breaking news
boyinapalli
-
బోయిన్పల్లి కాల్పులలో పోలీసుల విచారణ
-
ఇక రాత్రిళ్లూ రిజిస్ట్రేషన్లు..
రెండు షిఫ్టులుగా సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల పనివేళలు నేటి నుంచి పెలైట్ ప్రాజెక్టుగా ప్రయోగం బోయినపల్లిలో ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మారేడుపల్లిలో మధ్యాహ్నం 2 గం॥నుంచి రాత్రి 8 గంటల వరకు సిటీబ్యూరో: స్థిరాస్తుల రిజిస్ట్రేషన్లు ఇక సులభతరం కానున్నాయి. రోజుల తరబడి జాప్యం కాకుండా వెంట వెంటనే రిజిస్ట్రేషన్లు జరిగేలా ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. రాత్రి 8 గంటల సమయంలోనూ స్థిరాస్తుల రిజిస్ట్రేషన్లు జరిగేలా ఏర్పాట్లు చేస్తోంది. స్థిరాస్తుల దస్తావేజుల నమోదు ప్రజలకు మరింత సౌకర్యవంతంగా ఉండటంతోపాటు..పెరుగుతున్న తాకిడిని అధిగమించేందుకు ముంబయి తరహాలో సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసులు రెండు షిఫ్టుల పద్ధతిలో సేవలందించేందుకు రిజిస్ట్రేషన్ అండ్ స్టాంపుల శాఖ సిద్ధమైంది. ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు, ఇతర పనుల్లో బిజీగా ఉండే వారికి వెసులుబాటు ఉండే విధంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పనివేళలు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఉండేలా అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట్రంలోనే ప్రయోగాత్మకంగా సోమవారం నుంచి హైదరాబాద్ రిజిస్ట్రేషన్ శాఖ పరిధిలోని బోయిన్పల్లి, మారేడుపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు రెండు షిఫ్టులుగా పనిచేయనున్నాయి. ప్రతి రోజు రెండేసి షిఫ్టులుగా వేర్వేరు సమయాల్లో ఆరుగంటల చొప్పున సిబ్బంది సేవలందించనున్నారు. పనివేళలు ఇలా... నగరంలోని బోయినపల్లి, మారేడుపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో దస్తావేజుల నమోదు ప్రక్రియ రెండు షిఫ్టులుగా కొనసాగనుంది. ఉదయం షిఫ్టుగా బోయినపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు, మధ్యాహ్నం షిఫ్టు మారేడుపల్లి సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ రెండు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు పనిచేయనుంది. ఇలా రెండు షిఫ్టులు కార్యాలయ సిబ్బంది సేవలందిస్తారు. ‘ఎనీవేర్ రిజిస్ట్రేషన్’ విధానం అమలులో ఉన్న కారణంగా ఒక రిజిస్ట్రేషన్ జిల్లా పరిధిలోని రెండు సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో ఎక్కడైనా రిజిస్ట్రేషన్ నమోదు చేసుకునేందుకు వెసులుబాటు ఉంది. ఈ కారణంగా రెండు కార్యాలయాల్లో దాదాపు 12 గంటలపాటు రిజిస్ట్రేషన్ల సేవలు అందుబాటులో ఉంటాయి. కాగా ఈ రెండు కార్యాలయాల్లో ప్రవేశపెడుతున్న షిఫ్టుల పద్ధతికి స్పందన లభిస్తే..రంగారెడ్డి జిల్లా పరిధిలో మరో రెండు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు సైతం దీన్ని విస్తరించనున్నారు. అనంతర రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసే అవకాశాలు ఉన్నాయని రిజిస్ట్రేషన్ అండ్ స్టాంపుల శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. -
విచారణకు వచ్చిన ఎంఈవోను చితకబాదారు
కడప : వైఎస్ఆర్ జిల్లా రాజంపేట మండలం బోయనపల్లి గ్రామంలో లైంగిక వేధింపులు ఆరోపణలు ఎదుర్కొంటున్న కీచక టీచర్‌పై గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉపాధ్యాయుడిని తక్షణమే అరెస్ట్ చేయాలంటూ గ్రామస్తులు శనివారం పాఠశాలను ముట్టడించారు. విచారణకు వచ్చిన మండల విద్యాశాఖ అధికారి (ఎంఈవో) కృష్ణకుమార్‌ను చితకబాదారు. కాగా వివరాల్లోకి వెళితే విద్యా బుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడే కీచకుడిగా మారాడు. లెక్కల టీచర్ అర్తర్ అనునిత్యం వికృత చేష్టలతో లైంగిక వేధింపులకు పాల్పడేవాడు. ఎవరికీ చెప్పుకోలేక విద్యార్థినులు మదనపడేవారు. ఓ విద్యార్థిని విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పటంతో వ్యవహారం బయటకు పొక్కింది. దాంతో గ్రామస్తులు కీచక టీచర్‌కు దేహశుద్ధి చేశారు. విషయం తెలుసుకున్న రాజంపేట రూరల్ సీఐ వెంకటేశ్వర్లు గ్రామస్తులకు సర్థిచెప్పారు. టీచర్ ను కస్టడీలోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు. గత రెండు సంవత్సరాల నుంచి స్కూల్ లో చదువుతున్న బాలికలపై వేధింపులకు పాల్పడుతున్నాడని ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపారు. అతనిపై సెక్షన్ 354 కింద కేసు నమోదు చేశామన్నారు.