తీగ కాదు అమ్మాయి నడుమా?.. ‘బాయ్స్’ టైటిల్లోనే బిగ్ ట్విస్ట్!
క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ 23 ఏళ్ల క్రితం తెరకెక్కించిన ‘బాయ్స్’ మూవీ టైటిల్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. యానిమేషన్లో చేసిన ఆ సినిమా టైటిల్లో ఓ క్రేజీ ట్విస్ట్ ఉంది. ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు ఆ ట్విస్ట్‌ని కనిపెట్టి.. వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు కొంతమంది నెటిజన్లు. ఇంతకీ ఆ ట్విస్ట్ ఏంటి? టైటిల్లోనే శంకర్ చూపించిన క్రియేటివిటీ ఏంటి?టైటిల్ యానిమేషన్లోనే అసలు ట్విస్ట్..బాయ్స్ సినిమా ప్రారంభంలో ‘BOYS’ అనే అక్షరాలు ఒక తీగపై ఎగురుతున్నట్టుగా కనిపిస్తాయి. అప్పట్లో ఈ యానిమేషన్‌ను చూసిన ప్రేక్షకులు కూడా దాన్ని సాధారణ టైటిల్ డిజైన్‌గానే భావించారు. అయితే తాజాగా కొందరు సినీ ప్రేమికులు ఈ టైటిల్‌ను మరో కోణంలో పరిశీలించారు. మొబైల్ లేదా ల్యాప్‌టాప్ స్క్రీన్‌ను ఎడమవైపు తిప్పి చూస్తే.. ఆ తీగలా కనిపించే ఆకృతి నిజానికి ఓ అమ్మాయి నడుము వంపులా కనిపిస్తుందని గుర్తించారు.(ఇదీ చదవండి: దూరంగా ఉండు.. నా దగ్గరకు వచ్చే అర్హత లేదు: వెంకీపై చిరు ఫన్నీ కామెంట్స్!)ఆ నడుము వంపుల మీదుగా ‘BOYS’ అనే అక్షరాలు ఎగురుతూ టైటిల్ ఏర్పడేలా శంకర్ అప్పట్లోనే డిజైన్ చేశారనే విషయం ఇప్పుడు వైరల్‌గా మారింది. అంటే సాధారణంగా చూస్తే ఓ తీగలా కనిపించే ఆ ఆకృతి.. మరో యాంగిల్లో చూస్తే అమ్మాయి నడుము ఆకారాన్ని పోలి ఉండటమే ఈ టైటిల్ ప్రత్యేకత.23 ఏళ్ల క్రితమే ఇంత క్రియేటివిటీనా?2003లో ‘బాయ్స్’ విడుదలైనప్పుడు ఈ చిన్న డీటెయిల్ పెద్దగా ఎవరి దృష్టినీ ఆకర్షించలేదు. కానీ ఇప్పుడు సోషల్ మీడియా అందుబాటులోకి రావడం, పాత సినిమాల్లోని చిన్న చిన్న విషయాలను అభిమానులు డీకోడ్ చేస్తుండటంతో ఈ టైటిల్ యానిమేషన్ మళ్లీ చర్చలోకి వచ్చింది.శంకర్ సినిమాల్లో సామాజిక అంశాలు, భారీ సెట్స్, విజువల్ గ్రాండియర్, విభిన్నమైన కథనాలతో పాటు ఇలాంటి క్రియేటివ్ ఐడియాలకు కూడా ప్రత్యేక స్థానం ఉంటుంది. ‘బాయ్స్’ విషయంలోనూ ఆయన తన రెగ్యులర్ స్టైల్‌కు భిన్నంగా యూత్ పల్స్‌ను పట్టుకునే ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే సినిమా టైటిల్‌ను కూడా యూత్‌కి కనెక్ట్ అయ్యేలా డిజైన్ చేశారనే చర్చ ఇప్పుడు జరుగుతోంది.(ఇదీ చదవండి: కవలల ప్రసవానంతరం తీవ్ర సమస్యలు..కన్నీళ్లు పెట్టుకున్న ఉపాసన)బాయ్స్ సినిమా విషయానికొస్తే.. సిద్ధార్థ్, జెనీలియా, తమన్, వివేక్, నకుల్, భరత్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. 2003లో విడుదలైన ఈ చిత్రం అప్పటి యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించినప్పటికీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది.అయితే సినిమాకు ఏఆర్ రెహమాన్ అందించిన సంగీతం మాత్రం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పాటలు అప్పట్లోనే భారీగా ఆదరణ పొందడంతో పాటు ఇప్పటికీ రెహమాన్ కెరీర్లో గుర్తుండిపోయే ఆల్బమ్‌లలో ఒకటిగా నిలిచాయి.శంకర్ క్రియేటివిటీని అర్ధం చేసుకోవడానికి 23 ఏళ్ళు టైమ్ పట్టింది😴 ఇన్నాళ్ళు ఏదో తీగ అనుకున్నాను.. అది ఒక అమ్మాయి నడుము ఆకృతా 🧐 #BoysMovie #23YearsForBoys #Shankar @shankarshanmugh #Boys https://t.co/NgwPJGrc6w— Phani Kumar (@iam_PhaniKumar) November 18, 2026