అంకిత భావం ఉంది. ఈ సీజన్లో నేను, నా జట్టు గొప్పగా రాణిస్తుందనే నమ్మకంతో ఉన్నా’’ అంటూ పృథ్వీ షా తన విమర్శకులకు కౌంటర్ ఇస్తూనే.. సానుకూల దృక్పథంతో ముందుకు సాగుతానని పేర్కొన్నాడు.చదవండి: అప్పుడు గిల్ లేడు కాబట్టే సంజూ ఓపెనర్.. కానీ ఇప్పుడు: అగార్కర్ -
కెప్టెన్‌గా ఆయుశ్ మాత్రే.. జట్టులో సర్ఫరాజ్ ఖాన్, ముషీర్ ఖాన్
భారత యువ క్రికెటర్ ఆయుశ్ మాత్రే (Ayush Mhatre) మరో జట్టుకు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. బుచ్చిబాబు ఇన్విటేషనల్ టోర్నమెంట్లో ముంబై జట్టుకు అతడు నాయకుడిగా వ్యవహరించనున్నాడు. ఈ టోర్నీకి సంబంధించి 17 మంది సభ్యులతో కూడిన జట్టును ముంబై మంగళవారం ప్రకటించింది.జట్టులో సర్ఫరాజ్ ఖాన్ఈ జట్టులో టీమిండియా క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ (Sarfraz Khan)తో పాటు అతడి తమ్ముడు ముషీర్ ఖాన్ (Musheer Khan)వంటి స్టార్లు ఉండటం విశేషం. ఇక ఈ రెడ్‌బాల్ టోర్నీలో ఆయుశ్ మాత్రే డిప్యూటీగా సువేద్ పార్కర్ ఎంపికయ్యాడు.ఐపీఎల్లో అదరగొట్టి.. భారత జట్టు కెప్టెన్‌గా సత్తా చాటికాగా తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుచ్చిబాబు ఇన్విటేషనల్ టోర్నీ నిర్వహిస్తున్నారు. దేశీ ఫస్ట్‌క్లాస్ క్రికెట్ సీజన్ ఈ టోర్నీతోనే ఆరంభం కానుంది. ఇదిలా ఉంటే.. ముంబైకి చెందిన 18 ఏళ్ల ఆయుశ్ మాత్రే ఐపీఎల్-2025లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK)కు ప్రాతినిథ్యం వహించాడు. అరంగేట్రంలోనే ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో మాత్రే 15 బంతుల్లో 32 పరుగులతో ఆకట్టుకున్నాడు.ఈ సీజన్లో ఏడు మ్యాచ్‌లు ఆడిన ఈ ఓపెనింగ్ బ్యాటర్ మొత్తంగా 240 పరుగులు సాధించాడు. ఇందులో ఓ అర్ధ శతకం ఉంది. ఆయుశ్ మాత్రే అత్యుత్తమ స్కోరు 94 కావడం విశేషం. రాజస్తాన్ రాయల్స్ చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీతో కలిసి ఆయుశ్ మాత్రే కూడా ఐపీఎల్-2025లో హైలైట్‌గా నిలిచాడు.రెండు సెంచరీలు బాదిన ఆయుశ్ఇదిలా ఉంటే.. ఇటీవల ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లిన భారత అండర్-19 క్రికెట్ జట్టుకు ఆయుశ్ మాత్రే కెప్టెన్‌గా వ్యవహరించాడు. అతడి సారథ్యంలోని భారత యువ జట్టు ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల యూత్ వన్డే సిరీస్‌ను 3-2తో గెలిచింది. ఇక ఇంగ్లండ్ లయన్స్‌తో అనధికారిక టెస్టు సిరీస్‌లో రెండు సెంచరీలు బాది.. బ్యాటర్‌గానూ సత్తా చాటాడు ఆయుశ్ మాత్రే. ఈ క్రమంలో తదుపరి ఆస్ట్రేలియాలో పర్యటించే భారత అండర్-19 జట్టుకు ఆయుశ్ మాత్రే మరోసారి సారథిగా ఎంపికయ్యాడు.తాజాగా ముంబై జట్టుకు కూడా ఆయుశ్ మాత్రే కెప్టెన్‌గా వ్యవహరించేందుకు సిద్ధం కావడం విశేషం. కాగా ఆగష్టు 18 నుంచి బుచ్చిబాబు ఇన్విటేషనల్ టోర్నమెంట్లో ముంబై తమ ప్రయాణం మొదలుపెట్టనుంది.బుచ్చిబాబు ఇన్విటేషనల్ టోర్నమెంట్‌కు ముంబై జట్టు ఇదేఆయుశ్ మాత్రే (కెప్టెన్), ముషీర్ ఖాన్, దివ్యాంష్ సక్సేనా, సర్ఫరాజ్ ఖాన్, సువేద్ పార్కర్ (వైస్ కెప్టెన్), ప్రజ్ఞేష్ కాన్పిల్లెవార్, హర్ష్ అఘవ్, సాయిరాజ్ పాటిల్, ఆకాష్ పార్కర్, ఆకాష్ ఆనంద్ (వికెట్ కీపర్), హార్దిక్ తామోర్ (వికెట్ కీపర్), శ్రేయాస్ గురవ్, యష్ డిచొల్కర్, హిమాన్షు సింగ్, రాయ్స్టన్ డయాస్, సిల్వెస్టర్ డిసౌజా, ఇర్ఫాన్ ఉమైర్.వెస్ట్ జోన్ జట్టులోనూ సర్ఫరాజ్ ఖాన్ఇక బుచ్చిబాబు ఇన్విటేషనల్ టోర్నీలో ఆడనున్న సర్ఫరాజ్ ఖాన్ తదుపరి దులిప్ ట్రోఫీలోనూ భాగం కానున్నాడు. శార్దూల్ ఠాకూర్ కెప్టెన్సీలో యశస్వి జైస్వాల్, శ్రేయస్ అయ్యర్, రుతురాజ్ గైక్వాడ్ వంటి టీమిండియా స్టార్లతో కలిసి వెస్ట్ జోన్‌కు సర్ఫరాజ్ ఖాన్ ప్రాతినిథ్యం వహించనున్నాడు.దులిప్ ట్రోఫీ-2025లో వెస్ట్ జోన్ జట్టుశార్దూల్ ఠాకూర్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, ఆర్య దేశాయ్, హార్విక్ దేశాయ్ (వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్, సర్ఫరాజ్ ఖాన్, రుతురాజ్ గైక్వాడ్, జయమీత్ పటేల్, మనన్ హింగ్రాజియా, సౌరభ్ నవలే (వికెట్ కీపర్), షమ్స్ ములానీ, తనూశ్ కొటియాన్, ధర్మేంద్ర జడేజా, తుషార్ దేశ్‌పాండే, అర్జాన్ నగ్వాస్వాలా.చదవండి: AUS vs SA: బేబీ ఏబీడీ విధ్వంసకర శతకం.. తొలి ‘ఫాస్టెస్ట్ సెంచరీ’తో.. -
బుచ్చిబాబు టోర్నీ ఫైనల్: పటిష్ట స్థితిలో హైదరాబాద్
చెన్నై: ఆలిండియా బుచ్చిబాబు ఇన్విటేషన్ క్రికెట్ టోర్నమెంట్లో హైదరాబాద్ జట్టు తమ జోరు కొనసాగిస్తోంది. ఛత్తీస్‌గఢ్ జట్టుతో జరుగుతున్న ఫైనల్లో హైదరాబాద్ ప్రత్యర్థి జట్టుకు 518 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించింది. మ్యాచ్ మూడో రోజు హైదరాబాద్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 70.2 ఓవర్లలో 281 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ రాహుల్ సింగ్ (68; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు), రాహుల్ రాధేశ్ (41; 4 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు.రోహిత్ రాయుడు భారీ సెంచరీఛత్తీస్గఢ్ బౌలర్ జీవేశ్ ఆరు వికెట్లు పడగొట్టాడు. అంతకుముందు ఛత్తీస్‌గఢ్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 70.2 ఓవర్లలో 181 పరుగులకు ఆలౌటవ్వడంతో హైదరాబాద్‌కు 236 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. హైదరాబాద్ బౌలర్లలో అనికేత్ రెడ్డి నాలుగు వికెట్లు తీయగా... రోహిత్ రాయుడు, తనయ్ త్యాగరాజన్‌లకు మూడు వికెట్ల చొప్పున లభించాయి. హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్‌లో 118.4 ఓవర్లలో 417 పరుగులు చేసింది. రోహిత్ రాయుడు (155; 8 ఫోర్లు, 8 సిక్స్‌లు) భారీ సెంచరీ సాధించాడు. అభిరత్ (85; 10 ఫోర్లు, 1 సిక్స్), రాహుల్ రాధేశ్ (48; 7 ఫోర్లు) ఆకట్టుకున్నారు.టీమిండియా స్టార్లు సైతంకాగా తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ టోర్నీ ఆరంభ మ్యాచ్‌లలో టీమిండియా స్టార్లు శ్రేయస్ అయ్యర్, సర్ఫరాజ్ ఖాన్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ తదితరులు పాల్గొన్నారు. ప్రస్తుతం శ్రేయస్, సర్ఫరాజ్ దులిప్ ట్రోఫీ-2024తో బిజీగా ఉండగా.. సూర్య, ఇషాన్ గాయాల బారిన పడ్డారు. చదవండి: DT 2024: భారత ‘ఎ’ జట్టులోషేక్ రషీద్.. టీమిండియాతో చేరని సర్ఫరాజ్ ఖాన్! -
‘బుచ్చిబాబు’ విజేత హైదరాబాద్
ఫైనల్లో తమిళనాడు ఎలెవన్ చిత్తు చెన్నై: సొంతగడ్డపై ఇటీవలే మొయినుద్దౌలా గోల్డ్ కప్ గెలిచి ఊపు మీదున్న హైదరాబాద్ జట్టు చెన్నైలోనూ అదే జోరు కొనసాగించింది. శుక్రవారం ఇక్కడ ముగిసిన ఆలిండియా బుచ్చిబాబు ఇన్విటేషన్ క్రికెట్ టోర్నీలో హైదరాబాద్ విజేతగా నిలిచింది. ఫైనల్లో హైదరాబాద్ 8 వికెట్ల తేడాతో తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ (టీఎన్‌సీఏ) ఎలెవన్‌ను చిత్తు చేసింది. మ్యాచ్ తొలి రోజు గురువారం తమిళనాడు 200 పరుగులకే ఆలౌట్ కాగా... ఆట ముగిసే సమయానికి హైదరాబాద్ వికెట్ నష్టానికి 76 పరుగులు చేసింది. రెండో రోజు హైదరాబాద్ 56.4 ఓవర్లలో 2 వికెట్లకు 201 పరుగులు సాధించి విజయాన్నందుకుంది. కొల్లా సుమంత్ (115 బంతుల్లో 77 నాటౌట్; 11 ఫోర్లు, 1 సిక్స్), రోహిత్ రాయుడు (100 బంతుల్లో 47 నాటౌట్; 7 ఫోర్లు) మూడో వికెట్‌కు అభేద్యంగా 113 పరుగులు జోడించి జట్టును గెలిపించారు. ఓపెనర్లు తన్మయ్ అగర్వాల్ 35, అక్షత్ రెడ్డి 30 పరుగులు చేశారు. టోర్నీలో మొత్తం 299 పరుగులు సాధించిన కొల్లా సుమంత్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్’ అవార్డు దక్కింది. 12 వికెట్లు తీసి టోర్నీలో రెండో స్థానంలో నిలిచిన హైదరాబాద్ లెఫ్టార్మ్ స్పిన్నర్ మెహదీ హసన్ కూడా జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.