breaking news
brutally rape
-
ఆ మరో నిర్భయ దేహంలో 38 గాయాలు
న్యూఢిల్లీ: కేరళలో దారుణ లైంగిక దాడి, అనంతరం హత్యకు గురైన దళిత యువతి ఒంటిపైన.. అంతర్భాగాల్లో మొత్తం 38 చిన్నాపెద్ద గాయాలయినట్లు తెలిసింది. పెరువంబూర్లో గత నెల 28న నిర్భయకన్నా దారుణంగా ఓ న్యాయవిద్యార్థినిపై లైంగికదాడి.. అనంతరం కత్తిపోట్లతో హత్య జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలీసులు తెలిపిన ఆమె పోస్ట్ మార్టం నివేదిక ప్రకారం బాధితురాలి ఒంటిపైన.. అంతర్భాగాల్లో కలిపి 38చోట్ల చిన్న పెద్ద గాయాలయినట్లు తెలుస్తోంది. రేప్ కు పాల్పడినవారు చాలా దారుణంగా వ్యవహరించినట్లు శవపరీక్ష నిర్వహించిన వైద్యులు తెలిపారు. మే 11న బాధితురాలి ఇంటికి మోదీ! కుటుంబాన్ని పరామర్శించేందుకు ప్రధాని నరంద్రమోదీ వెళ్లనున్నారు. ఈ నెల 11న మోదీ ఆ యువతి స్వగ్రామం పెరువంబూర్కు స్వయంగా వెళ్లి ఓదార్చనున్నారు. అలాగే, సామాజిక న్యాయశాఖ మంత్రి థవర్ చాంద్ గెహ్లాట్ కూడా వారి ఇంటికి వెళ్లి పరామర్శించనున్నారు. ఇప్పటికే కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ ఈ కేసు పురోగతిపై ఆరా తీశారు. వివరాలు తనకు పంపించాలని ఆదేశించారు. మరోపక్క, ఇదివరకే కేరళ ముఖ్యమంత్రి ఉమెన్ చాందీ బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పారు. ఎన్నికల కమిషన్ అవకాశం ఇస్తే ఆ కుటుంబాన్ని ఏ విధంగా ఆదుకునేందుకైనా తాను సిద్ధమని, ఆ ఇంట్లో ఒకరికి ఉద్యోగం కూడా ఇస్తామని చెప్పారు. -
రేప్ చేసి, కత్తులతో పొడిచి..
త్రివేండ్రం: లా చదువుతున్న దళిత విద్యార్థిని అత్యాచారం చేసి, కడుపుపై తన్ని, కత్తితో పొడిచి దారుణంగా హత్య చేసిన ఘటన కేరళలో జరిగింది. గత నెల 28న జరిగిన ఈ దారుణం ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాలిలా ఉన్నాయి. ఎర్నాకుళం జిల్లా పెరుంబవూర్లో బాధితురాలు మానసిక స్థితి సరిగా లేని తల్లితో కలసి నివసించేది. ఈ నెల 28న ఆమె మృతదేహం బయటపడింది. ఆమె ఒంటిపై పలు కత్తిపోట్లు ఉన్నాయి. కడుపుపై తన్నడంతో ప్రేగులు బయటకు వచ్చాయి. ఆమెపై లైంగికదాడి జరిగినట్టు పోస్టుమార్టమ్ నివేదికలో తేలింది. పట్టపగలే ఈ ఘటన జరిగినట్టు పోలీసులు చెప్పారు. ఈ ఘటనపై ఇరుగుపొరుగువారు నోరు విప్పలేదు. దారుణం జరిగి ఐదు రోజులు కావాస్తున్నా పోలీసులు ఇంకా ఎవరినీ అరెస్ట్ చేయలేదు. బాధితురాలి కుటుంబానికి సాయం చేసేందుకు స్థానిక రాజకీయ నాయకులు కానీ సామాజిక కార్యకర్తలు కానీ ముందుకు రాలేదు. రెండు రోజుల తర్వాత బాధితురాలి హత్యాచారం వార్త పేపర్లో రావడంతో ఆమె స్నేహితులకు తెలిసింది. బాధితురాలి ఇంట్లోనే ఈ దారుణం జరిగి ఉంటుందని వారు అభిప్రాయపడ్డారు.