breaking news
borderlines
-
మనసున మనసై
నిరుత్సాహం కమ్ముకున్నప్పుడు, ఒంటిరితనం శాపంగా మారినప్పుడు, పీల్చే శ్వాస కూడా బరువెక్కుతుంది. బతుకు భారమవుతుంది. కాని ఆశ అనే దీపం వెలిగిస్తే ఎన్ని నిరాశల నిశీధులనైనా దాటవచ్చని నిరూపించిందో యువతి. ఆమె సెహర్ హష్మీ... స్వయంగా తానే మానసిక అంతర్మధనంలో ఎన్నో రోజులు నరకాన్ని చవిచూసింది.. ఆపై ఒక దృఢ నిశ్చయంతో నరకాన్ని దాటి తనలాంటి ఎంతోమంది మానసిక రోగులకు ఉపశమనం కలిగిస్తోంది.ఢిల్లీలో జన్మించిన సెహర్ హష్మీ, చిన్నప్పటి నుంచే సృజనాత్మకతపై ఆసక్తి పెంచుకుంది. తల్లి షబ్నం హష్మీ, తండ్రి గౌహర్ రజా. అన్నయ్య సాహిర్ రజా బాలీవుడ్లో దర్శకుడిగా పనిచేస్తున్నాడు. ఫ్యాషన్ రంగంలోకి అడుగుపెట్టిన సెహర్, ముంబయిలో ఓ డిజైనర్‌తో కలిసి పలు షూట్లలో పనిచేసింది. బయటికి అందమైన, సృజనాత్మక ప్రపంచంగా కనిపించే ఫ్యాషన్ రంగం వెనుక ఎన్నో సవాళ్లున్నాయని తెలిశాక ఆమె మొదట్లో ఆశ్చర్యపోయింది. ఆ తర్వాత తేరుకుని అంతర్గతంగా తీవ్రమైన పోరాటం సాగించింది. బోర్డర్‌లైన్ పర్సనాలిటీ డిజార్డర్ (బీపీడీ), డిప్రెషన్ తో బాధపడింది. తీవ్రమైన ఒత్తిడి, మూడ్‌లో మార్పులు, ఆత్మవిశ్వాసంలో హెచ్చుతగ్గులు, స్వీయ హింస, ఒంటరితనం, తరచూ కోపం రావడం ఇవన్నీ బీపీడీ లక్షణాలు.. ఓ దశలో పరిస్థితి తీవ్రంగా మారి రెండేళ్లపాటు దాదాపు తన గదికే పరిమితమయింది. ఆ చీకటి దశను దాటడం ఆమె జీవితంలోనే అతిపెద్ద పోరాటంగా మారింది. ఆ తర్వాత పెయింటింగ్ ఆమెకు ఆధారమైంది. తల్లి ప్రోత్సాహంతో చిత్రాలను ప్రదర్శనకు పెట్టడంతోబాటు, అక్కడి నుంచే తన అనుభవాలను ప్రజలతో ధైర్యంగా పంచుకోవాలనే ఆలోచన కూడా మొదలైంది.ప్రాజెక్ట్ బ్రేకింగ్ స్టిగ్మా...సెహర్ తనలాంటి వారికి ధైర్యం ఇవ్వడానికి ‘బ్రేకింగ్ స్టిగ్మా – ఒన్మైల్ ఎట్ ఎ టైం’ పేరుతో క్యాంపెయిన్ మొదలు పెట్టింది. ఢిల్లీలో మొదలు పెట్టి దాదాపు 22 నగరాలు, 30 గ్రామాలలో ఎంతోమందికి ఇంటరాక్టివ్ సెషన్స్ నిర్వహించింది. కోవిడ్ సమయంలో ఫేస్బుక్ లైవ్‌ల ద్వారా కూడా ఎంతోమందికి చేరువైంది. మానసిక ఆరోగ్యం, వ్యక్తిగత పోరాటం వంటి అంశాలను బహిరంగంగా మాట్లాడటం ద్వారా ఎన్నో కుటుంబాలకు ధైర్యాన్ని కల్పించింది. ఒకసారి బెంగళూరులో ఓ మహిళ సెహర్ తల్లి షబ్నం హష్మీని కలిసి.. ‘‘సెహర్ నా ప్రాణాన్ని కాపాడింది’’ అని చె΄్పారు. సెహర్ వీడియోలు చూసిన తర్వాత తన లైంగిక గుర్తింపును కుటుంబానికి చెప్పే ధైర్యం వచ్చిందని, ఒకప్పుడు జీవితం ముగించుకోవాలనుకున్న స్థితి నుంచి ఇప్పుడు తన గుర్తింపుతో స్వేచ్ఛగా జీవిస్తున్నానని ఆమె వివరించింది.రాయల్ ఎన్ ఫీల్డ్ టూర్మానసిక ఆరోగ్యంపై అవగాహన కోసం 7 వేల కిలోమీటర్లకు పైగా చేసిన ప్రయాణంలో ఎన్నో ఒడిదొడుకులు.. కాని సెహర్ వెనకడుగు వేయలేదు. ఈ ప్రయాణం రహదారులపై దూసుకెళ్లడం మాత్రమే కాదు. చిన్న పట్టణాలు, గ్రామాలు, దూర ప్రాంతాలు, కమ్యూనిటీ కేంద్రాల్లోకి నేరుగా వెళ్లి మానసిక ఆరోగ్యంపై చర్చకు అవకాశం కల్పిస్తోంది. సాధారణంగా ఇలాంటి అంశాలపై మాట్లాడని ప్రాంతాల్లోనూ మాట్లాడుకునేలా చే స్తూ తన గమనాన్ని కొనసాగిస్తోంది.విద్యలో భాగం కావాలినా గురించి నేను మాట్లాడినప్పుడు నన్ను చాలామంది సంప్రదించారు. అప్పుడు నేను ఒంటిరిదాన్ని కాదని నాకు అర్థమైంది. మెంటల్ హెల్త్ అవేర్నెస్ అనేది ఏదో ఒక్కసారి మొక్కుబడిగా నిర్వహించే కార్యక్రమం కాకూడదు. అది విద్యావ్యవస్థలో నిరంతర భాగం కావాలి. ప్రభుత్వం నిర్వహిస్తున్న ‘మానస్’ హెల్ప్‌లైన్ అన్ని భారతీయ భాషల్లో అందుబాటులో ఉండటం చాలా మంచి విషయం. – చైతన్య వంపుగాని, సాక్షి న్యూఢిల్లీ -
బయ్యారంలో మారిన సరిహద్దులు
బయ్యారం : నూతన జిల్లాల ఏర్పాటులో బయ్యారం ఓ ప్రత్యేకతను చాటుకుంది. ఖమ్మం జిల్లాలో అంతర్భాగంగా ఉన్నప్పుడు బయ్యారం మండలానికి దక్షిణం వైపున వరంగల్ జిల్లాలోని పాకాల వాగు, కొత్తగూడ మండలాలు సరిహద్దుగా ఉండేవి. ప్రస్తుతం బయ్యారం మండలం దక్షిణాన ఉన్న మహబూబాబాద్ జిల్లాలో కలువగా తూర్పున ఉన్న ఇల్లెందు మండలం భద్రాద్రి జిల్లాలో కలిసింది. దీంతో రెండు ప్రాంతాలు వేర్వురు జిల్లాల్లోకి వెళ్లాయి. మండలంలోని నామాలపాడు సమీపంతో పాటు పాఖాలకొత్తగూడ సరిహద్దులో ఉన్న మిర్యాలపెంట గ్రామం భద్రాద్రి జిల్లాకు హద్దుగా మారింది. గతంలో ఉప్పలపాడు పంచాయతీలోని లకీ‡్ష్మనర్సింహపురం గ్రామంలో రహదారికి తూర్పు వైపున ఉన్న ఇళ్లు ఖమ్మం జిల్లాలో ఉండగా దక్షిణం వైపున ఉన్న ఇళ్లు వరంగల్ జిల్లాలో ఉండేవి. ప్రస్తుతం ఆ గ్రామానికి జిల్లా సరిహద్దులు మారగా మండల హద్దులు మాత్రం అలానే ఉన్నాయి. బయ్యారం మండలం నూతన జిల్లాలోకి మారినప్పటికీ పాత సంప్రదాయం ప్రకారం ఇతర జిల్లాకు హద్దుగా మారడంపై స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు


