breaking news
Brahmos Aerospace
-
పాక్‌లో ప్రతి అంగుళం ‘బ్రహ్మోస్’ పరిధిలోనే..
లక్నో: రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పాకిస్తాన్‌ను గట్టిగా హెచ్చరించారు. పాకిస్తాన్లో ప్రతి అంగుళం బ్రహ్మోస్ క్షిపణి పరిధిలోనే ఉందని స్పష్టంచేశారు. ఆపరేషన్ సిందూర్ కేవలం ఒక ట్రైలర్ మాత్రమేనని అన్నారు. భారత్‌పై మరోసారి కయ్యానికి కాలుదువి్వతే అసలు సినిమా చూపించక తప్పదని పరోక్షంగా తేల్చిచెప్పారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో బ్రహ్మోస్ క్షిపణుల శక్తిసామర్థ్యాలు ఏమిటో ప్రపంచం చూసిందన్నారు.యుద్ధంలో భారత్ విజయం సాధించడం యాదృచ్చికం కాదని, అదొక అలవాటుగా మారిందని వ్యాఖ్యానించారు. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని బ్రహ్మోస్ ఏరోస్పేస్ యూనిట్లో తయారైన మొదటి బ్యాచ్ బ్రహ్మోస్ క్షిపణులను రాజ్‌నాథ్ సింగ్ శనివారం సైన్యానికి అప్పగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నానాటికీ బలీయమైన స్వదేశీ శక్తిగా ఎదుగుతున్న భారత్‌కు ఈ క్షిపణులు ఒక ప్రతీక అని అభివరి్ణంచారు. బ్రహ్మోస్ అంటే కేవలం మిస్సైల్ కాదని, భారతదేశ వ్యూహాత్మక విశ్వాసానికి ఆధారమని చెప్పారు. త్రివిధ దళాలకు ఇదొక మూలస్తంభంగా మారిందన్నారు. ‘‘ఆపరేషన్ సిందూర్‌లో జరిగినదంతా ట్రైలర్ మాత్రమే. ఒక కొత్త పాకిస్తాన్‌ను భారత్ సృష్టించగలదని పాకిస్తాన్‌కు తెలిసొచ్చింది. కానీ, ‘సమయం వచ్చినప్పుడు’.. ఇంతకంటే ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. మీరంతా తెలివైనవాళ్లని నాకు తెలుసు. చెప్పకుండానే అర్థం చేసుకోగలరు’’ అని రాజ్‌నాథ్ వ్యాఖ్యానించారు. రక్షణ రంగంలో స్వయం సమృద్ధి ఆపరేషన్ సిందూర్ భారతీయుల్లో నూతన విశ్వాసాన్ని నింపిందని రక్షణ శాఖ మంత్రి ఉద్ఘాటించారు. ఈ విశ్వాసాన్ని ఇలాగే కొనసాగించడం మనందరి సమ్మిళిత బాధ్యత అని పిలుపునిచ్చారు. మన దేశ శక్తిని ప్రపంచమంతా గుర్తిస్తోందని, కలలను నెరవేర్చుకోగలమన్న విశ్వాసాన్ని బ్రహ్మోస్ క్షిపణులు మరింత బలోపేతం చేశాయని చెప్పారు. రక్షణ రంగంలో స్వయం సమృద్ధికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని, మనకు అవసరమైన ఆయుధాలు, రక్షణ పరికరాలను మనమే తయారుచేసుకోవాలని సంకల్పించామని తెలిపారు. రక్షణ తయారీ రంగంలో పెరుగుతున్న మన విశ్వాసానికి, సామర్థ్యానికి బ్రహ్మోస్ మిస్సైల్స్ ఉత్పత్తి కేంద్రం ఒక ఉదాహరణ అని పేర్కొన్నారు. లక్నో అంటే పార్లమెంట్ నియోజకవర్గం మాత్రమే కాదని, ఈ నగరం తన హృదయంలో ఉందని చెప్పారు. సంస్కృతి సంప్రదాయాలతోపాటు ఆధునిక టెక్నాలజీ, పరిశ్రమలకు ప్రధాన కేంద్రంగా మారిందని ఆనందం వ్యక్తంచేశారు. లక్నోలో బ్రహ్మోస్ క్షిపణు లు ఉత్పత్తి కావడం చూస్తే ఒకనాటి స్వప్నం నేడు నెరవేరినట్లు తేటతెల్లమవుతోందని ఉద్ఘాటించారు. సహనం, కఠోర శ్రమ, అంకితభావానికి ఈ ప్రాజెక్టును ఒక ప్రతీకగా భావించవచ్చని వివరించారు. ఇక్కడ ప్రతిఏటా దాదాపు 100 క్షిపణులను ఉత్పత్తి చేయొచ్చని, వందలాది మందికి ప్రత్యక్షంగా ఉపా ధి లభిస్తుందని తెలిపారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఈ యూనిట్ టర్నోవర్ రూ.3,000 కోట్లకు చేరుతుందని, తద్వారా జీఎస్టీ రూపంలో ప్రభుత్వానికి రూ.500 కోట్ల ఆదాయం వస్తుందన్నారు.బ్రహ్మాస్త్రమే → బ్రహ్మోస్ క్షిపణి సూపర్‌సానిక్ క్రూయిజ్ మిస్సైల్ రకానికి చెందినది. → దాదాపు 300 కిలోల వార్హెడ్లను మోసుకెళ్లగలదు. → పొడవు 8.4 మీటర్లు. వ్యాసం 0.6 మీటర్లు. బరువు 3 టన్నులు → భూ ఉపరితలంపైనుంచి ప్రయోగించే క్షిపణి పరిధి 290 కిలోమీటర్లు. నౌకలపైనుంచి ప్రయోగించి క్షిపణి పరిధి 450 కిలోమీటర్లు. ఈ పరిధిని 800 కిలోమీటర్లకు పెంచడానికి ప్రయోగాలు జరుగుతున్నాయి. → జీపీఎస్ రాడార్ గైడెన్స్ సిస్టమ్ ఆధారంగా దూసుకెళ్తుంది. → బ్రహ్మోస్ మిస్సైల్‌లో ఘన ఇంధన బూస్టర్, ద్రవ ఇంధనం క్రూయిజ్ దశ ఉంటాయి. → గంటకు 3,400 నుంచి 3,700 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లగలదు. → భూఉపరితలంతోపాటు యుద్ధ విమానాల నుంచి, నౌకల నుంచి, జలాంతర్గాముల నుంచి ప్రయోగించవచ్చు. → 2005 నుంచి బ్రహ్మోస్ క్షిపణులు భారత సైన్యంలో సేవలందిస్తున్నాయి. ఈ ఏడాది మే నెలలో జరిగిన ఆపరేషన్ సిందూర్‌లో కీలక పాత్ర పోషించాయి. పాకిస్తాన్లో ఉగ్రవాదుల స్థావరాలను, శిక్షణ కేంద్రాలను, పాక్ వైమానిక దళం ఎయిర్‌బేస్‌లను ధ్వంసం చేశాయి. ఆర్థిక రంగానికీ లబ్ధి దేశీయంగా బ్రహ్మోస్ క్షిపణుల తయారీతో మన రక్షణ రంగంతోపాటు ఆర్థిక రంగానికి సై తం ఎంతో లబ్ధి చేకూరుతుందని రాజ్‌నాథ్ సింగ్ స్పష్టంచేశారు. రెండు దేశాలకు క్షిపణులు ఎగుమ తి చేయడానికి మన బ్రహ్మోస్ టీమ్ ఒప్పందాలు కుదుర్చుకుందని, వీటి విలువ రూ.4,000 కోట్లు అని వెల్లడించారు. శుభప్రదమైన ధన త్రయోదశి రోజే క్షిపణులను సైన్యానికి అప్పగిస్తుండడం ఆనందంగా ఉందన్నారు. లక్ష్మీదేవి ఆశీస్సులు రక్ష ణ రంగంపై, ఆర్థిక రంగంపై ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పాల్గొన్నారు. లక్నోలో బ్రహ్మోస్ ఏరోస్పేస్ యూనిట్ ఈ ఏడాది మే 11న ప్రారంభమైంది. -
గూఢచర్యం కేసు.. ‘బ్రహ్మోస్’ మాజీ ఇంజినీర్‌కు జీవిత ఖైదు
నాగ్‌పూర్: బ్రహ్మోస్ ఏరోస్పేస్ లిమిటెడ్ మాజీ ఇంజినీర్ నిషాంత్ అగర్వాల్‌కు నాగ్‌పూర్ సెషన్స్‌కోర్టు జీవిత ఖైదు విధించింది. నాగ్‌పూర్‌లోని బ్రహ్మోస్ ఏరోస్పేస్ టెక్నికల్ రీసెర్చ్ విభాగంలో నాలుగేళ్లు పనిచేసిన నిషాంత్ అగర్వాల్ పాకిస్థాన్‌కు ప్రాజెక్టు కీలక రహస్యాలను చేరవేశాడని కోర్టులో రుజువైంది. దీంతో కోర్టు నిషాంత్‌కు 14 ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ.3వేల జరిమానా విధించింది. పాక్ గూడఛారి సంస్థ ఐఎస్ఐకి రహస్యాలు చేరవేస్తున్న నిషాంత్‌ను మిలిటరీ ఇంటెలిజెన్స్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ 2018లో అరెస్టు చేశాయి. అనంతరం నిషాంత్‌పై ఐపీసీతో పాటు అఫీషియల్స్ సీక్రెట్ యాక్ట్ చట్టాల కింద కేసులు నమోదు చేశారు. ఈ కేసులో 2018 నుంచి జైలులో ఉన్న నిషాంత్‌కు ఈ ఏడాది ఏప్రిల్‌లోనే మహారాష్ట్ర హైకోర్టు నాగ్‌పూర్ బెంచ్ బెయిల్ మంజూరు చేసింది. డీఆర్డీవో, మిలిటరీ పారిశ్రామిక కన్సార్టియం సంయుక్తంగా బ్రహ్మోస్ ఏరోస్పేస్ లిమిటెడ్ కంపెనీని ఏర్పాటు చేశాయి. -
తొలి అడుగు.. ఫిలిప్పీన్స్‌కు బ్రహ్మోస్ క్షిపణులు
న్యూఢిల్లీ: ఆయుధాలను, క్షిపణి వ్యవస్థల్ని ఎప్పుడూ దిగుమతి చేసుకునే భారత్ ఎగుమతి చేసే దిశగా తొలి అడుగు పడింది. మొట్టమొదటి సారిగా బ్రహ్మోస్ క్షిపణుల్ని ఫిలిప్పీన్స్‌కు విక్రయించనుంది. ఈ మేరకు భారత్, ఫిలిప్పీన్స్ మధ్య 37.4 కోట్ల డాలర్ల విలువైన ఒప్పందం (రూ.28 వందల కోట్లకు పైనే) కుదిరింది. బ్రహ్మోస్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్‌తో (బీఏపీఎల్) ఫిలిప్పీన్స్ రక్షణ శాఖ కొనుగోలు ఒప్పందంపై సంతకాలు చేసినట్టుగా రక్షణ మంత్రిత్వ శాఖ శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. విమానాలు, నౌకలు, జలాంతర్గాములు, నేల మీద నుంచి నిర్దేశించిన లక్ష్యాలను బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్షిపణులు ఛేదించగలవు. ఫిలిప్పీన్స్ నేవీకి యాంటీ–షిప్ బ్రహ్మోస్ క్షిపణుల సరఫరా చేయడానికి ఒప్పందం కుదిరిందని రక్షణ మంత్రిత్వ శాఖ ఆ ప్రకటనలో స్పష్టం చేసింది. రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఒ)తో కలిసి బీఏపీఎల్ బ్రహ్మోస్ క్షిపణుల్ని తయారు చేస్తోంది. ఫిలిప్పీన్స్ నావికాదళం ఎన్ని క్షిపణుల్ని కొనుగోలు చేయనుందో రక్షణ శాఖ వెల్లడించలేదు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే చైనా సరిహద్దుల వెంబడి వ్యూహాత్మక ప్రాంతాల్లో బ్రహ్మోస్ క్షిపణుల్ని భారీగానే మోహరించింది. తాను సొంతంగా క్షిపణుల్ని తయారు చేయడమే కాకుండా ఎగుమతి చేసే స్థాయికి ఎదిగిన చారిత్రక సందర్భంలో తాను ఉన్నందుకు చాలా గర్వంగా ఉందని ఫిలిప్పీన్స్‌లో భారత రాయబారి శంభు కుమరన్ వ్యాఖ్యానించారు. ఈ కొనుగోలు ఒప్పందంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత పటిష్టమవుతాయని, ఇండో ఫసిఫిక్ ప్రాంతాల్లో శాంతి, స్వేచ్ఛాయుత వాణిజ్యమనే ఉమ్మడి లక్ష్యాలను సాధించడానికి మరో అడుగు పడినట్టయిందని కుమరన్ చెప్పారు. స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఆకాశ్, అస్త్ర, రాడార్లు, యాంటీ ట్యాంక్ మిస్సైల్స్ కొనుగోలు కోసం కూడా పలు దేశాలు ఆసక్తి చూపిస్తున్నాయని డీఆర్‌డీఒ చైర్మన్ జి.సతీశ్ రెడ్డి తెలిపారు. -
బ్రహ్మోస్ క్షిపణి పరీక్ష విజయవంతం
న్యూఢిల్లీ : భూ ఉపరితల లక్ష్యాలను ఛేదించే సూపర్సోనిక్ క్షిపణి బ్రహ్మోస్‌ని భారత్ శుక్రవారం విజయవంతంగా పరీక్షించింది. రాజస్తాన్‌లోని పోఖ్రాన్ కేంద్రంలో భారత వాయుసేన ఈ పరీక్ష నిర్వహించింది. అనుకున్న లక్ష్యాలను క్షిపణి కచ్చితత్వంతో అధిగమించిందని బ్రహ్మోస్ ఏరోస్పేస్ ప్రకటించింది. లోపరహిత సామర్థ్యాలు కలిగిన ఈ వ్యవస్థ త్రివిధ దళాలకు సాధికారత చేకూర్చనుం ది.మన విమానాల రాకపోకలను పసిగట్టేందుకు శత్రుదేశాలు సరిహద్దుల వెంట ఏర్పాటుచేసిన రాడార్లు, కమ్యూనికేషన్ వ్యవస్థలను కూల్చేసేందుకు ఈ క్షిపణిని భారత వాయుసేన గత ఏడాది తీసుకుంది.