breaking news
Brain Gym
-
భర్తను షూట్ చేసిన తర్వాత అతడితో కలిసి భోజనం చేసిన భార్య.. ఇదెలా సాధ్యం?
1. ఈ ఇంగ్లీష్ పదంలో మొదటి రెండు అక్షరాలు అతడు. మొదటి మూడు అక్షరాలు ఆమె. మొదటి నాలుగు అక్షరాల విషయానికి వస్తే...సాహసం చేసిన వ్యక్తులను ఇలా పిలుస్తారు. మొత్తం పదం విషయానికి వస్తే....అందానికి అద్భుత నిర్వచనం. ఆ పదం ఏమిటి? 2. 1988వ సంవత్సరం, ఒక పండగపూట ఎవరికీ అనుమానం రాకుండా భర్తను షూట్ చేసింది అన్నపూర్ణ. ఆ తరువాత చీకటి గదిలో నీళ్లలో ముంచి వేలాడదీసింది. ఆ తరువాత అన్నపూర్ణ ఆమె భర్త ఇద్దరు కలిసి సంతోషంగా భోజనం చేశారు. ఇదెలా సాధ్యం? జవాబులు 1.Heroine 2. అన్నపూర్ణ షూట్ చేసింది గన్‌తో కాదు. అలనాటి కెమెరాతో. డార్క్‌రూమ్‌లో నెగెటివ్‌ను డెవలప్ చేసింది. -
'కీ వీవ్' అంటే ఏంటో తెలుసా..?
అలర్ట్‌గా ఉండడం, తదేకంగా పరిశీలించడం... ఇలాంటి సందర్భాలలో ఉపయోగించే ఎక్స్ప్రెషన్ కీ వీవ్. ఉదా: యాన్ ఆర్మీ ఆన్ ది కీ వీవ్ ‘కీ వీవ్’ అనేది ఫ్రెంచ్ ఎక్స్ప్రెషన్. ఆరోజుల్లో ఫ్రాన్సులో కోటలకు కాపల కాసే సైనికులు, దూరంగా ఎవరైనా అపరిచితులు కనిపిస్తే–‘కీ వీవ్’ (లాంగ్ లివ్ హూ?) అని గట్టిగా అరిచేవాళ్లు. అప్పుడు అటునుంచి జవాబు... ‘లాంగ్ లివ్ ది కింగ్’ అని వినిపించాలి. అలా కాకుండా, ఆ వ్యక్తి నీళ్లు నమిలినా, వేరే ఏదైనా జవాబు చెప్పినా...అతడిని అనుమానించి రకరకాలుగా ప్రశ్నించేవారు. ఇది ఎలా సాధ్యం? ఒక కాలువకు అటు వైపు యజమాని, ఇటు వైపు అతని శునకం జిమ్మీ ఉంది. ‘జిమ్మీ! ఇటు వచ్చేయ్’ అని అరిచాడు యజమాని. వెంటనే వచ్చేసింది జిమ్మీ. అయితే జిమ్మీ కొంచెం కూడా తడవలేదు. అలా అని అది వంతెన మీది నుంచి రాలేదు. పడవ ఎక్కి రాలేదు. తడవకుండా రావడం ఎలా సాధ్యమైంది? జవాబు: ఆ కాలువ గడ్డకట్టి పోయింది! -
అతడే హంతకుడని ఎలా కనిపెట్టారు?
అప్పారావు, ఆమని అనే నూతన దంపతులు హానిమూన్‌కు వెళ్లారు. రెండురోజులు తరువాత అప్పారావు అందరికీ ఫోన్ చేసి తన భార్య బోట్ యాక్సిడెంట్లో చనిపోయినట్లు చెప్పి రోదించాడు. అప్పారావు సొంత గ్రామానికి వచ్చిన తరువాత చుట్టాలు, పక్కాలు పరామర్శించారు. అప్పారావు మీద అనుమానంతో ఎవరో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పారావే భార్యను హత్య చేసిన హంతకుడని పోలీసులు తేల్చారు. ఎలా? (క్లిక్: ఆ ముగ్గురు ఎలా చనిపోయారో చెప్పండి చూద్దాం!) జవాబు: అప్పారావు తన భార్య కోసం కేవలం వన్–వే టికెట్ మాత్రమే బుక్ చేశాడు. -
Brain Gym: మీరే డిటెక్టివ్ అయితే.. ఆ ముగ్గురు ఎలా చనిపోయారో చెప్పండి!
ఒక క్రిమినల్ ముగ్గురు వ్యక్తులను కిడ్నాప్ చేశాడు. వారి ముందు మూడు వాటర్ గ్లాస్లు పెట్టాడు. ఒక్కొక్కరికి రెండు పిల్స్ ఇచ్చాడు. ‘మీకు ఇచ్చిన పిల్స్‌లో ఒకటి విషం ఉన్నది. రెండోది విషం లేనిది. అందులో ఒకటి నోట్లో వేసుకొని గ్లాస్లో నీళ్లు తాగండి. మీ అదృష్టం ఎలా ఉందో పరీక్షించుకోండి’ అని హుకుం జారీ చేశాడు. మొదటి వ్యక్తి రెండిట్లో ఒకటి వేసుకొని, గ్లాస్లో నీళ్లు తాగాడు. చనిపోయాడు. రెండో వ్యక్తి రెండిట్లో ఒకటి నోట్లో వేసుకొని నీళ్లు తాగాడు. చనిపోయాడు. మూడో వ్యక్తి బా...గా ఆలోచించి ఒకటి సెలెక్ట్ చేసుకొని, నోట్లో వేసుకొని నీళ్లు తాగాడు. అతడు కూడా చనిపోయాడు. రెండు పిల్స్‌లో ఒకటి మాత్రమే విషపూరితమైనప్పుడు ఒక్కరికైనా బతికే అదృష్టం ఎందుకు లేకుండా పోయింది? అసలు విషయం: నిజానికి అందులో ఒకటి కూడా పాయిజన్ పిల్ లేదు. వారికి ఇచ్చిన వాటర్గ్లాస్లలోనే పాయిజన్ ఉంది! చదవండి: నిద్ర లేకపోతే ఎంత డేంజరో తెలుసా? మీకు తెలియని షాకింగ్ విషయాలు -
బ్రెయిన్ గెయిన్
అంతా గుర్తున్నట్టే ఉంటుంది.. తీరా ఎగ్జామ్కెళ్లాక పెన్ను కదలదు. ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఈక్వేషన్ గుర్తుండదు. టీచర్ చెప్పిన కొండగుర్తు ఎప్పుడో కొండెక్కితే, బట్టీ పట్టిన సైన్స్ థియరీ... మైండ్ దాటి బయటికి రాదు. స్టూడెంట్స్‌కి ఈ శ్రమ తప్పిస్తోంది బ్రెయిన్ జిమ్. నగరానికి కొత్తగా వచ్చిన ఈ యాక్టివిటీస్‌ను నేర్చుకునేందుకు ‘మిడ్ బ్రెయిన్ మాస్టర్స్ (ఎంబీఎం)’ సెంటర్స్‌కి క్యూ కడుతున్నారు పిల్లలు!. - వాంకె శ్రీనివాస్ పువ్వుల్లా తమ పిల్లలూ.. పుట్టిన నాటి నుంచే పరిమళించాలని కోరుకుంటున్నారు నేటి తల్లిదండ్రులు. ర్యాంక్స్ కోసం వేట ఎల్కేజీ నుంచే మొదలవుతుంది. ఏ ఇద్దరు మనుషులూ ఒకేలా ఉండరు. మరి పిల్లలందరూ యాక్టివ్‌గా ఉండాలంటే సాధ్యమవుతుందా? కొందరు ఫస్ట్ బెంచ్, ఇంకొందరు లాస్ట్. అయితే లాస్ట్ బెంచ్ విద్యార్థులను సైతం ఫస్ట్ ర్యాంకర్స్లా తీర్చిదిద్దడానికే పుట్టుకొచ్చింది బ్రెయిన్ జిమ్. పిల్లల మెదడుకు పదును పెట్టి... చురుకుగా పనిచేసే కిటుకులను నేర్పిస్తోంది. మలేసియాలో అంకురించిన ఈ బ్రెయిన్ జిమ్ కాన్సెప్ట్ ఇప్పుడు హైదరాబాద్‌కు చేరింది. దీన్ని సిటీవాసులకు పరిచయం చేసిన ఎంబీఎం సెంటర్.. మెమరీ గేమ్స్, డ్యాన్స్, ఫన్ యాక్టివిటీస్, రిలాక్సేషన్ ఎక్సర్‌సైజులతో పిల్లల ఊహలకు రెక్కలు తొడుగుతోంది. ఏకాగ్రతలో ఏకలవ్యులను మించేలా చేస్తుంది. పిల్లల్లో జ్ఞాపకశక్తి, గ్రాహక శక్తితోపాటు ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంచుతోంది. భిన్నమైన వ్యాయామాలు... పిల్లలను అన్ని పనుల్లో చురుగ్గా ఉంచేందుకు దోహదం చేసే ఈ బ్రెయిన్ జిమ్‌లో డిఫరెంట్ వ్యాయామాలు ఉన్నాయి. నిపుణుల మార్గదర్శనంలో ఐదేళ్ల నుంచి పదహారేళ్ల వరకు పిల్లలతో విభిన్నమైన ఆసనాలు వేయిస్తారు. సాధారణంగా మెడిటేషన్ మానసిక ప్రశాంత తతోపాటు ఏకాగ్రతను పెంచుతుంది. ‘మేం చెప్పే ఎక్సర్‌సెజైస్ చేస్తే.. మెదడు చురుగ్గా పనిచేస్తుంది. ఆలోచన విధానంలో మార్పు వస్తుంది. భావోద్వేగాలను కంట్రోల్ చేయగలుగుతారు. ఒక్కముక్కలో చెప్పాలంటే అన్ని విషయాల్లో పిల్లలు చాకచాక్యంగా ఉంటారు’ అని చెబుతున్నారు బ్రెయిన్జిమ్ ఎక్స్పర్ట్స్, మలేషియాకు చెందిన హెడ్ట్రైనర్ మాథ్యూ. బ్రెయిన్జిమ్లో కుడి, ఎడమ చేతులు ఒకేసారి పనిచేసేలా ఎక్సర్సైజులు ఉంటాయి. హ్యాండ్స్, లెగ్స్, ఫింగర్స్ కోసం ప్రత్యేక వ్యాయామాలు ఉంటాయి. అయితే రెగ్యులర్ వ్యాయామాలకు భిన్నంగా ఉండటంతో వీటిని చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు పిల్లలు. క్రేజీ డ్యాన్స్... మైండ్ రిలాక్స్ కోసం చేయించే డ్యాన్స్‌కు పిల్లల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. స్కూల్లో పుస్తకాలు, ఇంటికొచ్చాక వీడియోగేమ్స్, లేదంటే కంప్యూటర్ ముందు కాలం వెళ్లదీస్తున్న సిటీ పిల్లలకు ఆరోగ్యకరమైన ఎంటర్టైన్మెంట్ ఉండటం లేదు. అందుకే ఎంబీఎం నేర్పిస్తున్న మలేషియా డ్యాన్స్ స్టెప్పులపై ఆసక్తి కనబరుస్తున్నారు సిటీ కిడ్స్. మెమరీ గేమ్స్ కూడా పిల్లల్లో ఆలోచనాత్మక మార్పులు తీసుకొస్తున్నాయి. ‘20 మంది పిల్లలకు మెమరీ గేమ్‌ను చూపెడతాం. పది మందిని గుర్తుపెట్టుకోమంటాం. ఏ పోజిషన్లో ఏమున్నాయో గుర్తు పెట్టుకుని వాళ్లు మళ్లీ చెప్పాలి. ఇలా ట్రయాంగిల్, సబ్ ట్రయాంగిల్లో నంబర్స్‌ను చూపిస్తాం. ఇలా చేయడం వల్ల పిల్లలు చూసింది చూసినట్టు గుర్తుపెట్టుకోవడానికి అవకాశముంటుంది. దీన్ని ఫొటోగ్రాఫిక్ మెమరీ అని కూడా అంటార’ని చెబుతున్నారు ఎంబీఎం ఇన్స్ట్రక్టర్ సపర్ణ. ఇవేకాకుండా మ్యూజిక్, డిస్కషన్స్, ఆలోచనలు పంచుకోవడం వంటివి కూడా నేర్పిస్తారు. కూకట్పల్లి, దిల్సుఖ్నగర్, హబ్సిగూడలో ఎంబీఎం కేంద్రాలున్నాయి. ఈ సెంటర్స్‌లో కేవలం చిన్నపిల్లలకే కాదు.. పదహారేళ్ల నుంచి అరవై ఏళ్లవయసు వారికి కూడా ఆరోగ్యంగా ఉండడానికి తీసుకోవాల్సిన చర్యలు, మానసిక ఒత్తిడి నుంచి బయటపడేందుకు కౌన్సెలింగ్, సెల్ఫ్ మోటివేటింగ్, క్రియేటివేట్ ఇంట్రెస్ట్ వంటివి కూడా నేర్పిస్తున్నారు. ఆసక్తి ఉన్నవారు http://www.midbrainmasterindia.com వెబ్‌సైట్‌ని చూడవచ్చు.