breaking news
Boxing championship title
-
‘నువ్వు గెలిస్తే ఆ కారును నేనే బహుమతిగా ఇస్తా’
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది ప్రపంచ మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ స్టార్ బాక్సర్, డిఫెండింగ్ చాంపియన్ (ఫ్లయ్ వెయిట్) నిఖత్ జరీన్ టైటిల్ నిలబెట్టుకుంటే ఖరీదైన ‘మెర్సిడెజ్ బెంజ్’ కారు కొంటానని చెప్పింది. అయితే అక్కడే ఉన్న అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం (ఐబీఏ) అధ్యక్షుడు ఉమర్ క్రెమ్లెవ్ ఆమె గెలిస్తే కొనాల్సిన అవసరం లేకుండా నిఖత్ కోరుకున్న కారును బహుమతిగా ఇస్తానని చెప్పారు. భారత్‌కు 2023 మహిళల చాంపియన్‌షిప్ ఆతిథ్య హక్కులు కట్టబెట్టిన సందర్భంగా ఈ ఆసక్తికర సంభాషణ చోటు చేసుకుంది. ఈ మేరకు ఐబీఏ చీఫ్ క్రెమ్లెవ్, భారత బాక్సింగ్ సమాఖ్య (బీఎఫ్ఐ) అజయ్ సింగ్‌లు ఆతిథ్య హక్కుల ఒప్పందంపై సంతకాలు చేశారు. వచ్చే మార్చి, ఏప్రిల్ నెలల్లో ఈ బాక్సింగ్ మెగా ఈవెంట్ జరగనుంది. తేదీలను తర్వాత ఖరారు చేయనున్నారు. టోర్నీ ప్రైజ్‌మనీ పెరగడంతో విజేతకు రూ. 81 లక్షలు అందజేయనున్నారు. ఈ నేపథ్యంలో డిఫెండింగ్ చాంపియన్ హోదాలో పాల్గొన్న నిఖత్ మాట్లాడుతూ ‘ప్రస్తుత టైటిల్ ప్రైజ్‌మనీతో హైదరాబాద్‌లో ఇల్లు కొనే ప్రయత్నంలో ఉన్నాను. వచ్చే ఏడాది కూడా గెలిస్తే దాంతో బెంజ్ కారు కొంటాను. అందులో క్రెమ్లెవ్తో హైదరాబాద్‌లో సిటీ రైడ్‌కు వెళ్తాను’ అని తెలిపింది. -
హైదరాబాద్‌కు బాక్సింగ్ టైటిల్
ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: అంతర్ జిల్లా స్కూల్ అండర్-17 బాలుర బాక్సింగ్ చాంపియన్‌షిప్ టైటిల్‌ను హైదరాబాద్ జట్టు చేజిక్కించుకుంది. హైదరాబాద్ జిల్లా స్కూల్ గేమ్స్ సమాఖ్య ఆధ్వర్యంలో ఇక్కడి ఎల్బీ స్టేడియంలో ఆదివారం జరిగిన ఫైనల్లో హైదరాబాద్ జట్టు ఐదు స్వర్ణ పతకాలను గెలిచి టైటిల్ దక్కించుకుంది. ఫైనల్స్ ఫలితాలు ఇలా ఉన్నాయి. ఫలితాలు: 46 కేజీలు: 1.సి. డేవిడ్ (హైదరాబాద్), 2.ప్రసాద్ (విజయనగరం), 3.ఎం.రామచంద్ర (ఆదిలాబాద్), 3. ఆర్. భరత్ (నల్గొండ). 48 కేజీలు: 1. ఎస్. వినయ్ (ఆదిలాబాద్), 2.హెచ్.వికాస్ (వరంగల్), 3.డి.గంగాధర్ (నిజామాబాద్), 3.ఎం.నవీన్ (హైదరాబాద్). 50 కేజీలు: 1.ఎం.డి. కరీం (నిజామాబాద్), 2. మనోజ్‌రాజ్ (విశాఖపట్నం), 3.వి.శ్రీరాములు (నల్గొండ) 3. ఉసామౌద్దీన్ (మహబూబ్‌నగర్). 54 కేజీలు: 1. మహ్మద్ ఇబ్రహీమ్ (హైదరాబాద్), 2.పి.అనిల్ (రంగారెడ్డి), 3. ఎం.వెంకటేష్ (వరంగల్), 3.వి.రఘు (ఆదిలాబాద్). 57 కేజీలు: 1. విజయ్ సింగ్ (హైదరాబాద్), 2.అమృత్ ప్రసన్న (కరీంనగర్), 3.బి.భార్గవ్ సాయి (ఆదిలాబాద్), 3.పి.రమణ (వరంగల్). 60 కేజీలు: 1.ఎం.మహేష్ (కరీంనగర్), 2.పి.వెంకటేశ్వర్లు (మహబూబ్‌నగర్), 3.కె.హర్షవర్ధన్ (రంగారెడ్డి), 3. ఎం.అనిల్(వరంగల్). 66 కేజీలు: 1. పి.ఉబ్బర్ సాయి (హైదరాబాద్), 2.ఎన్.అకాష్ రాజ్ (వరంగల్). 70 కేజీలు: 1.రవితేజ (హైదరాబాద్), 2.ఎం.రోహిత్ (కరీంనగర్), 3.బి.ప్రమోద్ (ఆదిలాబాద్). 75 కేజీలు: 1.ఎం.డి.హస్ముద్దీన్ (మెదక్), 2.ఎం.షాహిద్ ఖాన్ (నల్గొండ). 81 కేజీలు: 1.ఎ.సాయి కిరణ్ (నల్గొండ), 2.జి.చరణ్ రాజ్‌రెడ్డి (అనంతపురం), 3. కె.కృష్ణకాంత్‌రెడ్డి (మెదక్), 3.ఎ.పృథ్వీ రెడ్డిరాజు(రంగారెడ్డి). 86 కేజీలు: 1.పి.హెచ్.ఖాన్ (రంగారెడ్డి), 2.ఎస్.రాజేష్ (వరంగల్), 3.టి.నితిన్ (మెదక్).