breaking news
Brijesh
-
మార్చి 26 నుంచి ఐపీఎల్ 2022 షురూ..
ఐపీఎల్–2020 సీజన్ మొత్తం మహారాష్ట్రలోనే నిర్వహించేందుకు రంగం సిద్ధమైంది. వచ్చే నెల 26 నుంచి మే 29 వరకు కేవలం నాలుగు వేదికల్లోనే మ్యాచ్‌లను నిర్వహిస్తామని ఐపీఎల్ చైర్మన్ బ్రిజేశ్ పటేల్ ప్రకటించారు. ముంబైలోని వాంఖెడే, బ్రాబౌర్న్, డీవై పాటిల్ స్టేడియాలతో పాటు పుణే మైదానంలో ఐపీఎల్ మ్యాచ్‌లు జరుగుతాయి. మహారాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలను అనుసరించి 40 శాతం ప్రేక్షకుల్ని అనుమతిస్తామని లీగ్ వర్గాలు వెల్లడించాయి. -
Indian Defence Sector: మన ‘రక్షణ’కు అవరోధాలెన్నో!
రక్షణ మంత్రిత్వ శాఖ ఈమధ్య విడుదల చేసిన పత్రంలో రక్షణ రంగంలో ప్రవేశపెట్టిన 20 రకాల సంస్కరణలను పొందుపరిచారు. సాధారణంగా జాతీయ భద్రత పేరిట ఇలాంటివి బాహాటంగా వెల్లడించే సంప్రదాయం మన దేశంలో లేదు. ఈసారి రక్షణ శాఖ ఇందుకు భిన్నమైన మార్గాన్ని అనుసరించటం స్వాగతించదగ్గది. ఇందులో రెండు కీలకమైన అంశాలున్నాయి. రక్షణ రంగానికి ఆత్మ నిర్భరత తీసుకురావటం, రక్షణ రంగ పరిశోధనలను సంస్కరించటం. దేశీయ విధానాల ద్వారా మన సాయుధ దళాల అవసరాలను తీర్చేందుకే ఈ రెండింటినీ ఉద్దేశించారు. అదే సమయంలో మన దేశాన్ని రక్షణ సామగ్రి తయారీ రంగ కేంద్రంగా రూపొందించటం కూడా ఈ సంస్కరణల ధ్యేయం. రక్షణ రంగంలో స్వావలంబన గురించి, ఆ లక్ష్య సాధన గురించి దశాబ్దాలుగా అనేక ప్రభు త్వాలు మాట్లాడటం మనకు తెలియనిదేమీ కాదు. కేంద్రంలో ఏ పార్టీ ప్రభుత్వం పరిపాలించినా ఈ లక్ష్యం గురించి ఘనంగా చెప్పడం ఎప్పటినుంచో మనం చూస్తున్నదే. కానీ విచారకరమైన విషయమేమంటే అంతర్జాతీయంగా ఆయుధాలు దిగుమతి చేసుకునే దేశాల జాబితాలో ఈనాటికీ మనది రెండో స్థానం. మాటలకు దీటుగా చేతలు ఉండటం లేదని ఈ పరిస్థితి తెలియజెబుతోంది. రక్షణ, పరిశోధన రెండూ రక్షణ మంత్రిత్వశాఖ ఛత్రఛాయలో ఉంచటం సరైందికాదని ఎప్పటినుంచో అనేక మంది నిపుణులు సూచిస్తున్నారు. కానీ ఎవరూ పట్టించు కోలేదు. పాశ్చాత్య దేశాల్లో ఈ నమూనా ఎక్కడా అమల్లో లేదు. మంచిదేగానీ... ఈ సందర్భంగా నేను రెండు ఉదాహరణలు ఇవ్వద ల్చుకున్నాను. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఇటీవల రక్షణ నవీకరణ సంస్థ(డీఐఓ)కింద రక్షణ రంగంలో ఉత్కృష్టమైన సృజనాత్మకతను ప్రోత్సహించటానికి ఉద్దేశించిన ఐడెక్స్‌కు బడ్జెట్ కేటాయింపులు చేస్తున్నట్టు ప్రకటించారు. రక్షణ రంగంలో కొత్త ఆలోచనలతో ముందుకొచ్చేవారిని, రక్షణ, ఎయిరో స్పేస్ రంగాల్లో సాంకేతికతను అభివృద్ధి చేసేవారిని ప్రోత్సహించటానికి తగిన వ్యవస్థను ఏర్పాటు చేయటం ఈ సంస్థ ప్రధాన లక్ష్యం. ఈ చొరవ వెనకున్న స్ఫూర్తి కొనియా డదగినది. అయితే డీఐఓ సైతం రక్షణ మంత్రిత్వశాఖలోని రక్షణ ఉత్పత్తి విభాగంకింద పనిచేస్తుందని చెప్పటం కొంత నిరాశ కలిగిస్తుంది. బ్యూరోక్రసీ మన దేశంలో ఎలా పనిచేస్తుందో ఎవరికీ తెలియనిది కాదు. ఇక కాగ్, సీబీఐ, సీవీసీ వగైరా సంస్థల నీడ సరేసరి. ప్రయోగశాలలు, సాంకే తిక రంగంలో కొత్త పుంతలు తొక్కే సంస్థలు మేధోపరమైన కృషిలో నిమగ్నమవుతాయి. నిబంధనలు, సంప్రదాయాల పేరుచెప్పి వాటికి అడ్డంకులు సృష్టిస్తే అవి ఎప్పటికీ ఎదగ లేవు. విభిన్నంగా ఆలోచించటం, ఎలాంటి ఇబ్బందుల నైనా, అవరోధాలనైనా ఎదుర్కొనటానికి సిద్ధపడటం వంటి గుణాలు సృజనాత్మక పరిష్కారాలకు దోహదపడతాయి. కానీ డీఐఓను ప్రభుత్వ విభాగం పరిధిలో ఉంచితే ఇవెలా సాధ్యం? రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్డీఓ) పరిధిలో, అది అందజేసే నిధులతో అత్యాధునిక రక్షణ సాంకేతి కతలను అభివృద్ధి కోసం కృషిచేస్తున్న సంస్థలు చాలా వున్నాయి. అయినా మన దేశానికి ఒక కొత్త నవీకరణ సంస్థ అవసరం వున్నదని రక్షణ శాఖ భావించిందంటేనే ఆ సంస్థల పని తీరు ఎలావున్నదో అర్థం చేసుకోవచ్చు. విక్రమ్ సారాభాయ్ విలువైన సూచన దేశీయంగా హెచ్ఎఫ్–24 యుద్ధ విమానాన్ని అభివృద్ధి చేయాలని 50వ దశకంలో అప్పటి ప్రధాని నెహ్రూ సూచించారు. ఆ తర్వాతే 1956లో హిందూస్థాన్ ఏరోనాటికల్ సంస్థ(హెచ్ఏఎల్) ఆవిర్భవించింది. ఆ యుద్ధ విమానం 1967లో వైమానిక దళ సర్వీసులోకి ప్రవేశించింది. 1970లో భారత అంతరిక్ష రంగ పితామ హుడు విక్రమ్ సారాభాయ్ అణు శక్తి, అంతరిక్ష రంగం, ఎర్త్ సైన్సు, ఎయిరోనాటికల్ రంగాలకు ప్రత్యేక కమిషన్‌లుండాలని, ఇవన్నీ శాస్త్ర, సాంకేతిక రంగ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేయాలని పాలనారంగ సంస్కరణల కమిషన్‌కు సూచించారు. ఆయన ఎంతో ముందు చూపుతో చేసిన ఆ ప్రతిపాదనను ఆనాటి ప్రభుత్వం ఆమోదించింది. అది కార్యరూపం దాల్చాక ఆ రంగాలన్నీ ఎన్నో విధాల అభివృద్ధి సాధించాయి. కానీ ఎయిరోనాటిక్స్ రంగం ఎదుగూ బొదుగూ లేకుండా మిగిలి పోయింది. ఎందుకంటే ఆ ఒక్క రంగం మాత్రం రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలో ఉండిపోయింది. కనుకనే ఇన్ని దశాబ్దాలు గడిచినా రక్షణ రంగ దిగుమతులు మన దేశానికి తప్పడం లేదు. అందుకోసం వేలాది కోట్ల రూపాయలు వ్యయం చేయవలసి వస్తోంది. ఇన్ని దశాబ్దాలవుతున్నా ప్రభుత్వాల సారథులు దీనిపై తగిన దృష్టి సారించలేక పోయారు. వీగిపోయిన ప్రతిపాదన దేశానికి వైమానిక రంగ విధానం ఎంతో అవసరమని 1994లో ఏపీజే అబ్దుల్ కలామ్ రాష్ట్రపతిగా వుండగా ఎయిరోనాటికల్ సొసైటీ ప్రతిపాదించింది. వర్తమాన కాలంలో ఈ రంగంలో జరిగే సాంకేతికాభివృద్ధి రక్షణరంగానికి, దేశ భద్రతకు దోహదపడుతుందని, మన దేశం అంతర్జాతీయ భాగస్వామ్యం పొందటానికి ఉపయోగపడుతుందని, అందువల్ల ఆర్థికంగా కూడా దేశానికి లాభదాయకమని ఆ ప్రతిపాదన సూచించింది. పౌరవిమానయాన రంగం, సైనిక విమాన రంగాలమధ్య ఎన్నో సారూప్యతలుంటాయి. ఎయిరోనాటిక్స్‌ను ప్రోత్సహిస్తే దేశ భద్రతతోపాటు లాభదాయకమైన వ్యాపారం చేయటానికి కూడా అవకాశం వుంటుంది. అంతేకాదు... వైమానిక రంగంలో అంతర్జాతీయంగా మనదైన ప్రత్యేక ముద్ర వుంటుంది. కానీ విచారకరమైన విషయమేమంటే ఈ ప్రతిపాదన ఉన్నతాధికార వర్గం ధర్మమా అని వీగిపోయింది. దీనికి మరింత మెరుగులు దిద్ది, మార్పులు చేర్పులు చేసి 2004లో మరోసారి ప్రతిపాదించారు. దానికి కూడా అదే గతి పట్టింది. ప్రభుత్వ నిర్ణయాలపై, విధానాలపై సౌత్ బ్లాక్ పట్టు ఎంతగా వుంటుందో ఈ స్థితి తెలియజేస్తుంది. ఆ బ్లాక్‌లో వేరే మంత్రిత్వ శాఖల సచివాలయాలతోపాటు రక్షణ మంత్రిత్వ శాఖ సచివాలయం కూడా ఉంటుంది. రక్షణ పరిశ్రమ రంగంలో నవీకరణను ప్రోత్సహిం చటానికి ఒక సంస్థ అవసరమున్నదని ఇన్నేళ్ల తర్వాత ఎన్డీఏ ప్రభుత్వంలోని అత్యున్నత స్థాయి నాయకత్వం భావించటం నిజంగా హర్షించదగ్గ పరిణామం. ఈ విషయంలో గతం తాలూకు అనవసర భారాన్ని వదల్చు కోవాలని చూడటం కొత్త ఆశల్ని రేకెత్తిస్తోంది. ప్రభుత్వ ఆలోచనల్లో చాలా మార్పు వచ్చింది గనుక భారత వైమానిక రంగానికి ఇకముందైనా సరైన స్థానం దక్కాలని, ప్రస్తుత సానుకూల వాతావరణంలో అది అన్ని రకాలుగా లబ్ధి పొందాలని అందరమూ ఆశించాలి. అసలు మన జాతీయ భద్రతా వ్యవస్థలో సృజనాత్మక దృక్పథం పెంపొందాలంటే పూర్తి స్థాయి పాలనా రంగ సంస్కరణలు చాలా చాలా అవసరమని ప్రభుత్వ పెద్దలు గుర్తించాలి. –ఎయిర్ మార్షల్ బ్రిజేష్ జయల్(రిటైర్డ్) రక్షణ రంగ వ్యాఖ్యాత (‘ది ట్రిబ్యూన్’ సౌజన్యంతో) చదవండి: చైనాతో ప్రతిష్టంభన నేపథ్యంలో రక్షణ మంత్రి లద్దాఖ్ పర్యటన హిందీభాషకు దక్షిణ వారధి పీవీ -
బ్రిజేశ్ ముందుకు బ్రహ్మాస్త్రం!
ట్రిబ్యునల్ ముందు స్వయంగా వాదనలు వినిపించనున్న కేసీఆర్! - హాజరుకావాల్సిందిగా ఆహ్వానించిన అధికారులు, న్యాయవాదులు - దీనిపై ముఖ్యమంత్రితో ప్రాథమిక చర్చలు - కేసీఆర్ దాదాపుగా ఓకే చెప్పినట్లు నీటి పారుదల వర్గాల వెల్లడి సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదీ జలాల పంపిణీ వివాదం, నీటి లెక్కలు, తెలంగాణకు దక్కాల్సిన వాస్తవ వాటాలపై బ్రిజేశ్ ట్రిబ్యునల్ ఎదుట సీఎం కె.చంద్రశేఖర్‌రావు స్వయంగా వాదనలు వినిపించనున్నారు. ఈ అంశంలో అధికారుల విజ్ఞప్తిపై ఆయన సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది. తుది వాదనల సమయంలో కచ్చితంగా ట్రిబ్యునల్ ముందు హాజరై వాదనలు వినిపిస్తానని హామీ ఇచ్చినట్లు సమాచారం. కృష్ణా జలాల్లో వాస్తవ కేటాయింపులు, జరుగుతున్న వినియోగం, ఉమ్మడి ఏపీలో జరిగిన నష్టం, కొత్త ప్రాజెక్టులకు వరద జలాల మళ్లింపు తదితర అంశాలపై ట్రిబ్యునల్ ముందు వాదనలు వినిపిస్తున్న ప్రభుత్వ న్యాయవాదులు, నీటి పారుదల శాఖ అధికారులు దీనిపై ముఖ్యమంత్రితో చర్చలు సైతం జరిపినట్లు తెలిసింది. కేంద్రం, ట్రిబ్యునల్ల తీరుతో నిరాశ కృష్ణా జలాల పంపిణీలో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని సవరించాలంటూ మూడున్నరేళ్లుగా రాష్ట్రం విజ్ఞప్తి చేస్తున్నా ఫలితం ఉండడం లేదు. కేంద్రం రాజకీయ ప్రయోజనాలకే పెద్దపీట వేస్తూ కృష్ణా జలాల పంపిణీపై విచారణను తెలంగాణ, ఏపీలకే పరిమితం చేస్తూ నిర్ణయం తీసుకుంది. అటు బ్రిజేశ్ ట్రిబ్యునల్ కూడా తెలంగాణ గోడును ఏమాత్రం వినిపించుకోవడం లేదు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాలకు జరిపిన నికర, మిగులు జలాల కేటాయింపుల జోలికి వెళ్లకుండా.. కేవలం క్యారీ ఓవర్ జలాలు, గోదావరి నుంచి కృష్ణాకు నీటిని తరలిస్తే ఎగువ రాష్ట్రాలకు దక్కే వాటాలపై ప్రధానంగా దృష్టి పెట్టింది. అటు కేంద్ర నిర్ణయం, ఇటు ట్రిబ్యునల్ తీరు రెండూ తెలంగాణకు అశనిపాతంగా మారాయి. ‘పూడిక’ లెక్కలు తీద్దాం! ఇక నాగార్జున సాగర్ నిల్వ సామర్థ్యం 408 టీఎంసీలుకాగా పూడిక కారణంగా సామర్థ్యం ప్రస్తుతం 312 టీఎంసీలకు తగ్గిపోయిందని.. శ్రీశైలంలోనూ 312 టీఎంసీల నుంచి 215 టీఎంసీలకు తగ్గిందని కేసీఆర్ అధికారులకు వివరించినట్లు తెలిసింది. రెండు ప్రాజెక్టుల్లో పూడికతో తగ్గే నీటిని పాలమూరు, డిండి ప్రాజెక్టులకు మళ్లిద్దామని ప్రాతిపాదన చేద్దామని పేర్కొన్నట్లు చెబుతున్నారు. ఈ విషయాలపై తానే స్వయంగా ట్రిబ్యునల్ ముందుకు వస్తానని చెప్పినట్లు విశ్వసనీయంగా తెలిసింది. అయితే బోర్డు ముందు ముఖ్యమంత్రి ఏ హోదాలో హాజరవుతారు? దానికి ముందుగానే బోర్డు అనుమతి తీసుకోవాలా? అన్నదానిపైనా చర్చలు జరుగుతున్నాయి. ఈ నెల 13, 14, 15 తేదీల్లో ట్రిబ్యునల్ ముందు వాదనలు జరుగుతున్నా.. అవి ఇరు రాష్ట్రాలు సమ ర్పించిన అఫిడవిట్లు, కౌంటర్లు కేంద్రంగా ఉండనున్నాయి. దీంతో తీర్పు వెలువరించే ముందు పూర్తిస్థాయిలో జరిగే తుది వాదనల సమయంలో ముఖ్యమంత్రి హాజ రయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అన్యాయాన్ని ఎండగడదాం.. కృష్ణా జలాల అంశంపై నీటి పారుదల శాఖ అధికారులు, న్యాయవాదులతో ముఖ్యమంత్రి కేసీఆర్ పలు దఫాలుగా సుదీర్ఘ చర్చలు జరిపారు. కృష్ణా పరీవాహక ప్రాంతం తెలంగాణలో 68.5 శాతం ఉన్నా నీటి వాటాలు మాత్రం మొత్తం కేటాయింపుల్లో 35 శాతం మేర మాత్రమే ఉన్నాయని... పరీవాహకాన్ని, ఆయకట్టును పరిగణనలోకి తీసుకొని అయినా కేటాయింపులు పెంచాల్సిందేనని కేసీఆర్ ఇప్పటికే స్పష్టం చేశారు. నాగార్జునసాగర్ నుంచి కృష్ణా డెల్టాకు అవసరానికి మించి నీటి కేటాయింపులు జరిపారని కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. ఇక గతంలో జరిగిన ఒప్పందాల మేరకు తెలంగాణలోని ఆర్డీఎస్కు, రాయలసీమలోని సుంకేశుల కేసీ కెనాల్‌కు సమాన కేటాయింపులు జరపాల్సి ఉన్నా.. ఆర్డీఎస్కు 12 టీఎంసీలు ఇచ్చి, సుంకేశులకు 39 టీఎంసీలు కేటాయించిన అంశాన్ని వివరించారు. టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్లో సైతం ఈ అంశాలను లేవనెత్తినా ఫలితం రాలేదు. ఈ నేపథ్యంలో ఈ అంశాన్ని ట్రిబ్యునల్ ముందు తేల్చుకోవాల్సిందేనని నీటి పారుదల శాఖ అధికారులు, న్యాయవాదులు ఇటీవల ముఖ్యమంత్రికి తేల్చిచెప్పినట్లు తెలిసింది. చివరి అస్త్రంగా మీరే స్వయంగా ట్రిబ్యునల్ ముందుకు రావాలని వారు కేసీఆర్‌ను కోరగా.. ఆయన సానుకూలంగా స్పందించినట్లు నీటి పారుదల ఉన్నత స్థాయి వర్గాలు స్పష్టం చేశాయి. -
నేడు పులిచింతల ప్రాజెక్టు వద్ద విజయమ్మ దీక్ష