ఆ మరో నిర్భయ దేహంలో 38 గాయాలు | Modi to Meet Family of Kerala Rape Victim on May 11 | Sakshi
Sakshi News home page

ఆ మరో నిర్భయ దేహంలో 38 గాయాలు

May 5 2016 11:09 AM | Updated on Aug 15 2018 6:34 PM

ఆ మరో నిర్భయ దేహంలో 38 గాయాలు - Sakshi

ఆ మరో నిర్భయ దేహంలో 38 గాయాలు

కేరళలో దారుణ లైంగిక దాడి, అనంతరం హత్యకు గురైన దళిత యువతి ఒంటిపైన.. అంతర్భాగాల్లో మొత్తం 38 చిన్నాపెద్ద గాయాలయినట్లు తెలిసింది.

న్యూఢిల్లీ: కేరళలో దారుణ లైంగిక దాడి, అనంతరం హత్యకు గురైన దళిత యువతి ఒంటిపైన.. అంతర్భాగాల్లో మొత్తం 38 చిన్నాపెద్ద గాయాలయినట్లు తెలిసింది. పెరువంబూర్లో గత నెల 28న నిర్భయకన్నా దారుణంగా ఓ న్యాయవిద్యార్థినిపై లైంగికదాడి.. అనంతరం కత్తిపోట్లతో హత్య జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలీసులు తెలిపిన ఆమె పోస్ట్ మార్టం నివేదిక ప్రకారం బాధితురాలి ఒంటిపైన.. అంతర్భాగాల్లో కలిపి 38చోట్ల చిన్న పెద్ద గాయాలయినట్లు తెలుస్తోంది. రేప్ కు పాల్పడినవారు చాలా దారుణంగా వ్యవహరించినట్లు శవపరీక్ష నిర్వహించిన వైద్యులు తెలిపారు.

మే 11న బాధితురాలి ఇంటికి మోదీ!
కుటుంబాన్ని పరామర్శించేందుకు ప్రధాని నరంద్రమోదీ వెళ్లనున్నారు. ఈ నెల 11న మోదీ ఆ యువతి స్వగ్రామం పెరువంబూర్కు స్వయంగా వెళ్లి ఓదార్చనున్నారు. అలాగే, సామాజిక న్యాయశాఖ మంత్రి థవర్ చాంద్ గెహ్లాట్ కూడా వారి ఇంటికి వెళ్లి పరామర్శించనున్నారు. ఇప్పటికే కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ ఈ కేసు పురోగతిపై ఆరా తీశారు. వివరాలు తనకు పంపించాలని ఆదేశించారు. మరోపక్క, ఇదివరకే కేరళ ముఖ్యమంత్రి ఉమెన్ చాందీ బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పారు. ఎన్నికల కమిషన్ అవకాశం ఇస్తే ఆ కుటుంబాన్ని ఏ విధంగా ఆదుకునేందుకైనా తాను సిద్ధమని, ఆ ఇంట్లో ఒకరికి ఉద్యోగం కూడా ఇస్తామని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement